బెంగళూరు : స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చెందిన వన్8 కమ్యూన్ పబ్ విషయంలో వరుస వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఉన్న వన్ 8 కమ్యూన్ పబ్‌లపై పలు కేసులు నమోదు కాగా.. తాజాగా బెంగళూరు పబ్‌పై కేసు నమోదైంది.
బెంగళూరులోని చిన్నస్వామీ స్టేడియం సమీపంలో ఎంజీ రోడ్‌లో వన్8 కమ్యూన్ పేరిట కోహ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్దంగా అర్ధరాత్రి 1.౩౦ గంటల వరకు పబ్‌ను నిర్వహిస్తున్నారంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు పబ్‌కు చేరుకున్నారు. పబ్ తెరిచే ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
సాధారణంగా పబ్ కార్యకలాపాలు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంది. సమయం దాటితో సదరు పబ్‌లపై పోలీసులు కేసు నమోదు చేస్తుంటారు. వన్8 కమ్యూన్ పబ్ విషయంలో సైతం ఇదే జరిగింది.
ఇక కోహ్లీ పబ్‌పై కేసు నమోదు చేయడంపై సెంట్రల్ డీసీపీ స్పందించారు. అర్ధరాత్రి వరకు పబ్‌లో ఓపెన్ చేసి ఉండడం, పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో పబ్‌ను పరిశీలించగా సమయం పాలన పాటించకపోవడంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
గతేడాది ముంబై వన్8 కమ్యూన్ పబ్ బ్రాంచ్‌లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ధోతి ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ పబ్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వన్8 కమ్యూన్ పబ్ సిబ్బంది కస్టమర్ల మనోభావాల్ని పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదిగా ట్వీట్ చేశాడు.
కాగా,గతేడాది కోహ్లి రెస్టారెంట్‌లపై కాపీరైట్ వివాదం చుట్టుముట్టింది. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో ఫోనోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ లిమిటెడ్ (PPL) కాపీరైట్ ఉన్న పాటలను ప్లే చేయకుండా నిషేధం విధించడంతో ఒక్కసారిగా వార్తల్లోకి నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment