బుల్లితెర నటి ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇదిలా ఉండగా ప్రియాంక సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే కొన్ని రోజుల కిందట ఆమె తన అమ్మానాన్నలతో కలిసి పూజా చేస్తూ ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. దీనికి ఇట్స్ డన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అయితే తాజాగా హల్దీ ఫంక్షన్‌లో తళుక్కుమంది. ఎల్లో కలర్ లెహంగాలో పెళ్లికూతిరిలా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కంగ్రాట్స్ ప్రియాంక అంటూ పలువురు నెటిజన్లు ఆమెకు విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment