Pubs
-
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం
-
న్యూ ఇయర్ ఎఫెక్ట్.. పబ్బులపై నిఘా..
-
రాజధానిలో పెరిగిపోయిన బౌన్సర్ల సంస్కృతి
ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 115 (2), లాఠీలు, కర్రలు వినియోగించి దాడి చేస్తే 118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామంటున్నారు. సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న జల్పల్లిలోని ‘మంచు టౌన్’ కేంద్రంగా ఇటీవల జరిగిన భారీ హంగామాకు ఓ రకంగా బౌన్సర్లే కారణమయ్యారు. కేవలం ఈ ఒక్క ఉదంతంలోనే కాదు... దాదాపు ప్రతి చోటా ‘పెద్దల’ వెనక బౌన్సర్లు కామన్ అయ్యారు. ఇటీవల కాలంలో కొందరు లేడీ బౌన్సర్లు కూడా తెరపైకి వస్తున్నారు. తమ వారి రక్షణ పేరుతో వీళ్లు చేసే హడావుడి, దౌర్జన్యాలు వీధి రౌడీలకు తీసిపోకుండా ఉంటున్నాయి. అత్యధిక బౌన్సర్లు జిమ్‌ల ద్వారా రిక్రూట్ అవుతుండటంతో 2005 నాటి ది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ (రెగ్యులరేషన్) యాక్ట్‌లోని (పస్రా) నిబంధనలు వీరికి పట్టట్లేదు. తమకు అనుకూలంగా మార్చుకుని.. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ప్రీమియర్ షోలు, ప్రారం¿ోత్సవాలతో సహా సినీ తారలతో ముడిపడి ఉన్న కార్యక్రమాలు, సభలు, సమావేశాలతో పాటు భారీ సంస్థల ఈవెంట్లకు నిర్వాహకులు పోలీసుల నుంచి అనుమతి తీసుకుంటూ ఉంటారు. ఎలాంటి టికెట్లు లేకుండా చేసే కార్యక్రమాలను పోలీసు విభాగమే భద్రత ఏర్పాటు చేస్తుంది. టికెట్లు విక్రయించే కార్యక్రమాలతో పాటు మరికొన్నింటికి నిరీ్ణత మొత్తం వసూలు చేస్తుంది. దీనికి తోడు పోలీసు విభాగంలో ఉన్న సిబ్బంది కొరత నేపథ్యంలో ఆయా సందర్భాల్లో అధికారులు అవసమైన స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలంటూ షరతు విధిస్తుంది. ఈ మాటను అడ్డం పెట్టుకుని బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డులు, వ్యక్తిగత అంగరక్షకుల పేరుతో వీళ్లు చేసే జులుం అంతా ఇంతా కాదు. భద్రత పేరుతో ఈ గార్డులు బలప్రయోగం చేస్తుంటారు. చట్టప్రకారం ఇది నేరమే అంటున్న పోలీసులు బాధితులు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.ఫిర్యాదు చేస్తే కేసులు.. భద్రత కల్పించడానికి, ప్రజలకు అదుపులో పెట్టడానికి బౌన్సర్లు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను యాజమాన్యాలు, వ్యక్తులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా విధుల్లోకి వస్తున్న గార్డులు అనేక సందర్భాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కార్యక్రమాలకు హాజరైన, తమ యజమాని ఆదేశాల మేరకు ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కోసారి ఏకంగా లాఠీలు చేతపట్టుకుని ఆహూతులపై విరుచుకుపడుతున్నారు. వీఐపీలకు ఉండే పలుకుబడిని దృష్టిలో పెట్టుకునే సామాన్యులు వీటన్నింటినీ మౌనంగా భరిస్తున్నారు. కేవలం అక్కడక్కడ మాత్రమే నిరసన గళం విప్పుతున్నారు. కాగా.. దురుసుగా ప్రవర్తించే అధికారం ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు లేదని పోలీసులు అంటున్నా... ఫిర్యాదు చేస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేస్తున్నారు. బార్లతో మొదలై..బౌన్సర్... ఈ పేరు పబ్స్, బార్స్‌కు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. ఈ సంస్కృతి సైతం ముంబైలోని డాన్స్ బార్లలో ప్రారంభమైంది. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం తాగి గొడవలు చేసేవారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాం (సాధారణంగా షర్టు, టీషర్టు మాత్రమే నల్లవి ధరిస్తారు)లతో వీరు దర్శనం ఇస్తుంటారు. ఆపై వీరిని రెస్టారెంట్లు, మాల్స్ యాజమాన్యాలు సైతం ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాయి. ఆపై సెక్యూరిటీ గార్డులుగా మారిన ఈ బౌన్సర్లు ప్రముఖుల రాక, భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు తదితర సందర్భాల్లో రక్షణ కోసం రంగంలోకి దిగడం ప్రారంభించారు. ఇప్పుడైతే అనేక మంది వీఐపీల వెంటే ఉండటం ప్రారంభమైంది. దేహ దారుఢ్యంతో పాటు కాస్త చురుకుదనం, సమయస్ఫూర్తి మాత్రమే ప్రధాన అర్హతలు కావడంతో జిమ్స్తో టచ్‌లో ఉండే అనేక మంది యువకులు తాత్కాలిక బౌన్సర్లుగా ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలోనే కొందరు శాశ్వత ప్రాతిపదికన సెక్యూరిటీ గార్డులుగానూ పని చేస్తున్నారు. -
బంజారాహిల్స్ లోని పలు పబ్బులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
-
హైదరాబాద్ పబ్బులపై దాడులు.. నలుగురికి డ్రగ్స్ పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పబ్బులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. టెస్టులో నలుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఐదు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించాగా, 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో శాంపిల్స్ సేకరించారు.పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన చిన్న నిగేష్, శ్రీకాకుళం కి చెందిన నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీమ్ లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కోరం క్లబ్లో ఇద్దరికి, బేబిలోన్ పబ్‌లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. చిన్న నిగేష్(వరంగల్), నార్త్ రవికుమార్(శ్రీకాకుళం), కేశవరావు(మూసేపేట), చార్మినార్‌కు చెందిన రహీమ్‌లకు పాజిటివ్‌గా గుర్తించారు. -
హైదరాబాద్ లోని 25 పబ్ ల్లో పోలీసుల తనిఖీలు
-
హైదరాబాద్ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్లలో పోలీసులు దాడులచేశారు. టీజీనాబ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో బార్లలో మరో ముగ్గురు వ్యక్తులు పాజిటివ్‌గా తేలారు. మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డీటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను టీజీనాబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు కేసుల్లో జీ 40లో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరా పబ్బులో ఒకరికి, క్లబ్ రొగ్లో ఒకరికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చినట్లు అధికారుల తెలిపారు. -
హైదరాబాద్ లోని పబ్బుల్లో ఎక్సైజ్ శాఖ ఆకస్మిక తనిఖీలు
-
హైదరాబాద్ పబ్స్ లో అధికారుల సోదాలు
-
జోర పబ్బులో నార్కెటిక్ బ్యూరో పోలీసులు తనిఖీలు..
-
వివాదాల మయం, విరాట్ కోహ్లీ పబ్‌పై కేసు నమోదు.. కారణం ఏంటంటే?
బెంగళూరు : స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చెందిన వన్8 కమ్యూన్ పబ్ విషయంలో వరుస వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఉన్న వన్ 8 కమ్యూన్ పబ్‌లపై పలు కేసులు నమోదు కాగా.. తాజాగా బెంగళూరు పబ్‌పై కేసు నమోదైంది.బెంగళూరులోని చిన్నస్వామీ స్టేడియం సమీపంలో ఎంజీ రోడ్లో వన్8 కమ్యూన్ పేరిట కోహ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్దంగా అర్ధరాత్రి 1.౩౦ గంటల వరకు పబ్‌ను నిర్వహిస్తున్నారంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు పబ్‌కు చేరుకున్నారు. పబ్ తెరిచే ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.సాధారణంగా పబ్ కార్యకలాపాలు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంది. సమయం దాటితో సదరు పబ్‌లపై పోలీసులు కేసు నమోదు చేస్తుంటారు. వన్8 కమ్యూన్ పబ్ విషయంలో సైతం ఇదే జరిగింది.ఇక కోహ్లీ పబ్‌పై కేసు నమోదు చేయడంపై సెంట్రల్ డీసీపీ స్పందించారు. అర్ధరాత్రి వరకు పబ్‌లో ఓపెన్ చేసి ఉండడం, పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో పబ్‌ను పరిశీలించగా సమయం పాలన పాటించకపోవడంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.గతేడాది ముంబై వన్8 కమ్యూన్ పబ్ బ్రాంచ్‌లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ధోతి ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ పబ్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వన్8 కమ్యూన్ పబ్ సిబ్బంది కస్టమర్ల మనోభావాల్ని పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదిగా ట్వీట్ చేశాడు. కాగా,గతేడాది కోహ్లి రెస్టారెంట్లపై కాపీరైట్ వివాదం చుట్టుముట్టింది. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో ఫోనోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ లిమిటెడ్ (PPL) కాపీరైట్ ఉన్న పాటలను ప్లే చేయకుండా నిషేధం విధించడంతో ఒక్కసారిగా వార్తల్లోకి నిలిచింది. -
ది కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
-
దీ కేవ్ పఫ్ క్లబ్'లో డ్రగ్స్ కలకలం..
-
మొదటిసారి డ్రగ్స్ కోసం స్నిఫర్ డాగ్స్ తో పోలీసుల రైడ్స్
-
హైదరాబాద్ లో డ్రగ్ విక్రయాలు.. పబ్ డీజే ప్లేయర్ల అరెస్టు
-
పబ్ లో కొత్త దందా..
-
హైదరాబాద్ పబ్‌ల్లో కొత్త రకం మోసం.. వ్యాపారవేత్తను బుట్టలోకి దింపి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్త రకం మోసం వెలుగు చూసింది. కొంతమంది పబ్ యజమానులు.. అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్‌లో కొత్త మోసానికి తెరతీశారు. పబ్ యజమానులు, అమ్మాయిలు.. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు.ఒక వ్యాపారవేత్తకు రితికా అనే యువతి పరిచయం కాగా, పరిచయం అయిన మరుసటి రోజే కలుద్దామని చెప్పి హై టెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకి రమ్మంది. మరుసటి రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద చేరుకున్నారు. వ్యాపారవేత్తను పబ్‌లోకి తీసుకెళ్లి తియ్యని మాటలు చెప్పి గంట లోపల ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి తాగింది. రూ. 40,505 రూపాయిలు బిల్‌ను చేతిలో పెట్టి రితిక జారుకుంది. బిల్లును చూసి ఆ వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 45 వేల రూపాయల మద్యం తాగిన రితిక తూలకుండా బయటికి వెళ్లిపోవడంతో విస్మయం చెందిన వ్యాపార వేత్త.. పబ్బు యజమానులు మద్యం పేరుతో కోక్ ని అమ్మాయికి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నాడు.పబ్ వాళ్లే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఇలాగే ఆ యువతి, పబ్ యాజమానుల చేతిలో చాలా మంది మోసపోయి పోయినట్లు తేలింది. రెండు రోజుల పరిధిలోని ఈ పబ్బులో ఇలాంటి మోసాలు జరిగినట్లు గుర్తించారు. తనకు జరిగిన మోసంపైన సోషల్ మీడియాలో ఆధారాలతో సహా వ్యాపారవేత్త బయటపెట్టాడు. -
పుణే ఘటన: లంచాల మోజు.. పోలీసుల అక్రమాలు వెలుగులోకి!
రెండు నిండు ప్రాణాల్ని బలిగొన్న పుణే పోర్షే హిట్ అండ్ రన్ కేసు.. రకరకాల కోణాల్లో చర్చకు దారి తీసింది. వాహనం నడిపింది ఓ మైనర్ కావడంతో పేరెంటింగ్ కోణంలో ప్రధాన చర్చ నడిచింది. మైనర్ బాలుడి తండ్రి తన పలుకుబడి ఉపయోగించి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం.. ఆ ప్రయత్నంలో నిర్లక్ష్యం ధోరణి ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు, రక్త నమూనాలు తారుమారు చేయటంతో డాక్టర్ల అరెస్టు.. తండ్రి, తాతల అరెస్ట్.. పోర్షే కథలు రోజుకొకటి వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ కేసు కారణంగానే.. నగరంలో అర్ధరాత్రుల దాకా అనుమతులు లేకుండా బార్లు, పబ్‌ల నిర్వహణ, వాటిల్లో డ్రగ్స్ వాడకం.. ఆ మొత్తం వెనుక అధికారుల అవినీతి బాగోతం బయటపడింది ఇప్పుడు.. పుణేలో అర్ధరాత్రి దాకా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహించే పబ్‌లు, బార్లు.. పైగా డ్రగ్స్ కోణాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు ఓ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్.. ఈ హిట్ అండ్ రన్ కేసుపై ఇదివరకే నిరసన వ్యక్తం చేశారు. పబ్‌లు, బార్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన యెరవాడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆయన ఇప్పుడు మరో సంచలన చర్చకు దారితీశారు.చదవండి: Pune Porsche Case: రీల్‌ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!లంచాల మోజుతో పోలీసులు అక్రమంగా నిర్వహిస్తున్న పబ్ యజమానులు, డ్రగ్స్ ట్రేడర్ల వద్ద నెలకు లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారని రవీంద్ర ధంగేకర్ ఆరోపణులు చేశారు. పుణె ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రతినెలా లంచాలు తీసుకుంటున్నారని, లంచాల సేకరణకు కానిస్టేబుళ్లు, ప్రైవేట్ వ్యక్తులను ఉపయోగించుకున్నారని తెలిపారు.#Pune #Porsche Case: Ravindra Dhangekar Discloses Names Of Persons Involved In ' HAFTA 'From Pubs, Clubs and Liquor Shops In a major crackdown, the Kasba Peth MLA Ravindra Dhangekar revealed that police are collecting monthly bribes amounting to lakhs of rupees from the owners… pic.twitter.com/5ehtFFSuW8— Pune Pulse (@pulse_pune) May 27, 2024 విమాన్ నగర్, కోరేగావ్ పార్క్, కళ్యాణి నగర్, భుగావ్ భూకుమ్, బానేర్, హింజవాడి, పింప్రి చించ్వాడ్, లోనావాలా ప్రాంతాల్లో ఉండే అర్ధరాత్రి, రూఫ్‌టాప్‌లో నిర్వహించినే హోటళ్ల వద్ద లంచాలు తీసుకొని చూసిచూడనట్లు వ్యవహరిస్తారని అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పోలీసు నెలకు వసూలు చేసే మొత్తం దాదాపు రూ. 78 లక్షలు ఉంటుందని లెక్కలతో సహా మీడియాకు తెలిపారు. లంచాలు తీసుకునే ప్రాంతాలు, వాటిని వసూలు చేసే పోలీసు కానిస్టేబుల్స్ పేర్లను ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టారు.కస్బా పేట్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టిన ఈ వివరాలు ప్రస్తుతం మహారాష్ట్రలో సంచలనంగా మారాయి. అదేవిధంగా పుణె పోలీసు డిపార్టుమెంట్లో ఎప్పటి నుంచో ఉన్న అవినీతి వ్యవహారం తాజాగా బట్టబయలు అయింది. పుణె సిటీ కల్చర్, చట్టాల అమలుపై తీవ్ర చర్చ జరుగుతోంది. -
పబ్బుల మీద బతికే వసూల్ రాజా!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లకు టార్గెట్లు పెట్టి మరీ కప్పం వసూలు చేస్తున్నాడు. తొలినాళ్లల్లో పోలీసులకు, పబ్స్‌కు మధ్య దళారిగా వ్యవహరించిన ఇతడు ప్రస్తుతం వాటి యజమానులను బెదిరించే స్థాయికి వెళ్లాడు. తనకు నెలనెలా మామూళ్లు చెల్లించకపోతే సిటీలో వ్యాపారం చేయలేరని, పోలీసులు, ఎక్సైజ్ విభాగాలతో పాటు నార్కోటిక్స్ వింగ్స్తోనూ దాడులు చేయిస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఆయా అధికారులతో మాట్లాడిన ఆడియోలను సైతం వారికి షేర్ చేసి మరీ డబ్బు డిమాండ్ చేస్తున్నాడు. ఇటీవల కాలంలో పబ్బులపై పోలీసులు కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో దీన్నే పెట్టుబడిగా మార్చుకుని రెచ్చిపోతున్న ఈ వసూల్ రాజా బారి నుంచి తమను ఆదుకోవాలని పలువురు వేడుకుంటున్నారు. అధికారులను ఉసిగొల్పుతానంటూ.. నగరంలోని కొన్ని పబ్స్ యజమానులకు చోటా నేతగా పరిచయమైన ఈ వసూల్ రాజా.. హ్యూమన్‌రైట్స్ కార్యకర్త అని, ఓ సేన యాక్టివిస్ట్ అంటూ పోలీసులకు దగ్గరయ్యాడు. ఆపై సదరు పోలీసు అధికారుల సంబం«దీకులకు–పబ్స్ యజమానులకు మధ్య దళారీగా మారాడు. కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది తమ వారు ఎవరైనా పబ్‌కు వెళ్లాలని భావిస్తే ఇతడిని సంప్రదించే వాళ్లు. వారిని పబ్‌కు పంపడమే కాకుండా బిల్లుల్లోనూ రాయితీలు ఇప్పించేవాడు. ఇలా కొన్ని పబ్స్‌ను తన చేతిలో పెట్టుకున్న సదరు దళారీ వాటి యజమానులకు టార్గెట్లు పెట్టి మరీ ప్రతి నెలా వసూళ్లకు పాల్పడ్డాడు. పోలీసులు, ఎక్సైజ్, నార్కోటిక్స్ విభాగాలతో పాటు ఇతరులకూ డబ్బు ఇవ్వాల్సి ఉందంటూ వారి నుంచి దండుకున్నాడు. ఆ అధికారులు ఎవరూ పబ్ జోలికి రాకుండా చూస్తానంటూ యజమానుల నుంచి డబ్బు తీసుకున్నాడు. నా మాట వినకుంటే అంతే.. 👉తన మాట వినని వారికి సంబంధించిన పబ్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ స్థానిక పోలీసులు, ప్రత్యేక విభాగాలకు ఈ దళారీ ఫోన్లు చేస్తుంటాడు. ఆ ఆడియోలను రికార్డు చేసి సదరు పబ్ యజమానికే పంపిస్తుంటాడు. అలా పంపిన తర్వాత పోలీసులతో తనకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని, తన మాట వినకుంటే దాడుల చేయిస్తానని బెదిరింపులకు దిగి వసూళ్లు చేస్తున్నాడు. ఎంతకీ తన మాట వినని పబ్స్ యజమానులకు తన దారికి తెచ్చుకోవడానికి సదరు దళారీ పోలీసులను వినియోగించుకుంటాడు. 👉 ఆయా పబ్స్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, యువత పెడదారి పడుతున్నారని, స్థానిక మహిళలు తనకు ఫిర్యాదు చేశారంటూ పోలీసులకు ఫోన్లు చేస్తాడు. తక్షణం దానిపై దాడి చేసి, సోదాలు చేయాలని కోరతాడు. వారు పట్టించుకోకుంటే పై స్థాయి «అధికారులకు ఫోన్లు చేయడం ప్రారంభిస్తాడు. ఆపై పబ్స్ యజమానిని సంప్రదించి అధికారులతో మాట్లాడిన ఆడియో రికార్డులు షేర్ చేస్తాడు. 👉తడి బెదిరింపులు తట్టుకోలేకపోయిన కొందరు పబ్స్ యజమానులు తమ సంస్థలు అయినకాడికి అమ్ముకుని నగరం విడిచి వెళ్లిపోయారు. మరికొందరు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఈ దళారీ బెదిరింపులకు భయపడి ప్రోత్సహించవద్దని, అతడి బారి నుంచి తమను కాపాడాలని పబ్స్ యజమానులు పోలీసులను వేడుకుంటున్నారు. -
లైసెన్స్ లేని ‘మ్యూజిక్’
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం 2022 నుంచి పునఃప్రారంభించిన విధానం ప్రకారం ప్రతి పబ్ కచి్చతంగా అమ్యూజ్మెంట్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఇది లేకపోతే కేవలం ఓ బార్ మాదిరిగా వ్యవహరించాలే తప్ప మ్యూజిక్కు అనుమతి ఉండదు. ఇప్పటికీ సిటీలో అనేక పబ్‌లు ఈ అనుమతి లేకుండానే యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించేస్తున్నాయి. అప్పుడప్పుడు దాడులు చేస్తున్న పోలీసులు సైతం ఓ బెయిలబుల్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. పోలీసు నిబంధనల్ని పట్టించుకోని వారి విషయం ఇలా ఉంటే.. కొందరు పబ్స్ యజమానులు తాము ఈ అమ్యూజ్మెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినా అనుమతి లభించట్లేదని ఆరోపిస్తున్నారు. పదేళ్ల క్రితం నిలిచిపోయిన విధానం.. నగరంలో ఒకప్పుడు పబ్స్‌కు లైసెన్సులు జారీ చేయడంలో పోలీసు విభాగానికీ కీలక పాత్ర ఉండేది. వీళ్లు సైతం క్లియరెన్స్ ఇస్తేనే పబ్ నడిచేందుకు అనుమతి ఉండేది. 2015 నుంచి అమలులోకి వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంతో ఈ పద్ధతికి ఫుల్స్టాప్ పడింది. వ్యాపార సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం కోసమంటూ పబ్స్‌కు పోలీసు లైసెన్స్ విధానాన్ని ప్రభుత్వం అటకెక్కించేసింది. ఫలితంగా కొన్నాళ్లు పరిస్థితులు సజావుగానే ఉన్నా.. ఆపై అసలు సమస్యలు మొదలయ్యాయి. అనేక పబ్స్ ఉల్లంఘనలు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారిపోయాయి. ఈ విషయంపై హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు 2022 నుంచి పాత విధానాన్ని పునరుద్ధరించారు. అధికారిక వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు.. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంటర్టైన్మెంట్, ఎమ్యూజ్మెంట్ లైసెన్సుల జారీకి నగర పోలీసులు 2022 డిసెంబర్ 20 నుంచి శ్రీకారం చుట్టారు. పోలీసుస్టేషన్లు, ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే జారీ చేసే విధానం ప్రారంభించారు. ఈ అవకాశంతో కూడిన నగర పోలీసు వెబ్సైట్ ( ఠీఠీఠీ. జిyఛ్ఛీట్చb్చఛీఞౌ జీఛ్ఛి. జౌఠి. జీn) కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా దరఖాస్తును 15 నిమిషాల్లో సబి్మట్ చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. దీన్ని పరిశీలించే పోలీసు విభాగం కొత్త లైసెన్సును 30 రోజుల్లో, రెన్యువల్‌ను 15 రోజుల్లో పూర్తి చేసేలా సమయాన్ని నిర్దేశించారు. దీనికి ముందు స్థానిక శాంతిభద్రతల విభాగం (ఎల్ అండ్ ఓ), ట్రాఫిక్ డీసీపీలు దరఖాస్తుదారుడు పబ్ ఏర్పాటు చేయనున్న భవనాన్ని పరిశీలించేలా నిబంధనలు రూపొందించారు. పక్కా పరిశీలన తర్వాతే అనుమతి... ఈ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అధికారులు ఆ పబ్ ఉన్న ప్రాంతం, చుట్టుపక్కల వారికి ఏవైనా ఇబ్బందులు కలుగుతాయా? సౌండ్ పొల్యూషన్‌కు ఆస్కారం ఉందా? అవసరమైన స్థాయిలో పార్కింగ్ వసతులు ఉన్నాయా? తదితర అంశాలను పరిశీలిస్తారు. అవసరమైన అన్ని నిబంధనల ప్రకారం ఉంటేనే అమ్యూజ్మెంట్ లైసెన్సు జారీ చేయాల్సిందిగా కోరుతూ నగర కొత్వాల్‌కు సిఫార్సు చేస్తారు. ఈ విధానం కొత్తగా ఏర్పాటు చేయబోయే పబ్స్‌కు మాత్రమే కాదు.. అప్పటికే ఉన్న వాటికీ వర్తింస్తుంది. సరైన పార్కింగ్ వసతి లేని వారిని నిర్ణీత సమయం ఇచ్చి పార్కింగ్ వసతి ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తారు. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ బయటకు రాకుండా చర్యలు తీసుకునేలా చేస్తారు. కేవలం రాత్రి వేళల్లోనే కాకుండా ఏ సమయంలో ఈ పబ్స్‌లో వచ్చే శబ్దాలతో స్థానికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు. వాళ్లు తీసుకోరు.. వీళ్లు అడిగినా ఇవ్వరు.. ► ఎమ్యూజ్మెంట్ లైసెన్స్ విధానం పునరుద్ధరించి 14 నెలల దాటుతున్నా.. ఇప్పటికీ నగరంలోని అనేక పబ్స్ ఇది లేకుండా, కేవలం ఎక్సైజ్, జీహెచ్ఎంసీ అధికారులు ఇచి్చన పర్మిషన్లతో నడిపించేస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పబ్‌ల జాబితా రూపొందించి, వాటిలో ఎన్నింటికీ ఈ ఎమ్యూజ్మెంట్ లైసెన్స్ ఉంది? ఎన్ని దరఖాస్తు చేశాయి? ఎన్ని ఈ నిబంధనల్ని పట్టించుకోవట్లేదు? అనే అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ► పోలీసులు మాత్రం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు. లైసెన్స్ లేదంటూ ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. లైసెన్స్ తీసుకోని వారి విషయం ఇలా ఉంటే.. కొందరు దీన్ని పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసినా.. పోలీసులు పట్టించుకోవట్లేదు. కొత్త లైసెన్సు జారీ 30 రోజుల్లో, రెన్యువల్ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేసేలా గడువు నిర్దేశించుకున్నా ఇది అమలు కావట్లేదు. ఈ విషయం తెలిసిన మిగిలిన పబ్స్ యజమానులూ దరఖాస్తు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. -
‘అక్కడ ఫ్యాక్టరీ పెట్టనే పెట్టం.. వాళ్లు పనిచేయకుండా పబ్‌కు పోతారు’
యూకేలో ఫ్యాక్టరీల ఏర్పాటుపై అపోలో టైర్స్ అధిపతి నీరజ్ కన్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఫ్యాక్టరీలు పెట్టనే పెట్టబోమని, అక్కడి వర్కర్లు పనిచేయకుండా పబ్‌లకు వెళ్తారని ఆరోపించారు. అందులోనూ అక్కడి ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించినట్లు ‘డైలీ మెయిల్’ కథనం పేర్కొంది. ఇదే సమయంలో ఇతర దేశాలు ఇచ్చిన ప్రోత్సాహకాలను హైలైట్ చేస్తూ "హంగేరీ మాకు ప్రోత్సాహకాలను ఇచ్చింది. ఇక్కడ కార్మికుల ఖర్చు చాలా అందుబాటులోనే ఉంది. దీంతో ఉత్పత్తి ఖర్చు తక్కువే అవుతుంది. ఇక యూకేలో శ్రామిక శక్తి ఎలా ఉందో మీకు తెలుసు. వీళ్లు పెద్దగా పనిచేయకుండా పబ్‌లకు వెళ్తుంటారు" అని అపోలో టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించారు. ఇది అక్కడ విధానపరమైన సమస్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ విధానాల వల్ల అక్కడి ప్రజలు పనులు చేయకుండా ఇంట్లో కూర్చొని పెన్షన్లు తీసుకుంటున్నారని నిందించారు. లండన్‌లో ఇటాలియన్ రెస్టారెంట్ కూడా ఉన్న కన్వర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ యూకేలో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అపోలో టైర్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే యూకేలో కార్పొరేట్ వ్యవహారాలను నిర్వహించడానికి 30 మంది సభ్యుల టీమ్ ఉంది. ఇక్కడే ఈ కంపెనీకి ఇన్నోవేషన్ హబ్ ఉండటం గమనార్హం. కాగా మరో ఇన్నోవేషన్ హబ్ భారత్‌లోని హైదరాబాద్‌లో ఉంది. మాంచెస్టర్ యునైటెడ్‌కు ఈ కంపెనీ దీర్ఘకాలిక స్పాన్సర్‌గా కొనసాగుతోంది. -
HYD: పబ్బుల్లో డ్రగ్స్.. యువతులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల్లో డ్రగ్ విక్రయాలు చేస్తున్నారు. మాదాపూర్‌లోని నోవాటెల్ ఆర్టిస్ట్రీ, ఎయిర్ లైవ్, క్లబ్ రౌగ్, క్లబ్ రాక్ పబ్బుల్లో డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి పబ్బుల్లో విక్రయిస్తున్న మహిళల నుంచి 10 గ్రాముల ఎండీఎంఏతో పాటు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న మిథున, కొంగాల ప్రియలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో నలుగురు కలిసి గత కొంతకాలం నుంచి డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సప్లయర్స్ ఉస్మాన్, అజీం, అబ్దుల్లా పరారీలో ఉన్నారు. -
హైదరాబాద్ లో మితిమీరిన పబ్ ల ఆగడాలు
-
న్యూఇయర్ వేడుకల రోజు నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లు
-
Hyd: నిబంధనలు పాటించని పబ్‌లపై కొరడా.. ఆరు పబ్‌లపై కేసులు
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల రోజు నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. జూబ్లీహిల్స్‌లో ఆరు పబ్బులపై కేసులు నమోదు చేశారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు నడిచిన హలో, టార్,గ్రీన్ మంకిస్, మకవ్,లాస్ట్, జీనా పబ్బులపై కేసులు నమోదయ్యాయి. నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను పబ్ నిర్వాహకులు లెక్కచేయలేదు. అధిక డీజే సౌండ్‌తో స్థానికులను ఇబ్బందిపెట్టినందుకు కూడా కేసు నమోదు చేశారు. భారీ శబ్ధాలు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు. ఐపీసీ సెక్షన్ 188, 290, సీపీ చట్టం కింద కేసు నమోదైంది. కాగా, కొత్త ఏడాదికి లిక్కర్ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతో పాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్‌షాపులకు చేరింది. డిసెంబర్ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది డిసెంబర్ 30న రూ.313 కోట్లు, డిసెంబర్ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: నుమాయిష్ 2024 ప్రారంభం.. మాస్క్ కంపల్సరీ! -
హైదరాబాద్ పబ్బుల్లో అసభ్య నృత్యాలు
-
రాహుల్‌కు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
ఎర్రుపాలెం: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, మధిరల్లో సోమవారం జరిగిన మోటారు సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రధాని పదవినే త్యాగం చేసిన రాహుల్‌పై సభ్యత, సంస్కారం మరిచి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎప్పుడూ పబ్‌లు, క్లబ్‌ల వెంట తిరిగే కేటీఆర్‌కు పొలాలు పబ్లలా, మెకానిక్ షాపులు క్లబ్లలా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అవినీతిలో కూరుకున్న కేటీఆర్ వెంట ఈడీ, సీబీఐ పడుతుండటంతో బీజేపీ నాయకులతో అంటకాగుతూ వారి డైలాగ్‌లను వల్లె వేస్తున్నా రని విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించారు. ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయా అన్న ప్రశ్నకు భట్టి సమాధానం ఇస్తూ ఆయన వ్యాఖ్య లను కట్ చేసి చూపించారని ఆరోపించారు. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్ అని, తాము అధికారంలోకి రాగానే నూటికి నూరు శాతం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని భట్టి స్పష్టం చేశారు. -
HYD: పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై పోలీస్ రైడ్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు పబ్‌లు, శివారుల్లోని ఫామ్‌హౌజ్‌లపై పోలీసులు శనివారం రైడ్స్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఒకవైపు.. మాదాపూర్‌లోని పబ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొన్ని పబ్బులు నిబంధనలు ఉల్లంఘించి మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. బర్డ్ బక్స్, హాట్కప్ పబ్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఏడుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. మొయినాబాద్ పరిధిలోని ఫామ్హౌజ్లలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. సెలబ్రిటీ ఫామ్‌హౌజ్, ముషీరుద్దిన్, ఎటర్నిటీ ఫామ్‌హౌజ్‌లపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ మూడు ఫామ్ హౌజ్‌లపై కేసులకు గానూ పదిహేను మంది అరెస్ట్ చేశారు పోలీసులు. -
రాత్రి 10 గంటల నిబంధన ఎత్తివేయలేం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని పబ్‌లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పబ్‌ల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మ్యూజిక్ సౌండ్ ఆపాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. జూబ్లీహిల్స్ పబ్‌లు జనావాసాల మధ్య ఉన్నందున దీనిపై ఎటువంటి వెసులుబాటు ఇవ్వ లేమని ఆ పబ్‌లకు తేల్చిచెప్పింది. ఫర్జీ కేఫ్, అమ్నీసియా లాంజ్ బార్, బ్రాడ్వే ది బ్రూవరీ పబ్‌లకు గతంలోనే ఈ మేరకు ఆదేశాలు ఇవ్వగా.. శుక్రవారం సన్‌బర్న్ సూపర్క్లబ్కు ఇదే ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వు లను సవాల్ చేస్తూ సన్‌బర్న్ సూపర్క్లబ్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. జూబ్లీహిల్స్‌లోని పబ్‌లు జనావాసాల మధ్య ఉన్నందున వెసు లుబాటు ఇవ్వలేమంటూ మధ్యంతర పిటిషన్ ను కొట్టివేసింది. రాత్రి పది తర్వాత సౌండ్ పెట్టొద్దని ఆదేశించింది. సౌండ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ నిబంధనలను పాటించడంలేదని జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ సహా మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి పలు నిబంధనలు విధిస్తూ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. -
New Year: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పబ్‌లకు హైకోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలోని 10 పబ్‌లకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్ అనుమతి ఇచ్చేది లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. పబ్‌లపై గతంలో హైకోర్టు ఈ ఆదేశాలివ్వగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్స్ నిర్వాహకులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గతంలో పబ్‌ల విషయంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. న్యూఇయర్ సందర్భంగా నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపింది. రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్ సౌండ్ పెట్టరాదని పేర్కొంది. గత ఆదేశాల ప్రకారమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది. చదవండి: New Year Celebrations: కరో కరో జల్సా.. కరోనా ముప్పుంది జాగ్రత్త..! -
హై వ్యాల్యూమ్‌తో డీజే.. బంజారాహిల్స్‌లో రెండు పబ్‌లపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్‌కు అడ్డంకులు కలిగించడమే కాకుండా హై వ్యాల్యూమ్‌తో డీజే ఏర్పాటు చేసి శబ్ధ కాలుష్యానికి పాల్పడిన రెండు పబ్‌లపై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాలివీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో కేబీఆర్ పార్కు ముందు రియోట్ పబ్, చీర్స్ పబ్ ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి 1.10 గంటల సమయంలో స్థానిక పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఈ రెండు పబ్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ వినిపిస్తుండటంతో తనిఖీలు చేపట్టారు. గడువు ముగిసిన తర్వాత కూడా డీజే ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు పార్కింగ్ చేసి రోడ్డుపై కస్టమర్లు న్యూసెన్స్ చేస్తుండటంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగానే రియోట్ పబ్ యజమాని కన్హయ్య కుమార్‌సింగ్, చీర్స్ పబ్ యజమాని తానిశెట్టి రాములపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
24 గంటల్లో 78 పబ్బుల్లో తాగాడు...
‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అంటున్నాడు ఆస్ట్రేలియాకు చెందిన హెన్రిచ్ డి విలియర్స్. 24గంటల్లో 78 పబ్బుల్లో తాగి అత్యధిక ‘పబ్ క్రాల్’ (లైసెన్సులున్న పబ్బులను సందర్శించి అన్నింట్లోనూ ఆల్కహాల్ తాగడం) చేసిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక్కరోజులో 78 పబ్బులా? ఎంత తాగి ఉంటాడో అనే కదా సంశయం. ఒక్కో పబ్బులో 125 ఎమ్ఎల్ మాత్రమే తాగాలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రూల్. ఆ ప్రకారమే తాగాడు. అంత తాగిన తరువాత స్టడీగా ఉన్నాడా? అంటే.. అందుకే తనకు సహాయంగా తమ్ముడు రువాల్డ్ డి విలియర్స్‌ను, ఫ్రెండ్.. వెస్సెల్ బర్గర్‌ను వెంట బెట్టుకు వెళ్లాడు. అయినా సరే... 24 గంటల్లో 78 పబ్బులకు వెళ్లడమంటే.. సాధారణ విషయం కాదు. రికార్డు కోసం మెల్బోర్న్లోని బార్స్ గురించి బాగా రీసర్చ్ చేసి.. ముగ్గురూ పక్కాగా రూట్‌మ్యాప్ ప్లాన్ చేసుకున్నారు. జీపీఎస్ ట్రాకింగ్‌తో గమ్యస్థానాన్ని చేరుకుని రికార్డ్ బ్రేక్ చేశారు. -
జూబ్లీహిల్స్ పబ్‌లలోనే రాత్రి 10 దాటితే నో మ్యూజిక్: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల వ్యవహారంలో మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. 10 పబ్‌లలో రాత్రి పది గంటల తర్వాత మ్యూజిక్ వినిపించకూడదని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని అప్పీలు చేసింది రెస్టారెంట్ అసోసియేషన్. ఈ అప్పీలుపై విచారణ సందర్భంగా డివిజనల్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు జూబ్లీహిల్స్‌లోని 10 పబ్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 26న పబ్‌లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే మైనర్లను కూడా పబ్‌లలోకి అనుమతివ్వొద్దని ఆదేశించారు. ఇదీ చదవండి: కేసుల్లో ఈ కేసులు వేరయా.. పతి, పత్నీ ఔర్ ఓ.. ప్చ్! యాప్ ఎంతపని చేసింది? -
‘వర్క్ ఫ్రమ్ పబ్’.. మందేస్తూ, చిందేస్తూ పని చేయ్..!
లండన్: కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే పని)కి చాలా సంస్థలు మొగ్గు చూపాయి. అయితే, ఇంట్లో ఒంటరిగా కూర్చిని పని చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో విసుగు చెందటం సహజమే. అయితే, అలాంటి వారి కోసమే ఈ బంపర్ ఆఫర్. బ్రిటన్‌లో ఇప్పుడు ‘వర్క్ ఫ్రమ్ పబ్’ అనే సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. వర్క్ అండ్ ప్లే అనే కాన్సెప్ట్‌తో బార్లు, పబ్లులు ఇంటి నుంచే పని చేసే ఉద్యోగులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా కారణంగా బిజినెస్ లేక పబ్బులు దివాలా తీసే పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిని ఆకట్టుకునే పనిలో పడ్డాయి యూకేలోని పబ్బులు. ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీలను అందిస్తున్నాయి. యూకేలోని ‘యంగ్’ పబ్ దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రాంచైజీల్లో ఈ ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీని అందిస్తోంది. పని చేసుకునేందుకు ప్రత్యేక స్థలం, లంచ్‌లో సాండ్విచ్, అన్లిమిటెడ్ టీ, కాఫీలు కేవలం రోజుకు 15పౌండ్లు(రూ.1,300)లకే అందిస్తోంది. వర్క్ ఫ్రమ్ పబ్ కల్చర్ విస్తరిస్తుండటంతో నలుగురితో కలిసి పనిచేయాలని కోరుకునే ఉద్యోగాలు.. పబ్బుల దారిపడుతున్నారు. ఈ ప్యాకేజీల్లో పవర్ సాకెట్స్, నిశబ్దంగా ఉండే క్యాబిన్లతో పాటు షిఫ్ట్ అయిపోగానే జిన్, పింట్, టోనిక్ వంటి వాటిని సైతం సేవించవచ్చు. అయితే, ఈ స్కీమ్‌ను 2020లోనే యంగ్ పబ్ లాంచ్ చేసింది. మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు మొత్తం 185 ప్రాంచైజీల్లో అమలు చేస్తోంది. తాము పబ్‌లో ఉండే వాతావరణానికే మొగ్గు చూపుతామని కొందరు వర్క్ ఫ్రమ్ పబ్ వినియోగదారులు చెబుతున్నారు. లండన్, గ్రీన్విచ్లోని కట్టి సార్క్ పబ్‌లో ‘వర్క్ ఫ్రమ్ పబ్’ చేస్తున్న ఎడ్యుకేషన్ కాపీరైటర్ జెన్ పలు విషయాలు పంచుకున్నారు. తాను 200 ఏళ్లనాటి వాతవరణాన్ని ఆఫీస్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్యాకేజీ వాటర్ కూలర్‌ను దెబ్బ తీస్తుందని చమత్కరించారు. యూకేలోని ఇతర పబ్బులు సైతం ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నాయి. ఫుల్లర్ పబ్ తన 380 ప్రాంచైజీల్లో రోజుకు 10పౌండ్లు(రూ.900)లకే లంచ్, డ్రింక్ అందిస్తోంది. అలాగే బ్రేవ్హౌస్ అండ్ కిచెన్ 10పౌండ్లకే వర్క్ స్పేస్‌తో పాటు వైఫై, పవర్ సాకెట్స్, అన్లిమిటెడ్ హాట్ అండ్ సాఫ్ట్ డ్రింక్, ప్రింటింగ్ సైతం అందిస్తోంది. ఇదీ చదవండి: 1161 కిలోల ‘జంబో’ గుమ్మడి.. జాతీయ రికార్డు బద్దలు! -
హైదరాబాద్ : పబ్ లపై పోలీసుల కొరడా...
-
తక్కువ వయసు వారిని పబ్ లకు అనుమతించొద్దు : హైదరాబాద్ సీపీ
-
మందేయడంలో గిన్నిస్ రికార్డ్.. 17 గంటల్లో 56 పబ్‌లకు.. 30 లీటర్లు తాగడంతో
ఇంగ్లండ్‌లోని బ్రైటన్‌కు చెందిన నాదన్ క్రింప్ అనే 22 ఏళ్ల యువకుడు మందేయడంలో సరికొత్త గిన్నిస్ సృష్టించాడు! మందుకొట్టడం కూడా రికార్డేనా అని చులకనగా భావించకండి. ఎందుకంటే.. అతను సాధించింది అలాంటి, ఇలాంటి రికార్డు కాదు మరి... కేవలం 17 గంటల వ్యవధిలోనే ఏకంగా 67 పబ్‌లకు వెళ్లి అతను ‘పానీయం’ పుచ్చుకున్నాడు. తద్వారా 24 గంటల వ్యవధిలో అత్యధిక పబ్‌లను సందర్శించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్‌కే చెందిన గ్యారెత్ మర్ఫీ అనే యువకుడు 17 గంటల్లో 56 పబ్‌లను సందర్శించి నెలకొల్పిన రికార్డును క్రింప్ బద్దలుకొట్టాడు. గిన్నిస్ నిర్వాహకుల నిబంధనల ప్రకారం సందర్శించే ప్రతి పబ్‌లోనూ మద్యమే సేవించాల్సిన అవసరం లేనప్పటికీ క్రింప్ మాత్రం ఒక పబ్‌లో మద్యం, మరో పబ్‌లో పానీయం సేవిస్తూ ముందుకెళ్లాడు. అయితే ఈ తతంగమేదీ ఆషామాషీగా జరగలేదని అతను చెప్పుకొచ్చాడు. చదవండి: హడలెత్తించిన కుక్క.. ఆవుపై దాడి.. అమాంతం నోటితో కరిచి పట్టుకొని.. ముందుగా తమ ప్రాంతంలో ఉన్న పబ్‌లను జీపీఎస్ పరికరం ద్వారా మార్కింగ్ చేసుకొని తన ప్రయాణం మొదలుపెట్టాడట. తాను పబ్‌లను సందర్శించి మద్యం లేదా పానీయం తాగినట్లు ప్రతి పబ్ నుంచి రశీదులు, సాక్షి సంతకాలు కూడా సేకరించాడట. ఈ విషయంలో అతనికి ముగ్గురు స్నేహితులు సహకరించారు. తన పానీయాల జాబితాలో బీర్, ‘బేబీ గిన్నిస్’ షాట్స్, టకీలా, లేగర్ మొదలైనవి ఉన్నట్లు క్రింప్ తెలిపాడు. ఇలా రోజంతా సుమారు 30 లీటర్ల మేర ‘పానీయాలు’ సేవించడం వల్ల తాను ఎక్కువసార్లు బాత్రూంకు వెళ్లాల్సి వచ్చిందని... 17 గంటల సమయంలో దీనికే ఎక్కువ సమయం పోయిందని చెప్పుకొచ్చాడు. అయితే ఎందుకోసం ఇదంతా చేశావంటే.. కేన్సర్‌తో మృతిచెందిన తన కుక్క జ్ఞాపకార్థంతోపాటు శునకాల ట్రస్టుకు నిధుల సమీకరణకు ఈ మార్గం ఎంచుకున్నట్లు క్రింప్ వివరించాడు. -
పబ్బుల తీరు మారేనా?
హైదరాబాద్ (బంజారాహిల్స్): తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి అన్న రీతిలో లైసెన్స్‌లు జారీ చేసి ఎక్సైజ్ శాఖ చేతులు దులుపుకుంది. అక్రమ నిర్మాణలైనా.. నివాసిత ప్రాంతంలోనైనా మా వాటాలు అందితే చాలు ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేసి జీహెచ్ఎంసీ పక్కకు తొలగింది. జనం ఫిర్యాదులు చేస్తున్నా సరే పెట్టీ కేసులు వేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి మమ అనిపిస్తున్నారు. పోలీసులు. నివాసిత ప్రాంతాల్లో పబ్‌లలో అర్ధరాత్రి శబ్దకాలుష్యంతో నరకాన్ని చూస్తున్న సీనియర్ సిటిజన్లు పోలీసులు, ఇతర శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూ నెట్టుకొచ్చారు. అయినా సరే గత 12 సంవత్సరాలుగా పబ్‌ల వల్ల న్యూసెన్స్ పెరగడమే కానీ తగ్గుముఖం పట్టలేదు. అటు ఎక్సైజ్ పోలీసులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు, మరో వైపు లా ఆండ్ ఆర్డర్ పోలీసులు కూడా చేతులు ఎత్తేయడంతో ఇక లాభం లేదనుకున్న బాధిత నివాసితులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీళ్లందరినీ నమ్ముకుంటే ఏ మాత్రం ఉపయోగం లేదని భావించిన సూర్యదేవర వెంకట రమణ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ గతేడాది నవంబర్‌లో శాస్త్రీయ ఆధారాలతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన హైకోర్టు పబ్‌లపై కొరడా ఝులిపించింది. ఇష్టానుసారంగా సౌండ్ పెట్టుకుంటామంటే కుదరదని అందుకు తగిన గడువును నిర్దేశించి హైకోర్టు మార్గదర్శకాలు రాగానే చర్యలకు పోలీసులు శ్రీకారం చుట్టేందుకు యతి్నస్తున్నారు. ఫిర్యాదు చేసినా స్పందన కరువు.. ► జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 28, బంజారాహిల్స్ పరిధిలో నాలుగు, పంజగుట్ట పోలీస్ పరిధిలో నాలుగు పబ్‌లు ఉన్నాయి. ► ప్రతిరోజూ ఆయా ప్రాంతాల్లో శబ్ద కాలుష్యంతో పాటు ఇతరత్రా న్యూసెన్స్‌తో నివాసితులు నరకాన్ని చవి చూస్తున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని స్రవంతి నగర్లో ఉన్న టాట్‌పబ్‌కు జీరో పార్కింగ్ ఉంది, అర్ధరాత్రి మందుబాబులు తూలుతు మద్యం మత్తులో స్థానిక నివాసాల్లోకి చొచ్చుకెళ్తున్నారు. అక్కడే వాంతులు, మలమూత్ర విసర్జనలు చేస్తుండటంతో అటుగా రాకపోకలు సాగిస్తున్న మహిళలకు ఇబ్బందిగా మారింది. ► ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా చర్యలు తీసుకునేవారు. దీంతో స్రవంతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున బి.సుభారెడ్డి జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ తరఫున సూర్యదేవర వెంకటరమణ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి స్పందించి తగిన ఆదేశాలు జారీ చేశారు. నివాసిత ప్రాంతాల్లోనే.. ► పబ్‌లు నివాసిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయకూడదు. ఎక్సైజ్ అధికారుల పుణ్యమా అని ఇళ్లల్లోనే పబ్‌లు కొనసాగుతున్నాయి. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 56లోని ఫర్జీ, అబ్జార్బ్ పబ్‌లు పూర్తిగా నివాసాల మధ్యనే ఉన్నాయి. టాట్ పబ్ స్రవంతినగర్‌లో ఉంది. ► అమ్నేయా లాంజ్‌బార్, బ్రాడ్వే, మాకోబ్రూ, హాట్కప్ డరి్టమారి్టని ఇలా పబ్‌లన్నీ నివాసిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ► ప్రతిరోజూ స్థానికుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా జరిమానాలు చెల్లిస్తూ జారుకుంటున్నారు. ► జూబ్లీహిల్స్‌రోడ్ నెం. 36, 45లలో మాత్రమే కమర్షియల్ వ్యాపారాలు జరగాల్సి ఉండగా మిగతా అన్ని చోట్లా నివాసిత ప్రాంతాల్లోనే పబ్‌లు కొనసాగుతున్నాయి. నార్మల్ బార్‌కు ఇచ్చినట్లుగానే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా పబ్ పేరుతో లైసెన్స్ ఇవ్వడం లేదు. నార్మల్ బార్ లైసెన్స్ 2(బి) ప్రకారమే ఈ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. దీంతో ఇష్టానుసారంగా పబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
Hyderabad Pubs: రాత్రి 10 గం. తర్వాత సౌండ్ ఆపాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పబ్‌ల్లో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మ్యూజిక్ సౌండ్ పెట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన ఉదయం 6 గంటల వరకు వర్తిస్తుందని ఆదేశించింది. నేటి నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సౌండ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ నిబంధనలను పాటించకుండా పబ్‌లు నిర్వహిస్తున్నారని, నగరవాసులను రాత్రి ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ సహా మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము అధికారులకు విజ్ఞప్తి చేసినా ఆ పబ్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. విద్యా సంస్థలున్న చోట అనుమతి ఎలా ఇచ్చారు?.. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం.. సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున హైకోర్టు న్యాయవాది కైలాష్‌నాథ్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఎలాంటి సౌండ్ పెట్టరాదని తేల్చిచెప్పింది. నగర పోలీస్ చట్టం, సౌండ్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం.. లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత సమయం వరకే అనుమతి ఉందని పేర్కొంది. ఇళ్లు, విద్యాసంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించిన న్యాయమూర్తి.. ఏ అంశాల ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారో కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్‌శాఖను ఆదేశించింది. పబ్‌లో రాత్రిపూట లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని సూచించింది. హైదరాబాద్ పరిధిలోని పబ్‌లపై ఇప్పటివరకు దాఖలైన కేసుల వివరాలను అందజేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మ్యూజిక్ సిస్టమ్ ప్లే చేసేందుకు ఎన్నిటికి అనుమతి ఉంది.. తదితర వివరాలను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. -
పబ్స్‌పై తెలంగాణ హైకోర్టు కొరడా.. కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్స్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజేలు ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది. రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల వరకు డీజేలపై నిషేధం విధించింది. డీజేలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: నేను రాజీనామా చేస్తా..! సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉందని, రాత్రి వేళల్లో ఎటువంటి సౌండ్ సిస్టంకు అనుమతి లేదని హై కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఇళ్లు, విద్యాసంస్థల ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. పబ్‌లకు ఏ అంశాలను పరిగణించి అనుమతులు ఇచ్చారో ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల టాట్ పబ్ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ల తరపున హైకోర్టు న్యాయవాది కైలాష్ నాథ్ వాదించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అసాంఘిక చర్యలకు పాల్పడే పబ్‌లపై దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, నేరాలను ప్రోత్సహించే పబ్‌లపై దాడులు తప్పవని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ పరిధిలో అలాంటి పబ్‌లపై రాబోయే రోజు ల్లో భౌతిక దాడులు చేయాలని ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే రాత్రి 11:30 తర్వాత తెరిచి ఉంచే వాటిపై కూడా దాడులు తప్పవని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశ్వనగరంగా మారాల్సిన హైదరాబాద్‌ను విషనగరంగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశా రు. కేసీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో సుమారు 150 పబ్‌లకు అనుమతినిచ్చారని, పబ్‌ల వ్యాపారం వెనుక రాష్ట్రంలోని రాజులు, యువరాజులకు సంబంధించిన వ్యక్తులు కీలకంగా ఉన్నారని ఆరోపించారు. పబ్‌లు, డ్రగ్ల సంస్కృతిని ప్రోత్సహించడం వల్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు హత్యలు, అత్యాచారాల్లోనూ భాగస్వాములయ్యారని రేవంత్ విమర్శించారు. మైనర్ అత్యాచారం ఘటన గురించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే, కొందరిని తప్పించే ప్రయత్నం చేసినట్టుగా ఉందని ఆరోపించారు. ఈ ఘటనలో నిందితులు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా వాహనానికి సంబంధించిన కీలకమైన ఆధారాలను, వాటి యజమానుల వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. యజమానులపై పోక్సో చట్టం ప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్లలోని కీలకమైన ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోందన్నారు. పబ్‌లపై పోలీసుల పర్యవేక్షణ కరువైందని, తనిఖీలు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలి మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష నిర్వహించలేదని, ఇప్పటికైనా తక్షణమే ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులపై సమీక్ష జరపాలని రేవంత్‌రెడ్డి కోరారు. మైనర్లను అనుమతిస్తున్న పబ్ యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మైనర్ అత్యాచార వ్యవహారంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌పై సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మైనర్ బాలిక రేప్ విషయంలో ఎందుకు స్పందించట్లేదని మండిపడ్డారు. -
జూబ్లీహిల్స్ లోని పలు పబ్ లలో పోలీసుల తనిఖీలు
-
హైదరాబాద్ లో పెరిగిన పబ్ కల్చర్
-
పబ్బులో అశ్లీల నృత్యాలు...
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్‌లోని మరో పబ్బుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ పబ్బులోనూ అశ్లీల నృత్యాలు చేస్తున్న మహిళలను, పురుషులను అదుపులోకి తీసు కున్నారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ ఎస్డీరోడ్‌లోని బసేరా హోటల్లో పబ్‌ను నిర్వహిస్తున్నారు. డీజే సౌండ్ల హోరులో యువతీ, యువకులు అశ్లీలంగా నృత్యాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పబ్ యాజమాన్యం ఈ దందా కొనసాగిస్తూ యువతీ, యువకులను ఆకర్షిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందడంతో ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి కస్టమర్ల తరహాలో పబ్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడ యువతీ, యువకులు తాగిన మైకంలో నృత్యాలు చేస్తున్నారు. మహిళలు పురుషుల వద్దకు వచ్చి వారిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీసులకు అప్పగించారు. వారిలో 9 మంది మహిళలు, 24 మంది పురుషులు, 8 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు. హోటల్ యజమాని అమర్ ఓరీ పరారీలో ఉన్నాడు. (చదవండి: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణం...రూ.వెయ్యి ఇస్తేనే మార్చురీలోకి మృతదేహం..) -
పబ్బు..గబ్బు!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడితో వీటి కేంద్రంగా సాగుతున్న రేవ్ పార్టీలు బహిర్గతమయ్యాయి. తాజాగా రామ్‌గోపాల్‌పేటలోని క్లబ్ టెకీలపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జూబ్లీహిల్స్‌లోని ఎనిగ్మా పబ్‌పై స్థానిక పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేయడంతో వీటి కేంద్రంగా జరుగుతున్న ‘డ్యాన్సుల’ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన నగర పోలీసులు అన్ని క్లబ్బుల పైనా నిఘా ముమ్మరం చేశారు. దేశ, విదేశీ యువతులతో క్యాబరేలు... పబ్స్‌లో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాల్లో నగరంలోని దిగువ, మధ్యతరగతి, దేశ, విదేశీ యువతులతో చేయించే క్యాబరేలు నయా ట్రెండ్‌గా మారాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి వీటి నిర్వాహకులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు తెర తీస్తున్నారు. వివిధ మెట్రో నగరాలకు చెందిన యువతలతో పాటు టూరిస్టు వీసాలపై విదేశీ యువతుల్ని నగరానికి తెస్తున్న దళారులు పబ్స్, రిసార్ట్స్‌లో వారి ఒంపుసొంపులను ఎరగా వేసి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. పర్యాటకం ముసుగులో సాగుతున్న ఈ వ్యాపారం వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఎప్పుడైనా దాడులు జరిగినపుడు ఆ యువతులే పట్టుబడుతున్నారు తప్ప సూత్రధారులు మాత్రం తప్పించుకుంటున్నారు. గతంలో బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో పట్టపగలే అశ్లీల నృత్యాలుృ చేస్తూ ముగ్గురు రష్యా యువతులు పోలీసులకు దొరికారు. మరో యువతి టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడింది. ఆ దేశాల వాళ్లే ఎక్కువ... ఈ అనధికారిక క్యాబరేల్లో నర్తించడానికి వస్తున్న విదేశీ యువతుల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, ఇతర వూజీ సోవియట్ యూనియన్ దేశాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఆయా దేశాల్లోని ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు దళారులు అక్కడి యువతులకు డబ్బు ఎరవేస్తున్నారు. ఆకర్షణీయమైన దేహ సౌష్టవం కలిగిన వారిని టూరిస్టు వీసాలపై ఇక్కడకు రప్పిస్తున్నారు. ఆపై వారికి, వారి నృత్యాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనంతరం వీరితో పబ్‌లు, క్లబ్బుల్లో అశ్లీల ప్రదర్శనలు ఇప్పిస్తూనే కస్టమర్లను విటులుగా మార్చుకుని మరోపక్క వ్యభిచారం చేయిస్తున్నారు. గంట గంటకో రేటు... విదేశీ యువతుల నృత్యాలు, వారిపై ఉండే క్రేజును లక్ష్యంగా చేసుకునే ఏజెంట్లు వీరిని ఆటబొమ్మల్ని చేసి గంటల చొప్పున రేటు కట్టి మరీ వసూలు చేస్తుంటారు. ఒక్కో సందర్భంలో ఈ క్యాబరేలకు గంటకు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇందులో యువతులకు దక్కేది మాత్రం తక్కువే. వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ వ్యవహారాలు నడిపే సూత్రధారులు నగరానికి చెందిన వారు కారని తెలుస్తోంది. కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ముంబై కేంద్రంగా ఈ దందా నడుపుతున్నాడని సమాచారం. అక్కడి ఓ ఆంగ్లో ఇండియన్ యువతి ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పబ్స్‌పై డేగకన్ను వేశాం వరుసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాల నేపథ్యంలో నగరంలోని పబ్స్‌పై డేగకన్ను వేశాం. ఇప్పటి వరకు డ్రగ్స్ పైనే దృష్టి ఉండేది. ఇకపై ఇలాంటి డ్యాన్సుల విషయాన్నీ, అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తాం. నిర్ధేశిత సమయానికి మించి నడుస్తున్న పబ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. దీనిపై ఇప్పటికే వాటి నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చాం. – నగర పోలీసు ఉన్నతాధికారి (చదవండి: కార్డినల్‌గా పూల ఆంథోనీ) -
పోలీసు వెబ్సైట్ ద్వారానే లైసెన్సుల రెన్యువల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తూ వ్యాపార సంస్థల లైసెన్సుల రెన్యువల్‌కు పోలీసు అధికారిక వెబ్సైట్ ద్వారానే అవకాశం కల్పించనున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో బార్లు, రెస్టారెంట్లు, పబ్బులతో పాటు డ్రైవ్–ఇన్ రెస్టారెంట్ల యాజమాన్యాలతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలోనే త్వరలో ఆన్లైన్ రెన్యువల్ విధానం అమలులోకి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో కొకైన్ దొరకడం, కొన్ని పబ్బు ద్వారా తీవ్ర ధ్వనికాలుష్యం వెలువడుతోందని, వీటి పార్కింగ్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, మందుబాబుల ఆగడాలు పెరిగాయని వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కొత్వాల్ ఈ సమావేశం నిర్వహించారు. తమ లాభాల కోసం కొన్నింటి యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘిస్తూ సిటీకి అపఖ్యాతి తీసుకువస్తున్నారని ఆనంద్ అన్నారు. ఈ సమావేశానికి హాజరైన దాదాపు 100 మందికి సిటీ పోలీస్ యాక్ట్, అందులోని నిబంధనలు ఇతర అంశాలను వివరించారు. వీటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే తక్కువ వయస్సు ఉన్న వారిని పబ్బుల్లోకి, బార్లలోకి అనుమతించవద్దని, ధ్వని స్థాయిలను పరిమితం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం 30 రోజుల బ్యాకప్‌తో ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రాంగణంలో సౌండ్ ప్రూఫింగ్, వ్యాలెట్ డ్రైవర్లు, సిబ్బంది, కస్టమర్లను గమనిస్తూ ఉండటానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మద్యం సరఫరాకు సంబంధించి రాత్రి 11 గంటల తరువాత వచ్చిన ఆర్డర్లను అంగీకరించరాదని కచ్చితంగా 12 గంటల లోపు మూసివేయాలని ఆదేశించారు. (క్లిక్: దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్) శుక్ర, శనివారాల్లో లావాదేవీలను దృష్టిలో పెట్టుకుని అర గంట అదనపు సమయంతో సహా గంట మినహాయింపు ఇస్తున్నామన్నారు. పాశ్చాత్య దేశాలలో పబ్బు ముగింపు సమయానికి పది నిమిషాల ముందు నిర్వాహకులు తమ లైట్లను డిమ్ చేస్తూ కస్టమర్లు అది మూసే సమయమైందని తెలిసేలా చేస్తారని, ఇక్కడా ఈ విధానం అమలు చేయాలని సూచించారు. అంతర్జాతీయ ప్రయాణికులు లేదా ప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని స్టార్ రేటింగ్ ఉన్న హోటళ్లలో 24 గంటలూ మద్యం విక్రయించేందుకు అనుమతి ఉంటుందని, ఇది సాధారణ ప్రజల కోసం కాదని ఆనంద్ స్పష్టం చేశారు. ఇలాంటి బార్లు, రెస్టారెంట్లు, పబ్బులకు ఇకపై అనుమతులు ఉండవని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, సంయుక్త సీపీలు ఎం.రమేష్, పి.విశ్వప్రసాద్‌లతో పాటు జోనల్ డీసీపీలు పాల్గొన్నారు. (క్లిక్: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు) -
మేధావులు, క్యారెక్టర్ ఉన్న వారినే పిలుస్తారు
హనుమకొండ: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి పబ్‌ల గురించి చెబితే విద్యార్థులు చెడిపోతారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. మంగళవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ నేపాల్‌లోని కఠ్మాండులో పబ్‌లకు వెళతారు.. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏం చెబుతారని అనుకుంటున్నారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఎర్రబెల్లి పైవిధంగా బదులిచ్చారు. ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇవ్వాలా.. వద్దా.. అనేది ఆ యూనివర్సిటీ చూసుకుంటుందన్నారు. ప్రభుత్వానికి అనుమతితో సంబంధం లేదని స్పష్టంచేశారు. ‘ఓయూకు వచ్చి పబ్‌ల గురించి చెబితే విద్యార్థులు చెడిపోతారనే భావన కూడా అనుమతి ఇవ్వకపోవడానికి ఒక కారణం కావొచ్చు. ఎవరు వస్తే విద్యార్థులు బాగుపడతారు.. ఎవరు వస్తే విద్యార్థులు చెడిపోతారు.. అనే అంశాలపై ఓయూ యాజమాన్యం ఆలోచించి ఆహ్వానిస్తుంది. మేధావులు, క్యారెక్టర్ ఉన్న వారినే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు పిలుస్తారు’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. -
రాష్ట్రానికి ఉన్న మంచిపేరు చెడిపోవద్దు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
టాటూ చెప్పే ‘డ్రగ్స్’ కథ
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రాడిసన్ బ్లూప్లాజా హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ వ్యవహారంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. స్థానిక పోలీసుల నుంచి ప్రాథమిక వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్ అధికారులు.. పబ్బుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై రహస్య విచారణ చేపట్టారు. డ్రగ్స్ సరఫరాలో టాటూలు, కోడ్ వర్డ్స్ సహా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ► విలాసాలకు నెలవుగా మారిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని పబ్‌లలో డ్రగ్స్ దందా సాగుతున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ► కొన్ని పబ్‌లు సొంతంగా యాప్స్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు నిర్వహిస్తూ కస్టమర్లకు రహస్యంగా రేవ్ పార్టీలపై సమాచారం అందిస్తున్నాయని అధికారులు గుర్తించారు. ► యాప్‌లు, గ్రూపుల ద్వారా రిజిస్టర్ చేసుకుని పార్టీకి హాజరయ్యే వారికి నిర్వాహకులు టాటూలు వేస్తున్నారు. కస్టమర్ల మణికట్టుపై ఉండే ఈ టాటూ ఆధారంగానే ఏ డ్రగ్ ► కుడి చేయి మణికట్టుపై టాటూ ఉంటే.. వారికి గంజాయి, హష్ ఆయిల్ సరఫరా చేయాలని అర్థం. ఎడమ చేతి మణికట్టుపై ఉంటే కొకైన్, ఎండీఎంఏ వంటి డ్రగ్స్ సరఫరా చేస్తారు. ► కొన్ని రేవ్ పార్టీల్లో గంజాయి, హష్ ఆయిల్‌ను నేరుగా సరఫరా చేయట్లేదు. పార్టీ ప్రారంభంకావడానికి ముందే నిర్వాహకులు.. ఈ డ్రగ్స్‌ను నింపిన సిగరెట్లు సిద్ధం చేసి ఉంచుతున్నారు. వాటినే కస్టమర్లకు అందిస్తున్నారు. ► కొందరు పబ్ నిర్వాహకులు రేవ్ పార్టీలకు సంబంధించి ‘స్పెషల్’, ‘ఆఫర్’, ‘స్కీమ్’, ‘లిమిటెడ్’పేరుతో ప్రత్యేక కోడ్ భాషను వాడుతున్నారు. భారీగా డబ్బు వసూలు చేసే ఈ ► హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఘర్షణలకు.. ఈ పార్టీలకు సంబంధం ఉన్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ కోణంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ విభాగం అధికారులను అప్రమత్తం చేశాయి. -
పట్టుబడగానే... మావాడు మంచోడే!
సాక్షి, బంజారాహిల్స్: నాకేం తెలియదు.. మా పిల్లలు చాలా మంచి వారు.. అందులో మా పిల్లలు లేరు.. మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోంది.. ఇలా ఏదైనా ఘటనలో తమ పిల్లలు పట్టుబడగానే ప్రముఖులు నీతి సూక్తులు వల్లె వేస్తుంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాము వరకు పిల్లలు ఇంటికి రాకపోతే ఎక్కడున్నారనే విషయం కూడా కొంత మంది తెలుసుకోవడంలేదు. తీరా ఏదైనా పబ్‌లోనో, రేవ్ పార్టీలోనో, రిసార్ట్స్‌లోనో మద్యం తాగి, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే మాత్రం ఆ ఘటనతో తమకేమీ సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పబ్‌లో రేవ్ పార్టీలో పాల్గొని టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడినవారి కుటుంబ సభ్యులందరు డ్రగ్స్‌తో సంబంధం లేదంటూ ఒకేతీరుగా సమాధానాలు చెప్పారు. ఇక ఓ రాజకీయనేత కుమారుడు పట్టుబడ్డాడంటూ మీడియాలో ప్రసారం కాగానే ఆ కుటుంబం వెంటనే స్పందించి తమవాడు అక్కడ లేడంటూ చెప్పుకొచ్చారు. తీరా చూస్తే మీడియాలో వచ్చిన పేరుతో ఉన్న కొడుకు లేడు కానీ ఆ రాజకీయ నాయకుడి ఇంకో కొడుకు మాత్రం పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఎక్కడ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డా ఇలాగే బుకాయించేస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అదుపు తప్పిన వేగంతో దూసుకొచ్చి ఓ రాజకీయ నాయకుడి తనయుడు ఓ చంటి బిడ్డ ప్రాణాన్ని బలిగొన్న ఘటనలో కూడా ఆ నేత ఆ కారులో తన కొడుకే లేడంటూ గట్టిగా వాదించాడు. తీరా చూస్తే కారులో వెనుక సీటులో ఆ నేత కొడుకు దర్జాగా కూర్చొని ఉన్నాడు. ఇక శివార్లలో రిసార్ట్‌లకు వెళ్తే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇలాంటి గానా బజానాలు, రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు కోకొల్లలు. దొరికిన సందర్భాల్లో ప్రముఖులు తమ పిల్లలను ఇలాగే వెనుకేసుకొస్తున్నారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్గా నాగేశ్వర్రావు బంజారాహిల్స్ నూతన ఇన్స్పెక్టర్గా 2004 బ్యాచ్‌కు చెందిన కె. నాగేశ్వర్రావును నియమిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. గతంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో డీఎస్ఐగా పని చేశారు. బంజారాహిల్స్ సీఐగా పని చేసిన పూసపాటి శివచంద్రను విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన కారణంగా సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో నాగేశ్వర్రావును నియమించారు. -
పబ్‌లతో తారల బంధం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు పబ్‌లతో టాలీవుడ్ తారలకు దశాబ్దంన్నర కిందటే బంధం ఏర్పడింది. ఓ టాలీవుడ్ అగ్రహీరో బంజారాహిల్స్‌లో టచ్ పబ్‌ని స్నేహితుడితో కలిసి ఏర్పాటు చేయగ అది సినీతారలతోపాటు ఇతర రంగాల సెలబ్రిటీల నైట్ లైఫ్‌కు చిరునామాగా వర్ధిల్లింది. అయితే ఇతరుల రాక వల్ల గోప్యతకు ఇబ్బందనే భావనతో దాని కవర్ చార్జీలు కూడా షాక్ కొట్టే రీతిలో నిర్ణయించారు. కానీ అర్ధరాత్రి దాటినా డ్యాన్సులంటూ ఆరోపణలు రావడం, పలుమార్లు పోలీసు దాడులు జరగడంతో ఆ స్టార్ హీరో పబ్ వ్యాపారం నుంచి తప్పుకున్నప్పటికీ.. అప్పటికే సెలబ్రిటీల కోసం ప్రత్యేకమైన పార్టీ ప్లేస్ ఒక అవసరంగా మారిపోయంది. ఆ తర్వాత అదే యువ తారలకు ఆకర్షణీయ వ్యాపార మార్గమైంది. ‘టచ్’కన్నా ముందే బేగంపేట్‌లోని బాటిల్స్ అండ్ చిమ్నీస్ ఓ సినీనటి ఆధ్వర్యంలో నడిచేది. టాలీవుడ్లో మంచి సంబంధాలు నడుపుతాడని పేరున్న ఓ యువ నటుడు నగర శివార్లలో బీపీఎం పేరిట ఓ పార్టీ ప్లేస్‌ని నిర్వహించాడు. అది కూడా టాలీవుడ్ తారలకు, ఇతర రంగాల సెలబ్రిటీలకు మాత్రమే ప్రత్యేకించిందిగా పేరొందింది. అక్కడి రహస్య కార్యకలాపాలపట్ల ఎక్సైజ్‌శాఖ పోలీసులు కన్నెర్ర చేయడంతో అది మూతపడింది. అదే తరహాలో మరో యువ నటుడు నగర శివార్లలో నెలకొల్పిన ఎఫ్ క్లబ్ కూడా కొంతకాలం సీక్రెట్ పార్టీలకు కేరాఫ్‌గా నడిచి మూతపడింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ ఉదంతం, కెల్విన్ అనే డ్రగ్ డీలర్ దందాకు ఈ క్లబ్ వేదికైంది. జూబ్లీహిల్స్‌లో ఓ యువ హీరోకి వాటాలున్న హైలైఫ్ పబ్ కూడా అంతే. దానిపైనా లెక్కలేనన్నిసార్లు దాడులు జరిగాయి. విలన్ పాత్రలకు పేరొందిన ఓ టాప్ టాలీవుడ్ నటుడికి కూడా జూబ్లీహిల్స్‌లో ఓ పబ్ ఉంది. -
వీకెండ్ వస్తే.. రేవ్ మొదలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పబ్బులు, శివార్లలోని రిసార్టులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. డ్రగ్స్ వినియోగం, అశ్లీల నృత్యాలతో రేవ్ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం మేడ్చల్, హయత్‌నగర్‌లలో ఇలాంటి ఘటనలు బయటపడగా.. తాజాగా ఆదివారం వెలుగులోకి వచ్చిన ‘ఫుడింగ్ అండ్ మింక్ పబ్’ఉదంతం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని తొమ్మిది పబ్స్‌లో మాదకద్రవ్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నట్టుగా తమకు సమాచారం ఉందని గతంలో పోలీసులే అధికారికంగా ప్రకటించడం గమనార్హం. డబ్బులు ఎరవేసి.. రేవ్ పార్టీల నిర్వాహకులు ఓ వైపు డ్రగ్స్ సమకూర్చడంతోపాటు డబ్బున్నవారి పిల్లలను ఆకర్షించేందుకు అమ్మాయిలతో నృత్యాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉత్తరాది రాష్ట్రాలు, మెట్రో నగరాలకు చెందిన యువతులకు డబ్బులు ఎరవేసి రప్పిస్తున్నారు. కొన్నిచోట్ల అయితే టూరిస్టు వీసాలపై విదేశీ యువతులనూ పిలిపిస్తున్నారు. ఇలాంటి పార్టీల కోసం ప్రముఖులు, వీఐపీల పిల్లల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. అంతేకాదు సూత్రధారులు ఎక్కడా దొరకకుండా వ్యవస్థీకృతంగా దీనంతటినీ నడిపిస్తుండటం గమనార్హం. పోలీసులు దాడులు చేసినా.. అమాయక యువతులు, పార్టీలో పనిచేసే సిబ్బంది మాత్రమే పట్టుపడుతున్నారు. గతంలో బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో ఇలాగే ముగ్గురు రష్యా యువతులు చిక్కారు. మరో యువతి టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని శామీర్‌పేటలో 43 మంది, మేడ్చల్‌లోని ఓ రిసార్ట్‌లో 39 మంది, హయత్‌నగర్ పరిధిలోని మరో రిసార్ట్‌లో 11 మంది ఇలాగే పోలీసులకు దొరికారు. రేవ్ పార్టీల పేరిట వ్యభిచారం కూడా చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొత్త ట్రెండ్‌గా డ్రగ్ టూర్స్ రాష్ట్ర పోలీసులు కొంతకాలంగా డ్రగ్స్ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అయితే ‘హెచ్–న్యూ’పేరిట ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మరీ నిఘా పెట్టారు. డ్రగ్ పెడ్లర్స్ కదలికలు, మాదకద్రవ్యాలు దొరకడం కష్టమవడంతో కొత్తగా ‘డ్రగ్ టూర్స్’పెరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్ వినియోగదారుల్లో చాలా మంది గోవాతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నారని అంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కసోల్ ప్రాంతంలో నిర్ణీత సందర్భాల్లో రేవ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారని.. దేశవ్యాప్తంగా ఉన్న డ్రగ్ వినియోగదారులు హాజరవుతున్నారని సమాచారం. -
పబ్ లపై నేడు హైకోర్టులో విచారణ
-
పోలీస్ వర్సెస్ పార్టీస్: న్యూఇయర్ వేడుకలపై ఉత్కంఠ
జూబ్లీహిల్స్‌లోని వైట్ రాబిట్ పబ్‌పై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు పెట్టారు. సిటీలోనే బిగ్గెస్ట్ పార్టీ సెంటర్‌గా పేరున్న గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్పైనా దాడి చేశారు. అలాగే నివాసాల మధ్య న్యూసెన్స్ పేరిటా పలు పబ్స్‌పై రైడ్స్ జరిగాయి. న్యూ ఇయర్ వేడుకల్ని అదుపు చేయడానికే ఈ రైడ్స్ అనేది తెలుస్తోంది. అయితే వీటిని పట్టించుకోకుండా కొన్ని పబ్స్ పార్టీస్‌కి సై అంటుంటే మరికొన్ని సైలెన్స్‌ని ఆశ్రయించాయి. హోటల్స్, రిసార్ట్స్‌లు న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటున్నా పబ్స్ మాత్రం నిబంధనలకు లోబడి నిర్వహిస్తామంటూన్నాయి. ఏతావాతా న్యూ ఇయర్ వేడుకలు పోలీస్ వర్సెస్ పార్టీస్‌గా మారిన పరిస్థితుల్లో పార్టీ ప్రియులూ...పారా హుషార్. –సాక్షి, సిటీబ్యూరో సాధారణంగా ప్రతి న్యూ ఇయర్ ఈవెంట్‌కి ఓ వారం ముందుగానే వేడుకలు మొదలవుతాయి. అయితే కరోనా వల్ల గత ఏడాది సందడి కనుమరుగైంది. ఈ ఏడాది కరోనా లేదనుకుంటూ..ఫుల్ జోష్‌కు రెడీ అయిన సిటీ పార్టీపై ఒమిక్రాన్ అకస్మాత్తుగా దాడి చేసింది. దీంతో కొన్ని పార్టీ ప్లేస్లేమో సైలెంట్ అయిపోగా మరికొన్ని మాత్రం మాదే ఈవెంట్ అంటున్నాయి. వెల్కమ్...పార్టీస్.. ఎక్స్ప్లోజన్, అబ్రకదబ్ర, ఐయామ్ స్పుత్నిక్ ఎట్ బఫెలో వైల్డ్ వింగ్స్...తదితర ఆసక్తికరమైన పేర్లతో సిటీలో ఉన్న కొన్ని పాపులర్ పబ్స్ అన్నీ ఇప్పటికే న్యూ ఇయర్ ఈవెంట్స్‌ని ప్రకటించేశాయి. కొన్ని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభించేశాయి. బయటి నగరాల నుంచే కాక విదేశీ డీజేలను కూడా రప్పిస్తున్నాయి. చదవండి: (గుండెల్ని పిండే ఘటన: అమ్మా లే అమ్మ.. అమ్మా లే అమ్మ!) కార్పొరేట్...హార్ట్ బీట్... అత్యధిక సంఖ్యలో పబ్స్ అది కూడా యువతను ఆకట్టుకునేవి ఎక్కువగా ఉన్న ప్రాంతాలుగా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలు ముందు వరుసలో ఉంటాయి. ఎప్పుడూ కిక్కిరిసిన పార్టీ యానిమల్స్‌తో కళకళలాడే ఈ పబ్స్‌కి కార్పొరేట్ ఉద్యోగులే ప్రధాన పోషకులు. వీరికి పబ్బింగ్ అనేది దినచర్యలో ఒక భాగం కాగా న్యూ ఇయర్ పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్. విభిన్న ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు, కుటుంబాలకు దూరంగా గడిపే వారు సహజంగానే న్యూ ఇయర్ పార్టీస్ కోసం పబ్స్‌ను ఆశ్రయిస్తారు. వీరిని నిరాశపరచకుండా కొత్త సంవత్సరారంభానికి వారం ముందే పబ్స్ పార్టీల పరంపర కొనసాగిస్తుంటాయి. ముందస్తు ఏర్పాట్లే...వెనుకడుగుకు పోట్లు న్యూ ఇయర్ పార్టీస్ కోసం అంతర్జాతీయ స్థాయి డిజెలను సెలబ్రిటీలను నగరంలోని పబ్స్ ముందస్తు అడ్వాన్స్‌లు ఇచ్చి పోటా పోటీగా బుక్ చేసుకుంటాయి. కనీసం నెల, నెలన్నర ముందుగానే ఈ కాంట్రాక్ట్‌లు ఫిక్స్ అయిపోతాయి. ఈవెంట్స్ క్యాన్సిల్ అయితే పెద్ద మొత్తాలనే నష్టపోవాల్సి ఉంటుంది. అందుకని వీలున్నంత వరకూ పార్టీల్ని నిర్వహించడానికే సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా వరుస ప్రీ ఈవెంట్స్ నిర్వహిస్తున్న ప్రిజమ్ పబ్.. ఓ వైపు పోలీసు రైడ్స్ జరిగినా పట్టించుకోకుండా షెడ్యూల్ ప్రకారం తదుపరి ఈవెంట్స్‌కి రెడీ అయిపోతోందని తెలుస్తోంది. ఏదేమైనా.. న్యూ ఇయర్ పార్టీలపై పోలీస్ దాడులు, నిబంధనలను పబ్బుల బేఖాతరు కొనసాగే పరిస్థితులున్నాయి. కాబట్టి... గత ఏడాదిలా సన్నిహితులతో ఇంట్లోనే వేడుకలు జరుపుకోవడం సిటిజనులకు అన్ని రకాలుగా శ్రేయోదాయకం అని చెప్పక తప్పదు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) డౌట్ ఫుల్...కోవిడ్ ప్రొటోకాల్... నగరంలో ఉన్న మోస్తరు పబ్‌లో సగటున 300 నుంచి 500 మంది వరకూ ఆతిథ్యం ఇవ్వొచ్చు. ఇక ప్రిజమ్, బ్లాక్ 22 వంటి పెద్ద పబ్స్ అయితే 2 వేల మంది వరకూ హాజరు కావచ్చు. ఈ పబ్స్‌లో ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అనేది అసాధ్యమే. కాబట్టే పోలీసులు ఈసారి న్యూ ఇయర్ ఈవెంట్స్‌పై డేగ కన్నేస్తున్నారు. తాము కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తున్నామని, 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రం అనుమతిస్తున్నామని చెబుతున్నా అది జరిగే పనికాదని ఓ ప్రముఖ డి.జె ‘సాక్షి’తో స్పష్టం చేశారు. -
Hyderabad: నిబంధనలు ఉల్లంఘిస్తున్న పబ్‌లపై చర్యలు
-
గబ్బు గబ్బుగా హైదరాబాద్ పబ్ లు
-
హైదరాబాద్: పబ్బులు, బార్లకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రాంతంలోని పబ్బులు, బార్ల నుంచి శబ్ధకాలుష్యం వస్తోందంటూ దాఖ లైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ, నగర పోలీసు కమిషనర్‌తోపాటు ప్రతివాదులుగా ఉన్న పబ్బులు, బార్ల యజమానులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఏర్పాటు చేసిన పబ్బులు, బార్లతో తీవ్రమైన శబ్ధకాలుష్యం ఏర్పడుతోందని జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: తెలంగాణ: రైళ్ల వేళల్లో మార్పులు.. కొత్త టైంటేబుల్ విడుదల.. -
జూబ్లీహిల్స్‌వాసులకు నిద్రలేని రాత్రులు.. స్థానికుల ఆందోళన
అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు.. అడ్డదారుల్లో జీహెచ్ఎంసీ ఇచ్చిన ట్రేడ్ లైసెన్స్‌లు... క్షేత్ర స్థాయిలో తనిఖీలు లేకుండానే ఎక్సైజ్ జారీ చేసిన బార్ లైసెన్స్‌లు... ట్రాఫిక్ పోలీసుల ప్రమేయం లేకుండానే అక్రమ దారుల్లో అనుమతులు... ఇలా ఉంటుంది జూబ్లీహిల్స్‌లోని పలు కాలనీల్లో వెలసిన పబ్‌లు, కేఫేలు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణ. ఎన్ని ప్రమాదాలు జరిగినా.. ఎన్ని ఆందోళనలు చేసినా నిమ్మకునీరెత్తిన చందాన అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల పక్కనే నడుస్తున్న పబ్‌లతో స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. శబ్ధ కాలుష్యం ఏర్పడినప్పుడు, పరిమితికి మించి వేళల్లో నడుస్తున్నప్పుడు మాత్రమే లా అండ్ ఆర్డర్ పోలీసులు తనిఖీలు చేయాల్సి ఉండగా అన్నింటికీ పోలీసులనే బాధ్యులను చేస్తూ స్థానికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో అమ్ముడవ్వని ఇళ్లు 12 వేలు!) ► జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని టాట్ పబ్ ఎదుట స్థానికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. తమ ఇళ్ల మధ్యనే ఈ పబ్ నిర్వహణ రోజూ న్యూసెన్స్‌గా మారిందని ఆందోళన చేశారు. ► అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత కూడా పబ్‌లో మ్యూజిక్ సిస్టమ్ నడుస్తున్నదని యువతీయువకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వీరి ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటోందని ఆరోపించారు. (చదవండి: జూనియర్ ఆర్టిస్టుల దుర్మరణం.. వైరల్ అవుతున్న వీడియోలు) ► పబ్‌లో తాగిన మద్యం సీసాలను మత్తులో తమ ఇళ్లల్లోకి విసురుతున్నారని దుయ్యబట్టారు. ► ఈ పబ్ వల్ల స్థానికులకు కంటి మీద కునుకు ఉండటం లేదని గగ్గోలు పెట్టారు. ఎక్సైజ్ పోలీసులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా వారు పెడచెవిన పెడుతున్నారని భగ్గుమన్నారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు జోగుతున్నారని ఆరోపించారు. హైకోర్టులో పిటిషన్... ► జూబ్లీహిల్స్ కాలనీలో నివాసాల మధ్యనే పబ్‌లతో పాటు కాఫీ షాప్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు సమస్యాత్మకంగా మారాయని ఇళ్ల ముందే ఉమ్ముతున్నారని కొంత మంది వాంతులు చేసుకుంటున్నారని తమకు ఈ పబ్‌లతో నరకప్రాయంగా మారిందంటూ జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ (క్లీన్ అండ్ గ్రీన్) అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, అడవుల ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు నగర పోలీసులను ప్రతివాదులుగా చేర్చి అసోసియేషన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. యథేచ్ఛగా అక్రమ పార్కింగ్లు... ► పబ్‌లు ఉన్న ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 36, రోడ్ నం. 45, రోడ్ నం. 1, రోడ్ నం. 10 ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్లన్నీ రాత్రి 8 మొదలు తెల్లవారుజామున 2 గంటల వరకు రోడ్డుకు రెండువైపులా పబ్‌లకు, క్లబ్‌లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు వచ్చే వారి వాహనాల అక్రమ పార్కింగ్‌లతో నిండిపోతున్నాయి. పట్టించుకోని జీహెచ్ఎంసీ... ► పార్కింగ్ లేకుండానే భవనాలు అక్రమ అంతస్తుల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. నెలకు లక్షలాది రూపాయలు అద్దె తీసుకుంటూ ఇంటి యజమమానులు పార్కింగ్ లేకుండానే అద్దెలకు ఇచ్చేశారు. ► జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు. ట్రేడ్ లైసెన్స్ అడ్డదారుల్లో మంజూరవుతున్నది. వీరి పాత్రపై మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. జూబ్లీహిల్స్ కాలనీవాసులు కూడా జీహెచ్ఎంసీని పల్లెత్తు మాట అనడం లేదు. మొద్దు నిద్రలో ఎక్సైజ్... ► జూబ్లీహిల్స్ కాలనీలో ఇబ్బడిముబ్బడిగా ఇష్టారాజ్యంగా పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు కావడంలో జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీసుల నిర్వాకం చెప్పనలవి కాదు. నెలనెలా మామూళ్లు దండుకుంటున్న ఈ పోలీసులు ఇక్కడ ఏం జరుగుతున్నదో పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ► న్యూ ఇయర్ వచ్చిందంటే పాస్‌లు, మామూళ్లకు అలవాటు పడుతున్న ఎక్సైజ్ పోలీసులు ఇక్కడ అర్ధరాత్రి దాటినా లిక్కర్ కొనసాగుతుండటాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి రాత్రి పరిమితికి మించి నడిస్తే ఎక్సైజ్‌పోలీసులు ఆ పబ్‌ను సీజ్ చేయాల్సి ఉంటుంది. ► అక్రమంగారోడ్డు పక్కన పార్కింగ్ చేస్తే జీహెచ్ఎంసీ ఆ భవనాన్ని సీజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ తప్పులన్నీ ఎక్సైజ్, జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా స్థానికులు మాత్రం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులను లక్ష్యంగా చేసుకొని బద్నాం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ► జీహెచ్ఎంసీ, ఎక్సైజ్ పోలీసులు సమన్వయం.. చిత్తశుద్ధితో వ్యవహరించి అడ్డదారులు.. ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న పబ్‌లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని
బ్రిటన్: పబ్‌కి వెళ్లి తాగకుండా ఉండటమనేది సాధారణంగా జరగదు. కానీ ఇక్కడ ఒక 48 ఏళ్ల వ్యక్తి తాను ఒక్కో రోజులో 51 పబ్లకి వెళ్లి కనీసం ప్రతీ పబ్ వద్ద 125 మి.లీ డ్రింక్ తీసుకుని రికార్డు సృష్టించాడు. ఇంతకి అతనెవరనే కదా! అసలు విషయంలోకి వెళ్లితే కోవిడ్-19 దృష్ట్య పబ్లకి జనాలు దూరంగా ఉండటంతో ఆ వ్యాపారాలు కాస్త దెబ్బతిన్నయన్న సంగతి తెలిసిందే. (చదవండి: అక్కడ తాగే నీటిలో అత్యధిక స్థాయిలో డీజిల్, కిరోసిన్ ఉన్నాయట!) ఇలాంటి సమయంలో అందరి దృష్టిని ఆకర్షించేలా కావాలనే పబ్లకి వెళ్లానంటున్నాడు యూకేకి చెందిన మ్యాట్ ఎల్లిస్. అంతేకాదు కేవలం ఒక్కరోజులోనే ఎనిమిది గంటల 52 నిమిషాల్లో 51 పబ్‌లు చుట్టి వచ్చాడు. ఈ క్రమంలో అతను ఆరోగ్య రీత్యా ప్రతి పబ్‌లోనూ కేవలం 125 మిల్లీ లీటర్ల మాత్రమే ఆల్కహాల్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇందులో జ్యూస్, డైట్ కోక్ మిక్స్ చేసి డ్రింక్ తీసుకున్నాడు. ఓవరాల్‌గా పబ్‌లను చుట్టొచ్చే సమయంలో ఓవరాల్‌గా 6.3 లీటర్లు ఆల్కాహల్ తీసుకున్నాడట. దీనికి గిన్నిస్ వరల్డ్ ఇద్దరు స్వతంత్ర ప్రతినిధుల్ని నియమించి అతన్ని పర్యవేక్షించింది. ఈ ఏడాది చాలా భయంకరమైనదని, పబ్‌ల నుంచి ప్రజలను దూరం చేయడమే కాక అందరూ ఆనందంగా వారాంతాల్లో గడిపే అవకాశం లేకుండా చేసిందంటూ తన అసహనం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తాను వరల్డ్ రికార్డుకి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా తెలిపాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎల్లిస్ రికార్డును ధృవీకరిస్తే మాత్రం ఇలాంటి ఘనత సాధించిన మొట్ట మొదటి వ్యక్తిగా ఎల్లిస్ నిలుస్తాడు. (చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు) -
రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ముంబై తర్వాత అత్యంత ఘనంగా వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది తరలివస్తుంటారు. హైదరాబాద్‌లో రేపు ఆదివారం మహా నిమజ్జనం జరగనుంది. జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వినాయక విగ్రహాలు తరలి రానున్నాయి. శోభాయమానంగా జరిగే గణేశ్ నిమజ్జన మహోత్సవానికి హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చదవండి: మొన్నటి వరకూ కేంద్రమంత్రి.. ఇప్పుడు టీఎంసీ గూటికి అయితే నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో తీవ్ర ఆంక్షలు విధించారు. అందులో భాగంగా మద్యం దుకాణాలు మూసి వేస్తున్నారు. ఆది, సోమవారం (19వ తేదీ ఉదయం 9 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు) మద్యం దుకాణాలు మూసి ఉంటాయని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న వైన్స్‌తో పాటు బార్లు, పబ్‌లు మూసి ఉంటాయని ఎక్సైజ్ పోలీసులు ప్రకటించారు. చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు All the #Toddy & #WineShops shall remain #closed from 0600 hrs on 19.09.2021 to 1800 hrs on 20.09.2021, in the jurisdiction of #RachakondaPoliceCommissionerate in view of #Ganeshimmersion to be held on 19.09.2021. pic.twitter.com/1bm4r78qGU — Rachakonda Police (@RachakondaCop) September 18, 2021 -
క్లబ్బులు , పబ్బులు మూసివేయాలి బట్టి విక్రమార్క
-
ఐటీ రాజధానిలో మొదలైన కరోనా సెకెండ్ వేవ్
సాక్షి, బెంగళూరు: ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో మహిళల కంటే పురుషులకే అధికంగా కరోనా వైరస్ సోకుతోంది. మాస్క్ వినియోగించడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు మహిళలతో పోలిస్తే బయట తిరిగేది ఎక్కువ మగవారే కావడంతో కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. గత ఆరు రోజుల్లో 3,364 మంది పురుషులకు, 2,334 మంది మహిళలకు పాజిటివ్‌గా నిర్ధారించారు. వారంరోజుల నుంచి కర్ణాటకలో కరోనా రెండో ఉధృతి ప్రారంభమైందనడానికి సూచికగా నిత్యం 1500 లకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా నియమాలను మహిళల కంటే పురుషులే అధికంగా ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది. పబ్‌లు, రెస్టారెంట్లు, సభలు, సమావేశాలు, వివాహాలు, రెస్టారెంట్లలో ఎక్కువగా పురుషులే పాల్గొంటున్నారు. మొదలైన సెకెండ్ వేవ్.. ఈ ఏడాది (2021) ఆరంభమైన తర్వాత తొలిసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేల మార్క్ దాటింది. గత వారం రోజులుగా వెయ్యి పైగా పాజిటివ్‌లు నిర్ధారిస్తున్నారు. గతంలో 2020 నవంబరు 14వ తేదీన 2,154 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మార్చి 24వ తేదీన రెండు వేల మార్కు దాటింది. ఈ నెలారంభంలో 5,800గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య.. 23వ తేదీ నాటికి 15 వేలు దాటింది. -
హైదరాబాద్: పలు పబ్బులపై పోలీసుల దాడి
-
జూబ్లీహిల్స్: పబ్‌లపై టాస్క్‌ఫోర్స్ దాడులు
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని పలు పబ్‌లపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ అర్థరాత్రి వరకు నిర్వహిస్తున్న పబ్బులపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో తబులా రస, ఏయిర్ లైవ్, కెమెస్ట్రీ, అమ్నీసియా పబ్‌లపై దాడులు చేసి వాటిపై కేసులు నమోదు చేశారు. ఇవన్నీ అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్‌ను తేవడం, కోవిడ్ నిబంధనలు పూర్తిగా బేఖాతరు చేయడం, మాస్కులు లేకుండా పబ్బుకు అనుమంతిచడం చేస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే విధానానికి స్వస్తి చెప్పిన పబ్బు యజమానులు.. కాసుల కోసం కక్కుర్తి పడి కరోనా విస్తరణకు కారకులుగా మారుతున్నారని పోలీసులు తెలిపారు. చదవండి: పార్లమెంట్‌లోని బార్లలో పొంగుతున్న బీర్లు -
బార్లు, పబ్‌లకు అనుమతి
బెంగళూరు : కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులతో ప్రకటించిన అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా అదేరోజు నుంచి పబ్‌లు, బార్లు, క్లబ్‌లకు అనుమతించాలని కర్ణాటక నిర్ణయించింది. అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్‌లు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బార్లు, క్లబ్బులు, పబ్‌ల్లో మద్యం విక్రయాలను అనుమతిస్తామని, అయితే వాటి సీటింగ్ సామర్థ్యంలో సగం ఖాళీగా ఉంచాలని కర్ణాటక ఎక్సైజ్ మంత్రి హెచ్ నాగేష్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మాత్రమే వారు అనుమతించాలని, భౌతిక దూరం సహా ఇతర కోవిడ్-19 నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకూ 1435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా. గత ఏడాది ఇదే సమయంలో ప్రభుత్వానికి వచ్చిన రాబడితో పోల్చితే ఇంతమొత్తంలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని అంచనా వేశామని మంత్రి తెలిపారు. మద్యం విక్రయాలకు అనుమతించనిపక్షంలో నష్టాలు 3000 కోట్ల రూపాయలు దాటతాయని చెప్పారు. ఇక ఈ ఏడాది జూన్‌లో కర్ణాటక ప్రభుత్వం వైన్ షాపులను తెరిచేందుకు అనుమతించింది. చదవండి : కార్యాలయంలో రాసలీలలు -
2 వేల కోట్ల రూపాయల బీరు వృధా!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం విధించిన లాక్డౌన్లో భాగంగా బ్రిటన్‌లోని పబ్‌లన్నింటిని మూసివేయడం జరిగింది. దీంతో దాదాపు రూ. 7 కోట్ల పింట్ల బీరు వృధా అవుతోంది. మార్చి 20వ తేదీన మూతపడిన పబ్‌లు జూలై నాలుగవ తేదీన తెరచుకోనున్నాయి. ఈ కారణంగా పబ్స్‌లో రూ. 7 కోట్ల పింట్ల బీరు నిల్వ ఉండి పోయిందని, అవి తెరచుకునే నాటికి బీరు ఎందుకు పనికి రాదని బ్రిటన్ బీర్ అండ్ పబ్ అసోసియేషన్ తెలిపింది. (కరోనాకు ‘క్యూర్’ ఉందన్న శాస్త్రవేత్తలు) అయితే మిగిలి పోయిన బీరులో కొంత భాగాన్ని సేంద్రీయ వ్యవసాయంలో ఎరువుల కోసం, జంతువుల దాణ కోసం ఉపయోగించవచ్చని అసోసియేషన్ చీఫ్ ఎమ్మా మార్క్‌క్లార్కిన్ తెలిపారు. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యవసాయాన్ని ఈ రకంగా ఆదుకునేందుకు బీరు ఉపయోగపడడం సంతోషకరమైనప్పటికీ పబ్‌లకు బారీ నష్టం వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బీరు తయారీ కేంద్రాలను, పబ్‌లను కొంత మేరకైనా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రూ. 7 కోట్ల పింట్ల బీరు విలువ బ్రిటన్‌లో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఉంటుంది. (మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!) -
ఈ పబ్ చాలా స్పెషల్ గురూ..!
భార్యాభర్త ఇద్దరూ పని ఒత్తిడికి లోనవుతున్నప్పుడు.. రిఫ్రెష్మెంట్ మగవాళ్లకు ఎంత అవసరమో ఆడవాళ్లకూ అంతే అవసరం. మానసికోల్లాసం కోసం నగరం దాటి వెకేషన్‌కు వెళ్లడం ప్రతివారమూ కుదిరేపని కాదు. అందుకే పిల్లలు, అమ్మానాన్నలు కలిసి ఇష్టమైన ఆహారం తింటూ, మ్యూజిక్ వింటూ, చేయాలనిపిస్తే డాన్స్‌చేస్తూ తమను తాము రీచార్జ్ చేసుకోగలిగిన ‘పబ్’ని తెలుగు వాళ్లకు పరిచయం చేశారు యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రీతి. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఫ్యామిలీ పబ్ స్థాపించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ప్రీతి ‘‘పబ్ అనగానే అది సంస్కారవంతులు వెళ్లకూడని ప్రదేశం అని, ఆడవాళ్లు అడుగుపెట్టకూడదని.. ఇలాంటి గట్టి అభిప్రాయాలు మనలో ఉన్నాయి. ‘పబ్’ అనేది మద్యం సేవించడానికి వెళ్లే ప్రదేశంగా మాత్రమే మనకు ఒక ముద్ర బలంగా పడిపోయి ఉంది. ఇంతవరకు మన దగ్గర ఫ్యామిలీలకు పబ్‌కు లేకపోవడం వల్ల ఏర్పడిన దురభిప్రాయం ఇది’’ అంటారు ప్రీతి. ‘‘ఒక మహిళ తన భర్త, పిల్లలతో సెలవు రోజును ఆహ్లాదంగా గడపగలిగిన ప్రదేశంగా పబ్‌ని తీర్చిదిద్దడమే నా ఉద్దేశం. ఇప్పుడు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి పెరిగినట్లే ఒత్తిడి కూడా పెరిగిపోయింది. నెలకు యాభై వేలు– లక్ష రూపాయలు సంపాదించుకోవడం కోసం వారమంతా మెదడును ఒడిసిపట్టి పని చేయించక తప్పదు. వారాంతంలో రిఫ్రెష్ కాకపోతే మళ్లీ వారంలో కొత్త ఒత్తిడిని తలకెత్తుకోవడానికి సిద్ధం కాలేరు. అలాంటి వాళ్ల కోసం నా కెరీర్లో భాగంగా హైదరాబాద్‌లో నేను ఏర్పాటు చేసుకున్నదే ఈ ఫ్యామిలీ పబ్’’ అని చెప్పారామె. కొత్త సోపానం ‘‘నిజానికి ఫ్యామిలీ పబ్ అనే కాన్సెప్ట్ మనదేశంలోకి మూడు దశాబ్దాలవుతోంది. ‘షెర్లాక్స్ లాంజ్ అండ్ కిచెన్’ పేరుతో 1991లో బెంగళూరులో మొదలైంది. మాది తెలుగు కుటుంబమే అయినా నేను పుట్టింది పెరిగింది బెంగళూరులోనే. ఎంబీఏ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఒక యూరోపియన్ కన్స్ట్రక్షన్ కంపెనీలో హెచ్ఆర్ స్పెషలిస్ట్‌గా పని చేశాను. మా కంపెనీ కార్యకలాపాలు ఆసియా దేశాల్లో ఏడింటిలో జరుగుతుండేవి. చైనా, థాయ్‌ల్యాండ్‌తోపాటు మా కంపెనీ హెడ్‌క్వార్టర్ ఉన్న జర్మనీకి కూడా వెళ్లాల్సి వచ్చేది. మన దగ్గర వీధి చివర కాఫీ షాప్‌లు ఉన్నట్లు అక్కడ ఫ్యామిలీ పబ్లుంటాయి. ఆ దేశాల వర్క్ కల్చర్ మన దగ్గరకు కూడా వచ్చేసింది. పైగా మన దగ్గర మహిళకు ఉద్యోగంతోపాటు ఇంటి పనులు అదనం. మన మగవాళ్లు ఇంటిపనుల్లో సాయం చేయడం నూటికి ఏ పదిళ్లలోనో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కెరీర్‌కు న్యాయం చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు ఆడవాళ్లు. నేను పెళ్లి చేసుకుని కోడలిగా హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత నేను గమనించిన విషయం ఇది. పెళ్లయిన తర్వాత కూడా హైదరాబాద్– సింగపూర్ల మధ్య ప్రయాణిస్తూ ఉద్యోగం చేశాను. బాబు పుట్టిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేశాను. బాబుకి ఇప్పుడు రెండేళ్లు. నేను నా కెరీర్‌ని తిరిగి నిర్మించుకోవడానికి సిద్ధమైనప్పుడు మా ఫ్యామిలీ నడుపుతున్న విద్యాసంస్థలను చూసుకోవడం అనే ఆప్షన్ నా ఎదురుగా ఉంది. అప్పుడు నేను ఫ్యామిలీ మొత్తం సంతోషంగా గడపగలిగిన నైబర్‌హుడ్ పబ్‌ల గురించి చెప్పాను. అప్పుడు మా వారు ‘ఆ కాన్సెప్ట్‌ని నువ్వు టేకప్ చేస్తేనే న్యాయం జరుగుతుంది. కానీ ఇది నీకు చాలెంజింగ్‌గా ఉంటుందేమో’ అన్నారు. నేనా చాలెంజ్‌ని స్వీకరించి ఈ ఏడాది జనవరి 15వ తేదీన పబ్‌ను ప్రారంభించాను. తొలి అడుగు పడాలి పబ్ నిర్వహణ మగవాళ్ల వ్యాపార సామ్రాజ్యం అనేది కేవలం అపోహ మాత్రమే. ఏ రంగమైనా సరే ఆడవాళ్లు అడుగుపెట్టనంత వరకే అది మగవాళ్ల సామ్రాజ్యం. ఆడవాళ్లలో ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తే చాలు... ఆమె చూపించిన దారిలో నడవడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. నేను ఈ రంగంలో తొలి అడుగు వేశాను. ఈ రంగంలో మహిళలకు ఉద్యోగావకాశాలు పెరగాలంటే యజమాని స్థానంలో మహిళ ఉంటేనే సాధ్యం. ఏ సంస్థలోనైనా మహిళల మీద వేధింపులు లేని వాతావరణం ఉండాలంటే మహిళా ఉద్యోగుల నిష్పత్తి పెరగాలి. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర పాతిక మంది ఉద్యోగులున్నారు. ఈ నెల ఎనిమిదవ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నుంచి ఫ్యామిలీ పబ్‌లో మహిళా ఉద్యోగులు ఉంటారు. ‘ఆడవాళ్లు మీకు ఈ ఉద్యోగాలెందుకు? ఫలానా ఉద్యోగాలు చూసుకోండి’ అని తీర్పులిచ్చేస్తోంది మగసమాజం. అవకాశాలను ఆడవాళ్ల ముందు పెట్టాలి. ఉపయోగించకోవడం, ఉపయోగించుకోకపోవడం ఆడవాళ్ల ఇష్టమై ఉండాలి’’ అన్నారు ప్రీతి. మగవాళ్లు తీర్పు చెప్పడం ఎలా ఉంటుందంటే... ఒక సినిమాకి రివ్యూ రాసేటప్పుడు ‘ఇది ఆడవాళ్ల సినిమా’ అని మగవాళ్లే నిర్ణయించేస్తుంటారు. తమకు నచ్చే సినిమా ఏదో నిర్ణయించుకునే అవకాశాన్ని కూడా ఆడవాళ్ల చేతిలో ఉంచరన్నమాట. ఆ ధోరణి నుంచి మన సొసైటీ బయట పడాలి. అందుకు ఒక సాహసోపేతమైన అడుగు వేశారు ప్రీతి. – వాకా మంజులారెడ్డి రాత్రి రెండు వరకు నేను కోరుకుంటున్నట్లు యాభై శాతం ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేయడం సాధ్యమేనా... అనే సందేహం వచ్చినమాట నిజమే. అయితే మేము నిర్వహించనున్న మూడు రోజుల ఫ్రీ వర్క్‌షాప్‌కి పేర్లు నమోదు చేసుకున్న వాళ్లలో గృహిణులు కూడా ఉన్నారు. డీజే, ఆర్టిస్టులు కూడా మహిళలే ఉంటారు. నేను పెట్టుబడి పెట్టి నిర్వహణ బాధ్యత ఉద్యోగుల మీద వదిలేయడం లేదు. కౌంటర్ నుంచి కిచెన్ వరకు అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తాను. వీకెండ్స్‌లో రాత్రి రెండు గంటల వరకు కూడా పబ్‌లోనే ఉంటాను. ఇది కార్యక్షేత్రం. నేనిలా ఉండగలుగుతున్నాను కాబట్టి మహిళాఉద్యోగులకు కూడా భరోసా ఉంటుంది. మల్టీ క్విజిన్ రెస్టారెంట్లో చెఫ్‌లు, ఫ్రంట్ ఆఫీస్, స్టీవార్డ్ స్కిల్‌డెవలప్‌మెంట్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ప్లేస్‌మెంట్స్ ఇప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. నేను సమాజంలో ఒక మెట్టు మంచి స్థానంలో ఉన్నాను. నా వంతుగా మరికొంత ఆడవాళ్లకు ఉపాధి కల్పించడం నా బాధ్యత. – ప్రీతి, షెర్లాక్స్ లాంజ్ అండ్ కిచెన్ నిర్వహకురాలు -
ఆ రాష్ట్రంలో పబ్‌లకు పర్మిషన్..
తిరువనంతపురం : మద్యం విధానాన్ని సరళీకరిస్తూ కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పబ్‌ల ఏర్పాటుకు అనుమతించింది. రాష్ట్రంలో పబ్‌లు లేకపోవడం పట్ల ప్రభుత్వంపై వస్తున్న విమర్శల దృష్ట్యా గత మద్యం విధానాన్ని పునఃసమీక్షించామని చెప్పారు. రోజంతా ఎక్కువ సమయం పనిచేసి అలిసిపోయే ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రొఫెషనల్స్ ఫిర్యాదు మేరకు వారి ఉల్లాసం కోసం పబ్‌లను అనుమతించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. కేరళ బెవరేజెస్ కార్పొరేషన్ నిర్వహించే రిటైల్ మద్యం దుకాణాల్లోనూ వినియోగదారులకు మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు. మద్యం దుకాణాల ముందు భారీ క్యూలను నివారించేందుకు రాష్ట్రంలో మరిన్ని లిక్కర్ సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలిస్తున్నామని అన్నారు. కాగా గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సర్కార్ కేరళలో మద్యంపై పాక్షిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఫైవ్‌స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం విక్రయాలకు అనుమతించారు. దీంతో 2014-17లో 600కు పైగా బార్లు మూతపడ్డాయి. ఆ తర్వాత వాటిని బీర్, వైన్ పార్లర్లుగా మార్చారు. 2016లో అధికారంలోకి వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వం మద్య నిషేధ విధానాన్ని సమూలంగా మార్చివేసింది. త్రీస్టార్ హోటళ్లలోనూ మద్యం విక్రయాలకు అనుమతించింది. -
డ్యాన్స్ బార్లలో నోట్ల వర్షం
కర్ణాటక, బనశంకరి: ఐటీ సిటీలో పబ్బులు, డ్యాన్సింగ్ బార్లు, అటాచ్డ్ బార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిని సంపన్నులు, అధికాదాయ యువకులు తదితరులు వెల్లువలా సందర్శిస్తుంటారు. బ్రిగేడ్‌రోడ్, ఎంజీరోడ్తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో పదులసంఖ్యలోనున్న పబ్బులు,డ్యాన్సింగ్ బార్లలో డ్యాన్స్ లు చేసే యువతులపై ప్రతి రోజూ రూ.5 కోట్లకు పై గా నోట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది అతిశయోక్తి అనిపించినా నిజం. దేశ విదేశీ మద్యం మత్తులో వినుసొంపైన మ్యూజిక్‌లో నగరవాసులు బార్డ్యాన్సర్ల పై నోట్లను విచ్చలవిడిగా వెదజల్లుతుంటారు. బెంగళూరులో తామరతంపర రాష్ట్రంలో ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరులో ఈ మాఫియా అధికంగా ఉంది. బెంగళూరులో అంచనా ప్రకారం 100కు పైగా లైవ్‌బ్యాండ్, డాన్స్బార్లు ఉన్నాయి. 325 అటాచ్డ్ బార్లు కలిగిన పబ్‌లు 61 ఇండిపెండెంట్ పబ్‌లు ఉన్నాయి. అనేక బార్లు, పబ్‌లో ఎలాంటి అనుమతులు లేని డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఉత్తరాది నుంచి డ్యాన్సర్ల రాక ⇔ బీహార్, నేపాల్, పశ్చిమ బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్, ముంబయిల నుంచి అమ్మాయిలు ఇక్కడకు డ్యాన్సర్లుగా వస్తున్నారు. ⇔ కొన్ని బార్లు, పబ్‌లలో కస్టమర్లను ఆకర్షించడానికి విదేశీ యువతులను రప్పిస్తున్నారు. ⇔ నగదు, ఉద్యోగం పేరుతో యువతులకు ఆశచూపించి నగరానికి రప్పించే మధ్యవర్తులు పీజీ, లాడ్జ్‌లు, లేదా రింగ్‌రోడ్డులో ఉండే అపార్టుమెంట్లులో వసతి కల్పిస్తారు. ⇔ నిత్యం సాయంత్రం ప్రత్యేక వాహనాల్లో బౌన్సర్లభద్రత మధ్య వాహనాల్లో డ్యాన్సర్లను బార్లకు తరలిస్తారు. ⇔ నృత్యాలను వీక్షించడానికి రోజూ బార్‌కు విచ్చేసే పర్మినెంట్ గిరాకీలు ఉంటారు. ఇలాంటి వారికి రాయితీ , ఇతరత్రా సౌలభ్యాలూ ఉంటుంది. గొడవలు జరిగితే అదుపుచేయడానికి వస్తాదులూ ఉంటారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి? ⇔ మ్యూజిక్ వేయడానికి స్థానిక పోలీసులతో అనుమతి తీసుకోవాలి ⇔ డ్యాన్స్బార్లలో యువతులతో అసభ్య అశ్లీల నత్యాలు ప్రదర్శించరాదు యువతులపై నోట్లు చల్లరాదు, నిర్ణయించిన యూనిఫారాల్నే డ్యాన్సర్లు ధరించాలి. ఎక్కడెక్కడ ఎక్కువంటే.. ⇔ మెజస్టిక్, అశోకనగర, కోరమంగల, ఇందిరానగర, గాంధీనగర, బ్రిగేడ్‌రోడ్, డబుల్‌రోడ్, శేషాద్రిపుర, మైసూరురోడ్డు, దుమ్మలూరు, ఎలక్ట్రానిక్ సిటీ, మినర్వా సర్కిల్, జేసీ.రోడ్డు, రెసిడెన్సీ రోడ్డుతో పాటు నగరంలోని హైఫై ఏరియాల్లో నృత్యాలు నిత్యకృత్యం. ⇔ ప్రతి పబ్‌లో నిత్యం రాత్రి 8 గంటలకు ప్రారంభమై అర్దరాత్రి 1 గంట వరకు యువతులతో డ్యాన్స్‌లు నిర్వహిస్తారు. ఈ ఐదు గంటల అవధిలో వచ్చే గిరాకీలు ప్రతినిత్యం లక్ష నుంచి రూ.5 లక్షల వరకు యువతులపై డబ్బు విసురుతుంటారు. ఒకరోజు సేకరణ అయ్యే డబ్బులో మొత్తాన్ని పబ్,బార్ల నిర్వాహకులే తీసుకుంటారు. డ్యాన్సర్లకు, మధ్యవర్తులకు నామమాత్రంగా ఇస్తారు. -
పబ్‌లు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఆ కేసులు..
లండన్ : పబ్‌లు, క్లబ్‌లు, బార్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆల్కహాల్ సంబంధిత ఎమర్జెన్సీ కేర్, తీవ్ర అనారోగ్యాలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని తాజా అథ్యయనం వెల్లడించింది. జర్నల్ అడిక్షన్లో ప్రచురితమైన అథ్యయనం ప్రకారం మద్యం విక్రయించే రెస్టారెంట్లు ఇతర అవుట్లెట్లు అధికంగా ఉండటానికి, ఆస్పత్రుల్లో అడ్మిషన్ కేసులకు సంబంధం ఉందని తేలింది. పన్నెండేళ్ల వ్యవధిలో దాదాపు పది లక్షల ఆస్పత్రి అడ్మిషన్ల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ షెఫిల్డ్ ఈ వివరాలు వెల్లడించింది. ఇంగ్లండ్‌లో పబ్‌లు, బార్లు, నైట్ క్లబ్‌లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మద్యం సేవించడంతో వచ్చే కాలేయ వ్యాధులు వంటి తీవ్ర అనారోగ్యాలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఇతర ప్రాంతాలతో పోలిస్తే 22 శాతం అధికంగా ఉంది. మద్యం దుకాణాలను అనుమతించే అధికారులు ఈ అంశాలను తాము నిర్ణయాలు తీసుకునే సమయంలో పరిగణనలోకి తీసుకోవాలని ఆల్కహాల్ రీసెర్చి యూకేకు చెందిన డాక్టర్ జేమ్స్ నికోలస్ సూచించారు. -
అర్ధరాత్రి నాన్సెన్స్.. పబ్బుల్లో న్యూసెన్స్
బంజారాహిల్స్ : గత జూన్ 28న జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లోని అమినేషియా పబ్‌లో పీకల దాకా మద్యం సేవించిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ ఫిరోజ్‌ఖాన్ మాజీ లవర్ చేతులను బ్లేడుతో గాట్లు పెట్టిన ఘటన మరిచిపోకముందే అదే పబ్‌లో అర్ధరాత్రిదాకా విపరీతమైన శబ్దంతో ఇతరులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చుట్టు పక్కల నివాసితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఈ పబ్ కొనసాగుతోందని రోజూ న్యూసెన్స్ పెరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఇంత వరకు అమినేషియా పబ్ నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లోని టిక్కి షాక్ పబ్‌లో ఈ నెల 20న బౌన్సర్ల మధ్య జరిగిన గొడవలో ఓ బౌన్సర్ తలపగిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కూడా అర్ధరాత్రి స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇంత వరకు నిందితులపై చర్యలు కరువయ్యాయి. గత ఆరు నెలల కాలం టిక్కిషాక్ పబ్‌లో పలు ఘటనలు వెలుగు చూసాయి. అంతుకు ముందు ఓ డీఎస్పీ కుమారుడిపై కూడా రౌడీలు దాడి చేశారు. ఇటీవలనే ఓ ఛానల్ విలేకరి మీద ఇదే పబ్‌లో దాడి జరిగింది. తాజాగా శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లోని 788 అవెన్యూ పబ్ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత కూడా లిక్కర్ సరఫరా చేస్తుండటంతో పాటు పెద్ద పెద్ద శబ్దాలతో న్యూసెన్స్ చేస్తుండగా యజమాని మోహన్‌రెడ్డి, మేనేజర్ రాజ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో పబ్‌లలో అర్ధరాత్రి దాకా పీకల దాకా మద్యం సేవించిన యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. ఏడాది కాలంగా పీఎస్‌లో నమోదైన కేసుల్లో పబ్‌లలో జరుగుతున్న ఘర్షణకు సంబంధించిన అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా పబ్‌లు తెరిచి ఉంటుండటంతో పోలీసులు వెళ్లి బంద్ చేయించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు నిర్వాహకులు పోలీసులపైనే తిరగబడ్డ ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. జూబ్లీహిల్స్‌లో మొత్తం 28 పబ్‌లు కొనసాగుతుండగా 80 శాతం పబ్‌లపై నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదై ఉన్నాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా నిర్వాహకులు తీరు మార్చుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి పబ్‌ల ముందు గొడవలు షరా మామూలయ్యాయి. రోడ్డు నెం.45లోని ఫ్యాట్ పీజియన్ పబ్‌లో అర్ధరాత్రి దాకా మద్యం సేవించిన కొందరు యువకులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించిన ఘటన సంచలనం సృష్టించింది. ఇంకో వైపు మద్యం మత్తులో పబ్ నుంచి బయటకు వస్తున్న యువతీ యువకులు అదుపు తప్పిన వేగంతో దూసుకుపోతూ జూబ్లీహిల్స్ రహదారులపై న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి పబ్‌లపై నియంత్రణ కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. అంతే కాకుండా టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా పబ్‌లపై నిఘా ఉంచితే కొంతవరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని స్థానికులు అంటున్నారు. -
నిద్ర లేకుండా చేస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని పెద్దమ్మ దేవాలయం కమాన్ వద్ద ఉన్న ఆమ్నేషియా లాంజ్ పబ్‌లో అర్ధరాత్రి దాటినా శబ్దాలు చేస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని రౌనక్ బండారి అనే యువకుడు నగర పోలీసు కమిషనర్‌కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు. గత కొంత కాలంగా ఈ పబ్ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగుతున్నదని ఇష్టారాజ్యంగా మ్యూజిక్ ప్లే చేస్తూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించాడు. దీనిపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు నైట్ డ్యూటీ ఆఫీసర్‌తో పాటు పెట్రోలింగ్ పోలీసులను పంపి మ్యూజిక్‌ను ఆపివేయడం జరిగిందని సమాధానమిచ్చారు. శబ్ధకాలుష్యం లేకుండా తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే రౌనక్ బండారి ఇందుకు సంతృప్తి చెందలేదు. ఆదివారం రాత్రి కూడా మ్యూజిక్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, భారీ శబ్ధాలతో ఇబ్బందులు పడ్డామంటూ మరోసారి ట్వీట్ చేశారు. -
పబ్‌ల మూసివేతకు ఆదేశాలు..
సాక్షి, బెంగళూర్ : లైసెన్స్ లేకుండా మ్యూజిక్ ప్లే చేస్తున్న 27 పబ్‌లపై బెంగళూర్ పోలీసులు కొరడా ఝళిపించారు. పబ్‌లు, రెస్టారెంట్లలో లైవ్ మ్యూజిక్ ప్రదర్శించాలంటే అనుమతి తప్పనిసరి అని కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో 27 పబ్‌లను మూసివేయాల్సిందిగా బెంగళూర్ పోలీసులు ఆదేశించారు. అయితే లైవ్ మ్యూజిక్ లేకుండా కార్యకలాపాలు సాగించేందుకు ఈ పబ్‌లను అనుమతించారు. సంగీత కార్యక్రమాలు నిర్వహించేందుకు పబ్ యాజమాన్యాలు లైసెన్సు కోసం దరఖాస్తు చేయకపోవడంతో వీటిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సెక్షన్ 294 కింద వీటిని మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేయగా, మరికొన్ని పబ్‌లకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇదేతరహాలో గత నెలలో ఢిల్లీ ప్రభుత్వం రెస్టో బార్లను తమ ప్రాంగణాల్లో రికార్డింగ్ డ్యాన్స్‌లు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు నిర్వహించడంపై హెచ్చరికలు జారీ చేసింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ఢిల్లీ ప్రభుత్వం రెస్టో బార్ యాజమాన్యాలను హెచ్చరించింది. -
పబ్‌లు, బార్లలో జర జాగ్రత్త..!
సాక్షి, బెంగళూరు: ముంబైలోని కమల మిల్స్ భవనంపై ఉన్న పబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో నగర అగ్నిమాపక శాఖ విభాగం అప్రమత్తమైంది. ముంబై ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నగరంలోని బహుళ అంతస్తుల భవనాలు ముఖ్యంగా ఇటువంటి భవనాల్లో ఉన్న పబ్‌లు, బార్లు, రెస్టోరెంట్లలో తనిఖీని ముమ్మరం చేసింది. ముఖ్యంగా న్యూ ఇయర్ సంబరాలకు ఎక్కువ మంది పబ్‌లు, బార్లలలో నిర్వహించుకోవడానికి యువత ఇష్టపడుతుందన్న విషయం తెలిసిందే. అయితే నగరంలోని చాలా పబ్‌లు, బార్లు అగ్నిమాపశాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను పొందకుండానే వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. నెటిజన్లు ట్వీట్లతో సమాచారం.. ఈ నేపథ్యంలో అనేకమంది నెటిజన్లు నగరంలోని ఏఏ రెస్టారెంట్లలో ఎటువంటి పరిస్థితి ఉందన్న విషయమై రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ ఎం.ఎన్ రెడ్డికి ట్వీట్లతో సమాచారం అందించారు. ముఖ్యంగా వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రముఖ మాల్లోని రెస్టారెంట్‌తో పాటు రూఫ్ టాప్ పబ్‌లకు అనుమతి లేదని తెలిపారు. మరోవైపు ఇందిరానగరలోని అనేక పబ్‌లు ఇళ్లకు అనుమతులు పొంది అందులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎం.ఎన్ రెడ్డికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు ఎం.జీరోడ్, బ్రిగేడ్‌రోడ్, ఇందిరానగర్‌లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ విషయంపై ఎం.ఎన్ రెడ్డి మాట్లాడుతూ... ‘15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాలను బహుళ అంతస్తుల భవనాలుగా పరిగణిస్తారు. ఇందులో ప్రమాదం జరిగినప్పుడు త్వరగా కిందికి రావడానికి వీలుగా అత్యవసర మెట్లు ఉండాలి. అంతేకాక అటువంటి భవనాల ముందు అగ్నిమాపక వాహనాల నిలుపుదలకు వీలుగా విశాలమైన స్థలం ఉండాలి. ప్రతి అంతస్తులో అగ్నినిరోదక వస్తువులు తప్పక ఉండాలి. ఈ ఏర్పాట్లు లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. అధికారులు ప్రజలకు చెబుతున్న జాగ్రత్తలు .. ∙పబ్‌లు, బార్లలో కిచెన్‌కు దగ్గరగా సిటింగ్ టేబుల్‌పై కూర్చొకపోవడమే ఉత్తమం. ∙మద్యానికి దగ్గరగా సిగరెట్ వంటి వస్తువులు ఉండకుండా చూడాలి. ∙పబ్‌కు, రెస్టారెంట్‌కు వెళ్లే సమయంలోనే అత్యవసర ద్వారాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి ∙అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్‌ను ఉపయోగించకపోవడమే మేలు -
తాగినోళ్లకు తాగినంత..!?
సాక్షి, బెంగళూరు : న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు నగరంలో పబ్బులు, రెస్టారెంట్లు, బార్ల క్లోజింగ్ టైమ్‌లో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. బార్లు, పబ్బులును ఉదయం రెండు గంటలకు వరకూ తెరిచివుంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బార్లు, పబ్బుల్లో స్త్రీ, పురుషులకు ప్రత్యేక గదులను కేటాయించడంతో పాటు, పిల్లలతో వచ్చే తల్లులకు రిజర్వ్డ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని బెంగళూరు పోలీసులు బార్లు, పబ్బులు, రెస్టారెంట్ల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకలను సామరస్యంగా, ఆహ్లాదపూరిత వాతావరణంలో నిర్వహించుకోవాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ టీ సునీల్ కుమార్ ప్రజలను కోరారు. మద్యం మత్తులో అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తించేవారిని అక్కడికక్కడే అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటున్న వారికి బలంవంతంగా విషెస్ చెప్పడం, అల్లరి చేష్టలకు దిగినవారిని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు. నగరంలోని ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో 24 గంటల పాటు సీసీటీవీలో మానిటరింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా అల్లర్లు జరగవచ్చన్న ఉద్దేశంతో ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగా 15 వేల మంది పోలీసులు వినిమోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బార్లు, పబ్బులు నిబంధనలు పాటించాల్సిందే
హైదరాబాద్: బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలోని బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు/మేనేజర్లతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసాజ్ సెంటర్లు, పార్లర్లలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు జరగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మసాజ్ సెంటర్లు నిర్వహించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నియమ నిబంధనలను తప్పక పాటించాలని అన్నారు. మసాజ్ సెంటర్లను మసాజ్ సెంటర్లు గానే కొనసాగించాలని, వీటి ముసుగులో వ్యభిచారం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నేరమని తెలిపారు. స్పాలకు నిబంధనలు స్పాలలో తప్పనిసరిగా రిజిస్టర్ నిర్వహించాలన్నారు. ఇందులో స్పాలకు వచ్చే వారి పేరు, ఫోన్ నంబర్లను విధిగా నమోదు చేయాలన్నారు. స్పాలలో పడకల వాడకం అవసరం లేదన్నారు. సాధ్యమైనంత వరకూ క్రాస్ మసాజ్‌లకు అనుమతించవద్దని, 18 ఏళ్లకు తక్కువ ఉన్నవారిని అనుమతించొద్దని, సిసి కేమరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విజిటింగ్ వీసాలపై వచ్చిన ఇతర దేశాల వారిని స్పాలల్లో నియమించుకోవద్దన్నారు. స్పాలల్లో తలుపులు పారదర్శకంగా ఉండాలన్నారు. తలుపులకు ఎలాంటి బోల్టులను బిగించరాదన్నారు. వీలుంటే గాజు పార్టిషన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బార్లు, పబ్బులు, వైన్ షాపులకు నిబంధనలు బార్లు, పబ్బులు, వైన్ షాపుల యజమానులు కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్, లిక్కర్ లైసెన్స్, పోలీస్ లైసెన్స్‌లను తీసుకోవాలన్నారు. సమయపాలన పాటించాలని, రాత్రి 12 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలో షాపులను తెరిచి ఉంచొద్దని సూచించారు. పై నిబంధనలు అతిక్రమిస్తే మొదటిసారి సీపీ కార్యాలయానికి లేదా పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని, రెండోసారి అయితే 2, 3 రోజులు జైలు శిక్ష తప్పదని శాండిల్య హెచ్చరించారు. కేసుల నమోదుతోపాటు లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలు తీసుకున్నారు. వ్యాపారులు కనీస నైతికత పాటించాలని, సామాజిక హితాన్ని కొంతైనా పాటించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘టిప్’ ఇవ్వడం మంచిదా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: టిఫిన్ చేయడానికో, భోజనం చేయడానికో, సాయం సంధ్య వేళల్లో అలా అహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలసి కాఫీలు, టీలు తాగడానికి హోటళ్లకు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు లేదా సరదాగా స్నేహితులతో కలసి బీరు తాగేందుకు బార్‌కు వెళ్లినప్పుడు అక్కడి సర్వర్లకు ఎంతో కొంత టిప్ చెల్లించడం మనకు అలవాటే. టిప్పులెంత అనేది వినియోగదారుల మనస్తత్వం, వారి జేబు బరువునుబట్టి ఉంటుంది. అంటే, కొంత మంది డబ్బున్న వాళ్లు డాంబికం కోసం టిప్ ఎక్కువగా ఇవ్వొచ్చు. కొంత మంది ఎంత డబ్బున్నాసరే తక్కువ టిప్‌తో సరిపెట్టవచ్చు. కొంత మంది అంతంత మాత్రమే డబ్బున్నా ఉదారంగా ఎక్కువ టిప్ ఇవ్వొచ్చు. మరికొందరు పక్కనే ఉన్న గర్ల్ ఫ్రెండ్ లేదా స్నేహితుల మెప్పు కోసం టిప్ ఎక్కువగా ఇవ్వొచ్చు. అసలు ఈ టిప్‌లు అంటే ఏమిటీ? ఈ సంస్కతి ఎక్కడ పుట్టింది? ఎందుకోసం పుట్టింది? దీని వల్ల లాభాలున్నాయా, నష్టాలున్నాయా? అన్న అంశాలపై మరోసారి ఇప్పుడు చర్చ మొదలైంది. టిప్ అంటే ‘టు ఇన్సూర్ ప్రామ్టిట్యూడ్’ అని చెబుతారు. అంటే సకాలంలో లేదా తక్షణమే ఆర్డర్ చేసినది అందించడానికని అర్థం. ఇప్పుడు పబ్స్‌గా వ్యవహరిస్తున్న ఒకప్పటి ఇంగ్లీషు హౌసెస్‌లో ఈ టిప్ సంస్కతి పుట్టిందట. సకాలంలో మంచి సర్వీసు అందించడం కోసం సర్వర్లకు టిప్ లివ్వడం మొదలైంది వాటిలోనే. అనతి కాలంలోనే ఈ సంస్కతి యూరప్ అంతటా వ్యాపించింది. 20వ శతాబ్దంలో ఉత్తర అమెరికాకు పాకింది. అక్కడి నుంచి వివిధ దేశాలకు విస్తరించింది. మనం ఇచ్చే టిప్‌లకు సర్వీసుకు ప్రత్యక్ష సంబంధం ఉందా? ఉంటే ఎక్కువ టిప్ ఇచ్చిన వారికి ఎక్కువ సర్వీసు, తక్కువ టిప్ ఇచ్చిన వారికి తక్కువ సర్వీసు ఉంటుందా? ఇచ్చిన టిప్‌కు, చేసే సర్వీసుకు ప్రత్యక్ష సంబంధం లేదని, అయితే సర్వర్ ఆశించే టిప్‌కు, చేసే సర్వీసుకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఓ సర్వేలో తేలింది. ఓ కస్టమర్ ఎక్కువ టిప్ ఇస్తాడని ఆశించిన సర్వర్ ఆయనకు మంచి సర్వీసు అందించవచ్చు. ఆ..బేవార్స్ బ్యాచీ! టిప్ పెద్దగా ఇవ్వరని సర్వర్ భావిస్తే వారికి మంచి సర్వీసు అందించక పోవచ్చు. ధరించిన దుస్తులు, ముఖ కవలికలనుబట్టి ఎవరు ఎక్కువ ఇస్తారో, తక్కువ ఇస్తారో సర్వర్లు ఊహించవచ్చు. అప్పుడప్పుడు వారి ఊహలు తారుమారు కావచ్చు. ఇక్కడ మంచి సర్వీసంటే వేగంగా సర్వ్ చేయడమే కాకుండా, కస్టమర్లకు నచ్చిన చట్నీలనో, కూరలనో అడక్కముందే అందించడం, ఉన్నంతలో వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆహార పదార్థాలను వేడి వేడిగా సర్వ్ చేయడం. తరచుగా వచ్చే కస్టమర్లు ఎక్కువ టిప్ ఇస్తారంటే మంచి సర్వీసు, ఇవ్వరనుకుంటే సర్వర్లు నింపాది సర్వీసు ఇవ్వొచ్చు. వాస్తవానికి ఈ టిప్‌ల వల్ల సర్వీసు దెబ్బతింటుందని, ఓ సర్వర్‌కు టిప్ వందొస్తే చాలనుకుంటే ఆ సర్వర్ వంద చేతిలో పడగానే పనిచేసే చోటు నుంచి వెళ్లిపోతాడని, దాని వల్ల సర్వీసుకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పిన వాళ్లు ఉన్నారు. సర్వర్లకు టిప్‌లు ఇవ్వడం వల్ల వారి యజమానులు వారి జీతాలను పెంచడం లేదని, అందుకని వినియోగదారులు టిప్‌లు ఇవ్వడం మానేస్తే యజమానులు చచ్చినట్లు సర్వర్ల జీతాలు పెంచుతారనే బలమైన వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వాస్తవానికి ఈ వాదనను కూడా తప్పని తేల్చిన వారు ఉన్నారు. వినయోగదారుల నుంచి టిప్‌లు తగ్గిపోయాయన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని యజమానులు సర్వర్లకు జీతాలు పెంచాలని ఆలోచించరట. మార్కెట్లో సర్వర్లు ఎంతకు దొరుకుతున్నారనే అంశంపైనే ఆధారపడి ఉంటుందట వారి జీతభత్యాలు. ఇంకా టిప్‌లు రాకపోతే సర్వర్ ఉద్యోగం బాగాలేదని, మరో ఉద్యోగానికి సర్వర్లు వెళతారట. అలా సర్వర్ల కొరత ఏర్పడితే తప్పించి యజమానులు వారికి ఎక్కువ జీతాలు ఇవ్వడానికి ఇష్టపడరట! పైగా టిప్‌ల సంస్కతి వల్ల తినుబండారాల ధరలు స్థిరంగా ఉంటున్నాయనే వాదన కూడా ఉంది. సర్వర్ల జీతాలను వినియోగదారులు టిప్‌ల రూపంలో షేర్ చేసుకోవడం వల్లన యజమానులు తినుబండారాల ధరలను పెంచడం లేదట. సర్వర్లకు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తే యజమానలు కచ్చితంగా తినుబండారాల ధరలను పెంచుతారనే విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో టిప్‌ల సంస్కతికి తిలోదకాలివ్వాలా, లేదా ? అన్న అంశంపై ‘టొరాంటో స్టార్ రీడర్స్’ ఇటీవల ఓ సర్వే నిర్వహించగా 85 శాతం మంది వీటికి గుడ్‌బై చెప్పాలని తేల్చారు. ఎలా గుడ్‌బై చెప్పాలి? వినియోగదారుల్లో చైతన్యం తీసుకరావాలా? యజమానుల వైఖరిలో మార్పు రావాలా? ఇరువురి వైఖరిలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మార్పు సాధ్యమని, అదికూడా అంత సులువుకాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాలతోపాటు, భారత్‌లో కూడా కొన్ని హోటళ్లు సర్వర్లకు టిప్‌లు ఇవ్వొద్దని, తామే బిల్లులో టిప్ వేసి సర్వర్లకు ఇస్తామని ముందుకు వచ్చాయి. కొన్ని హోటళ్లు టిప్‌ల స్థానంలో సర్వీసు చార్జీలను తీసుకొచ్చాయి. అయితే ఆ పద్ధతులు సక్కెస్ అయిన దాఖలాలు లేవు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫైల్ రెస్టారెంట్ గ్రూపైన ‘డాని మేయర్స్ యూనియన్ స్క్వేర్ హాస్పిటాలిటీ గ్రూప్’ టిప్‌లను నిర్ద్వంద్వంగా రద్దు చేసింది. సత్ఫలితాలు కాకుండా మిశ్రమ ఫలితాలు వచ్చాయని ఆ గ్రూప్ తెలియజేసింది. -
పబ్బులు, కాఫీషాప్లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో పార్కింగ్ సౌకర్యం సరిగ్గాలేని 20 పబ్బులు, కాఫీషాప్లకు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజులక్రితం జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి ఓ పబ్ముందు పార్కింగ్ చేసిన కారు కారణమని రాత్రి వేళల్లో రోడ్డకు రెండువైపులా అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో పంజగుట్ట ట్రాఫిక్ ఎసీపీ కోటేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు నోటీసులు అందచేశారు. తగిన పార్కింగ్ సౌకర్యం కల్పించకపోతే వాటిని సీజ్‌చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్కింగ్ సౌకర్యం కల్పించుకున్న దానిపై వివరణ ఇవ్వాలని కోరారు. మహిళా సంఘాల ధర్నా పబ్‌ల ముందు రోడ్లకు రెండువైపులా అర్ధరాత్రిదాకా వాహనాలు పార్కింగ్చేస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారని ఆరోపిస్తూ మహిళాసంఘాలు బుధవారం జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్ 45 లోని ఫ్యాట్ ఫిజియన్ పబ్‌తో పాటు జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్ 30లో ఉన్న హైలైఫ్ 800 పబ్ ఎదుట ధర్నా నిర్వహించారు. అడ్డదిడ్డంగా కార్లు పార్కింగ్ చేయడంవల్ల రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్కింగ్ సౌకర్యం లేకుండానే పబ్‌లు ఎధేచ్చగా నడుస్తున్నా పోలీసులు పట్టించు కోవడంలేదని ఆరోపించారు. -
అర్థరాత్రి వరకే పబ్‌లు, క్లబ్‌లు
-
అర్థరాత్రి వరకే పబ్‌లు, క్లబ్‌లు
హైదరాబాద్: హైదరాబాద్ పోలీసలు పబ్ యజమానులకు షాక్ ఇచ్చారు. పబ్‌లలో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో పనిచేసే వేళలను కుదించారు. ఇకపై రాత్రి 12 గంటల వరకే అనుమతిస్తూ కొత్తగా ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితమే పబ్‌లు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట సహా అన్ని పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇక నుంచి అర్థరాత్రి 12 గంటలకు బంద్ చేయాల్సి ఉంటుంది. మొన్నటి వరకు రాత్రి 12 గంటల వరకు లిక్కర్ సరఫరాచేసి ఒంటి గంట వరకు ఫుడ్ సరఫరా చేసేవారు. ఇప్పుడు అన్నింటికి ఒకే లెక్క. రాత్రి 12 గంటలకు తమ పరిధిలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లు, హోటళ్లు మూసివేసిన తర్వాతనే సెక్టార్ ఎస్ఐలు ఇంటికి వెళ్లాలని తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆదివారం రాత్రి నుంచే పోలీసులు రంగంలోకి దిగారు. సరిగ్గా 12 గంటలకు పబ్‌లను మూసివేయించి ఇంటికి వెళ్తున్నారు. సోమవారం రాత్రి 12తర్వాత అన్ని పబ్‌లు, క్లబ్‌లు, హోటళ్ల వద్ద నిరంతర నిఘా ఉంచారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. కేసులు బనాయించాలని యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 12 గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా అనుమతించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇక పబ్‌లు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హుక్కా సెంటర్లు అధికంగా ఉన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాటిముందు రాత్రి 12 తర్వాత కార్లు ఆగినా, యువత అనుమానాస్పదంగా తిరిగినా వెంటనే ప్రశ్నించాలని తెల్లవారుజాముదాకా గస్తీకాయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు ఆయా పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లను బాధ్యులుగా చేశారు.