ప్రముఖ నటుడి పబ్ పై పోలీసుల దాడులు, కేసు నమోదు!
Published Mon, Sep 16 2013 7:00 PM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
అనుమతుల్లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారనే ఆరోపణలపై ఓ ప్రముఖ నటుడికి చెందిన ఎన్-గ్రిల్ పబ్ మేనేజర్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం తెల్లవారుజామున డిప్యూటి కమిషనర్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఎన్ గ్రిల్ పబ్ తోపాటు దసపల్లా హోటల్ లోని ఓవర్ ది మూన్, రాడిస్సన్ బ్లూ ప్లాజా హోటెల్ లోని మోవిదా పబ్ పై కూడా దాడులు నిర్వహించారు.
రాత్రి 11 గంటల తర్వాత మద్యం సరఫరా చేయకూడదనే నిబంధనల్ని తొక్కిపెట్టి పబ్ లో మద్యాన్ని విచ్చలవిడిగా సరఫరా చేస్తుండటం అధికారులు దృష్టికి వచ్చింది. దాంతో పలు పబ్ లపై దాడుల చేశారు. లైంగిక వేధింపు కేసులు ఎక్కువగా కావడంతో తాము దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. అనుమతిలేకుండా నిర్వహించే పబ్ లపై దాడులు నిర్వహిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ వీ సత్యనారాయణ తెలిపారు.
Advertisement
Advertisement