gully cricket
-
రాహుల్ ద్రవిడ్ గల్లీ క్రికెట్..
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. అయితే భారత హెడ్‌కోచ్‌గా తప్పుకున్న తర్వా ద్రవిడ్ తన ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మిస్టర్ డిఫెండ్బుల్ తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీని సందర్శించాడు. ఈ క్రమంలో అక్కడ గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి ద్రవిడ్ సరదాగా క్రికెట్ ఆడాడు. టెన్నిస్ బాల్‌తో బౌలింగ్ కూడా ద్రవిడ్ చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా గతంలో ద్రవిడ్ ఎన్సీఏ హెడ్‌గా కూడా పని చేశాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2024 విజయం తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకున్నాడు. 2021 నుంచి 2024 వరకు ద్రవిడ్ భారత ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. Rahul Dravid playing cricket with the Ground Staffs of NCA. 🌟 pic.twitter.com/y2tXJKGNbW— Johns. (@CricCrazyJohns) August 11, 2024 -
గల్లీ క్రికెట్ ఆడిన సచిన్.. వీడియో వైరల్
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం తన తొలి కాశ్మీర్ పర్యటనలో బీజీబీజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సచిన్ తన కుటుంబంతో కలిసి చుట్టేస్తున్నారు. ఈ పర్యటనలో సచిన్ మరోసారి బ్యాట్ పట్టి సందడి చేశాడు. గుల్మార్గ్లో స్థానికులతో కలిసి మాస్టర్ బ్లాస్టర్ గల్లీ క్రికెట్ ఆడాడు. రోడ్డుపై స్ధానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడూతూ సచిన్ ఎంజాయ్ చేశాడు. అక్కడ వారితో ఫోటోలు కూడా క్రికెట్ గాడ్ దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ ఎక్స్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోకు క్యాప్షన్‌గా "క్రికెట్ అండ్ కాశ్మీర్.. స్వర్గంలో మ్యాచ్" అంటూ రాసుకొచ్చాడు. కాగా బుధవారం సచిన్ బుధవారం చాలా ప్రాంతాలను సందర్శించాడు. అక్కడ విల్లో క్రికెట్ బ్యాట్ల తయారీ కేంద్రాన్ని లిటిల్ మాస్టర్ విజిట్ చేశాడు. అదే విధంగా ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై చివరి పాయింట్ అమన్ సేతు వంతెనను కూడా సందర్శించాడు. ఈ సందర్భంగా అమన్ సేతు సమీపంలోని కమాన్ పోస్ట్ వద్ద సైనికులతో సచిన్ ముచ్చటించాడు. Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV — Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024 -
గల్లీ క్రికెట్
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించనున్న చిత్రం ‘పరాక్రమం’. బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం ప్రీ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘గోదావరి జిల్లాలో లంపకలోవ గ్రామంలోని లోవరాజు అనే యువకుడి జీవితంలో జరిగే గల్లీ క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేమ, నాటక రంగ జీవితం, రాజకీయం.. వంటి అంశాలు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ, ఎడిటర్, సంగీతం, నిర్మాణం–దర్శకత్వం: బండి సరోజ్ కుమార్. -
సూర్య, డివిలియర్స్నే మించిపోయాడు.. ఎవరయ్యా నువ్వు?
క్రికెట్లో వినూత్న షాట్లకు పెట్టింది పేరు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్.. టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్. గ్రౌండ్ నలువైపులా షాట్లు బాదే ఈ ఇద్దరు క్రికెటర్లు మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్స్‌గా పేరు పొందారు. స్విచ్ హిట్, స్కూప్ షాట్, స్క్వేర్‌కట్.. ఇలా చెప్పుకుంటూ పోతే క్రికెట్ పుస్తకాల్లో లేని షాట్లను కూడా వీళ్లు ఆడి అభిమానులను అలరించారు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఇద్దరు తమ వినూత్న ఆటతీరుతో అభిమానుల మనసులను గెలుచుకున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే బ్యాటర్ మాత్రం సూర్య, ఏబీడీలను మించిపోయాడు. వీరిద్దరు వికెట్ల ముందు ఉండే వినూత్న షాట్లు ఆడడంలో నేర్పరులు అయితే.. ఇతను మాత్రం రూల్స్‌కు విరుద్దంగా వికెట్ల వెనకాలకు వెళ్లి మరీ స్కూప్ షాట్ ఆడాడు. బౌలర్ బంతి వేసేవరకు వెయిట్ చేసిన బ్యాటర్ ఆ తర్వాత ఒక్కసారిగా వికెట్ల వెనక్కి వెళ్లి వికెట్ కీపర్ తలపై నుంచి స్కూప్ షాట్ కొట్టి తన చర్యతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇదంతా ఎక్కడో కాదు మన దేశంలోనే ఒక లోకల్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. వీడియో చూసిన అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ''మిస్టర్ 1080..''..''రూల్స్‌కు విరుద్దంగా క్రికెట్ ఆడి పరువు తీస్తున్నాడు.. దమ్ముంటే వికెట్ల ముందే ఉండి ఈ షాట్ ఆడి చూపించు'' అని సవాల్ చేశాడు. pic.twitter.com/WIV6zMoHZx — Out Of Context Cricket (@GemsOfCricket) June 28, 2023 I wish someone does this to me with tape ball or leather ball. — Usman Asghar (@uasghar18) June 28, 2023 Mr 1080 😵 Is that shot even legal? — ವಿಕ್ರಮ್ ಪ್ರಭು | Vikram Prabhu (@TheLostIndian18) June 29, 2023 చదవండి: అభిమానుల డిమాండ్; అశ్లీల వెబ్సైట్లో జాయిన్ అయిన ఫుట్‌బాలర్ మా వల్లే కిర్‌స్టన్‌కు పేరు.. ఆ తర్వాత అతడు సాధించింది సున్నా! మరి ద్రవిడ్.. -
Viral Video: మహిళా గల్లీ క్రికెటర్ ను మెచ్చిన సచిన్
-
కొడుకు బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన క్రికెటర్.. వీడియో వైరల్
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ తన ఐదేళ్ల కొడుకు బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. సర్ఫరాజ్ అహ్మద్ తన కొడుకు ఐదేళ్ల జూనియర్ సర్ఫరాజ్‌తో కలిసి ఒక గల్లీ క్రికెట్లో పాల్గొన్నాడు. తాను సరదాగా బ్యాటింగ్ చేయగా.. కొడుకు బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ కొడుకు ఒక పర్ఫెక్ట్ యార్కర్ సంధించగా.. సర్ఫరాజ్ అహ్మద్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తన కుమారుడివైపు ఒక లుక్ ఇచ్చిన సర్ఫరాజ్ చిరునవ్వుతో తన కొడుకును మెచ్చుకున్నాడు. ఐదేళ్ల అబ్దుల్లా(సర్పారజ్ అహ్మద్ కొడుకు) ఇప్పటికే లోకల్ క్రికెట్ అకాడమీలో క్రికెటర్‌గా రూపుదిద్దుకుంటున్నాడు. కాగా గతంలో ఇక్కడి రాజకీయాలతో విసిగిపోయానని.. అది క్రికెట్‌కు కూడా పాకిందని.. తన కుమారుడిని ఎట్టి పరిస్థితుల్లో క్రికెటర్‌ను కానివ్వను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి తాజాగా తనను క్లీన్‌బౌల్డ్ చేసిన కుమారుడిని భవిష్యత్తులో స్టార్ క్రికెటర్‌గా మారుస్తాడేమో చూడాలి. ఇక సర్ఫరాజ్ అహ్మద్‌కు పాకిస్తాన్ టీంలో అంతగా అవకాశాలు రావడం లేదు. దీనికి ఒక కారణం ఉంది. వికెట్ కీపర్ అయిన సర్ఫరాజ్ అహ్మద్ మంచి బ్యాటర్ కూడా. అయితే మహ్మద్ రిజ్వాన్ రూపంలో పాక్‌కు మంచి యంగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దొరికాడు. ప్రస్తుతం రిజ్వాన్ అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. దీంతో సర్ఫరాజ్ అహ్మద్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. సర్ఫరాజ్ చివరిసారి పాక్ తరపున 2021 ఏప్రిల్‌లో సౌతాఫ్రికాతో ఆడాడు. ఇక సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని కెప్టెన్సీలోనే పాకిస్తాన్ 2017లో ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ గెలుచుకుంది. ఆ టోర్నీ ఫైనల్లో టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ట్రోపీని దక్కించుకుంది. ఇక సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ తరపున 49 టెస్టుల్లో 2657 పరుగులు, 117 వన్డేల్లో 2315 పరుగులు, 61 టి20ల్లో 818 పరుగులు సాధించాడు. Shabash Beta Abba ki he wicket he ura di 👏👏🔥 @SarfarazA_54 pic.twitter.com/rpvdxcNUVv — Thakur (@hassam_sajjad) June 20, 2022 చదవండి: Cheteshwar Pujara: 'ఆ క్రికెటర్ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి' కామెంటరీ ప్యానెల్ ఇదే.. మరో క్రికెట్ జట్టును తలపిస్తుందిగా! -
కీపింగ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టిన హర్భజన్ సింగ్.. వీడియో వైరల్..
Harbhajan Singh Celebrates After Taking Catch In Gully Cricket: భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పడు అభిమానుల కోసం ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటాడు. అయితే ఓ అసక్తికరమైన వీడియోను హర్భజన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. ఆ వీడియోలో అంత ఆసక్తికరం ఏముందంటే.. తన ఇంటికి సమీపంలో హర్భజన్ గల్లీ క్రికెట్ ఆడాడు. మీరు అనుకున్నట్టు బ్యాటర్‌గానో, బౌలర్‌గానో కాదు.. ఈ సారి టర్బోనేటర్ వికెట్ కీపర్ అవతారం ఎత్తాడు. వికెట్ కీపింగ్ చేయడమే కాకుండా ఒక క్యాచ్ కూడా పట్టాడు. అది ఇప్పడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈవీడియోకు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కామెంట్రీ చెప్పడం గమనార్హం. ఈ వీడియోపై నెటజన్లు స్పందిస్తూ.. సింగ్ ఈజ్ కింగ్ అని, పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మాల్ కంటే బాగా కీపింగ్ చేస్తున్నావ్ అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: Mahela Jayawardene: శ్రీలంక కోచ్‌గా మహేల జయవర్ధనే! View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
లవ్ ఆఫ్ క్రికెట్.. జాయ్ ఆఫ్ క్రికెట్..!
తిరువనంతపురం: మన దేశంలో క్రికెట్ ప్రేమికులు ఎక్కువనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ దొరికితే చాలు బ్యాట్‌కు, బంతికి పని చెబుతారు మనోళ్లు. ఇక్కడ చిన్నా పెద్దా అనే తేడాలు కూడా ఏమీ ఉండవు. గల్లీ క్రికెట్‌ను ఆస్వాదించడంలో తమకు తామే సాటి అన్నట్లు మురిసిపోతారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ఇంటా-బయటా క్రికెట్లో మునిగి తేలుతున్నారు.(7 ఏళ్లకే బ్యాటింగ్ ఇరగదీస్తోంది..) తాజాగా ఓ జంట క్రికెట్‌ను ఎంజాయ్ చేసిన తీరు ముచ్చటగొలుపుతోంది. కేరళ రాష్ట్రంలోని పల్కడ్ జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్న బిందు ఒజూకిల్ భర్త రామన్ నంబూద్రితో కలిసి ఇంటి వద్దనే ఉన్న పెరటినే క్రికెట్ ఫీల్డ్‌గా చేసుకున్నారు. తాము ఎవరికీ తక్కువ కాదన్నట్లు అటు బౌలింగ్‌తో ఇటు బ్యాటింగ్‌తో అలరించారు.వీరితో పాటు వారి పిల్లలు కూడా ఇలా క్రికెట్ ఆడేసుకున్నారు. ‘లవ్ ఆఫ్ క్రికెట్.. జాయ్ ఆఫ్ క్రికెట్’ అన్నంతగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. -
పీటర్సన్ ‘గల్లీ క్రికెట్’
బెంగళూరు: ఇంగ్లండ్ మాజీ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ బెంగళూరు వీధుల్లో సందడి చేశారు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం ఈ స్టార్ బ్యాట్స్‌మన్ వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ సందర్భంగా భారత్‌లో అన్ని నగరాలను పర్యటిస్తున్నాడు. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియంకు వెళ్తుండగా.. మార్గ మధ్యలో గల్లీలో పిల్లలు క్రికెట్ ఆడుతున్న విషయాన్ని గమనించాడు. దీంతో వెంటనే కార్ దిగి గల్లీ క్రికెటర్లతో కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశాడు. గల్లీ క్రికెట్ ఆడుతున్న వీడియోను పీటర్సన్ సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ‘ఇండియాలో ఎప్పటినుంచో గల్లీ క్రికెట్ ఆడాలనే కోరిక ఉండేది. అది ఈ రోజు తీరింది. మ్యాచ్‌కు వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన కొందరు పిల్లలు క్రికెట్ ఆడటం చూశాను. వెంటనే కారు ఆపి వారితో క్రికెట్ ఆడాను. చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా అభి అనే పిల్లవాడి బౌలింగ్ నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. అతడిలో మంచి టాలెంట్ ఉంది’అంటూ పీటర్సన్ పేర్కొన్నాడు. గతంలో ఆర్సీబీకి పీటర్సన్ సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
గల్లీ క్రికెట్లో న్యాయం కోసం ఐసీసీకు ట్వీట్..వీడీయో వైరల్
-
ఔట్ లేదా నాటౌట్?: మీరే చెప్పండి..
సాక్షి, వెబ్ డెస్క్ : గల్లీ క్రికెట్లో ఔట్ అయ్యావ్..! అని బ్యాట్స్‌మన్‌తో అంటే.. కాదు అని అతను పేచీకి దిగడం సహజమే. అయితే, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న హంజా అనే వ్యక్తి న్యాయం కోసం ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ను ఆశ్రయించాడు. ఈ మేరకు మ్యాచ్ సమయంలో రికార్డు చేసిన వీడియోను ఐసీసీకు ట్వీట్ చేసి న్యాయం చెప్పాలని కోరారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని వీడియోపై స్పందించిన ఐసీసీ నిబంధన 31(1) ప్రకారం బ్యాట్స్‌మన్ ఔట్ అని తేల్చింది. ఈ మేరకు రీట్వీట్ చేసింది కూడా. ఐసీసీ చేసిన ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ దాదాపు 2 మిలియన్ల మంది ఆ వీడియోను చూశారు. మరి మీరూ ఆ వీడియోను చూసేయండి. -
రోడ్డుపై క్రికెట్ ఆడిన సచిన్..!
-
వైరల్ : రాత్రివేళ రోడ్డు పక్కన సచిన్..
ముంబై : క్రికెట్‌ను అమితంగా ప్రేమించే టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఐకాన్‌గా వ్యవహరిస్తున్నారు. సచిన్ జీవితాన్ని క్రికెట్‌ను విడదీసి చూడలేమనేది అందరికి తెలిసిందే. చాలా మంది యువ క్రికెటర్లకు సచినే మార్గదర్శి. ప్రపంచ క్రికెట్లో తన పేరు మీద అనేక రికార్డులు నెలకొల్పిన సచిన్, రిటైర్మెంట్ తర్వాత కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాజాగా హోమ్ టౌన్ ముంబైలో రాత్రి సమయంలో సచిన్ ఓ రోడ్డు పక్కన సరదాగా క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సచిన్ బ్యాటింగ్ చేస్తుండగా, కొంత మంది యువకులు ఫీల్డింగ్ చేశారు. పరిసరాలను బట్టి అది విల్లే పార్లేలోని రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతమని తెలుస్తోంది. రోడ్డుపైనే క్రికెట్ ఆడుతుండటంతో వికెట్లుగా ప్లాస్టిక్ డివైడర్ని వాడారు. -
గల్లీ క్రికెట్లో గాయపడిన గంగూలీ!
-
మళ్లీ బ్యాటు పట్టిన గంగూలీ!
కోల్‌కతా: క్రికెట్ నుంచి రిటైరయి.. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరీ తీరిక దొరికినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు గంగూలీ ఏం చేస్తాడో తెలుసా? తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి దూరిపోతాడు. సరదాగా బ్యాటు పట్టుకొని గల్లీ క్రికెట్ ఆడుతాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదా రిటైరయిపోయి అప్పుడే ఎనిమిదేళ్లు అవుతోంది. అయినా గంగూలీకి క్రికెట్ అంటే మక్కువ తగ్గలేదు. అందుకే ఈడెన్ గార్డెన్స్‌లోనే కాదు తీరిక దొరికితే ఉత్తర కోల్‌కతాలోని ఇరుకు సందుల్లోనూ దాదా క్రికెట్ ఆడుతూ కనిపిస్తాడు. తాజాగా ఇలాగే గల్లీ క్రికెట్ ఆడుతూ గంగూలీ కనిపించాడు. పిల్లలతో కలిసి దాదా ఆడిన ఈ గల్లీ క్రికెట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గల్లీ క్రికెట్లోనూ గంగూలీ తన ట్రేడ్‌మార్క్ షాట్లు కొట్టాడు. ఇంతలో ఓ బాల్ దూసుకొచ్చి ఆయన భుజానికి గట్టిగా తాకింది. మామూలు టెన్నిస్ బంతి కావడంతో పెద్దగా గాయమేమీ కాలేదు. కాసేపు చేయి రాసుకొని మళ్లీ గంగూలీ క్రికెట్ కొనసాగించాడు.