madhusudhan
-
అమెరికాలో సగం సినిమా
ఆదర్శ్ పుందిర్, అశ్రిత్ రెడ్డి, ప్రియాంకా సింగ్, పూజిత పుందిర్, రాజ్ గౌడ్, సునందిని, మధుసూదన్ కీలక పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. ఘంటసాల విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తు న్నారు. స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్, సెటిల్ కింగ్ ప్రొడక్షన్‌పై వేణుబాబు నిర్మిస్తున్నారు. ఘంటసాల విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘టెక్నాలజీ, భావోద్వేగాలు, లింగ సమానత్వం నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. డిసెంబరు 26న ఆరంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ 50 శాతం పూర్తయింది. మిగతా సగభాగం షూటింగ్ కోసం అమెరికా వెళ్తున్నాం’’ అన్నారు. ప్రియాంకా సింగ్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో దర్శక–నిర్మాతలు నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు రావడం లేదు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో టెక్నాలజీ అనేది కీలక ΄ాత్ర పోషించబోతోంది’’ అన్నారు ఆదర్శ్ పందిరి. ‘‘లింగ సమానత్వంపై వినోదాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అని పూజిత పుందిర్, నటుడు అశ్రిత్ రెడ్డి చెప్పారు. కెమెరామేన్ దిలీప్ కుమార్ చిన్నయ్య మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: పవన్ చరణ్, జీవీ. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ హౌస్ అరెస్ట్
-
బలగం నటుడి షార్ట్ ఫిలిం.. ఎలా ఉందంటే?
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనుకునే ఆస్తికులు.. సైన్స్ తప్ప ఈ బ్రహ్మాండాన్ని ఏది నడిపించదు అనుకునే నాస్తికులు.. ఎవరిది నిజం అని చెప్పే ప్రయత్నమే 'బస్‌లో టైం ట్రావెల్' అనే షార్ట్ ఫిలిం. బలగం నటుడు మీమె మధు, ఆకాశవాణి ప్రభు, కనకరెడ్డి, అన్నపూర్ణ, కిట్టు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్‌కుమార్ జాణ దర్శకత్వం వహించగా నరేశ్ సముద్రాల నిర్మించాడు. ఈ షార్ట్ ఫిలిం ఎలా ఉందో చూసేద్దాం.. డబ్బులొచ్చాక కళ్లు నెత్తికి.. కోటేశ్వరరావు.. కటిక పేదవాడు.. అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరుడయ్యాడు. కానీ డబ్బుతో పాటు అహం, పొగరు, చెడు అలవాట్లు అన్నీ అలవడ్డాయి. కుటుంబాన్ని సైతం లెక్కచేసేవాడు కాదు. అతడి జీవితంలో జరిగిన ఓ విచిత్రమే ఈ షార్ట్ ఫిలిం. అప్పటివరకు కళ్లు నెత్తి మీదున్న కోటేశ్వరరావుకు ఒక్క బస్ జర్నీతో తను చేసిన తప్పులేంటో తెలుసుకుంటాడు. ఒక్క జర్నీతో తప్పు తెలుసుకుని.. పైసా పిచ్చితో కుటుంబాన్ని, జనాలను ఎంత టార్చర్ పెట్టాడో అర్థం చేసుకుంటాడు. ఇంటికి వెళ్లి చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తాడు. ఒక్కసారిగా మారిపోతాడు. అవమానించిన వాళ్లను ప్రేమించడమే గొప్ప.., సంపాదించడమే గొప్ప అయితే సాటి మానవుడి ఆకలి తీర్చడం అంతకంటే గొప్ప, కనబడని దేవుడిని వెతకకు.. నీలో ఉన్న దేవుడిని వెతుక్కో.. వంటి డైలాగులు బాగున్నాయి. అప్పుడు మనిషే దేవుడు "ప్రతి జీవి దానికి కనిపించే ప్రపంచాన్ని మాత్రమే చూస్తుంది. మనిషి దృష్టిలో చీమెంతో, దేవుడి దృష్టిలో మనిషి కూడా అంతే! దేవుడు ఉన్నాడా లేదా అని కనీసం మనుషులుగా వాదించుకుంటున్నాం. మిగతా జీవులన్నిటికి అసలు ఈ వాదనలు కూడా లేవు. ఎందుకంటే దేవుడి కాన్సెప్టే వాటికి తెలియదు. అందుకే కనబడని దేవుడు ఏదో చేస్తాడని చూడక, దేవుళ్ల పేరుతో ఖర్చు పెట్టే కోట్ల డబ్బులో కొంత పేదవారికి ఖర్చు పెట్టండి. అప్పుడు మనిషే దేవుడు అవుతాడు. సాటి మనిషికి సాయం చేసిన వాడే దేవుడు అని చెప్పడం.. బతికే ఈ చిన్న జీవితంలో గొడవలు, కొట్లాటలు, కుళ్లు కుతంత్రాలు మాని అందరితో కలిసి మెలిసి బతకాలని చెప్పడమే.. మా ఈ షార్ట్ ఫిల్మ్ ఉద్దేశ్యం" అని చివర్లో గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఈ షార్ట్ ఫిలింను కింద మీరూ చూసేయండి.. -
విడిపోయిన రాష్ట్రాన్ని కలపడం అసాధ్యం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘తెలంగాణ విడిపోవడం మాకు ఇష్టం లేదు.. ఉమ్మడి రాష్ట్రమే మా వైఎస్సార్ సీపీ విధానమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు.. విడిపోయిన రాష్ట్రాన్ని కలపడం అసాధ్యం’అని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఖమ్మంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ బిడ్డల కోపాగ్నికి మరోసారి గురికావద్దని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకోసం కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వంతో కలసి రావాలని సూచించారు. ఇలాంటి దుర్మార్గమైన ప్రకటనలు ఇవ్వడం బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డికి సరికాదన్నారు. బీజేపీ పన్నుతున్న కుట్రలో ఏపీ ప్రభుత్వం పావు కావొద్దని హితవు పలికారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని, తల్లీబిడ్డలను విడదీశారంటూ పలుమార్లు తెలంగాణ అస్థిత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేశారన్నా రు. షర్మిల కూడా మోదీ మాటలే చెబుతున్నారని ఆరోపించారు. ఏపీలో కలిసిన ఏడు మండలాలను తెలంగాణలో తిరిగి కలపాలని, దీనిపై కొట్లాడటానికి ఏపీ నేతలు కలసి రావాలని కోరారు. -
నిజమైన రైతులను అవమానిస్తున్నారు
-
నువ్వా.. నేనా.. అన్నాడీఎంకేలో పోటాపోటీ!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో కీలకమైన ప్రిసీడియం చైర్మన్ పోస్టును చేజిక్కించుకునేందుకు నేతలు ఆపార్టీ నేతలు నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. రేసులో మొత్తం ఏడుగురు నేతలు ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం ముగ్గురి మధ్య ఉంది. ఇప్పటి వరకు వళ్లి ముత్తు, నావలన్ నెడుంజెలియన్, పొన్నయ్యన్, పుదుమై పిత్తన్, కాళి ముత్తు, మధుసూదనన్ వంటి నేతలు ప్రిసీడియం చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో మధుసూదనన్ ఒకటిన్నర దశాబ్దం ఆ పదవిలో కొనసాగారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన మరణించారు. దీంతో ఈ పదవిపై సీనియర్ల దృష్టి పడింది. ప్రస్తుతం అన్నాడీఎంకేలో సమన్వయ కమిటీ కీలకంగా ఉన్నప్పటికీ, కోర్టుల్లో పార్టీ పరంగా ఉన్న వ్యవహారాల్ని ఎదుర్కొనడం, ఎన్నికల కమిషన్‌తో ముడిపడిన అంశాలన్నీ ప్రిసీడియం చైర్మన్ గుప్పెట్లోనే ఉంటాయి. ప్రధాన పోటీ వారిమధ్యేనా? ఎన్నికల్లో ఓటమి తర్వాత పదవులు లేకుండా ఖాళీగా ఉన్న సీనియర్లు ఈ పదవి కోసం తీవ్రంగానే పావులు కదుపుతున్నారు. సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామికి సన్నిహితంగా ఉన్న నేతలు ఆశావహుల జాబితాలో ఉన్నారు. జేసీడీ ప్రభాకర్, తమిళ్ మగన్ హుస్సేన్, సయ్యద్ ఖాన్, అన్వర్ రాజా, అరుణాచలం, వేనుగోపాల్, ధనపాల్ రేసులో ఉన్నారు. అయితే ధనపాల్, అన్వర్ రాజా, తమిళ్ మగన్ హుస్సేన్ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు భావిస్తున్నారు. అన్వర్, హుస్సేన్ మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన నేతలు. వీరిలో ఒకరికి పదవి కట్టబెడితే.. మరొకరు వ్యతిరేకించే అవకాశం ఉంది. ధనపాల్ వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాగా మధుసూదనన్ దివంగత అమ్మ జయలలిత మెచ్చిన ప్రిసీడియం చైర్మనే కాదు, పన్నీరుసెల్వం మద్దతు దారుడు కూడా. దీంతో ఈసారి కూడా తన వర్గీయులకే ఆ పదవి కట్టబెట్టేందుకు పన్నీరు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. చదవండి: Tamilnadu: రూ.7 వేల కోట్ల భారం.. అందుకే 60 ఏళ్లకే రిటైర్మెంట్ -
Tamil Nadu: అన్నాడీఎంకేలో విషాదం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్(81) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారం అన్నాడీఎంకే వర్గాల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడు రోజులపాటు సంతాపదినాలు పాటించేందుకు సమన్వయ కమిటీ నిర్ణయించింది. జీవించి ఉన్నంత కాలం, ఆయనే పారీ్టకి శాశ్వత ప్రిసీడియం చైర్మన్ అని జయలలిత వద్ద ముద్రపడ్డ నాయకుడు మధుసూదనన్. దివంగత ఎంజీఆర్‌కు వీరాభిమానిగా, ఉత్తర చెన్నై అన్నాడీఎంకేలో కీలక నేతగా, మాజీ మంత్రిగా, పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా అన్నాడీఎంకేలో కీలక పదవుల్లో ఉన్న మధుసూదనన్ మూడు నెలలుగా అనారోగ్య సమస్యలు, వయోభారంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారంతో అన్నాడీఎంకే వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం పారీ్టకి తీరని లోటుగా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కనీ్వనర్ పళనిస్వామి ప్రకటించారు. మూడు రోజులు సంతాప దినం పాటించేందుకు నిర్ణయించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణా టక, కేరళ రాష్ట్రాల్లో పార్టీ, అనుబంధ విభాగాల తరఫున అన్ని కార్యక్రమాలు రద్దు చేశారు. విశ్వాసపాత్రుడు.... ఎంజీఆర్ అంటే మధుసూదనన్‌కు వీరాభిమానం. తన 14వ ఏట ఉత్తర చెన్నై వేదికగా ఎంజీఆర్‌కు అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి తెరపైకి వచ్చారు. 1972లో అన్నాడీఎంకే ఆవిర్భావంతో ఉత్తర చెన్నై అన్నాడీఎంకేలో కీలక నేతగా అవతరించారు. ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత వెన్నంటి నడిచిన ఆయన 1991లో ఆర్కేనగర్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ కాలంలో చేనేత శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2007లో ఆయన్ను అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా జయలలిత నియమించారు. జీవించి ఉన్నంత కాలం ఆయనే పారీ్టకి ప్రిసీడియం చైర్మన్ అని స్వయంగా జయలలిత అప్పట్లో ప్రకటించారు. పార్టీ వ్యవహరాలను చివర్లో ఆయనతో చర్చించినానంతరం ప్రకటన రూపంలో జయలలిత విడుదల చేసేవారు. జయలలిత మృతి తర్వాత పరిణామాలతో మాజీ సీఎం పన్నీరుసెల్వం వెన్నంటి నడిచారు. తర్వాత పన్నీరు, పళనిల ఏకంతో అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గానే వ్యవహరిస్తూ వచ్చారు. ఈ వివాదాల నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ, చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ మధుసూదనన్ చేతిలో అప్పగించడం గమనార్హం. ఆయన ప్రిసీడియం చైర్మన్ అన్న పదవితోనే చివరి శ్వాసను విడిచారు. ఆయన పారి్థవదేహాన్ని తండయారుపేటలోని ఆయన నివాసంలో ఆప్తులు, పార్టీ వర్గాల సందర్శన నిమిత్తం ఉంచారు. శుక్రవా రం సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. -
అందమైన లవ్‌స్టోరీ
అర్జున్, మధుసూదన్, పావని ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అందమా అందుమా’. శ్రీ కృపామణి ఫిలిమ్స్ పతాకంపై ప్రళయ కావేరి మధుసూదన్‌రావు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. ప్రళయ కావేరి మధుసూదన్‌రావు మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది. యువతరంతో పాటు కుటుంబమంతా కలసి చూసేలా ఉంటుంది. కథానుగుణంగా ఉన్న నాలుగు ఫైట్స్‌ని అవినాష్ మాస్టర్ చక్కగా కంపోజ్ చేశారు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. పావని ఇప్పటి వరకూ పలు సినిమాలు చేసినా ఇందులో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశారు. అర్జున్‌కి మంచి పేరుతో పాటు నటుడిగా మరిన్ని అవకాశాలు వస్తాయి. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కథ పరంగా సాగుతుంది. మా సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. ఆత్రేయ, కెమెరా: ధీరజ్. -
తొలిరౌండ్లో దినకరన్ ముందంజ
-
లైవ్ అప్ డేట్స్.. అనూహ్యంగా స్వరం మార్చిన అన్నాడీఎంకే నేతలు
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో అన్నాడీఎంకే స్వతంత్ర్య అభ్యర్థి టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్ కి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తున్నాడు. అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులకు పోలైన ఓట్లు మొత్తం కలిపినా ఆయన కంటే చాలా తక్కువ నమోదు కావటం విశేషం. దినకరన్ గెలుపు ఖాయమైపోతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు ఒక్కోక్కరుగా స్వరం మారుస్తున్నారు. ఆ పార్టీ నేత సెల్లూరు రాజు మీడియాతో మాట్లాడుతూ దినకరన్ గెలుపును స్వాగతించటం విశేషం. దినకరన్ తో కలిసి పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అపార్థాల వల్లే రెండుగా విడిపోయింది. త్వరలో రెండూ ఒకటవుతాయని ఆశిస్తున్నా.. ఆ మేర నా వంతు ప్రయత్నం చేస్తా అని ఆయన తెలిపారు. అదే అభిప్రాయాన్ని మరికొందరు నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దినకరన్ ఇంటి వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే పగ్గాలు దినకరన్‌కు అప్పగించే సమయం వచ్చిందంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తూ రోడ్లపైకి చేరారు. ఫలితాలపై స్పందించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సుముఖత వ్యక్తం చేయటం లేదు. అయితే బీజేపీ మాత్రం మరో వాదనను వినిపిస్తోంది. ఓటుకు నోటు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని.. డబ్బు విచ్చలవిడిగా పంచటంతోనే దినకరన్ గెలుస్తున్నాడంటూ తమిళనాడు బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు చేశారు. సుబ్రమణియన్ స్వామి ట్వీట్... ఇక బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి తన ట్విట్టర్ లో ఆసక్తికర సందేశం ఉంచారు. ఉప ఎన్నికలో దినకరన్ గెలుస్తాడనిపిస్తోందంటూ పేర్కొన్నాడు. 2019 ఎన్నికల కోసం అన్నాడీఎంకే వర్గాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు. కాగా, మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. Dinakaran seems to have won the R K Nagar election caused by JJ death. I expect to see the two ADMK factions now to unite for 2019 LS poll — Subramanian Swamy (@Swamy39) 24 December 2017 -
శశికళకు ఝలక్ ఇచ్చిన పన్నీరు వర్గం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణం చేయడం, రేపు బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు మళ్లీ దూకుడు పెంచారు. దెబ్బకు దెబ్బ తీస్తూ, ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అన్నా డీఎంకే నుంచి శశికళను, ఆమె బంధువులు దినకరన్, వెంకటేష్‌లను బహిష్కరించారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ ఈ ముగ్గురిపై వేటు వేసినట్టు ప్రకటించారు. అమ్మ వారసత్వం కోసం, పార్టీ కోసం శశికళ, పన్నీరు సెల్వం వర్గాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. పన్నీరు సెల్వం, మధుసూదన్‌లను తొలుత శశికళ పార్టీ నుంచి బహిష్కరించగా.. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నిక చెల్లదని, తమను బహిష్కరించే హక్కు ఆమెకు లేదని మధుసూదన్ చెప్పారు. శశికళతో పాటు దినకరన్, వెంకటేష్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని మధుసూదన్ ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాయగా, ఆయన వర్గీయులు నేరుగా కలసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఈసీ పరిశీలనలో ఉంది. జయలలిత గతంలో దినకరన్, వెంకటేష్‌లను పార్టీ నుంచి బహిష్కరించారు. జయ మరణం తర్వాత శశికళ మళ్లీ వాళ్లను పార్టీలోకి తీసుకుని దినకరన్‌ను ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే బలాబలాలు తేలేది రేపే తమిళనాడుకు పళని 'స్వామి' కుటుంబపాలనను నిర్మూలిస్తాం -
శశికళకు ఝలక్ ఇచ్చిన పన్నీరు వర్గం
-
శశికళపై పన్నీరు వర్గం ముప్పేట దాడి
-
శశికళపై పన్నీరు వర్గం ముప్పేట దాడి
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం అన్నా డీఎంకే చీఫ్ శశికళపై ముప్పేటదాడిని ముమ్మరం చేసింది. శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు, పోయెస్ గార్డెన్ నుంచి ఆమెను వెళ్లగొట్టేందుకు పన్నీరు సెల్వం ఎవరూ ఊహించని విధంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తుండగా, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా ఆమెను తొలగించేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికను పరిగణనలోకి తీసుకోవద్దని కోరుతూ ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మొదట్నుంచి శశికళ శిబిరం వైపు ఉన్న మధుసూదన్ ఆమెకు ఝలక్ ఇచ్చి పన్నీరు సెల్వం గూటికి చేరిన సంగతి తెలిసిందే. పార్టీ నియమావళి ప్రకారం ప్రధాన కార్యదర్శి కావాలంటే పార్టీలో ఐదేళ్ల పాటు సభ్యత్వం కలిగి ఉండాలని ఈసీకి రాసిన లేఖలో మధుసూదన్ పేర్కొన్నారు. శశికళ 2012 మార్చిలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, ఇంకా ఐదేళ్లు పూర్తికాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికను పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. శశికళ ఎన్నికను తప్పుబడుతూ ఇటీవల ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప చేసిన ఫిర్యాదుకు స్పందించిన ఈసీ వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే అన్నా డీఎంకేను ఆదేశించింది. తాజాగా పార్టీ ప్రిసీడియం చైర్మన్ హోదాలో మధుసూదన్ లేఖ రాయడం శశికళకు సమస్యగా మారింది. సంబంధిత కథనాలు చదవండి.. శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
బైకు కొనివ్వలేదని యువకుడు..
అంబర్‌పేట: తల్లిదండ్రులు బైకు కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసకున్న సంఘటన గురువారం రాత్రి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అంబర్‌పేట రఘునాథ్నగర్కు చెందిన యాదయ్య కుమారుడు మదుసూదన్ (25) ఈ నెల 14 న బైకు కావాలని తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ తిరిగే నీకు బైకెందుకంటూ వారు నిరాకరించడంతో మనస్తాపం చెందిన అతను గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యవసాయ శాఖ అధికారులపై టీడీపీ నాయకులు దాడి
చక్రాయపేట : తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచ పచ్చచొక్క నాయకులు అధికారులపై దాడి చేసి భయోందోళన సృష్టిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారి మధుసుధన్పై తెలుగుదేశం పార్టీకి చెందిన సురభి సర్పంచ్ భర్త, అనుచరులతో వెళ్లి వ్యవసాయశాఖ అధికారిపై పురుష పదా జాలాతో చేయ్యి చేసుకొన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ అధికారిని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు పంట నష్టపోయిన పరిహారం వచ్చేందుకు తను సూచించిన పేర్లు మాత్రమే పొందుపరచాలని డిమాండ్ చేశారు. వెంటనే వ్యవసాయశాఖ అధికారి, సిబ్బంది గ్రామాలలో వెళ్లి పంట సాగు చేసిన రైతుల పొలాల్లోకి వెళ్లి పంట నష్టాన్ని నమోదు చేశామని తెలిపారు. అవన్ని తమ అవసరం లేదని, అవన్నీ తొలగించి తాము సూచించిన వారికి మాత్రమే పంట సాగు చేయకపోయిన తన అనచరులకు నష్ట పరిహారం వచ్చే విధంగా చేయాలని, ప్రభుత్వం తమదేనంటూ నేను సూచించిన పేర్లు నమోదు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వ్యవసాయ అధికారికి హెచ్చరించారు. అనంతరం వ్వవసాయశాఖ అధికారి చట్టంప్రకారం నడుచుకొంటామని పంట సాగు చేసిన వారి పేర్లు నమోదు చేశామని, మీరు ఇలా దౌర్జన్యం చేయడం మంచిది కాదని వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. -
రాష్ట్రపతి అవార్డు అందుకున్న మ«దుసూదన్‌రాజు
సత్తుపల్లి : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సత్తుపల్లి మండలం సిద్ధారం యూపీఎస్ హెచ్ఎం బి.మధుసూదన్‌రాజు సోమవారం అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డును బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో జాతీయస్థాయిలో అత్యంత గౌరవప్రదమైన అవార్డు అందుకోవడం సంతోషకరమన్నారు. తోటి ఉపాధ్యాయుల సహకారంతోనే అవార్డుకు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. -
ఏసీబీకి చిక్కిన సివిల్ డీజీఎం
కరీంనగర్ : ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. కరీంనగర్ జిల్లా ఆర్జీబీ - 2 సివిల్ డీజీఎం మధుసూదన్... కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి లంచం కింద తీసుకున్న రూ. 20 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మధుసూదన్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. బిల్లుపై సంతకం చేయాలంటే రూ. 20 వేలు లంచం కింద చెల్లించాలని సివిల్ డీజీఎం మధుసూదన్... కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్నీ మధుసూదన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న టెకీ
బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్యను హత్య చేసి, తానూ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీపీ నగర్లో ఈ విషాదకర సంఘటన జరినట్టు డీసీపీ రేవణ్ణ తెలిపారు. మధుసూదన్, ఆయన భార్య ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. శుక్రవారం రాత్రి వీరిద్దరూ ఘర్షణ పడ్డారు. సహనం కోల్పోయిన మధు తన భార్య శరీరమంతటా కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. భార్యను చంపిన తర్వాత మధు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదట సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించగా అది ఊడిపడింది. అనంతరం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా అగ్గి పెట్టె దొరకలేదు. చివరకు తాము నివాసముంటున్న భవంతిలో 13వ అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో వారి ఆరేళ్ల కుమార్తె అక్కడికి సమీపంలోని తాతయ్య ఇంట్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.