సాక్షి,సారవకోట(శ్రీకాకుళం): మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శి పాగోటి విశ్వేశ్వరరావు మంగళవారం రూ.2వేలు లంచం తీసుకుంటూ అవినీతి ని రోధక శాఖ అధికారులకు ప ట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి తన ఉద్యోగ అవసరం కోసం జనన ధ్రువీకరణ పత్రం కోసం నవంబర్‌లో మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. పాలకొండ ఆర్డీ ఓ నుంచి పత్రం రావాల్సి ఉందని ఆలస్యం చేశారు. ఈ నెల 6న ఆర్డీఓ నుంచి పత్రం తీసుకువచ్చిన పంచాయతీ కార్యదర్శి దాన్ని బాధితుడికి ఇచ్చేందుకు రూ.2వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
తర్వాత పంచాయతీ కార్యదర్శి విశ్వేశ్వరరావు సారవకోట మండల పరిషత్‌కు రావాలని అక్కడ ధ్రువీకరణ పత్రం అందజేస్తానని చెప్పడంతో సాయంత్రం 4.50 గంటల సమయంలో బాధితుడు అక్కడకు వెళ్లాడు. అధికారికి రూ.2 వేలు లంచం ఇస్తుండగా అప్పటికే మాటు వేసి ఉన్న ఏ సీబీ అధికారులు విశ్వేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణాపురం పంచాయతీలో 2014 నుంచి పనిచేస్తున్నారని, ఇప్పటికే ఈయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని తెలిపా రు. పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేసి విశాఖపట్నంలో ఏసీబీ కోర్టులో బుధవారం హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.
చదవండి: ఫంక్షన్‌హాల్‌లో శుభకార్యం.. పోలీసులొస్తున్నారని మేడపై నుంచి దూకి...
Comments
Please login to add a commentAdd a comment