IPL 2023, RCB Vs KKR: Virat Kohli Becomes The First Player To Score 3000 Runs In T20s - Sakshi
Sakshi News home page

#ViratKohli: అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలి ఆటగాడిగా 

Published Wed, Apr 26 2023 10:45 PM | Last Updated on Thu, Apr 27 2023 1:07 PM

Virat Kohli Completed 3000 Runs-Chinnaswamy Stadium 1st-player History - Sakshi

Photo: IPL Twitter

ఆర్‌సీబీ తాత్కాలిక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. టి20 చరిత్రలో ఒకే స్టేడియం వేదికగా 3వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ సాధించాడు. ఆర్‌సీబీకి హోంగ్రౌండ్‌ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి మూడువేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

దీంతోపాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే.. ఐపీఎల్‌లో కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. కేకేఆర్‌పై ఇప్పటివరకు కోహ్లి 858 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌ 1075 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. 1040 పరుగులతో రోహిత్‌ శర్మ రెండో స్థానంలో, 858 పరుగులతో కోహ్లి మూడో స్థానంలో, 850 పరుగులతో శిఖర్‌ ధావన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు.

చదవండి: చెత్త ఫీల్డింగ్‌తో మూడు లైఫ్‌లు.. సిక్సర్లతో రికార్డులకెక్కాడు

Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement