కరీంనగర్ : ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. కరీంనగర్ జిల్లా ఆర్జీబీ - 2 సివిల్ డీజీఎం మధుసూదన్... కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి లంచం కింద తీసుకున్న రూ. 20 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మధుసూదన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
బిల్లుపై సంతకం చేయాలంటే రూ. 20 వేలు లంచం కింద చెల్లించాలని సివిల్ డీజీఎం మధుసూదన్... కాంట్రాక్టర్ను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్నీ మధుసూదన్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.