panchayat secreatary
-
లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగి
సాక్షి,సారవకోట(శ్రీకాకుళం): మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శి పాగోటి విశ్వేశ్వరరావు మంగళవారం రూ.2వేలు లంచం తీసుకుంటూ అవినీతి ని రోధక శాఖ అధికారులకు ప ట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి తన ఉద్యోగ అవసరం కోసం జనన ధ్రువీకరణ పత్రం కోసం నవంబర్‌లో మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. పాలకొండ ఆర్డీ ఓ నుంచి పత్రం రావాల్సి ఉందని ఆలస్యం చేశారు. ఈ నెల 6న ఆర్డీఓ నుంచి పత్రం తీసుకువచ్చిన పంచాయతీ కార్యదర్శి దాన్ని బాధితుడికి ఇచ్చేందుకు రూ.2వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తర్వాత పంచాయతీ కార్యదర్శి విశ్వేశ్వరరావు సారవకోట మండల పరిషత్‌కు రావాలని అక్కడ ధ్రువీకరణ పత్రం అందజేస్తానని చెప్పడంతో సాయంత్రం 4.50 గంటల సమయంలో బాధితుడు అక్కడకు వెళ్లాడు. అధికారికి రూ.2 వేలు లంచం ఇస్తుండగా అప్పటికే మాటు వేసి ఉన్న ఏ సీబీ అధికారులు విశ్వేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణాపురం పంచాయతీలో 2014 నుంచి పనిచేస్తున్నారని, ఇప్పటికే ఈయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని తెలిపా రు. పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేసి విశాఖపట్నంలో ఏసీబీ కోర్టులో బుధవారం హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: ఫంక్షన్హాల్లో శుభకార్యం.. పోలీసులొస్తున్నారని మేడపై నుంచి దూకి... -
9 నెలలు.. 40 మందికి ‘షోకాజ్’లు..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని, వాటిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేర్చడంతోపాటు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు మాత్రం పనిభారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జగిత్యాల జిల్లాలో 380 గ్రామ పంచాయతీలకు గాను 380 మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. వీరు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రామాల్లోనే ఉంటూ పరిశుభ్రత, పాలనలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. కానీ చిన్నపాటి తప్పిదాలకే షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత 9 నెలల కాలంలో 40 మందికి జారీ చేశారు. దీంతో కార్యదర్శులు విధులు నిర్వహించేందుకు జంకుతున్నారు. జీపీ కార్యదర్శులు చేసే పనులివే.. జీపీ కార్యదర్శులు నిత్యం గ్రామాల్లో ఉంటూ శానిటేషన్‌తోపాటు హరితహారం, పల్లెప్రగతి, ఉపాధిహామీ, ఇంకుడు గుంతలు, వర్మికంపోస్ట్‌ల షెడ్లు, రైతు కల్లాల నిర్మాణం తదితర పనులు చేయిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన ప్రతీ పనిని ఫొటో తీసి, పీఎస్ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఫలితంగా తీవ్రంగా మానసికఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. రికార్డుల కస్టోడియన్‌తో తలనొప్పి.. గ్రామాల్లో రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత పనులు సక్రమంగా నిర్వహించడం లేదని ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో వారు ఆ నోటీసులకు సమాధానాలు ఇస్తూ రికార్డుల కస్టోడియన్ వంటి పనుల్లో తలమునకలవుతున్నారు. జీపీ కార్యదర్శులకు చెక్‌పవర్ లేకున్నా నిధుల దుర్వినియోగంలో రికార్డులు కస్టోడియన్ బాధ్యత ఉండటంతో వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముగ్గురి సస్పెన్షన్.. గతంలో జాబితాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా పని చేసిన శ్రీవాణి ఎంబీ రికార్డులు లేకుండానే నిధులు డ్రా చేసేలా అవకాశం ఇచ్చారని ఆమెను సస్పెండ్ చేశారు. అలాగే ధర్మపురిలో పనిచేసిన చంద్రశేఖర్ 2018లో ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ఇంటి నంబరు ఇచ్చారని, నెల రోజుల క్రితం సస్పెండ్ చేశారు. ధర్మపురి మండలం జైన పంచాయతీ నిధుల దుర్వినియోగంలో కార్యదర్శి మహబూబ్ పాషా, సర్పంచ్, ఉపసర్పంచ్ సస్పెండ్ అయ్యారు. చదవండి: తెలుగు అకాడమీలో రూ.64 కోట్ల గోల్మాల్.. -
కోట్లకు పడగెత్తిన పంచాయతీ కార్యదర్శి.. ఆస్తి ఎంతో తెలిస్తే షాక్!
విశాఖ క్రైం: శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి, రణస్థలం మండలంలో గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆగూరు వెంకటరావు ఇంటిపై శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు అతనితో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ డీవీఎస్ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది శ్రీకాకుళం, విజయనగరంతో పాటు విశాఖలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో రూ.35,67,100 నగదు, రూ.17,65,373 విలువైన 669 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువైన భూముల డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా అరసాడ గ్రామానికి చెందిన ఆగూరు వెంకటరావు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు. అక్కడ నుంచి ప్రస్తుతం గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శిగానే కాకుండా ఇన్చార్జి ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు విజయనగరం, రాజాం, నెల్లిమర్ల ప్రాంతాల్లో ఉన్న వెంకటరావుతో పాటు అతని కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విశాఖలోని రామా టాకీస్ డౌన్లోని వెజిటబుల్ మార్కెట్ దరి సువర్ణ రెసిడెన్సీలో రెండో అంతస్తులో వెంకటరావు నివాసం ఉంటున్న 202 ప్లాట్‌లో అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో అక్రమాస్తుల విలువ రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. అయితే అతని ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ ధర సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ భాస్కర్‌రావు, హరి, మహేష్, ఎస్ఐ చిన్నంనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఆగూరు వెంకటరావును అరెస్ట్ చేసినట్టు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ డీవీఎస్ఎస్ రమణమూర్తి తెలిపారు. అతన్ని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలిస్తామన్నారు. చదవండి: ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ మానవత్వం చూపించిన వీఆర్వో -
ఉద్యోగమే నా చావుకు కారణం
జోగిపేట(అందోల్): సంగారెడ్డి జిల్లాలో ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్కల్ మండలం ఇసోజిపేటకు చెందిన ఎం.జగన్నాథ్ మిన్పూర్ గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అనేక ఒత్తిడులు, అవమానాలు భరించలేక ‘నా చావుకు నా ఉద్యోగమే కారణం’అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ‘నేను పనిచేస్తున్న గ్రామానికి చెందిన నాయకులు పలువురికి మద్యం తాగించి నాతో గొడవకు ఉసిగొల్పుతున్నారు. వాళ్ల చిల్లర రాజకీయాలు భరించలేకపోయాను. గ్రామ ఇన్చార్జి సర్పంచ్, 7వ వార్డు సభ్యుడు తమకు సహకరించలేదని, చాలా వేధింపులకు గురి చేశారు. మార్చి 3న ఉద్యోగానికి రాజీనామా చేస్తూ అధికారులకు లేఖ ఇచ్చాను. తోటి ఉద్యోగులు, అధికారులు నచ్చచెప్పడం.. అలాగే ఉద్యోగం చేయకుండా ఇంటి దగ్గరే ఉంటే అమ్మానాన్నలకు బాధ కలుగుతుందని భావించి మళ్లీ విధుల్లో చేరాను. అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నా డు. ‘ఏపీవో నన్ను కుక్కలా తిప్పుకున్నారే కానీ, ఫిబ్రవరి 22 నుంచి 27వ తేదీ వరకు చేయించిన పనులకు పేమెంట్స్ ఇవ్వలేదు. నర్సరీ పనులకు, బ్యాగ్ ఫిల్లింగ్, పోల్స్ ఫిట్టింగ్, నర్సరీలోని లేబర్‌కు, ఆడిటింగ్‌లకు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. నా చావుతోనైనా సమస్యలు పరిష్కరించాలి. నాకు బతకాలని ఉన్నా, ఇలా బతకడం నావల్ల కావడం లేదు’అంటూ సూసైడ్ నోట్ ముగించాడు. అధైర్యపడొద్దు... పంచాయతీ కార్యదర్శులు అధైర్యపడవద్దు. సమస్యలుంటే ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందాం. గ్రామా ల్లో రాజకీయంగా ఇబ్బందులుంటే అధి కారుల దృష్టికి తీసుకెళ్లాలి. జగన్నాథ్ ఆత్మహత్య చాలా బాధాకరం. –ఎస్.రమేశ్, జిల్లా కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు -
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ
సాక్షి, మంగపేట: మండలంలోని రాజుపేట పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని కారోబార్ ఫోర్జరీ చేసి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. రాజుపేట పంచాయతీ సెక్రటరీ మానస 2020 జూలై 4 నుంచి 15 రోజుల పాటు సెలవులో ఉండగా కారోబార్ గడ్డిపాటి మహేష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి రాజుపేట పంచాయతీ పరిధిలోని ముప్పనేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి జులై 29న మృతి చెందినట్లు ధ్రువీకరిస్తూ మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశాడు. తన విధులను తప్పుదోవ పట్టించిన ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అదే కారోబార్ గ్రామంలో కోర్టు వివాదంలో ఉన్న ఖాళీ స్థలానికి ఇంటి యజమానిగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేశాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గ్రామంలో ఖాళీ స్థలాల్లో ఇల్లు ఉన్నట్లుగా తప్పుడు ఇంటి నంబర్లు ఇచ్చి దొంగ రిజిస్ట్రేషన్లకు సహకరించాడనే అభియోగాలు ఉన్నాయి. దీంతో కోర్టు వివాదంలో ఉన్న ఖాళీ స్థలాలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు ఉన్నట్లుగా ఇంటి యజమాని పత్రాలు జారీ చేసి దొంగ రిజిస్ట్రేషన్లకు సహకరిస్తున్న కారోబార్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లా పంచాయతీ అధికారులు సైతం కారోబార్ నుంచి రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. విషయంపై ఎంపీఓ శ్రీకాంత్ నాయుడిని వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది వాస్తమేనన్నారు. ఆయనపై ఖాళీ స్థలాలకు ఇంటి యజమాని ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన విషయంపై ఫిర్యాదు కూడా అందిందన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
పంచాయతీ కార్యదర్శి రూ.కోటి స్వాహా
సాక్షి, రాజానగరం: ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము ఏకంగా కోటి రూపాయలకు పైగా ఓ పంచాయతీ కార్యదర్శి స్వాహా చేసిన వైనం రాజానగరం మండలం లాలాచెరువు పంచాయతీలో తాజాగా బయటపడింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన సాగింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. అవినీతికి అలవాటు పడిన కొంతమంది కార్యదర్శులు ప్రజలు చెల్లించిన వివిధ రకాల పన్నులను ఆయా పంచాయతీలకు జమ చేయకుండా తమ జేబుల్లో వేసుకుని బొక్కేశారు. ఈ తరహాలోనే జిల్లాలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు గుట్టుగా చేసిన అక్రమం తాజాగా బయటపడింది. సుమారు రూ.ఒక కోటీ ఆరు లక్షల వరకూ అవినీతికి పాల్పడిన ఆ ఉద్యోగికి పలుమార్లు జారీ చేసిన షోకాజ్ నోటీసుల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ప్రాథమికంగా రూ.57,27,354 దుర్వినియోగమైనట్టు గత నెల 20న తుది నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే... రాజానగరం మండలం లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన దాసరి వెంకటేశ్వరరావు జూలై 2019లో కడియం మండలం, కడియపులంక పంచాయతీకి బదిలీపై వెళ్లారు. ఇలా బదిలీ అయిన కార్యదర్శి తన స్థానంలో వచ్చిన కొత్త కార్యదర్శి భాస్కరరావుకు బాధ్యతలు అప్పగించడం పరిపాటి. కానీ వెంకటేశ్వర రావు ఆ విధంగా చేయకుండా నెలల తరబడి ఇదిగో వస్తా, అదిగో వస్తానంటూ కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన భాస్కరరావు విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రికార్డులను పరిశీలించాలని రాజమహేంద్రవరం డీఎల్పీఓ ఆదేశించడంతో పంచాయతీకి వచ్చిన నాటి నుంచి పూర్తి స్థాయిలో రికార్డులను భాస్కరావు పరిశీలించగా అక్రమాలు బయటపడ్డాయి. పంచాయతీకి ప్రజలు చెల్లించిన వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్‌ల ద్వారానే సుమారు రూ.1.06 కోట్ల అవినీతి జరిగినట్టుగా రికార్డుల ద్వారా తేలడంతో డీఎల్పీఓ ద్వారా జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో 2014–15 నుంచి మొత్తం రికార్డులను పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ రాజానగరం ఈఓపీఆర్డీ ఆధ్వర్యంలో కోరుకొండ, కాతేరు పంచాయతీ కార్యదర్శులను బృందాలుగా నియమించారు. వారు చేసిన పరిశీలనలో రూ.84,12,916 ఖర్చులకు ఏవిధమైన రికార్డులు లేకపోవడంతో ఆ మేరకు దుర్వినియోగం జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన వెంకటేశ్వరరావుకు సమాధానం చెప్పుకునేందుకు (సరి చేసుకునేందుకు) అవకాశం ఇవ్వడంతో రూ.26,85,562లకు బిల్లులు తీసుకువచ్చి అందజేశాడు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ. 57,27,354 నికరంగా దుర్వినియోగమైందని విచారణ బృందం ఆగస్టు 20న రిపోర్టును తయారుచేసి జిల్లా పంచాయతీ అధికారికి అందజేసింది. ఇక్కడే ఇంత... మరి అక్కడో... నిందితుడు దాసరి వెంకటేశ్వరరావు లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే దివాన్‌చెరువు పంచాయతీకి కూడా ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆదాయ వనరులు పరిమితంగా ఉండే లాలాచెరువు హౌసింగ్ బోర్డు పంచాయతీలోనే ఇంత అవినీతికి పాల్పడితే ఆదాయ వనరులు అపారంగా ఉన్న దివాన్‌చెరువు పంచాయతీలో ఏమేరకు అవినీతికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక అతను లాలాచెరువుకు రాకముందు కోరుకొండ మండలం, గాడాల, బూరుగుపూడి పంచాయతీలలో కూడా కార్యదర్శిగా పనిచేశాడు. అక్కడ కూడా అతనిపై పలు అరోపణలున్నాయి. దీంతో ఈయనపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయా పంచాయతీల ప్రజలు కోరుతున్నారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా శిక్షార్హులే లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీ కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలు వాస్తవమేనని, అందుకు సంబంధించిన నివేదికను జిల్లా అధికారులకు కూడా అందజేశామని రాజమహేంద్రవరం డివిజనల్ పంచాయతీ అధికారి జె.సత్యనారాయణ తెలిపారు. అతను స్వాహా చేసిన ప్రజల సొమ్ములను రికవరీ చేయడంతో అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్నారు. అంతేకాక అతను ఇన్చార్జిగా పనిచేసిన దివాన్‌చెరువు పంచాయతీలో కూడా విచారణ జరిపేందుకు రెండు మూడు రోజుల్లోనే ఓ బృందాన్ని పంపిస్తామన్నారు. -
శిక్షణ లేకుండానే..!
సాక్షి, షాద్‌నగర్: కొత్తగా ఎంపికైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాలనలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పంచాయితీరాజ శాఖ ద్వారా ఎంపికైన వీరికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వకుండానే బాధ్యతలు అప్పగించింది. వారిని నేరుగా క్షేత్రస్థాయిలోకి పంపడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వం నియమించిన ఉద్యోగులకు విధిగా శిక్షణ ఇచ్చిన అనంతరం బాధ్యతలు అప్పగించడం సర్వసాధారణం. కానీ, కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వారికి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలూ నిర్వహించకుండానే గ్రామ పంచాయతీలను అప్పగించడంతో పాలనలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. మొత్తం 301 మంది నియామకం జిల్లాలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 558 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి పంచాయతీకి కార్యదర్శి నియమించేందుకు చర్యలు చేపట్టింది. పంచాయితీరాజ శాఖ ద్వారా జిల్లాలో 21 మండలాల్లో ఖాళీగా ఉన్న 301 పంచాయతీలకు కార్యదర్శుల పోస్టులను భర్తీ చేశారు. కొత్త కార్యదర్శులను ఏప్రిల్ 12న నియమించి ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీను కేటాయించి పాలనా బాధ్యతలను అప్పగించినట్లు జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి తెలిపారు. అయితే, వివిధ కారణాల నేపథ్యంలో కొందరు పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలను వదిలివెళ్తున్నారు. పనిభారం ఎక్కువై కొందరు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం ఇష్టం లేక మరికొందరు, ఇతర ఉద్యోగాలు రావడంతో మరికొందరు ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. తప్పులు జరిగితే చర్యలు.. గ్రామాభివృద్ధికి సంబంధించి పంచాయతీల నుంచి నిధులు డ్రా చేయడంలో అవకతవలు జరిగితే మాత్రం సర్పంచ్, కార్యదర్శిపై కఠిన చర్యలు తప్పవు. నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్‌ను సర్పంచ్, కార్యదర్శి చేయాల్సి ఉంటుంది. అయితే, నిధులను ఏవిధంగా ఖర్చు చేయాలనే విషయంపై కొత్త కార్యదర్శులకు అవగాహన లేదు. అదేవిధంగా వీరు ప్రతినెలా తమ పనితీరును కొత్త పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన వెబ్సైట్లో పొందుపర్చాలి. లేదంటే చర్యలు తీసుకోనున్నారు. ‘రియల్’పై అవగాహన అంతంతే కొత్త పంచాయతీ కార్యదర్శులకు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై అంతగా అవగాహన లేదు. ఎంటెక్, బీటెక్, పీజీ తదితర కోర్సులు చదవి పంచాయతీ కార్యదర్శి పోస్టులు సాధించిన యువకులు అధికంగా ఉన్నారు. వీరికి గ్రామాల్లో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వానికి సంబంధించి భూముల కబ్జాలు, భవన నిర్మాణాల అనుమతులు తదితర ప్రధాన అంశాల్లో ఎన్నో కీలకంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో కార్యదర్శులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చిన తర్వాతే విధులు అప్పగించాలి. కానీ, ప్రభుత్వం అలాకాకుండా నేరుగా వారికి బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందిగా మారింది. సర్పంచ్‌లకు శిక్షణ.. మరీ కార్యదర్శులకు? కొత్తగా ఎన్నికైన సర్పంచులకు మాత్రం బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే శిక్షణ తరగుతులు నిర్వహించి గ్రామాల అభివృద్ధి ఏవిధంగా చేయాలి, నిధులు ఏవిధంగా వినియోగించాలనే అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పించింది. కానీ, కార్యదర్శులకు మాత్రం నేటి వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈనేపథ్యంలో విధుల నిర్వహణలో కొత్త కార్యదర్శులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వారికి శిక్షణ ఎప్పుడు ఇస్తారో కూడా ఎవరికీ స్పష్టత లేదు. కొత్త చట్టంపై అవగాహనేదీ.? గ్రామ పరిపాలనా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం– 2018ను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో కొత్త చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. కొత్త చట్టం ప్రకారం ప్రతి నెలా పంచాయతీ కార్యదర్శులు విధిగా తమ పనితీరును వెబ్సైట్లో నమోదుచేయాలి. అదేవిధంగా ప్లాట్ల లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులు, వీధి దీపాలు, మురుగు కాల్వలు, అంతర్గత రహదారులను నిర్వహించడంతోపాటుగా హరితహారాన్ని పటిష్టంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇలా.. ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో అనేక కీలమైన అంశాలను పొందుపర్చింది. ప్రతి గ్రామానికి ఓ నర్సరీ ఏర్పాటు చేసింది. ఇందులో పంచాయతీ కార్యదర్శిగా కీలకంగా వ్యవహరించే విధంగా బాధ్యతలను పొందుపర్చింది. అదేవిధంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌కు చెక్‌పవర్‌ను కేటాయించారు. పైఅంశాలపై పూర్తి స్థాయిలో కొత్త పంచాయతీ కార్యదర్శులకు అవగాహన లేదు. -
27 పంచాయతీలకు నలుగురే..!
సాక్షి, గొల్లపల్లి: మండలంలో పంచాయతీ కార్యదర్శుల కొరత వేధిస్తోంది. 27 పంచాయతీలకు కేవలం నలుగురే ఉండడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కొత్త సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టారు. వారు వచ్చారు కానీ వారికి సహకరించేందుకు అధికారులు, సిబ్బంది సరిపడా లేరు. పూర్తిస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు లేకపోవడంతో పంచాయతీలకు వచ్చే నిధులు, వాటి ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసే వాళ్లు లేరు. కార్యదర్శులు లేకపోవడంతో సర్పంచ్‌లు ఇన్చార్జి అధికారులపై ఆధారపడి పాలన సాగిస్తున్నారు. దీంతో వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియక, పనులు ముందుకు సాగక పాలన కుంటుపడుతోంది. దీంతో సర్పంచ్‌లు పనులు చేయలేక ఖాళీగా కూర్చుంటున్నారు. ఫలితంగా గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొత్త కార్యదర్శులు వచ్చేదెన్నడు.. మండలంలో కొత్తగా 2 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం నూతన పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామకం చేపట్టింది. అయితే కోర్టు కేసు కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కొత్త కార్యదర్శులు ఇంకా గ్రామాలకు రాలేదు. కార్యదర్శుల కొరతతోపాటు భవనాలు లేక చిన్న గదుల్లో పాలన సాగిస్తున్నారు. కార్యదర్శులు లేకపోవడంతో సమస్యల పరిష్కారంపై కొత్త పాలకవర్గాలు దృష్టి సారించడం లేదు. పంచాయతీలకు కావాల్సిన నిధులపై అవగాహన లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో సర్పంచ్‌లు ఉన్నారు. మొన్నటివరకు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండడంతో అభివృద్ధి పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం సిబ్బంది కొరతతో అభివృద్ధి జరగడం లేదు. అదనపు బాధ్యతలు మండలంలో 27 గ్రామ పంచాయతీలకు కేవలం ముగ్గురు కార్యదర్శులు, ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. దీంతో వారిపై పనిభారం భారీగా పడింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి మల్లేషం అబ్బాపూర్, ఆత్మకూర్, దమ్మన్నపేట, లక్ష్మీపూర్, రంగదామునిపల్లి, చిల్వాకోడూర్, బొంకూర్, వెన్గుమట్ల, ఇస్రాజ్‌పల్లికి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జి.మల్లేశంకు దట్నూర్, చెందోళి, భీంరాజ్‌పల్లి, తిర్మాళాపూర్(పీడి), అగ్గిమల్ల, గంగాదేవిపల్లి, రాఘవపట్నం, లొత్తునూర్‌కు బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తిరుపతికి రాపల్లి, నందిపల్లి, వెంగళాపూర్, శంకర్రావుపేట, తిర్మాళాపూర్(ఎం), బీబీ రాజ్‌పల్లి, గొల్లపల్లి, జూనియర్ అసిస్టెంట్ రమేశ్ గోవింద్‌పల్లి, గుంజపడుగు, ఇబ్రహీంనగర్ గ్రామాల్లో పని చేస్తున్నారు. వీరంతా ఇన్ని పంచాయతీలు ఎలా పర్యవేక్షిస్తున్నారో వారికే తెలియాలి. కొత్త పంచాయతీరాజ్æ చట్టంలో అనేక మారులను తీసుకొచ్చారు. కార్యదర్శికి 30 రకాల బాధ్యతలు అప్పగించారు. దీంతో గ్రామీణ ప్రజలు సమస్యల పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యదర్శులను నియమించాలి ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించాలి. అప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇన్చార్జి కార్యదర్శులతో గ్రామంలో పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదు. కార్యదర్శి ఉంటేనే నిధులు, విధులు మాకు తెలుస్తాయి. అప్పుడే గ్రామ పాలన సజావుగా సాగే అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం కార్యదర్శుల నియామకంపై దృష్టి సారించాలి. – పురంశెట్టి పద్మ, సర్పంచ్, అబ్బాపూర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మండలంలో పంచాయతీ కార్యదర్శుల కొరత తీవ్రంగా ఉంది. ఈ విషయం జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఉన్నవారికి అదనపు గ్రామాల బాధ్యతలు అప్పగించి పనులు చేయిస్తున్నాం. కొత్త కార్యదర్శులు వచ్చేవరకు ఆయా గ్రామ పంచాయతీలకు ఇన్చార్జీలు కొనసాగుతారు. – నవీన్‌కుమార్, ఎంపీడీవో, గొల్లపల్లి -
మరో జన్మభూమి కమిటీలా చేయొద్దు
సాక్షి, అమరావతి: అత్యంత కీలకమైన గ్రామ కార్యదర్శి పదవుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గ్రామ కార్యదర్శుల నియామకాలపై సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 5800 ల కార్యదర్శుల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయితే ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించకుండా మెరిట్ ప్రకారం నియామకాలు జరగాలని, రూల్ అప్ రిజర్వేషన్ పాటించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే పంచాయితీ కార్యదర్శులదే ముఖ్యపాత్ర అన్నారు. అలాంటి నియామకాలు ఔట్ సోర్సింగ్ విధానంలో అంటూ మరో జన్మభూమి కమిటీలా చేయవద్దన్నారు. -
శనివారపుపేట కార్యదర్శి సస్పెన్షన్
గ్రామం వదిలి వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశాలు శనివారపుపేట (ఏలూరు రూరల్): ఏలూరు మండలం శనివారపుపేట గ్రామ కార్యదర్శి నిట్టా రవికిషోర్‌ను కలెక్టర్ కె.భాస్కర్ సస్పెండ్ చేశారు. గ్రామం వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను ఎంపీడీవో ఎన్.ప్రకాశరావు తన సిబ్బంది ద్వారా కార్యదర్శి రవికిషోర్‌కు అందజేశారు. సర్వే విధులు నిర్వహణలో నిర్లక్ష్యం వహించాడని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు గతనెల 17న రవికిషోర్‌పై తాత్కాలిక సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సంగతి తెలిసిన కార్యదర్శి ఏకబిగిన పనిచేసి సర్వే పూర్తి చేశారు. ఇదే సమయంలో జేసీ ఆదేశాలు అందుకోకుండా కాలయాపన చేస్తూ రాజకీయ పైరవీలు నడిపారు. ఫలితం లేకపోవడంతో తనను సస్పెన్షన్ చేసే అధికారం ఎంపీడీవోకు లేదని రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై ట్రిబ్యునల్ కార్యదర్శి అప్పీల్‌ను కొట్టేసింది. గత్యంతరం లేని సమయంలో రవికిషోర్ హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి ఎంపీడీవో ఆదేశాలు చెల్లవంటూ ఉత్తర్వులు తెచ్చుకున్నారని తెలిసింది. ఈ ఉత్తర్వుల కాపీను గత శనివారం ఎంపీడీవోకు చూపించి తనకు బాధ్యతలు అప్పగించాలని రవికిషోర్ కోరారు. ఈ మొత్తం వ్యవహారం కలెక్టర్ భాస్కర్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణం కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.