
అత్యంత కీలకమైన గ్రామ కార్యదర్శి పదవుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.
సాక్షి, అమరావతి: అత్యంత కీలకమైన గ్రామ కార్యదర్శి పదవుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గ్రామ కార్యదర్శుల నియామకాలపై సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 5800 ల కార్యదర్శుల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
అయితే ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించకుండా మెరిట్ ప్రకారం నియామకాలు జరగాలని, రూల్ అప్ రిజర్వేషన్ పాటించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే పంచాయితీ కార్యదర్శులదే ముఖ్యపాత్ర అన్నారు. అలాంటి నియామకాలు ఔట్ సోర్సింగ్ విధానంలో అంటూ మరో జన్మభూమి కమిటీలా చేయవద్దన్నారు.