లక్ష్మణ్‌రావు ఇంట్లో రెండోరోజూ సోదాలు | Laxman Rao house raided the second day | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్‌రావు ఇంట్లో రెండోరోజూ సోదాలు

Published Thu, Dec 8 2016 2:45 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

లక్ష్మణ్‌రావు ఇంట్లో రెండోరోజూ సోదాలు - Sakshi

లక్ష్మణ్‌రావు ఇంట్లో రెండోరోజూ సోదాలు

‘రూ.10 వేల కోట్ల’ వెల్లడికి కారణాలపై ఆరా
48 డాక్యుమెంట్ల స్వాధీనం
కంపెనీలన్నీ బోగస్ అని వెల్లడి

హైదరాబాద్: ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద తన వద్ద సుమారు రూ.10 వేల కోట్ల సంపద ఉన్నట్లు వెల్లడించిన బాణపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో ఐటీ అధికారులు బుధవారం రెండోరోజూ విసృ్తతంగా సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకే ఫిలిం నగర్‌లోని ఆయన నివాసానికి రెండు బృందా లుగా వచ్చిన అధికారులు తొలుత లక్ష్మణ్‌రావు తోపాటు ఆయన భార్య రమాదేవిని విచారిం చారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్లీ వచ్చి ఆయన కుమారులను విచారించారు. రూ.10 వేల కోట్లు వెల్లడించడానికి గల కార ణాలపై లక్ష్మణ్‌రావును ప్రశ్నించారు. ఇంట్లో ప్రతి అంగుళం సోదా చేశారు. సుమారు 48 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తాండూరుకు చెందిన ఓ పరిశ్రమ డాక్యుమెంట్లు, బీబీనగర్‌లో బీఎల్‌ఆర్ వెంచ ర్స్ డాక్యుమెంట్లు, తార్నాకలో రెండు భవనా ల పత్రాలు వెలుగు చూశాయి.

లక్ష్మణ్‌రావు స్థాపించిన కంపెనీలన్నీ 2014లోనే ప్రారంభం కావడం, ఇప్పటి వరకు చెల్లించిన ఆదాయ పన్ను వివరాలపై ప్రశ్నించారు. ఆయన భార్య రమాదేవి, కొడుకులు ప్రమోద్, వెంకట సతీశ్‌లతో పాటు, ఇంట్లో పని మనుషులు, డ్రైవర్లను కూడా వివిధ అంశాలపై విచారించారు. అయితే ఈ విచారణలో అధికారులకు కావాల్సిన సమాచారం లభించలేదని తెలిసింది. లక్ష్మణ్‌రావు వెనక ఎవరైనా పెద్ద మనిషి ఉన్నారా అన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. పలు కంపెనీలకు సంబంధించి ఆయన వెల్లడించిన అడ్రస్‌లన్నీ బోగస్‌వేనని తేలిపోయింది.

ఆయనెవరో స్థానికులకే తెలియదు
ఐటీ సోదాలతో వెలుగులోకి వచ్చిన లక్ష్మణ్‌రావు ఇప్పటి వరకు స్థానికులకు కూడా తెలియకపోవడం గమనార్హం. గతంలో రామంతపూర్ విశాల్ మెగా మార్కెట్ వెనుక ఉన్న అపార్ట్‌మెంట్ యమున బ్లాక్‌లోని 410 ఫ్లాట్‌లో లక్ష్మణ్‌రావు కొన్నాళ్లు అద్దెకున్నారు. అనంతరం బంజారాహిల్స్‌కు మకాం మార్చారు. గత అక్టోబర్‌లో ఫిలింనగర్‌లో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని కొనుగోలు చేశారు. చార్మినార్ బ్యాంకు చైర్మన్ మీర్ ఆగా పేరిట ఈ ఇల్లు ఉంది. ఆగా గతంలోనే దుండగుల కాల్పుల్లో మృతి చెందగా ఆయన భార్య షమీమ్ ఆగా మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఈ ఇంటిని లక్ష్మణ్‌రావుకు విక్రయించారు. ఈ ఇల్లు లక్ష్మణ్‌రావుతో పాటు భార్య రమాదేవి, ఇద్దరి కొడుకుల పేరిట రిజిస్టర్ అయి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement