బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు కివీస్ ఫాస్ట్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై నిప్పులు చేరుగుతున్నారు.
బ్లాక్ క్యాప్స్ ఫాస్ట్ బౌలింగ్ దాటికి టీమిండియా బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. వారిని ఎదుర్కొవడం భారత బ్యాటర్ల తరం కాలేదు. వచ్చిన వారు వచ్చినట్లగానే వెనక్కి వెళ్తున్నారు. తొలి సెషన్‌లో ఏ ఒక్క భారత్ బ్యాటర్ కూడా కివీస్ బౌలర్‌ను టార్గెట్ చేయలేకపోయాడు.
ఈ క్రమంలో భారత జట్టు కేవలం 32 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, జడేజా వంటి స్టార్ బ్యాటర్లు డకౌట్‌లగా వెనుదిరిగారు.
మరోవైపు రోహిత్ శర్మ రెండు, జైశ్వాల్ కేవలం 13 పరుగులు మాత్రమే చేశారు. మిగతా వాళ్లలో రిషభ్ పంత్ 20 పరుగులతో టాప్ స్కోర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్ర్ అశ్విన్ డకౌట్ అయ్యారు.
కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా ఒకటి, సిరాజ్ నాలుగు పరుగులు చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో చెలరేగగా.. విలియం రూర్కీ నాలుగు, సౌతీ ఒక వికెట్ తీశారు.
55 ఏళ్ల తర్వాత..
ఇక ఈ మ్యాచ్ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన భారత్ ఓ చెత్త రికార్డును నెలకొల్పింది. 1969 తర్వాత స్వదేశంలో భారత జట్టు 6వ వికెట్ నష్టానికి చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. ఇంతకుముందు 1969లో హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో భారత్ 6వ వికెట్ పతనానికి 27 పరుగులు చేసింది. మళ్లీ ఇప్పుడు 55 ఏళ్ల తర్వా అదే కివీస్‌పై భారత్ ఈ చెత్త రికార్డు మూటకట్టుంది.
అదే విధంగా మరో చెత్త రికార్డును భారత్ తమ ఖాతాలో వేసుకుంది. స్వదేశంలో జరిగిన ఓ టెస్టులో టాప్ 7 భారత బ్యాటర్లలో నలుగురు డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా ఇలా జరగడం మూడోసారి. 1952, 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో టాప్ 7 భారత బ్యాటర్లలో నలుగురు డౌకటయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment