సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని పలు పబ్‌లపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ అర్థరాత్రి వరకు నిర్వహిస్తున్న పబ్బులపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో తబులా రస, ఏయిర్ లైవ్, కెమెస్ట్రీ, అమ్నీసియా పబ్‌లపై దాడులు చేసి వాటిపై కేసులు నమోదు చేశారు. ఇవన్నీ అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్‌ను తేవడం, కోవిడ్ నిబంధనలు పూర్తిగా బేఖాతరు చేయడం, మాస్కులు లేకుండా పబ్బుకు అనుమంతిచడం చేస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే విధానానికి స్వస్తి చెప్పిన పబ్బు యజమానులు.. కాసుల కోసం కక్కుర్తి పడి కరోనా విస్తరణకు కారకులుగా మారుతున్నారని పోలీసులు తెలిపారు. చదవండి: పార్లమెంట్‌లోని బార్లలో పొంగుతున్న బీర్లు
Comments
Please login to add a commentAdd a comment