బిగ్‌ బాస్‌ 'ప్రియాంక సింగ్‌' ఇంట్లో విషాదం | Bigg Boss Priyanka Singh Father Passed Away Due To Health Issues | Sakshi
Sakshi News home page

Priyanka Singh Father Death: బిగ్‌ బాస్‌ 'ప్రియాంక సింగ్‌' ఇంట్లో విషాదం

Published Tue, Oct 22 2024 9:14 AM | Last Updated on Tue, Oct 22 2024 10:39 AM

Bigg Boss Priyanka Singh Father Passed Away

బుల్లితెర నటి ప్రియాంక సింగ్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున ఆమె తండ్రి బీబీ సింగ్‌ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. తన తండ్రి మరణించారని సోషల్‌ మీడియా ద్వారా ప్రియాంక సింగ్‌ ఒక పోస్ట్‌ పెట్టింది. దీంతో ఆమె స్నేహితులు, అభిమానులు ధైర్యంగా ఉండాలని ఓదార్చుతున్నారు.

శ్రీకాకుళానికి చెందిన ప్రియాంక సింగ్‌  ట్రాన్స్‌జెండర్‌ అని తెలిసిందే. సాయితేజగా ఉన్న తను లింగమార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారిపోయారు. అయితే, తాను ట్రాన్స్ జెండర్‌గా మారిన విషయం మొదట తల్లిదండ్రులకు చెప్పలేదు. చాలా కాలం పాటు తన తండ్రి వద్ద ఈ విషయాన్ని దాచారు. అయితే, బిగ్‌బాస్‌5 హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో తానొక ట్రాన్స్‌జెండర్‌ అనే విషయం తన తండ్రికి తెలియాలని ఎమోషనల్‌ అయ్యారు. బిగ్‌బాస్‌ వేదికగా తన తండ్రికి తాను ట్రాన్స్ జెండర్‌ చేయించుకున్నట్టు, అమ్మాయిగా మారిపోయినట్టు తెలిపారు.

కొంత కాలం తర్వాత ప్రియాంక సింగ్‌ నిర్ణయాన్ని బీబీ సింగ్‌ కూడా గౌరవించారు. తన తండ్రికి ఓ ప్రమాదంలో కళ్లుపోతే .. అన్నయ్యలు, చెల్లెల్లు తమకు పట్టనట్లు ఉండటంతో తానే తల్లిదండ్రుల బాధ్యతలు స్వీకరించినట్లు ప్రియాంక చెప్పింది. ఈ క్రమంలో వారికి ప్రియాంక సొంత ఇల్లు కూడా కట్టించారు. ఎంతో ఇష్టమైన తన తండ్రి మరణంతో ప్రియాంక సింగ్‌ కన్నీటి పర్యంతం అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement