Red handed
-
‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’
ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ మధ్య న్యాయ పోరాటం తీవ్రంగా మారింది. తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. పోటీ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ గోప్యమైన డేటాను దుర్వినియోగం చేసిందని, బహిర్గతం చేయని ఒప్పందాలను (NDAs) ఉల్లంఘించిందని కాగ్నిజెంట్ ఆరోపించింది .కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ల మధ్య యూఎస్ కోర్టులో ఓ దావా నడుస్తోంది. తమ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని ఆరోపిస్తూ కాగ్నిజెంట్ కేసు దాఖలు చేసిందని మింట్ నివేదిక తెలిపింది. "నాన్ డిస్క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్స్ (NDAAs) ద్వారా ఇన్ఫోసిస్ తమ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది" అని 22 పేజీల కోర్టు ప్రతిస్పందనను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: టీసీఎస్ వీసా ఫ్రాడ్ చేసింది.. మాజీ ఉద్యోగుల ఆరోపణలు తమ ట్రైజెట్టో సమాచారాన్ని ఉపయోగించారా లేదా అన్నది ఆడిట్ చేయడానికి ఇన్ఫోసిస్ నిరాకరించిందని, ఇది తన తప్పును రుజువు చేస్తుందని కాగ్నిజెంట్ వాదిస్తోంది. ఈ చట్టపరమైన వివాదం 2024 ఆగస్టు నాటిది. కాగ్నిజెంట్ మొదట డల్లాస్ కోర్టులో ఈ ప్రకటన చేసింది. గత జనవరి 9న దాఖలు చేసిన కేసులో ఈ ఆరోపణను ఇన్ఫోసిస్ తిరస్కరించింది, కాగ్నిజెంట్‌కు సంబంధించిన హెల్త్ కేర్ సొల్యూషన్స్ బహిరంగంగానే ఉన్నాయని, అందులో వాణిజ్య రహస్యాలు ఏమున్నాయో వారే చూసుకోవాలని కాగ్నిజెంట్‌కు సూచించాలని కోర్టును ఇన్ఫోసిస్ కోరింది.ఇన్ఫోసిస్ ప్రతి దావాఇన్ఫోసిస్ తరువాత కాగ్నిజెంట్ పై ప్రతి దావా వేసింది. దాని సీఈవో రవి కుమార్ ఇన్ఫోసిస్ లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ సొంత హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ ఉత్పత్తిని విడుదల చేయడాన్ని కావాలని ఆలస్యం చేశారని, కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం చర్చలు జరిపారని ప్రత్యారోపణలు చేసింది. రవి కుమార్ 2022 అక్టోబర్‌లో ఇన్ఫోసిస్‌ను వీడారు. ఆ తర్వాత ఏడాది అంటే 2023 జనవరిలో కాగ్నిజెంట్‌లో సీఈవోగా చేరారు. రెండు కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్ సైన్సెస్ రంగ క్లయింట్ల నుంచే పొందుతోంది. కాగ్నిజెంట్‌కు కూడా తమ క్లయింట్లలో దాదాపు మూడోవంతు హెల్త్ కేర్ నుంచే ఉన్నారు. -
నల్లా కనెక్షన్ కోసం లంచం.. మణికొండ జల మండలి మేనేజర్ అరెస్ట్
మణికొండ: మంచినీటి కనెక్షన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి వసూలు చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పాటు జలమండలి మేనేజర్‌ను అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. మణికొండ జలమండలి డివిజన్–18లో మేనేజర్‌గా పనిచేస్తున్న స్ఫూర్తి రెడ్డితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ను వలపన్ని పట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వేంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉపేంద్రనాథ్‌రెడ్డి ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు చేసి వారిని అరెస్టు చేశారు. తన అపార్ట్‌మెంట్‌కు రెండు నీటి కనెక్షన్లకు ఆన్లైన్లో ధరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవటంతో ఉపేంద్రనాథ్‌రెడ్డి జలమండలి కార్యాలయానికి వచ్చి మేనేజర్ స్ఫూర్తిరెడ్డిని కలిశాడు. ఆమె సమాధానం చెప్పకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ను కలవాలని సూచించింది. అతన్ని కలవగా ఒక్కో కనెక్షన్‌కు రూ.15 వేల చొప్పున రూ.30 వేలు ఇస్తే మీ పని అయిపోతుందని సలహా ఇచ్చారు. దాంతో అతను ఏసీబీని ఆశ్రయించి మంగళవారం వారి సూచన మేరకు మణికొండ మర్రిచెట్టు సర్కిల్లో ఉన్న జలమండలి కార్యాలయం వద్ద నవీన్‌గౌడ్‌కు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో మేనేజర్ ఆదేశం మేరకే డబ్బు తీసుకున్నానని పేర్కొనటంతో ఆమెను కూడా అరెస్టు చేశారు. వసూలు చేసిన మొత్తంలో మేనేజర్‌తో పాటు డీజీఎం, జీఎంలకు వాటా ఇవ్వాల్సి ఉందని ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో నవీన్‌గౌడ్ అంగీకరించాడు. దాంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. దాడులలో ఏసీబీ సీఐలు ఆజాద్, జగన్మోహన్రెడ్డి, నవీన్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ : రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన డెలివరీ బోయ్, వైరల్ వీడియో
అసలే వర్షాకాలం.. ఆపైన నక నకలాడే ఆకలి. ఉందిగా ఆన్లైన్ ఫుడ్ అంటూ ఆర్డర్ చేసుకొని తినేయడం చాలామందికి అలవాటు. అలాగే నోయిడాకు చెందిన ఒక వ్యాపారవేత్త ఓలా ఫుడ్స్ నుండి భోజనాన్ని ఆర్డర్ చేశాడు. కానీ అతని ఆకలి తీరలేదు సరికదా కడుపు రగిలిపోయే చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టోరీ నెట్టిజనుల ఆగ్రహానికి గురవుతోంది. విషయం ఏమిటంటే... వ్యాపారవేత్త అమన్ బీరేంద్ర జైస్వాల్ ఓలా ఫుడ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. డెలివరీ ఏజెంట్ ఫోన్ చేసి అదనంగా పది రూపాయిలివ్వాలని డిమాండ్ చేశాడు.దీనికి తొలుత నిరాకరించిన జైస్వాల్ ఆ తరువాత సరే అన్నాడు. ఆసగా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలా 45 నిమిషాలు గడిచిపోయాయి. ఇంకా ఫుడ్ డెలివరీ కాలేదుగానీ తన ఫుడ్‌ను ఎంచక్కా లాగించేస్తున్న దృశ్యాన్ని షాక్ అయ్యాడు. అంతేకాదు హాన్ తో కర్తే రహో జో కర్నా హై" (ఏం చేసుకుంటావో చేస్కో) అన్న అతగాడి సమాధానం విని మరింత దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన ఫుడ్ ఎందుకు తిన్నారని ప్రశ్నించగా మరి ఏం చేయాలి అంటూ ఉదాసీనంగా సమాధానం చెప్పాడు. మోటార్‌సైకిల్‌పై కూర్చుని డెలివరీ డ్రైవర్లు కస్టమర్ల ఫుడ్‌ను భోంజేస్తున్న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆ వీడియోను జైస్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Aman Birendra Jaiswal (@amanbjaiswal)దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు స్పందించారు. తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్ ప్లేస్ అవుతుంది. డెలివరీ బోయ్ జాడ ఉండదు. కాల్కి సమాధానం ఉండదు. ఓలా ఫుడ్స్‌కి ఫిర్యాదు లేదా పరిష్కార వ్యవస్థ లేదని తరువాత తెలిసిందే. చివరికి ఫుడ్ కేన్సిల్ అయింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు ఒక యూజర్. ఈ ప్లాట్‌పాంలో సీవోడీ(క్యాష్ అన్ డెలివరీ) అప్షన్లేదని మరొకరు ఆరోపించారు. రెండు సార్లు ఓటీపీ షేర్ చేయకుండానే ఫుడ్ డెలివరీ అయిందని వచ్చింది. రెండు సార్లు ఇలా జరిగిందని, ఓలాలోనే ఇలా జరగుతుందని ఒకరు, ఓలాలో మాత్రమే కాదు, స్విగ్గీలో కూడా ఇంతే అని మరొక వినియోగదారు తన గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం. ఈ ఉదంతంపై ఓలా ఫుడ్ ఇంకా స్పందించలేదు. -
గుట్టుగా వ్యభిచారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
తమిళనాడు: సెలూన్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి చెరలో ఉన్న ముగ్గురు యువతులకు విముక్తి కలిగించారు. తిరువళ్లూరు జిల్లా శివందినగర్ ప్రాంతంలోని సలూన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ఇన్స్పెక్టర్ మల్లికకు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు మంత్ర సలూన్‌లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. చైన్నెకు చెందిన రాజేష్(47) అన్ననూర్కు చెందిన గాయత్రి(23)లను అరెస్టు చేశారు. వీరి చెరలో ఉన్న ముగ్గురు యువతులను రిమాండ్‌కు తరలించారు. కాగా పరారీలో ఉన్న విఘ్నేష్ అనే యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
Hyderabad: వివాహేతర సంబంధం: భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
హైదరాబాద్: వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన భార్య బంధువులపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం వల్లభాయ్నగర్కు చెందిన విజయ్‌కుమార్‌కు మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగికి చెందిన స్వప్నతో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా విజయ్‌కుమార్ మూడేళ్లుగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. అప్పటి నుంచి భార్యను సైతం దూరం పెడుతూ విడాకులు ఇవ్వాల్సిందిగా వేధిస్తూ వస్తున్నాడు. కొన్ని నెలలుగా ఇంటి రావడంలేదు, కుటుంబ సభ్యులు ఫోన్లు చేసినా స్పందించడం లేదు. శనివారం రాత్రి సదరు మహిళతో విజయ్‌కుమార్ ఉన్నట్లు తెలుసుకున్న స్వప్న, ఆమె అక్కలు శ్యామల, మంజుల, బాబాయి శ్రీనివాస్ అక్కడికి వెళ్లారు. అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీయగా వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య స్వప్నను కొడుతున్న విజయ్‌కుమార్‌ను అడ్డుకున్న శ్రీనివాస్‌పై కత్తితో దాడి చేయగా అతని మెడభాగం, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం బాధిత మహిళ స్వప్న జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్: వనస్థలిపురంలో ఇన్స్పెక్టర్ రాజు అరెస్ట్
-
Hyderabad: నడిరోడ్డుపై సీఐ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
హస్తినాపురం(హైదరాబాద్): చట్టాన్ని పరిరక్షించాల్సిన రక్షకభటులే సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. నగరంలోని సౌత్జోన్లో కంట్రోల్ల్ రూంలో పనిచేస్తున్న ఓ సీఐ నడిరోడ్డుపై కారులో మహిళతో రాసలీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడటమేగాక డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ కథన ం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, బేగంపేట గ్రామానికి చెందిన రాజు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని హరిహరపురం కాలనీలో నివాసం ఉంటూ నగరంలోని సౌత్జోన్లో కంట్రోల్ రూమ్ సీఐగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అతను సాగర్ రహదారిపై పెట్రోల్‌బంక్ పక్కన కారులో పీకలదాకా మద్యంతాగి మరో మహిళతో కారులో ఉండటంతో అతని భార్య, పిల్లలు అక్కడికి వెళ్లి అతడితో గొడవపడ్డారు. దీనిని గుర్తించిన పెట్రోలింగ్ కానిస్టేబుళ్లు నాగార్జున, నాయుడు అక్కడికి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా మద్యం మత్తులో ఉన్న సీఐ రాజు వారిపై దాడిచేసి గాయపరిచాడు. హెడ్ కానిస్టేబుల్‌ను వెంబడించి దాడికి ప్రయత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు చేశామని, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. చదవండి: రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్.. అంతలోనే షాకింగ్ ఘటన.. అసలు ఏం జరిగింది? -
దొంగలించేందుకు వచ్చి కక్కుర్తిపడి అడ్డంగా బుక్కయ్యారు! వీడియో వైరల్
చెన్నై: ఇద్దరు దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకు మద్యం షాపుకి వెళ్లి పోలీసులుకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువెల్లూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆ దొంగలు మద్యం బాటిళ్లను దొంగతనం చేసేందుకని లిక్కర్ షాపుకి డ్రిల్లింగ్ మిషన్‌తో రంధ్రం చేశారు. ఐతే ఆ దొంగలు షాపులోకి వెళ్లిన తర్వాత ఆ మద్యం బాటిళ్లను చూసి టెంప్ట్ అయ్యి ప్లాన్ మార్చుకున్నారు. కాసేపు ఆ షాపులోనే ఉండి తాగి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అనుకున్నదే తడువుగా ప్లాన్ కూడా అమలు చేశారు. ఆ దొంగలు వక్రబుద్దే వారిని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాలే చేసింది. పోలీసులు వారు ఏ విధంగా లిక్కర్ షాపుకి రంధ్రం చేసి వెళ్లారు అలానే వారిని బయటకు రప్పించి మరీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు పోలీసులు సదరు షాపు యజమానితో ఓపెన్ చేయించి మరీ పోలీసులను అదుపులోకి తీసుకోవచ్చు, కానీ అలా కాకుండా వారు ఎలా షాపుకి ఎంట్రీ ఇచ్చారో అలానే అదుపులో తీసుకోవడం గ్రేట్ అంటూ పోలీసుల పని తీరును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX — Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
హన్మకొండలో నారాయణ స్కూల్ బండారం బట్టబయలు..||
-
పరాయి వ్యక్తితో భార్య సహజీవనం
-
పరాయి వ్యక్తితో భార్య సహజీవనం.. గదికి బయట నుంచి తాళం వేసి
సాక్షి, హైదరాబాద్: భార్య పరాయి పురుషుడితో గదిలో ఉండగా బయటి నుంచి తాళం వేసిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త తన భార్యతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా అప్పగించి తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశాడు. వివరాలివీ... జూబ్లీహిల్స్ రహ్మత్‌నగర్‌లోని యాదగిరినగర్‌లో నివసిస్తున్న మహిళ(35)కు ఇద్దరు పిల్లలు. భర్త సరిహద్దుల్లో పని చేస్తుంటాడు. గురువారం ఉదయం యాదగిరినగర్‌లో తన భార్య జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నట్లుగా తెలుసుకొని అక్కడికి వెళ్లి బయటి నుంచి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తాళం తీసి విచారణ చేపట్టారు. ఈ ఇంటిని ఆమె అద్దెకు తీసుకునే ముందు జ్ఞానేశ్వర్ తన భర్త అంటూ ఓనర్‌ను నమ్మించి కొంత కాలంగా ఉంటున్నట్లుగా విచారణలో తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం: భార్య ఇంకొకరితో కలిసి ఉండగా..
సాక్షి,కరీంనగర్‌క్రైం: కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలోని ఒక ఇంట్లో భర్త తన భార్యకు ఇతర వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం గురించి పోలీసులకు సమాచారమందించాడు. ప్రభుత్వ ఉద్యోగిని అయిన మహిళ తాను పనిచేస్తున్న శాఖలోని మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసిన భర్త మూడు నెలల నుంచి తన భార్యను తప్పని హెచ్చరిస్తున్నాడు. అయినా వినకుండా అదే పనిచేయడంతో శుక్రవారం వారు కలిసి ఉన్న సమయంలో పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు వచ్చి వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగి
సాక్షి,సారవకోట(శ్రీకాకుళం): మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శి పాగోటి విశ్వేశ్వరరావు మంగళవారం రూ.2వేలు లంచం తీసుకుంటూ అవినీతి ని రోధక శాఖ అధికారులకు ప ట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి తన ఉద్యోగ అవసరం కోసం జనన ధ్రువీకరణ పత్రం కోసం నవంబర్‌లో మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. పాలకొండ ఆర్డీ ఓ నుంచి పత్రం రావాల్సి ఉందని ఆలస్యం చేశారు. ఈ నెల 6న ఆర్డీఓ నుంచి పత్రం తీసుకువచ్చిన పంచాయతీ కార్యదర్శి దాన్ని బాధితుడికి ఇచ్చేందుకు రూ.2వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తర్వాత పంచాయతీ కార్యదర్శి విశ్వేశ్వరరావు సారవకోట మండల పరిషత్‌కు రావాలని అక్కడ ధ్రువీకరణ పత్రం అందజేస్తానని చెప్పడంతో సాయంత్రం 4.50 గంటల సమయంలో బాధితుడు అక్కడకు వెళ్లాడు. అధికారికి రూ.2 వేలు లంచం ఇస్తుండగా అప్పటికే మాటు వేసి ఉన్న ఏ సీబీ అధికారులు విశ్వేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణాపురం పంచాయతీలో 2014 నుంచి పనిచేస్తున్నారని, ఇప్పటికే ఈయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని తెలిపా రు. పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేసి విశాఖపట్నంలో ఏసీబీ కోర్టులో బుధవారం హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: ఫంక్షన్హాల్లో శుభకార్యం.. పోలీసులొస్తున్నారని మేడపై నుంచి దూకి... -
ప్రియురాలితో ఏకాంతంగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..
సాక్షి, విజయనగరం జిల్లా: సాలూరులో ఓ భార్య.. భర్త వివాహేతర సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పాచిపెంట మండలంలో విద్యాశాఖలో ఉద్యోగి సింగిపురపు తవుడు కొన్నాళ్లుగా పార్వతి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య తనని, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: నీతో శృంగారం నాకిష్టం లేదు.. భర్త జననాంగాన్ని కోసేసిన భార్య అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. సాలూరు డంపింగ్ యార్డ్ సమీపంలో ఏకాంతంగా వున్నా భర్త, అతని ప్రియురాలు పార్వతిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అయితే భర్త పారిపోగా ప్రియురాలిని పట్టుకొని చితక్కొట్టి పోలీసులకు అప్పగించింది. సాలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
భర్తను రెడ్ హ్యాండెడ్ పట్టుకొని.. ఏమైందో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్తను ఓ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. మరో మహిళతో గుట్టుగా వివాహేతరం సంబంధం నడిపిస్తున్న భర్తను సదురు మహిళ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. జగద్గిరిగుట్టకు చెందిన అనిల్ అనే వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని కుత్బుల్లాపూర్ బ్యాంక్ కాలనీలో నివాసిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి అనుమానం వచ్చిన భార్య రమేశ్వరి తన భర్త పట్టుకొని పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు. -
జాగింగ్కని వెళ్లి ప్రియురాలతో ఎంజాయ్.. భార్యను చూసి రన్నింగ్
‘‘ఏమోయ్ నేను ఈ మధ్య బాగా లావయ్యాను కదా.. బరువు తగ్గడం కోసం జాగింగ్‌కు వెళ్దామనుకుంటున్నాను.. ఏం అంటావ్’’ అని అమాయకంగా భార్యను అడిగాడు ఓ వ్యక్తి. భర్త ఆరోగ్యంగా ఉండటమే తనకు ముఖ్యమని భావించిన ఇల్లాలు సరే అంది. భర్త జాగింగ్ ప్రారంభించి నెల రోజుల పైనే అవుతుంది. అయినా ఒక్క గ్రాము బరువు కూడా తగ్గలేదు. దాంతో ఆ ఇల్లాలికి అనుమానం వచ్చింది. ఓ రోజు భర్తకు తెలియకుండా అతడి వెనకే ఫాలో అయ్యింది. ఇక పార్కులో కనిపించని దృశ్యం చూసి ఆమె షాకయ్యింది. ఎందుకంటే భర్త అక్కడ తన ప్రియురాలితో ముచ్చట్లాడుతూ కనిపించాడు. భార్యను అక్కడ చూసిన భర్త.. వెంటనే పరుగందుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: 2021 నుంచి అయినా ఫిట్‌గా ఉందాం : రాష్ట్రపతి) ఈ సంఘటన ఎక్కడ జరిగింది వంటి వివరాలు లేవు. జాగింగ్ పేరు చెప్పి.. ఓ వ్యక్తి ప్రతి రోజు పార్క్‌కు వెళ్లి ప్రియురాలిని కలుస్తుండేవాడు. జాగింగ్ చేసినప్పటికి భర్త బరువు తగ్గకపోవడంతో అనుమానం వచ్చి.. ఓ రోజు అతడి వెనకే పార్క్‌కు వెళ్లింది భార్య. అక్కడ ప్రియురాలితో సరదాగా గడుపుతున్న భర్తను చూసి షాకయ్యింది. వారి వెనక నిల్చుని ‘‘ఓహో తమరు చేసే జాగింగ్ ఇదా’’ అని ప్రశ్నించింది. సడెన్‌గా పార్క్‌లో భార్య గొంతు వినిపించేసరికి.. అతగాడికి ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ప్రియురాలితో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇక భార్య దగ్గరకు రావడం చూసి నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత పరుగందుకున్నాడు. ఇక సదరు ఇల్లాలు.. ‘‘ఆగు.. నా మాట విను.. ఇలాగే పరిగెత్తావనుకో.. ఇంటికి వచ్చాక నీ పని చెప్తాను’’ అని హెచ్చరించింది. (చదవండి: Viral Video: కేంద్ర మంత్రి డ్యాన్స్.. ప్రధాని మోదీ స్పందన) ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియోని షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ‘‘బాగా అయ్యింది.. ఇంటికెళ్లాక నీకు ఉంది పో’’.. ‘‘బలే బుక్కయ్యావ్ కదా ఇక నీకు చుక్కలు చూపిస్తుంది నీ భార్య’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: పోలీసుల సలహా : 3 రోజులు భార్యతో.. 3 రోజులు ప్రేయసితో.. -
లాడ్జిలో భర్త రాసలీలలు: నగ్న వీడియోలు తీసిన భార్య
జైపూర్ (రాజస్థాన్): ఆయనో జవాన్. ఇంట్లో కట్టుకున్న భార్య ఉంది. సంసారం సాఫీగా సాగుతుండగా.. భర్త ఫోన్ కాల్స్ నిత్యం మాట్లాడుతుండడం కాపురంలో చిచ్చు రేపింది. భర్తపై ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో భర్త బయటకు వెళ్లినప్పుడు నిఘా వేసింది. ఈసారి బయటకు వెళ్లిన భర్తను వెంబడించగా ఆయన ఓ లాడ్జికి వెళ్లాడు. కొద్దిసేపటికి భార్య మారుతాళంతో లాడ్జిలోని గదిని తెరిచి చూడగా నగ్నంగా భర్త, అతడి ప్రేయసి కనిపించారు. ఈ వీడియోను తీసి ఆమె పలువురికి షేర్ చేయడంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు చూసి తనను వేధిస్తున్నారని ఆ ప్రేయసి అతడి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తన భార్యతో కలిసి జైపూర్‌లో నివసిస్తున్నాడు. భార్య ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. అయితే ఆమె భర్తకు ఓ ప్రేయసి ఉంది. ఆమెతో తరచూ మాట్లాడుతుండడంతో అతడి భార్యకు అనుమానం వచ్చింది. తన భర్తకు వేరొకరితో సంబంధం ఉందని గుర్తించిన ఆమె భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భర్త ఫోన్లో మాట్లాడుతూ.. పలానా చోటకు రమ్మని తన ప్రేయసికి చెప్పాడు. ఇది తెలుసుకున్న భార్య కొద్దిసేపటికి భర్త వెళ్లిన లాడ్జికి వెళ్లింది. లాడ్జి నిర్వాహకులతో మాట్లాడి వారు ఉన్న గది మారుతాళం తీసుకుని పైకి వెళ్లింది. పోలీసుల సహాయంతో తాళం తెరచి చూడగా ఇద్దరూ భర్త, అతడి ప్రేయసి నగ్నంగా ఉన్నారు. ఈ దృశ్యాలను వీడియో తీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీసిన వీడియోను పలువురికి పంపండంతో అవి నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. రాజస్థాన్‌లో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఆ వీడియోలు బయటకు రావడంతో తన పరువు పోయిందని అతడి ప్రేయసి ఉల్టా భార్యపై ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలు చూసి తన బంధువులు మనస్తాపానికి గురయ్యాయని వాపోయింది. ప్రస్తుతం ఈ పంచాయితీ శాస్త్రీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పక్కా ప్లాన్.. కానీ గేటుకు తాళం..!
తణుకు: ఒంటరిగా ఉన్న వృద్ధురాలి నుంచి బంగారాన్ని దోచుకోవాలని పన్నాగం పన్నారు.. అందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకుని ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశారు.. ఇందుకు మారణాయుధాలను సిద్ధం చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోకి చొరబడ్డారు. అయితే ప్లాన్ తిరగబడింది. అనుకోకుండా నిందితులంతా ఇంట్లో ఉండగానే వృద్ధురాలు గేటుకు తాళం వేసింది. అనూహ్యంగా పోలీసులకు చిక్కడంతో కథ అడ్డం తిరిగింది. చివరికి నలుగురు నిందితులు కటకటాలు లెక్కిస్తున్నారు. తణుకు పట్టణంలో ఈనెల 28వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ వివరాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఆపై... తణుకు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆంజనేయ కాంప్లెక్స్‌లో శ్రీనివాసా టీకార్నర్ నడుపుతున్న ఎన్ని శ్రీనివాసరావు అలియాస్ శ్రీను గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గతంలో కొండూరి వారి వీధిలో వృద్ధురాలు నాగులకొండ శాంతకృష్ణవేణి ఇంట్లో పై అంతస్తులో శ్రీనివాసరావు కుటుంబం అద్దెకు ఉండేవారు. ఇదిలా ఉంటే కృష్ణవేణి నలుగురు కుమారులు బంగారం వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు షాపులకు సంబంధించిన తాళాలు తల్లి ఇంట్లో ఉంచి ఉదయాన్నే తీసుకెళుతుంటారు. కృష్ణవేణి మాత్రం ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది. అయితే ప్రతిరోజు బంగారు నగలు ఇంట్లో ఉంచుతున్నారని భ్రమ పడిన శ్రీనివాసరావు ఎలాగైనా బంగారాన్ని అపహరించుకుపోవాలని ప్రణాళిక చేశాడు. విజయవాడకు చెందిన తన మేనల్లుడు పిల్లా రామును సంప్రదించగా అతడి స్నేహితులు ఏలూరు ఖండ్రికగూడేనికి చెందిన దొండపాటి రాజు అలియాస్ చిన్నోడు, విజయవాడకు చెందిన ఇప్పిలి మురళితో కలిసి శ్రీనివాసరావు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందుకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తానని శ్రీనివాసరావు నమ్మబలికాడు. ఈనెల 28న పిల్లా రాము తణుకు రైల్వేస్టేషన్ వద్ద ఉండగా మిగిలిన ముగ్గురు మూడు కత్తులు, నైలాన్ తాళ్లు తీసుకుని కృష్ణవేణి ఇంటికి వెళ్లారు. అడ్డం తిరిగిన కథ కృష్ణవేణి ఇంటి çపరిసరాలు అణువణువూ తెలిసిన శ్రీనివాసరావు తనతో పాటు రాజు, మురళిలను తీసుకుని రాత్రి 9 గంటలకే ఇంటిపైకి చేరుకున్నాడు. కృష్ణవేణి కుమారులు ఇంటికి వచ్చి తిరిగి వెళ్లే వరకు వేచి చూసిన వీరు కిందికి దిగి కృష్ణవేణి గది తలుపులు కొట్టారు. అయితే కృష్ణవేణితో పాటు మనవరాలు భావన కూడా ఇంట్లోనే ఉంది. కృష్ణవేణి అప్పటికే బయట గేటు తాళం వేయడంతో అసలు మీరు లోపలకు ఎలా వచ్చారని భావన ప్రశ్నించింది. దీంతో అయోమయంలో పడిన నిందితులు తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. కృష్ణవేణి తన కొడుకు నాగులకొండ బాలాజీకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో వీరు పారిపోయేందుకు పై అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించారు. శ్రీనివాసరావు, మురళిలు తప్పించుకోగా రాజు స్థానికుల చేతికి చిక్కాడు. ఇతడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. దొండపాటి రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం చెప్పాడు. ఒకవేళ శ్రీనివాసరావును కృష్ణవేణి గుర్తుపడితే ఆమెను హత్య చేయడానికి సైతం తమతో పాటు కత్తులు, తాళ్లు తీసికెళ్లినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. నాగులకొండ బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ డీఎస్ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో సహకరించిన ఎస్సైలు కె.శ్రీనివాసరావు, పి.ప్రేమ్‌రాజు, క్రైం పార్టీ సిబ్బంది సత్యనారాయణ, అన్వర్, మహేష్, అక్బర్‌లాల్, వెలగేశ్వరరావులను జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు అభినందించారు. -
ఇద్దరు చైన్ స్నాచర్లకు దేహశుద్ధి..!
ఇద్దరు చైన్ స్నాచర్లు ఒకేరోజు ఇద్దరు మహిళల మెడల్లోంచి రెండు బంగారు గొలుసులను చోరీ చేశారు. వర్ని మండలం మోస్రాలో ఒకటి, నిజామాబాద్ రూరల్ మండలం లింగితండా వద్ద మరో మహిళ మెడలోని బంగారు గొలుసులను చోరీ చేశారు. చివరకు ఎడపల్లి మండలం ఠాణాకలాన్ వద్ద గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించారు. ఎడపల్లి(బోధన్): మండలంలోని ఠాణాకలాన్‌వాసులు మంగళవారం ఇద్దరు చైన్స్నాచర్లను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వర్ని మండలం మెస్రాలో రోడ్డుపై వెళుతున్న మహిళతోపాటు నిజామాబాద్ రూరల్ మండలం లింగితండా వద్ద మరో మహిళ మెడలోంచి రెండు చైన్లను తెంపుకుని కుర్నాపల్లి మీదుగా ఠాణాకలాన్ వైపు బైక్‌పై పారిపోతున్న వారిని గ్రామస్తులు పట్టుకున్నారు. మోస్రా, కుర్నాపల్లి గ్రామస్తులు ఫోన్లో పారిపోతున్న చైన్‌స్నాచర్ల వివరాలను ఠాణాకలాన్వాసులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు చైన్స్నాచర్లను సాహసించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితులతో ఎస్ఐ టాటాబాబు మాట్లాడి వర్ని పోలీసులకు చైన్స్నాచర్లను అప్పగించారు. సాహసంతో పట్టుకున్న ఠాణాకలాన్వాసులను పోలీసులు అభినందించారు. వర్ని(బాన్సువాడ): మండలంలోని మోస్రాలో బస్టాండ్ వద్ద నిలబడిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును మంగళవారం దుండగులు ఎత్తుకెళ్లినట్టు స్థానికులు తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన మహిళ మోస్రాలోని బంధువుల ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో బస్టాండ్ వద్దకు రాగానే ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి మెడలోని గొలుసు తెంపుకుని పరారయ్యారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వారిని వెంబడించారు. విషయం తెల్సుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
వివాహేతర సంబంధం బయటపడిందని..
మేడ్చల్: పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వ్యక్తి భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో అవమానం భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అక్బార్జాపే ట్ గ్రామానికి చెందిన పద్మారావు ఆదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబం ధం కొనసాగిస్తున్నాడు. ఈనెల 20న అతను సదరు మహిళతో కలిసి తుర్కపల్లి బస్‌స్టాండ్‌లో నిలిచి ఉండగా అదే సమయంలో అక్కడికి వచ్చిన పద్మారావు భార్య శిరీష వారిని నిలదీసింది. అనంతరం పద్మారావు భార్య, ఆ మె స్నేహితురాలిని కారులో ఘనాపూర్ క్షేత్రగి రి వెంకటేశ్వర గుడి వద్ద దించి ఇంటికి వచ్చా డు. శుక్రవారం గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నం పెట్టిన దుకాణానికే కన్నం వేశాడు
జమ్మికుంట(హుజూరాబాద్): అన్నంపెట్టిన దుకాణానికే కన్నం వేశాడు ఓ ఘనుడు. సాయంగా ఉంటాడని గుమాస్తాను పెట్టుకుంటే డమ్మీతాళం చెవి సృష్టించి రెండు నెలలుగా బంగారం, నగదు అపహరిస్తున్నాడు. బుధవారం యజమాని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. జమ్మికుంట పట్టణంలోని గాంధీచౌక్ వద్ద కాసుల శేషు బంగారం దుకాణం ఉంది. యాజమాని శేషు పట్టణంలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన రామకృష్ణను నాలుగు మాసాల క్రితం గుమాస్తాగా పెట్టుకున్నాడు. రామకృష్ణ షాపు కౌంటర్ తాళాలను పరిశీలించి యాజమాని లేని సమయంలో దొంగతనం చేసేందుకు కౌంటర్ తాళానికి డమ్మీ తాళం చెవిని తయారుచేశాడు. యాజమాని కౌంటర్‌కు తాళం వేసుకొని వెళ్లిన సమయంలో డమ్మీ తాళంచెవితో కౌంటర్ తాళాలు తీస్తూ్త అందులోని నగదు, బంగారం, వెండి వస్తువులు అపహరించేవాడు. ఈ విషయమై అనుమానం వచ్చిన శేషు అతడి కదలికలపై నిఘా పెట్టాడు. బుధవారం సాయం త్రం శేషు బయటకు వెళ్లినట్లు నటించి దుకాణంలో ఉన్న గుమాస్తాను పరిశీలించాడు. ఇదే సమయంలో రామకృష్ణ జేబులో ఉన్న డమ్మీతాళం చెవితో కౌంటర్ తీసి అందులో రూ. 6వేల నగదు, కొంత బంగారాన్ని తీసి జేబులో పెట్టుకున్నాడు. గమనించిన వ్యాపారి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు అప్పగించాడు. ఇప్పటి వరకు రూ. 50 వేల నగదు, రెండు కిలోల వెండి, 12జతల బంగారు కమ్మలు పోయినట్లు శేషు పోలీసులకు వెల్లడించాడు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీడీ
కరీంనగర్ : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) పెరిక యాదయ్య ఏసీబీకి చిక్కారు. కూరగాయల కాంట్రాక్టర్ కనకయ్యకు ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు వంట వండే క్యాటరింగ్ పర్మిషన్ ఇచ్చేందుకు డీడీ యాదయ్య రూ.1.30 లక్షలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కనకయ్య ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. దీంతో పధకం ప్రకారం యాదయ్యను అరెస్ట్ చేసేందుకు వ్యూహం పన్నారు. అనుకున్న విధంగా రాంనగర్లో కనకయ్య రూ.లక్ష ఇస్తుండగా యాదయ్యను పట్టుకున్నారు. మధ్యవర్తిగా వెళ్లిన లక్ష తీసుకున్న అటెండర్ శ్యామ్ సుందర్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డబ్బులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మీర్‌పేటలో భర్తను చితకబాదిన భార్య
-
ఏసీబీకి చిక్కిన సివిల్ డీజీఎం
కరీంనగర్ : ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. కరీంనగర్ జిల్లా ఆర్జీబీ - 2 సివిల్ డీజీఎం మధుసూదన్... కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి లంచం కింద తీసుకున్న రూ. 20 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మధుసూదన్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. బిల్లుపై సంతకం చేయాలంటే రూ. 20 వేలు లంచం కింద చెల్లించాలని సివిల్ డీజీఎం మధుసూదన్... కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్నీ మధుసూదన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
గాంధీ ఆస్పత్రిలో నకిలీ లేడీ డాక్టర్
-
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
-
నయనతార బెడ్రూంలో దొరాకలని..
-
ఏసీబీ వలలో డీఈ
రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత రాయచోటి : ఏసీబీ వలలో ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ రంగప్రసాద్ చిక్కాడు. కాంట్రాక్టర్ వద్దనుంచి రూ. 5 వేలు లంచంగా తీసుకుంటూ బుధవారం సాయంత్రం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి కధనం మేరకు.. సుండుపల్లె మండలం పత్తివాండ్లపల్లెకు చెందిన కె. కృష్ణారెడ్డి రూ. 2 లక్షల జెడ్పీ నిధులతో వాయల్పాటివాండ్లపల్లెలో పైప్ లెన్ పనులు చేశాడు. ఆ పనులకు బిల్లు పొందేందుకు ఎంబుక్ పూర్తి చేసి డీఈకి అందజేశారు. దానిపై సంతకం చేసేందుకు 4 శాతం లంచం ఇవ్వాలని డీఈ అడిగాడు. చివరకు రూ. 5 వేలైనా ఇవ్వకపోతే సంతకం పెట్టేదిలేదన్నాడు. బిల్లు కోసం పలుమార్లు డీఈ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు అందించిన రూ. 5 వేలను డీఈ రంగప్రసాద్‌కు కృష్ణారెడ్డి అందజేశారు, అప్పటికే సిద్ధంగా ఉన్న ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి డీఈ రంగప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డితో పాటు సీఐలు పార్థసారధిరెడ్డి రాంకిషోర్,సుధాకర్‌రెడ్డి,లక్ష్మీకాంత్‌రెడ్డి,చంద్రశేఖర్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శంకర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఏ శాఖలోనైనా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ్రప్రభుత్వ జీతం తీసుకుంటున్న ఉద్యోగులు నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. కాంట్రాక్టరు క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ విల్లు కోసం తాను అనేక సార్లు డీఈ రంగప్రసాద్‌ను కలిశానన్నారు. లంచం ఇవ్వనిదే తాను సంతకం పెట్టనని చెప్పాడన్నారు. దీంతో విధిలేని పరిస్థితులో తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.