raided
-
పోలీసుల అత్యుత్సాహం.. హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఇంటిపై దాడి..
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మలక్‌పేటలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఇంటిపై దాడి చేశారు. అనంతరం అడ్వకేట్ ఇంట్లో ఉన్న ఎన్ఆర్ఐ ఏపూరి సుభాష్ రెడ్డి(75)ని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గూడూరులో ఉన్న ఎన్ఆర్ఐకు చెందిన 5 ఎకరాల భూమిని స్థానిక రియల్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కాసి రామ్ కొనేందుకు కుట్ర పన్నారని బాధితులు ఆరోపించారు. కుట్రలో భాగంగానే ఎన్ఆర్ఐని పలుమార్లు పీఎస్ కు పిలిపించి పోలీసులు బెదిరించారని అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఆరోపించారు. మాట వినకపోవడంతో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రానా ప్రతాప్.. ఎన్ఆర్ఐని అక్రమంగా అరెస్టు చేసేందుకు యత్నించాడని తెలిపారు. ఈ క్రమంలో గూడూరు పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసేందుకు ఇంటిపై దాడి చేశారని అడ్వకేట్ చెప్పారు. గట్టిగా ప్రశ్నించడంతో పోలీసులు వెనుదిరిగారని అన్నారు. ఈ ఘటనపై రేపు డీజీపీకి, హైకోర్టులో ఫిర్యాదు చేయనున్నట్లు అడ్వకేట్ రాపోలు భాస్కర్ తెలిపారు. నిందితునికి ఆశ్రయం కల్పించడంతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని పోలీసుల మలక్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ ఐ రాణా ప్రతాప్ ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శామ్ కోషీ! -
పట్టుబడగానే... మావాడు మంచోడే!
సాక్షి, బంజారాహిల్స్: నాకేం తెలియదు.. మా పిల్లలు చాలా మంచి వారు.. అందులో మా పిల్లలు లేరు.. మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోంది.. ఇలా ఏదైనా ఘటనలో తమ పిల్లలు పట్టుబడగానే ప్రముఖులు నీతి సూక్తులు వల్లె వేస్తుంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాము వరకు పిల్లలు ఇంటికి రాకపోతే ఎక్కడున్నారనే విషయం కూడా కొంత మంది తెలుసుకోవడంలేదు. తీరా ఏదైనా పబ్‌లోనో, రేవ్ పార్టీలోనో, రిసార్ట్స్‌లోనో మద్యం తాగి, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే మాత్రం ఆ ఘటనతో తమకేమీ సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పబ్‌లో రేవ్ పార్టీలో పాల్గొని టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడినవారి కుటుంబ సభ్యులందరు డ్రగ్స్‌తో సంబంధం లేదంటూ ఒకేతీరుగా సమాధానాలు చెప్పారు. ఇక ఓ రాజకీయనేత కుమారుడు పట్టుబడ్డాడంటూ మీడియాలో ప్రసారం కాగానే ఆ కుటుంబం వెంటనే స్పందించి తమవాడు అక్కడ లేడంటూ చెప్పుకొచ్చారు. తీరా చూస్తే మీడియాలో వచ్చిన పేరుతో ఉన్న కొడుకు లేడు కానీ ఆ రాజకీయ నాయకుడి ఇంకో కొడుకు మాత్రం పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఎక్కడ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డా ఇలాగే బుకాయించేస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అదుపు తప్పిన వేగంతో దూసుకొచ్చి ఓ రాజకీయ నాయకుడి తనయుడు ఓ చంటి బిడ్డ ప్రాణాన్ని బలిగొన్న ఘటనలో కూడా ఆ నేత ఆ కారులో తన కొడుకే లేడంటూ గట్టిగా వాదించాడు. తీరా చూస్తే కారులో వెనుక సీటులో ఆ నేత కొడుకు దర్జాగా కూర్చొని ఉన్నాడు. ఇక శివార్లలో రిసార్ట్‌లకు వెళ్తే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇలాంటి గానా బజానాలు, రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు కోకొల్లలు. దొరికిన సందర్భాల్లో ప్రముఖులు తమ పిల్లలను ఇలాగే వెనుకేసుకొస్తున్నారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్గా నాగేశ్వర్రావు బంజారాహిల్స్ నూతన ఇన్స్పెక్టర్గా 2004 బ్యాచ్‌కు చెందిన కె. నాగేశ్వర్రావును నియమిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. గతంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో డీఎస్ఐగా పని చేశారు. బంజారాహిల్స్ సీఐగా పని చేసిన పూసపాటి శివచంద్రను విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన కారణంగా సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో నాగేశ్వర్రావును నియమించారు. -
లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగి
సాక్షి,సారవకోట(శ్రీకాకుళం): మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శి పాగోటి విశ్వేశ్వరరావు మంగళవారం రూ.2వేలు లంచం తీసుకుంటూ అవినీతి ని రోధక శాఖ అధికారులకు ప ట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి తన ఉద్యోగ అవసరం కోసం జనన ధ్రువీకరణ పత్రం కోసం నవంబర్‌లో మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. పాలకొండ ఆర్డీ ఓ నుంచి పత్రం రావాల్సి ఉందని ఆలస్యం చేశారు. ఈ నెల 6న ఆర్డీఓ నుంచి పత్రం తీసుకువచ్చిన పంచాయతీ కార్యదర్శి దాన్ని బాధితుడికి ఇచ్చేందుకు రూ.2వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తర్వాత పంచాయతీ కార్యదర్శి విశ్వేశ్వరరావు సారవకోట మండల పరిషత్‌కు రావాలని అక్కడ ధ్రువీకరణ పత్రం అందజేస్తానని చెప్పడంతో సాయంత్రం 4.50 గంటల సమయంలో బాధితుడు అక్కడకు వెళ్లాడు. అధికారికి రూ.2 వేలు లంచం ఇస్తుండగా అప్పటికే మాటు వేసి ఉన్న ఏ సీబీ అధికారులు విశ్వేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణాపురం పంచాయతీలో 2014 నుంచి పనిచేస్తున్నారని, ఇప్పటికే ఈయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని తెలిపా రు. పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేసి విశాఖపట్నంలో ఏసీబీ కోర్టులో బుధవారం హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: ఫంక్షన్హాల్లో శుభకార్యం.. పోలీసులొస్తున్నారని మేడపై నుంచి దూకి... -
జూబ్లీహిల్స్: పబ్‌లపై టాస్క్‌ఫోర్స్ దాడులు
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని పలు పబ్‌లపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ అర్థరాత్రి వరకు నిర్వహిస్తున్న పబ్బులపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో తబులా రస, ఏయిర్ లైవ్, కెమెస్ట్రీ, అమ్నీసియా పబ్‌లపై దాడులు చేసి వాటిపై కేసులు నమోదు చేశారు. ఇవన్నీ అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్‌ను తేవడం, కోవిడ్ నిబంధనలు పూర్తిగా బేఖాతరు చేయడం, మాస్కులు లేకుండా పబ్బుకు అనుమంతిచడం చేస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే విధానానికి స్వస్తి చెప్పిన పబ్బు యజమానులు.. కాసుల కోసం కక్కుర్తి పడి కరోనా విస్తరణకు కారకులుగా మారుతున్నారని పోలీసులు తెలిపారు. చదవండి: పార్లమెంట్‌లోని బార్లలో పొంగుతున్న బీర్లు -
నకిలీ సీబీఐ అధికారుల హల్చల్ ...
శుక్రవారం ఉదయం 7.30 గంటలు.. సీతమ్మధార కేఎస్ఆర్ కాంప్లెక్స్‌లోనూ, బాలయ్యశాస్త్రి లేఔట్‌లోనూ రెండు ఇళ్లపై సీబీఐ దాడులు జరిగాయి. ఇద్దరు యువకులు వచ్చి తాము సీబీఐ అధికారులమని చెప్పుకున్నారు.. కుటుంబ సభ్యులందరి వద్ద నుంచి ఫోన్లు లాక్కున్నారు. వారందరినీ ఒక రూములోకి పంపించి దాదాపు నిర్బంధించినంత పని చేశారు. ఎవరైనా కదిలినా, వేరే వాళ్లకు సమాచారం అందించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తాము సీబీఐ అధికారులమనీ, తమకు వచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించేందుకు సహకరించాలన్నారు. ఐడీకార్డు చూపించమని అడిగితే.. పాన్ కార్డు చూపించి.. తనిఖీలకు వచ్చినప్పుడు ఐడీ కార్డు చూపించాల్సిన అవసరం లేదని దబాయించారు. దీంతో.. ఇళ్లలోనివారు సైలెంట్ అయిపోయారు. వచ్చినవారు ఇళ్లలోని అణువణువూ జల్లెడ పట్టారు. ప్రతి అంగుళం సోదా చేసి.. మీ ఇంట్లో ఏమీ దొరకలేదంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధితులు.. ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించారు. తీరా చూస్తే.. వారంతా నకిలీ సీబీఐ అధికారులని తేలింది. వారికి ఓ ఆర్ఎస్ఐ సహకరించినట్లు పోలీసుల చేతికి చిక్కిన సీసీటీవీ ఫుటేజీల ద్వారా వెల్లడైంది. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీలో నకిలీ ఏసీబీ అధికారులు దాడులు చేసిన వైనం మరవకముందే.. సీబీఐ అధికారులమంటూ దుండగులు చేసిన తాజా హడావుడి కలకలం సృష్టిస్తోంది. విశాఖసిటీ, విశాఖ క్రైం: నగరంలోని సీతమ్మధార రైతుబజార్ ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ కాంప్లెక్స్ సీ బ్లాక్‌లోని 401 ఫ్లాట్‌లో నివాసముంటున్న దాట్ల వెంకట సూర్యనారాయణేశ్వర జోగి జగన్నాధరాజు ఓ సివిల్ ఇంజినీరింగ్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 7.30 గంటలకు జగన్నాథరాజు పేపర్ చదువుతుండగా ఇద్దరు అపరిచిత యువకులు నేరుగా ఇంట్లోకి ప్రవేశించి సీబీఐ అధికారులమంటూ హల్చల్ చేశారు. ఇంట్లో వారందరినీ.. ఓ గదిలోకి తీసుకెళ్లి ఉంచారు. ఓ గదిలో అనారోగ్యంతో బాధపడుతున్న జగన్నాథరాజు తల్లి ఉన్నారు. ఆమె వద్దకు వెళతామని చెప్పినా వారు అంగీకరించలేదు. దాదాపు గంట సేపు తనిఖీల పేరుతో హడావుడి చేశారు. అన్ని గదుల్లో ఉన్న సూట్‌కేసులు, అల్మరాలు మొత్తం సోదాలు చేసి సామాన్లు చిందరవందరగా పడేసి ఏమీ దొరకలేదని వెళ్లిపోయారు. కిందికి వచ్చి చూడగా.. పోలీస్ అని రాసి ఉన్న ఏపీ35డీడీ1533 నంబర్ గల కారులో వెళ్లిపోతూ కనిపించారు. ఈ హఠాత్పరిణామంతో జగన్నాథరాజు తల్లి మరింత అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుడు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును ఆశ్రయించగా శుక్రవారం ద్వారకానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టగా.. కేఎస్ఆర్ కాంప్లెక్స్‌లో అమర్చి ఉన్న సీసీటీవీల్లో నకిలీ సీబీఐ అధికారుల కదలికలు కనిపించాయి. వారికోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. వీరితో పాటు వచ్చిన పోలీస్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి ఓ రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్గా పోలీసులు గుర్తించారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని ద్వారకానగర్ పోలీసులు విచారించగా.. తన స్నేహితుడు తనతో పాటు రమ్మని కేఎస్ఆర్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారని, పైన ఏం జరిగిందనేది తనకు తెలీదని ఆయన చెప్పినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ద్వారకానగర్ సీఐ రాంబాబు తెలిపారు. గంట తర్వాత మరోచోట కాగా అక్కడికి గంట తర్వాత బాలయ్యశాస్త్రి లే అవుట్‌లోనూ ఇదే మాదిరిగా అపరిచితులు సోదాల పేరుతో హల్చల్ చేశారు. గీతికా అపార్ట్మెంట్లో నివాసముంటున్న పేరిచర్ల ప్రసాదరాజు ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ అధికారులమంటూ వెళ్లి సోదాలు నిర్వహించారు. దాదాపు గంట పాటు సోదాలు చేసిన అనంతరం.. పొరపాటున వచ్చామంటూ వేగంగా వెళ్లిపోయారనీ.. బాధితుడు ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ తిరుమలరావు తెలిపారు.రెండు నెలల క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులమంటూ కొంతమంది వ్యక్తులు దాడులు నిర్వహించిన ఘటన కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో మరోసారి నగరంలో నకిలీ సీబీఐ దాడులు అలజడి రేపుతున్నాయి. -
తవ్వేకొద్దీ అక్రమాస్తులు
విశాఖ క్రైం: ఏసీబీ అధికారులు తవ్వేకొద్దీ అవినీతి జలగల అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీఆర్వోలు కాండ్రేగుల సంజీవ్‌కుమార్, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జీవీఎంసీ అధికారి మునికోటి నాగేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేసి అక్రమాస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి అక్రమార్జనపై అధికారులు మరింత లోతుగా దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా సంజీవ్‌కుమార్ బినామీలు బగ్గు సుబ్రహ్మణ్య మల్లిఖార్జునరావు, సామ ఉదయనాగరాజును ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐలు గణేష్, అప్పారావు ఆదివారం ఉదయం నుంచి విచారించారు. విచారణలో కీలకమైన ఒక ల్యాప్‌టాప్ స్వాధీనపరుచుకున్నారు. ఇప్పటికే వీరి అక్రమార్జన రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని అధికారులు గుర్తించారు. తాజాగా గుర్తించిన అక్రమాస్తులివీ - సంజీవ్‌కుమార్ బినామీగా వ్యవహరించిన బగ్గు సుబ్రహ్మణ్య మల్లిఖర్జురావు(ఒకప్పుడు బిల్డర్) పేరు మీద ఆదిత్యవర్థన్ డెవలప్మెంట్ అనే సంస్థ పేరిట కొత్తవలస సమీప గంగువాడ గ్రామంలో 200 ఎకరాలు వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. - సుమారు రూ.ఆరు కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరిగినట్లు లాప్‌ట్యాప్‌లో గుర్తించారు. దీంతో లాప్‌ట్యాప్‌ను సీజ్ చేశారు. - చెతన్యనగర్లో ఉన్న శ్రీసాయి ఆదిత్య నిలయం –1లోని 303 ప్లాట్ పి.విజయ పేరు మీద ఉంది. అయితే ఈ ప్లాట్‌లో సోమవారం సోదాలు చేయనున్నారు. సంజీవ్‌కుమార్ అక్రమార్జనకు తతంగం అంతా ఇక్కడి నుంచే జరిగిందని అధికారులు భావిస్తున్నారు. - రెల్వే న్యూ కాలనీలో సుజన కనస్ట్రక్షన్ పేరు మీద బినామీలతో సంజీవ్‌కుమార్ అక్రమ వ్యాపారం నడిపిస్తున్నాడు. - అదేవిధంగా సంజీవ్‌కుమార్ వినియోగిస్తున్న కారులో నుంచి పలు విలువైన డాక్యుమెంట్లతోపాటు పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. - ఎన్టీపీసీ వద్ద సంజీవ్‌కుమార్ పేరు మీద ఒక ఎకరం భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. - సంజీవ్‌కుమార్ వద్ద ఉన్న ఫిస్టల్ బటన్ నొక్కితే రెగ్యులర్‌గా మంటలు వస్తున్నాయి. ఈ ఫిస్టల్తోపాటు బటన్ చాకు స్వాధీనం చేసుకున్నారు. - మునికోటి నాగేశ్వరరావు భార్య పేరుమీద ఆమె తల్లిదండ్రులు కానుకగా 339 గజాల స్థలం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.10 కోట్లు ఉంటుందని నిర్థారించారు. - అదేవిధంగా అతని బావమరిది యాసిడ్ శ్రీను వద్ద సుమారు రూ.85 లక్షలు విలువచేసే ఆస్తులు గుర్తించారు. లాకర్లలో భారీగా అక్రమాస్తులు! సంజీవ్‌కుమార్‌కు సంబంధించిన బ్యాంక్ లాకర్లు ఎస్బీహెచ్, ఐఓబీ, ఆంధ్రాబ్యాంక్, కో ఆపరేటివ్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్‌లలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటిని సోమవారం తెరవనున్నారు. ఇవి తెరిస్తే మరిన్ని అక్రమాస్తులకు సంబంధించిన వివరాలు, బంగారు ఆభరణాలు వెలుగుచూసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వీఆర్వో పోలిశెట్టి వెంకటేశ్వరావుకు సంబంధించి ఎన్ఏడీలోని యాక్సెస్ బ్యాంక్‌లో ఉన్న లాకర్లు తెరిచారు. అందులో 790 గ్రాముల బంగారం, కిలో వెండి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మార్చి 16 వరకు రిమాండ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన కేసులో అరెస్ట్ అయిన వీఆర్వోలు సంజీవ్‌కుమార్, వెంకటేశ్వరావు, జీవీఎంసీ విద్యుత్ విభాగం మజ్దూర్ ఉద్యోగి నాగేశ్వరరావులను శనివారం శనివారం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి ఆదివారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 16వరకు వీరికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అయితే సంజీవ్‌కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు ఆయనకు బీపీ పెరగడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంకోజీపాలెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రిమాండ్‌కు తరలిస్తారు. సంజీవ్‌కుమార్ బినామీ సుబ్రహ్మణ్య మల్లికార్జునరావును విచారిస్తున్న సీఐ అప్పారావు -
సంకటంలో సెంథిల్
అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. కోట్లాది రూపాయల మేరకు పన్ను చెల్లించకుండా మోసానికి పాల్పడ్డట్టుగా ఆదాయ పన్నుశాఖ వర్గాలు గుర్తించినట్టు సమాచారం. సోదాల్లో పెద్ద ఎత్తున బంగారం, నోట్ల కట్టలు బయటపడ్డట్టుగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నాలుగో రోజు విచారణ ముగించిన అధికారులు 35 మందికి సమన్లు జారీచేయడానికి తగ్గ కసరత్తులో ఉన్నట్టు సమాచారం. సాక్షి, చెన్నై: మాజీ మంత్రి, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని గురిపెట్టి సాగుతున్న ఐటీ దాడుల గురించి తెలిసిందే. రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో ఒకే వ్యక్తిని గురిపెట్టి ఏకంగా నాలుగు రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ వర్గాలు దాడులు నిర్వహించడం గమనించదగ్గ విషయం. నిన్నటివరకు కరూర్ జిల్లాలో ముప్ఫై చోట్ల ఆదాయ పన్ను శాఖవర్గాలు తనిఖీలు సాగించాయి. నాలుగో రోజు ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి. సెంథిల్ బాలాజీకి అత్యంత సన్నిహితులుగా ఉన్న మిత్రులు, కళాశాలల అధిపతి, పలు సంస్థలకు యజమాని, కాంట్రాక్టర్లు త్యాగరాజన్, నవరంగ్ సుబ్రమణియన్, శంకర్ల చుట్టూ నాలుగో రోజు విచారణ సాగాయి. ఇందులో శంకర్‌కు చెందిన కార్యాలయాన్ని ఏకంగా అధికారులు సీజ్ చేయడం చర్చకు దారితీసింది. రూ.వంద కోట్లకు పైగా పన్ను ఎగవేత ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సెంథిల్ బాలాజీ మరింత సంకట పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లల్లో మొత్తంగా 35 చోట్ల దాడులు నిర్వహించారు. ఇందులో కోట్లాది రూపాయల మేరకు పన్ను ఎగవేత వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. వంద కోట్ల మేరకు ఎగవేసి ఉండవచ్చని భావిస్తున్నా, దానిని దాటే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అలాగే, మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అక్రమార్జనగా వచ్చిన రూ.ఐదు కోట్లకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, రూ.1.20 కోట్ల నగదుతో పాటు బంగారు ఆభరణాలను సైతం ఈ దాడుల్లో ఐటీ వర్గాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆదివారం నాటికి విచారణను ముగించిన అధికారులు , పెద్దఎత్తున తమకు లభించిన వాటన్నింటినీ వాహనాల్లో తరలించారు. ఇక, సెంథిల్ మిత్రుడు శంకర్ కార్యాలయం నుంచి రెండు సూట్‌కేసులను తీసుకెళ్లడంతో అందులో నోట్ల కట్టలు ఉన్నట్టు సమాచారం. బిగుస్తున్న ఉచ్చు ప్రస్తుతానికి అధికారులు దాడుల్ని ముగించినా, విచారణ కొనసాగించే విధంగా ఐటీ వర్గాలు పరుగులు తీస్తుండడంతో సెంథిల్ బాలాజీ మెడకు ఉచ్చు రోజురోజుకు బిగిసే అవకాశాలు ఎక్కువే. ప్రస్తుతం దాడులు జరిగిన ప్రాంతాల్లో లభించిన వాటన్నింటికి వివరాలు, ఆధారాలను సేకరించే విధంగా విచారణ సాగనున్నట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం ఆయా ప్రాంతాలకు చెందిన ముప్ఫై ఐదు మందిని విచారించేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా సెంథిల్ బాలాజీ సన్నిహితులు ముగ్గుర్ని తొలుత తమ విచారణ పరిధిలోకి తీసుకొచ్చి విధంగా సమన్లు సిద్ధం చేస్తుండడం గమనార్హం. అలాగే, సెంథిల్ బాలాజీకి సైతం సమన్లు జారీ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. కాగా, పెద్ద ఎత్తున నగదు, నగలు పట్టుబడిన నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు, గతంలో సాగిన అవినీతిపై ఏసీబీ దృష్టి సారించి, సెంథిల్‌ను కటకటాల్లోకి నెట్టే రీతిలో దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. -
ఛాయ్ వాలా మొత్తం ఆస్తులు రూ.400కోట్లు
-
ఛాయ్ వాలా మొత్తం ఆస్తులు రూ.400కోట్లు
సూరత్: డిమానిటైజేషన్ తరువాత సూరత్ లో వడ్డీ వ్యాపారి , మనీ లాండరింగ్ కింగ్ కిషోర్ భాజీవాలా ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులే షాకయ్యారు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన అవినీతి తిమింగలం కూడబెట్టిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లకు చేరింది. వడ్డీవ్యాపారిగా అవతరించిన టీ బజ్జీలు అమ్ముకునే వ్యక్తి ఆదాయం ఇంత భారీగా ఉండడం ఆదాయ పన్ను అధికారులను సైతం విస్మయ పరిచింది. ఆదాయ పన్ను అధికారులు తాజాగా ఆయన ఇంటిపై చేసిన సోదాల్లో మరో రూ. 150 కోట్ల విలువైన ఆస్తులు పట్టుబడ్డాయి. సుమారు రూ. 1.33 కోట్లను నగదును రికవరీ చేసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ఇందులో రూ.95 లక్షల విలువైన కొత్త రెండు వేల నోట్లు ఉన్నాయి. దీంతోపాటుగా రూ.7 కోట్ల విలువగల బంగారు ఆభరణాలు, రూ.72 లక్షల విలువైన వెండిని స్వాధీనం చేసుకున్నారు. (5కేజీల బంగారం బిస్కట్లు, 8 కేజీల బంగారు ఆభరణాలు, కేజీ డైమండ్ నగలు) రూ. 4.50 లక్షల కిసాన్ వికాస పత్రాలు, బంగ్లా, ఫ్లాట్స్, ఇళ్లు, షాపు లు సహా వ్యవసాయ భూమి సుమారు 70 ఆస్తుల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం విలువ సుమారు నాలుగువందల కోట్లని అధికారులు అంచనావేశారు. పెద్దనోట్ల రద్దు ప్రకటించిన మరుసటి రోజు సూరత్ లోని ఉధానా బ్యాంకుకు భారీ సంచులతో రావడం సీసీటీవీలో రికార్డు అయింది. దీనిపై విచారణ సందర్భంగా సదరు వ్యక్తి సమాధానం చెప్పడంలో విఫలం కావడం ఐటి అధికారులు ఆయన ఇంటిపై సోదారు నిర్వహించారు. సూరత్ పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్, బరోడా, హెచ్ డీఎఫ్ సీ తదితర బ్యాంకుల్లో 30కి పైగా బ్యాంకు అకౌంట్లు, 16 లాకర్లు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సేర్లతో ఈ నకిలీ ఖాతాలు, లాకర్లను ఆపరేట్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు. విచారణ నిమిత్తం అక్రమ ఖాతాలను సీజ్ చేసినట్టు చెప్పారు. మరోవైపు రాష్ట్ర మంత్రి,బీజేపీ నేత పురుషోత్తం రూపాలను అభినందిస్తున్న ఫోటో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఐటీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం 31 సం.రాల క్రితం సౌరాష్ట్ర నుంచి ఉద్నాగాంకి వలస వచ్చిన కిషోర్ భాజియావాలా ఓ చిన్న, టీస్టాల్ ద్వారా జీవనం మొదలు పెట్టారు. ఆతరువాత బజ్జీల అమ్మడం మొదలు పెట్టాడు. అలా మెల్లిగా వడ్డీ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. స్థానిక రాజకీయనాయకులు, పో్లీసు అధికారులతో సన్నిహిత సంబంధాలున్న ఈయన రుణం తిరిగి చెల్లించనివారిపై బెదరింపులకు పాల్పడేవారిని తెలిపారు. ఈ క్రమంలోరుణాలు చెల్లించలేని వారిదగ్గరనుండి ఆస్తులను లాక్కొనేవాడు. ఈక్రమంలోబ ఇతని నెలవారీ ఆదాయం 7.5కోట్లని విచారణలో తెలిపింది. వీటికితోడు 4.5 కోట్లు వడ్డీ రూపంలో వస్తుండగా, వివిధ ఆస్తుల మీద అ ద్దెరూపంలో మరో 3కోట్లు ఆదాయం. 150 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలతో కలిపి మొత్తం అక్రమ సంపద నాలుగువందల కోట్లకుచేరింది. మరోవైపు తమ సంవత్సర ఆదాయాన్నిరూ.1.5కోట్లుగా ఐటీ రికార్డులో చూపించడం విశేషం. డిసెంబర్ 13న మొదలైన ఈ ఐడీ దాడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
లక్ష్మణ్‌రావు ఇంట్లో రెండోరోజూ సోదాలు
► ‘రూ.10 వేల కోట్ల’ వెల్లడికి కారణాలపై ఆరా ►48 డాక్యుమెంట్ల స్వాధీనం ►కంపెనీలన్నీ బోగస్ అని వెల్లడి హైదరాబాద్: ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద తన వద్ద సుమారు రూ.10 వేల కోట్ల సంపద ఉన్నట్లు వెల్లడించిన బాణపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో ఐటీ అధికారులు బుధవారం రెండోరోజూ విసృ్తతంగా సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకే ఫిలిం నగర్‌లోని ఆయన నివాసానికి రెండు బృందా లుగా వచ్చిన అధికారులు తొలుత లక్ష్మణ్‌రావు తోపాటు ఆయన భార్య రమాదేవిని విచారిం చారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్లీ వచ్చి ఆయన కుమారులను విచారించారు. రూ.10 వేల కోట్లు వెల్లడించడానికి గల కార ణాలపై లక్ష్మణ్‌రావును ప్రశ్నించారు. ఇంట్లో ప్రతి అంగుళం సోదా చేశారు. సుమారు 48 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తాండూరుకు చెందిన ఓ పరిశ్రమ డాక్యుమెంట్లు, బీబీనగర్‌లో బీఎల్ఆర్ వెంచ ర్స్ డాక్యుమెంట్లు, తార్నాకలో రెండు భవనా ల పత్రాలు వెలుగు చూశాయి. లక్ష్మణ్‌రావు స్థాపించిన కంపెనీలన్నీ 2014లోనే ప్రారంభం కావడం, ఇప్పటి వరకు చెల్లించిన ఆదాయ పన్ను వివరాలపై ప్రశ్నించారు. ఆయన భార్య రమాదేవి, కొడుకులు ప్రమోద్, వెంకట సతీశ్‌లతో పాటు, ఇంట్లో పని మనుషులు, డ్రైవర్లను కూడా వివిధ అంశాలపై విచారించారు. అయితే ఈ విచారణలో అధికారులకు కావాల్సిన సమాచారం లభించలేదని తెలిసింది. లక్ష్మణ్‌రావు వెనక ఎవరైనా పెద్ద మనిషి ఉన్నారా అన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. పలు కంపెనీలకు సంబంధించి ఆయన వెల్లడించిన అడ్రస్‌లన్నీ బోగస్‌వేనని తేలిపోయింది. ఆయనెవరో స్థానికులకే తెలియదు ఐటీ సోదాలతో వెలుగులోకి వచ్చిన లక్ష్మణ్‌రావు ఇప్పటి వరకు స్థానికులకు కూడా తెలియకపోవడం గమనార్హం. గతంలో రామంతపూర్ విశాల్ మెగా మార్కెట్ వెనుక ఉన్న అపార్ట్మెంట్ యమున బ్లాక్‌లోని 410 ఫ్లాట్‌లో లక్ష్మణ్‌రావు కొన్నాళ్లు అద్దెకున్నారు. అనంతరం బంజారాహిల్స్‌కు మకాం మార్చారు. గత అక్టోబర్‌లో ఫిలింనగర్లో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని కొనుగోలు చేశారు. చార్మినార్ బ్యాంకు చైర్మన్ మీర్ ఆగా పేరిట ఈ ఇల్లు ఉంది. ఆగా గతంలోనే దుండగుల కాల్పుల్లో మృతి చెందగా ఆయన భార్య షమీమ్ ఆగా మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఈ ఇంటిని లక్ష్మణ్‌రావుకు విక్రయించారు. ఈ ఇల్లు లక్ష్మణ్‌రావుతో పాటు భార్య రమాదేవి, ఇద్దరి కొడుకుల పేరిట రిజిస్టర్ అయి ఉంది. -
ఇండియాబుల్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు
బినామీ లావాదేవీలు, పన్ను ఎగవేతపై సందేహాలు న్యూఢిల్లీ: భారీగా పన్ను ఎగవేసినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండియాబుల్స్ గ్రూపునకు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు బుధవారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. వందల సంఖ్యలో ఐటీ అధికారులు, స్థానిక పోలీసులతో కలసి బృందాలుగా ఏర్పడి ముంబై, ఢిల్లీ, చెన్నైలోని ఇండియాబుల్స్ గ్రూపునకు చెందిన పలు కంపెనీల ప్రాంగణాల్లో ఏక కాలంలో సోదాలు చేపట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సోదాలు ఎక్కువ భాగం ముంబై కార్యాలయంలోనే జరిగాయి. ఇండియాబుల్స్ సంస్థ తీసుకున్న రూ. 1,700 కోట్ల కార్పొరేట్ రుణం కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగాయని, అయితే రూ.1,500 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్టు సందేహాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి అలాగే, గతంలో ఇండియాబుల్స్ నిర్వహించిన ఆస్తుల అమ్మకాల్లో రూ.1,000 కోట్ల విలువ మేర బినామీ లావాదేవీలు సైతం జరిగాయన్న సందేహాలు ఉన్నట్టు ఆ అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఐటీ దాడులను ఇండియాబుల్స్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా ధ్రువీకరించింది. గతేడాది రూ.782కోట్ల మేర ఆదాయపన్ను, రూ.372కోట్ల మేర సేవాపన్ను చెల్లించినట్టు తెలిపింది. షేర్లు కుదేలు: ఐటీ దాడుల వార్తలతో ఇండియాబుల్స్ వెంచర్స్ 6.86% నష్టంతో 31.90 వద్ద ముగి సింది. ఇండియాబుల్స్ హోల్‌సేల్ సర్వీసెస్ కూడా 4.89% నష్టంతో రూ.28.20వద్ద క్లోజ్ కాగా... ఇండియాబుల్స్ రియల్ఎస్టేట్ 4.23% నష్టంతో రూ. 91.65 వద్ద, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.89 శాతం నష్టంతో రూ.714.40కు దిగివచ్చాయి. -
తప్పు ఒప్పుకున్న కంపెనీ...విస్తృత దాడులు
టోక్యో: జర్మనీకి చెందిన కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కుంభకోణం తరహాలో మరో కార్ల కంపెనీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో జపాన్ కు చెందిన మిత్సుబిషి మోటార్స్ కంపెనీ ఫ్యుయల్ ఎకానమీ డాటా విడుదలలో అక్రమాలకు పాల్పడినట్టు ఒప్పుకుంది. తప్పుడు నివేదికలు అందించినట్లు ఆ కంపెనీ అంగీకరించింది. ఈ వ్యవహారంపై స్పందించిన జపాన్ అధికారులు దాడులు నిర్వహించారు. ఒకజాకి నగరంలో ఉన్న ఆ కంపెనీ ప్రధాన ప్లాంట్‌లో గురువారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వాహన మైలేజ్ అంశంలో డేటాను తమ ఉద్యోగులు మార్చినట్లు మిత్సుబిషి సంస్థ అంగీకరించింది. సుమారు 60వేల వాహనాలకు అలా చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రమైన కేసుగా పరిగణిస్తున్నామని ప్రభుత్వాధికారులు తెలిపారు. మైలేజ్ టెస్టింగ్‌లో చూపించిన తప్పుడు రిపోర్టులకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని కంపెనీని సూచించారు. ఏప్రిల్ 27వ తేదీలోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అయితే సోదాల ద్వారా వెల్లడైన వాస్తవాలను పరిశీలించిన తర్వాత మొత్తం ఎన్ని వాహనాలకు తప్పుడు నివేదికలు ఇచ్చారో స్పష్టం చేయనున్నట్లు ఆ దేశ క్యాబినెట్ సెక్రటరీ తెలిపారు. కార్ల భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.