అమెరికాలో సగం సినిమా | Splash Colors Media, Alinea Avighna Studios And Settle King Production No 1 Shoot Commences | Sakshi
Sakshi News home page

అమెరికాలో సగం సినిమా

Published Sun, Jan 12 2025 1:42 PM | Last Updated on Sun, Jan 12 2025 1:54 PM

Splash Colors Media, Alinea Avighna Studios And Settle King Production No 1 Shoot Commences

ఆదర్శ్‌ పుందిర్, అశ్రిత్‌ రెడ్డి, ప్రియాంకా సింగ్, పూజిత పుందిర్, రాజ్‌ గౌడ్, సునందిని, మధుసూదన్‌ కీలక పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. ఘంటసాల విశ్వనాథ్‌ దర్శకత్వం వహిస్తు న్నారు. స్ప్లాష్‌ కలర్స్‌ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్, సెటిల్‌ కింగ్‌ ప్రొడక్షన్‌పై వేణుబాబు నిర్మిస్తున్నారు. ఘంటసాల విశ్వనాథ్‌ మాట్లాడుతూ– ‘‘టెక్నాలజీ, భావోద్వేగాలు, లింగ సమానత్వం నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. 

డిసెంబరు 26న ఆరంభమైన ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ 50 శాతం పూర్తయింది. మిగతా సగభాగం షూటింగ్‌ కోసం అమెరికా వెళ్తున్నాం’’ అన్నారు. ప్రియాంకా సింగ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో దర్శక–నిర్మాతలు నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. ఈ రోజుల్లో 
ఇటువంటి సినిమాలు రావడం లేదు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో టెక్నాలజీ అనేది కీలక ΄ాత్ర పోషించబోతోంది’’ అన్నారు ఆదర్శ్‌ పందిరి. ‘‘లింగ సమానత్వంపై వినోదాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అని పూజిత పుందిర్, నటుడు అశ్రిత్‌ రెడ్డి చెప్పారు. కెమెరామేన్‌ దిలీప్‌ కుమార్‌ చిన్నయ్య మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: పవన్‌ చరణ్, జీవీ.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement