
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం తన తొలి కాశ్మీర్ పర్యటనలో బీజీబీజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సచిన్ తన కుటుంబంతో కలిసి చుట్టేస్తున్నారు. ఈ పర్యటనలో సచిన్ మరోసారి బ్యాట్ పట్టి సందడి చేశాడు. గుల్మార్గ్‌లో స్థానికులతో కలిసి మాస్టర్ బ్లాస్టర్ గల్లీ క్రికెట్ ఆడాడు.
రోడ్డుపై స్ధానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడూతూ సచిన్ ఎంజాయ్ చేశాడు. అక్కడ వారితో ఫోటోలు కూడా క్రికెట్ గాడ్ దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ ఎక్స్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోకు క్యాప్షన్‌గా "క్రికెట్ అండ్ కాశ్మీర్.. స్వర్గంలో మ్యాచ్" అంటూ రాసుకొచ్చాడు. కాగా బుధవారం సచిన్ బుధవారం చాలా ప్రాంతాలను సందర్శించాడు.
అక్కడ విల్లో క్రికెట్ బ్యాట్‌ల తయారీ కేంద్రాన్ని లిటిల్ మాస్టర్ విజిట్ చేశాడు. అదే విధంగా ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై చివరి పాయింట్ అమన్ సేతు వంతెనను కూడా సందర్శించాడు. ఈ సందర్భంగా అమన్ సేతు సమీపంలోని కమాన్ పోస్ట్ వద్ద సైనికులతో సచిన్ ముచ్చటించాడు.
Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV
— Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024
Comments
Please login to add a commentAdd a comment