
Pinky Proposes To Maanas Unseen Video Goes Viral: బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కొందరు కంటెస్టెంట్లకు సైతం అప్పటివరకు రాని గుర్తింపు బిగ్‌బాస్ ద్వారా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే వంద రోజులకు పైగా సాగే బిగ్‌బాస్ హౌస్‌లో లవ్‌ట్రాక్‌లు కూడా సహాజమే. అప్పటివరకు ఎలాంటి కనెక్టివిటి లేని వాళ్లు సైతం బెస్ట్‌ఫ్రెండ్స్‌గా మారిపోతారు. మరికొందరేమో ఆ రిలేషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారు.
తాజాగా ప్రియాంక సింగ్(పింకీ) అలాంటి ప్రయత్నమే చేసింది. రోజురోజుకి మానస్‌పై పెంచుకుంటున్న ప్రేమను బయటపెట్టేసింది. సోమవారం(నవంబర్22)న జరిగిన ఎపిసోడ్‌లో పింకీ మానస్‌కి ప్రపోజ్ చేసింది. 'నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అనిపిస్తుంది. మొదటి రోజు నుంచి నిన్ను చేస్తుంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది.
ఇది కరెక్ట్ కాదన్న సంగతి నాకు తెలుసు కానీ నీ విషయంలో నాకు బాగా అనిపిస్తుంది' అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. ఇది బిగ్‌బాస్ అన్‌సీన్‌లో ప్లే అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment