
పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపింది. ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఈవెంట్‌పై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాదు ఫ్యాషన్ షో దూమారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీని కూడా అట్టుడికించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు ఒమర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నెల మార్చి 7న గుల్మార్గ్‌లో జరిగిన ఈ ఫ్యాషన్ షోపై తారాస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వివాదాస్పదంగా మారిన ఈ షో వెనుకున్న డిజైనర్లు ఎవరంటే..?
ఎవరా డిజైనర్ ద్వయం..?
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిజైనర్లు శివన్ భాటియా, నరేష్ కుక్రేజా. ఈ ఇద్దరు స్థానిక సున్నితత్వాన్ని విస్మరించి పవిత్ర రంజాన్ మాసంలో అశ్లీల దుస్తులతో ప్రదర్శన ఇవ్వడంతోనే ఈ షో వివాదాస్పదమైంది. అయితే డిజైనర్ల ద్వయం ఫ్యాషన్ పరిశ్రమలో తమ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుల్మార్గ్‌లోని ప్రఖ్యాత స్కీ రిసార్ట్‌లో ఈ ఫ్యాషన్ షోని నిర్వహించారు.
వాళ్ల బ్రాండ్‌కి సంబంధించిన శిల్పకళా స్కీ సూట్‌లు, అప్రెస్-స్కీ దుస్తులు, ఆర్ట్ ప్రింట్‌లు ఉన్న ట్రాన్స్‌పరేంట్ దుస్తులు ధరించారు ఇందులో పాల్గొన్న పురుషులు, మహిళలు. అయితే వాళ్లు సరిగ్గా రంజాన్ పర్వదినం సమయంలో దీన్ని నిర్వహించడతో ఇంతలా స్థానిక ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను దారితీసింది.
పైగా ఈ ఈవెంట్ సాంస్కృతిక విలువలకు తిలోదాకలిచ్చే రీతిలో దారుణంగా ఉందంటూ మత పెద్దలు, ప్రజలు, రాజకీయనాయకులు మండిపడ్డారు. అయితే ఈ షోని నిర్వహించింది ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ హాలిడే. ఇది కేన్స్‌లోని 'మారే డి మోడా'లో భారతదేశపు తొలి లగ్జరీ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. అధునాతన సౌందర్యానికి చెందిన ఈ బ్రాండ్ హాలిడే రిసార్ట్, స్విమ్ దుస్తుల పరంగా ఫ్యాషన్‌లో సంచలనాలు సృష్టించింది. వారి కలెక్షన్లు డీఎల్‌ఎఫ్ ఎంపోరియో (ఢిల్లీ), కలఘోడా (ముంబై), బంజారా హిల్స్ (హైదరాబాద్), ఎంబసీ చాంబర్ (బెంగళూరు) లలో అందుబాటులో ఉన్నాయి.
ఇద్దరు డిజైనర్లు ఫ్యాషన్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థానాన్ని దక్కించుకున్నారు. వారిలో శివన్ NIFT ఢిల్లీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇస్టిట్యూట్ యూరోపియో డి డిజైన్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. కాగా నరేష్ అదే సంస్థ నుంచి లగ్జరీ అండ్ మార్కెటింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఈ బ్రాండ్‌ని ఎక్కువగా బాలీవుడ్ నటులు కిమ్ కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు నిర్వహించారు.
ఈ బ్రాండ్‌కి వరించిన అవార్డులు..
స్వరోవీస్కీ మోస్ట్ క్రియేటివ్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ (2007)
ఉత్తమ ఎమర్జింగ్ డిజైనర్లు (మేరీ క్లైర్ ఫ్యాషన్ అవార్డ్స్, 2010)
ఉత్తమ రిసార్ట్ వేర్ (ఎల్లే స్టైల్ అవార్డ్స్, 2010)
ఉత్తమ క్రూయిజ్ వేర్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2011)
‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్ టు ది వరల్డ్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2012)
యంగ్ అచీవర్స్ అవార్డు (ఎంబసీ ఆఫ్ ఇండియా, ఖాట్మండు అండ్ టుడేస్ యూత్ ఆసియా)
ఇంత మంచి పేరు, కీర్తీ దక్కించుకున్న ఈ ఫ్యాషన్ డిజైనర్లు గుల్మార్గ్ ఫ్యాషన్ షోతో ఒక్కసారిగా వివాదాస్పద వ్యక్తులుగా అపకీర్తిని మూటగట్టుకున్నారు, విమర్శలపాలయ్యారు.
(చదవండి: వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..)
Comments
Please login to add a commentAdd a comment