![IPL 2019 Kevin Pietersen Played Gully Cricket in Bengaluru - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/28/Pietersen-gully-cricket.jpg.webp?itok=JnmV9QcB)
బెంగళూరు: ఇంగ్లండ్ మాజీ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ బెంగళూరు వీధుల్లో సందడి చేశారు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం ఈ స్టార్ బ్యాట్స్‌మన్ వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ సందర్భంగా భారత్‌లో అన్ని నగరాలను పర్యటిస్తున్నాడు. గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియంకు వెళ్తుండగా.. మార్గ మధ్యలో గల్లీలో పిల్లలు క్రికెట్ ఆడుతున్న విషయాన్ని గమనించాడు. దీంతో వెంటనే కార్ దిగి గల్లీ క్రికెటర్లతో కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశాడు.
గల్లీ క్రికెట్ ఆడుతున్న వీడియోను పీటర్సన్ సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ‘ఇండియాలో ఎప్పటినుంచో గల్లీ క్రికెట్ ఆడాలనే కోరిక ఉండేది. అది ఈ రోజు తీరింది. మ్యాచ్‌కు వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన కొందరు పిల్లలు క్రికెట్ ఆడటం చూశాను. వెంటనే కారు ఆపి వారితో క్రికెట్ ఆడాను. చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా అభి అనే పిల్లవాడి బౌలింగ్ నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. అతడిలో మంచి టాలెంట్ ఉంది’అంటూ పీటర్సన్ పేర్కొన్నాడు. గతంలో ఆర్సీబీకి పీటర్సన్ సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment