Maanas
-
అమ్మలా ప్రేమను పంచాడు, నెత్తిన పెట్టుకున్నాడు: విష్ణుప్రియ లవ్‌స్టోరీ
అవినాష్‌ను తక్కువ అంచనా వేసిన నబీల్, ప్రేరణకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. ఇచ్చిన రెండు గేమ్స్‌లోనూ అతడే గెలిచి విన్నరయ్యాడు. కంటెండరవ్వాలనుకున్న నబీల్ రేసులోనే లేకుండా పోయాడు. అటు విష్ణుప్రియ... తన మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుంది. తన ప్రేమ కహానీని పృథ్వీతో పంచుకుంది. అదేంటో నేటి (నవంబర్ 27) ఎపిసోడ హైలైట్స్‌లో చదివేయండి..తక్కువ అంచనా వేశారుటికెట్ టు ఫినాలే కోసం హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించేందుకు మానస్, ప్రియాంక జైన్ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చారు. వీళ్లు ప్రేరణ, నబీల్ను గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేశారు. అయితే ఈ రోజు బ్రెయిన్ గేమ్‌లో నలుగురు ఆడే ఛాన్స్ ఉందంటూ మరో ఇద్దర్ని ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో ప్రేరణ, నబీల్.. ఐక్యూ అంతగా లేదు, బ్రెయిన్ గేమ్ ఆడలేరంటూ అవినాష్, పృథ్వీని సెలక్ట్ చేశారు.సుడోకు గేమ్అలా ఈ నలుగురికి సుడోకు గేమ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ముందుగా నబీల్ గంట కొట్టి గెలిచేసినంత బిల్డప్ ఇచ్చాడు. తీరా చూస్తే అన్నీ తప్పులతడకగానే ఉంది. ఏ ఒక్కరూ సుడోకు పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ అందుకుని అవినాష్ చకచకా సుడోకు పూర్తి చేసి గంట కొట్టాడు. తర్వాత ప్రేరణ, పృథ్వీ, నబీల్ గేమ్ కంప్లీట్ చేశారు. వీళ్లందరికీ బిగ్‌బాస్ కొన్ని మూటలు ఇచ్చాడు. అందులో అవినాష్‌కు 8 బాల్స్, ప్రేరణకు 6, పృథ్వీకి 5, నబీల్‌కు 4 బంతులు ఉన్నాయి.అవినాష్ గెలుపుపై నబీల్ డౌట్అవినాష్ గెలుపుపై నబీల్ అనుమానపడ్డాడు. తేజ, నువ్వేమైనా సాయం చేశావా? అని అడిగాడు. ఎవరూ సాయం చేయలేదని హౌస్మేట్స్ అందరూ క్లారిటీ ఇచ్చారు. అంతా అయిపోయాక నబీల్.. నువ్వు ఆడలేవని అనలేదు, ఎవరైనా సాయం చేశారనిపించి అడిగానంతే.. నీకు కోపం వస్తే అప్పుడే తిట్టాల్సిందంటూ అవినాష్‌కు సారీ చెప్పాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ కలిసి కామెడీ స్కిట్‌తో కడుపుబ్బా నవ్వించారు.మళ్లీ గెలిచేసిన అవినాష్అనంతరం పృథ్వీ, ప్రేరణ, అవినాష్, నబీల్.. వారు పొందిన బంతులతో నేర్పుగా సాగు- స్కోర్ పొందు అని మరో గేమ్ ఆడారు. ఈ టాస్క్‌లో అవినాష్ అందరికంటే ఎక్కువగా 43 పరుగులు చేసి గెలిచాడు. పృథ్వీ, ప్రేరణ.. 30 పరుగులు చేయగా, నబీల్ 24 పరుగులు చేశాడు. చివర్లో రెండు బంతుల్ని ఎవరికైనా ఇవ్వొచ్చు అని మానస్, ప్రియాంకకు బిగ్‌బాస్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ వాళ్లు అందుకు అంగీకరించలేదు.విష్ణుప్రియ బ్రేకప్ స్టోరీరెండు టాస్కులు గెలిచిన అవినాష్‌కు కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. నబీల్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తొలగించారు. చివర్లో విష్ణు, మానస్ కలిసి జరీజరీ పంచె కట్టి.. పాటకు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. మాజీ బాయ్‌ఫ్రెండ్ గుర్తురావడంతో అర్ధరాత్రి పృథ్వీపక్కన చేరి ముచ్చట్లు పెట్టింది విష్ణు. కలలో తనకు మాజీ బాయ్‌ఫ్రెండ్ వచ్చాడంది. బ్రేకప్ నువ్వు చెప్పావా? అని పృథ్వీ అడగ్గా.. అవును, నేనే బ్రేకప్ చెప్పానంది. తల్లి స్థానమిచ్చా..తెలీకుండా రెండు తప్పులు చేశాడు. నా మంచి కోసమే చేశాడు. నాకు తెలిస్తే భరించలేనని చెప్పలేదు. తీరా తెలిశాక నేను నిజంగా భరించలేకపోయాను. నాకోసమే కొన్ని పనులు చేసినా అవి నాకస్సలు నచ్చలేదు. అవి నా ముఖంపై చెప్పేంత ధైర్యం లేని వ్యక్తితో ఉండకూడదనుకున్నాను, బ్రేకప్ చెప్పాను. కానీ అతడికి నా తల్లి స్థానమిచ్చాను.నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడుకాబట్టి తనను చూడకుండా ఉండలేకపోతున్నాను. అతడు నా బలం. తనను హత్తుకుంటే మా అమ్మను హత్తుకున్నట్లే ఉంటుంది. నన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు. అమ్మలాగా స్వచ్ఛంగా ప్రేమించాడు అంటూ అతడి జ్ఞాపకాలను పృథ్వీతో పంచుకుంది. అయితే అతడెవరనేది మాత్రం బయటపెట్టలేదు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తండ్రయిన 'బిగ్‌బాస్' మానస్.. ఫొటోలు వైరల్
బిగ్‌బాస్ ఫేమా మానస్ తండ్రయ్యాడు. కొన్నిరోజుల క్రితమే ఇతడి భార్య శ్రీజ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా పిల్లాడికి నామకరణోత్సవం జరిగింది. ధ్రువ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా మానస్ ఇన్ స్టాలో పోస్ట్ చేసి బయటపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.మానస్ విషయానికొస్తే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలైంది. 2011లో 'ఝలక్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు, గోలీ సోడా తదితర సినిమాలు చేశాడు. కానీ పెద్దగా పేరు రాలేదు. అలా కొన్నాళ్లకు తెలుగులో బిగ్‌బాస్ 5వ సీజన్లో పాల్గొన్నాడు. ఫైనల్ వరకు వచ్చాడు గానీ విన్నర్ కాలేకపోయాడు. కానీ మంచి ఫేమ్ సంపాదించాడు.(ఇదీ చదవండి: Bigg Boss 8: 13వ వారం నామినేషన్స్.. ఆ ఇద్దరు తప్పితే!)బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత 'కార్తీకదీపం' సీరియల్లో ఆఫర్ వచ్చింది. కాకపోతే అది పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత 'బ్రహ్మముడి' సీరియల్ చేశాడు. ఇది బుల్లితెరపై సూపర్ హిట్ అయింది. అలా సీరియల్ నటుడిగా మానస్ మంచి పేరు తెచ్చుకున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది నవంబర్‌లో మానస్.. శ్రీజని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయి ఏడాది గడవక ముందే అంటే ఈ ఏడాది జూలైలో గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ పిల్లాడికి పేరు పెట్టారు. ఆ ఫొటోలు పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) View this post on Instagram A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli) -
మహేష్ బాబు మేనల్లుడి పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
కుమారుడి బర్త్ డే.. వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇటీవలే మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తండ్రి, కుమారుల కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్ణ జోడీగా హీరోయిన్గా నటించింది. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా సుధీర్ బాబు తన కుమారుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఆయన కుమారుడు చరిత్ మానస్ కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఈ రోజు నాకు ప్రత్యేకమంటూ కుమారుడిపై ప్రేమను చాటుకున్నారు. చరిత్ మానస్ పుట్టినరోజు వేడుకలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా, సోదరి మంజుల కూడా సందడి చేశారు.కాగా.. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి కుమార్తె ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని బర్త్ డే వేడుకల్లో సుధీర్ బాబు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసింది. On your special day, I want you to know how much I love and cherish you. You're growing up to be an incredible individual! Happy birthday, cherry ❤️ @Just_Charith pic.twitter.com/7HGrRdno55— Sudheer Babu (@isudheerbabu) November 22, 2024 -
‘ఓ.జి.ఎఫ్’ రెస్టారెంట్‌ను ప్రారంభించిన బిగ్‌బాస్ స్టార్ మానస్ (ఫొటోలు)
-
Maanas: అప్పుడలా.. ఇప్పుడిలా.. వాటే డెడికేషన్! (ఫోటోలు)
-
గ్రాండ్‌గా బిగ్‌బాస్ మానస్ భార్య సీమంతం ఫంక్షన్ (ఫోటోలు)
-
త్వరలో తండ్రి కాబోతున్న బిగ్‌బాస్ మానస్
బిగ్‌బాస్ ఫేమ్, నటుడు మానస్ గుడ్‌న్యూస్ చెప్పాడు. త్వరలోనే తండ్రిని కాబోతున్నట్లు వెల్లడించాడు. భార్య శ్రీజ ప్రస్తుతం గర్భిణి అన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా మా మనసులు పర్ఫెక్ట్గా కలిశాయి. ఇప్పుడు మా కుటుంబంలోకి ఓ బుజ్జాయి రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. బేబీ నాగులపల్లి వచ్చేస్తున్నాడు అంటూ శ్రీజ బేబీ బంప్ ఫోటో షేర్ చేశాడు. వారం రోజుల క్రితమే శ్రీజకు ఘనంగా సీమంతం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. ఇకపోతే గతేడాది నవంబర్‌లో చెన్నైకి చెందిన శ్రీజను మానస్ పెళ్లి చేసుకున్నాడు. నెల తిరిగేలోపు కొత్త కారు కూడా కొన్నాడు. ఇప్పుడు ఏడాది తిరగకముందే శ్రీజ గర్భం దాల్చిందన్న గుడ్ న్యూస్ చెప్పాడు.కాగా మానస్.. కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు. తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొని టాప్ 5 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచాడు. బ్రహ్మముడి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli) చదవండి: 23 కిలోలు తగ్గా.. అప్పటినుంచే ఎక్కువ ఆఫర్లు: బాలీవుడ్ నటి -
ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ షో, తెలుగు సీరియల్ ప్రేక్షకులకు మానస్‌ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. ఇప్పుడు సీరియల్స్‌లో నటిస్తూ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడేమో ఏకంగా ఖరీదైన బెంజ్ కారు కొనేశాడు. ఇంతకీ ఆ కారు రేటు ఎంతంటే? (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) 'కాయ్ రాజా కాయ్', 'ప్రేమికుడు' తదితర సినిమాల్లో మానస్ హీరోగా నటించాడు. కానీ బిగ్ స్క్రీన్ పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్ 5వ సీజన్లో పాల్గొని ఫినాలే వరకు వచ్చాడు కానీ విజేతగా నిలవలేకపోయాడు. అయితేనేం ఫేమ్ తెచ్చుకుని 'బ్రహ్మముడి' అనే సీరియల్‌తో బుల్లితెర హీరోగా మారిపోయాడు. నవంబరు 23న చెన్నెకి చెందిన శ్రీజ అనే అమ్మాయిని మానస్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నెల తిరిగేలోపు ఖరీదైన బెంజ్ ఎఫ్220డీ కారుని కొనుగోలు చేశాడు. ఇదే విషయాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు. అయితే ఈ కారు ఖరీదు.. దాదాపు రూ.85-90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా సరే మొన్నే పెళ్లి చేసుకుని, ఇప్పుడు కారు కూడా కొనేశాడు. అదిరిందయ్యా చంద్రం! (ఇదీ చదవండి: మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఒక్కటిగా కనిపించిన ఆ ఇద్దరు!) -
Maanas Nagulapalli Srija Wedding: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన 'బిగ్ బాస్' మానస్ (ఫొటోలు)
-
Maanas-Srija Reception: గ్రాండ్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్ మానస్ రిసెప్షన్ (ఫోటోలు)
-
Maanas-Srija Marriage: బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు మానస్ పెళ్లి (ఫోటోలు)
-
పెళ్లిబంధంతో ఒక్కటైన బ్రహ్మముడి సీరియల్ నటుడు..!
బిగ్‌బాస్ ఫేమ్, నటుడు మానస్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హల్దీ వేడుకతో మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు విజయవాడలోని ఓ రిసార్ట్స్ వేదికగా ఘనంగా జరిగాయి. చెన్నైకు చెందిన శ్రీజ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లికి ఇరువర్గాల కుటుంబసభ్యులు, నటీనటులు, ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఈ జంట సెప్టెంబర్ 2న నిశ్చితార్థం చేసుకున్నారు. (ఇది చదవండి: ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?) కాగా.. కోయిలమ్మ అనే సీరియల్ ద్వారా మానస్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించారు. ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ -5లో ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ప్రస్తుతం బ్రహ్మాముడి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే బిగ్ బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా ఉన్న తన ఫ్రెండ్ అమర్దీప్ కోసం వచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Amardeep♥️ Tejaswini (@amarteju_girl_fan) -
'బిగ్‌బాస్' మాసన్ హల్దీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పెళ్లిపీటలెక్కనున్న మానస్.. హల్దీ వీడియో వైరల్..
బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు మానస్ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టబోతున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహానికి పచ్చజెండా ఊపిన ఇతడు ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. నేడు (నవంబర్ 22న) రాత్రి 8.55 గంటలకు శ్రీజతో ఏడడుగులు వేయనున్నాడు. వీరి వివాహం విజయవాడలో జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ప్రస్తుతం మానస్ హల్దీ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వధూవరులిద్దరూ ఒకరి మీద ఒకరు నీళ్లు గుమ్మరించుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హమీదా, శుభశ్రీ రాయగురు, తేజ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మానస్- శ్రీజ హల్దీ వేడుకల అనంతరం కలిసి సంతోషంగా స్టెప్పులేశారు. కాగా మానస్ అసలు పేరు సాయి రోహిత్. పద్మిని- వెంకటరావు నాగులపల్లిల ఏకైక సంతానం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసిన ఇతడు బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌తో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్న ఇతడు ఆ మధ్య మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) చదవండి: పేరు కూడా అడగలేదు, గదిలోకి రమ్మని పిలిచాడు.. రోజూ తాగి వచ్చి టార్చర్.. -
Bigg Boss 7 : శివాజీ వారిని చెడగొడుతున్నాడు.. మానస్
బిగ్‌బాస్ సీజన్ 7 ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్స్ అంతా కాస్త సీరియస్‌గా గేమ్స్ ఆడుతున్నారు. పోటీలో గెలిచేందుకు వందశాతం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకే ఒక కంటెస్టెంట్ మాత్రం సీజన్ ప్రారంభం నుంచి గేమ్ ఆడట్లేదు. అతనే శివాజీ. ప్లేయర్‌గా హౌస్‌లోకి వెళి కోచ్‌గా అవతారమెత్తాడు. పోని అలా అయినా న్యాయంగా ఉంటున్నాడా అంటే.. ‘అబ్బే..మనవి మాటలే’ అంటున్నాడు. నీతి ముచ్చట్లు చెప్పడమే కానీ..పాటించడం మన హిస్టరీలోనే లేదంటున్నాడు. ఇతరులకు ఓ న్యాయం తనకో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అయితే హౌస్‌లో అంతా అతని మాయ మాటలకు పడిపోతే.. గౌతమ్ కృష్ణ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా శివాజీ నిజస్వరూపం బయటపెడుతున్నాడు. మరోవైపు అమర్దీప్ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాడు కానీ.. శివాజీ తెలివిగా వ్యవహరిస్తూ..అతన్ని బకరా చేస్తున్నారు. ఈ విషయం షో వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతుంది. తాజాగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ మానస్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. శివాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శివాజీ లాంటి కంటెస్టెంట్‌ని చూడలేదు: మానస్ బిగ్‌బాస్ షోలో అమర్దీప్, శివాజీల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. ప్రతిసారి చిన్న చిన్న కారణాలు చెప్పి అమర్‌దీప్‌ని నామినేట్ చేస్తున్నాడు శివాజీ. అంతేకాదు తనకు నచ్చినవాళ్లు తప్పు చేస్తే సమర్థిస్తాడు.. అదే అమర్దీప్, గౌతమ్ కృష్ణ చిన్న మిస్టేక్ చేసినా..దాన్ని భూతద్దంలో పెట్టి ప్రచారం చేస్తాడు. పైగా తెలివిగా హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్స్‌కి కూడా తన అభిప్రాయాన్ని రుద్దే ప్రయత్న చేస్తాడు. తాజగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని మానస్ చెప్పాడు. ‘ప్రతీ సీజన్లో శివాజీ లాంటి విలన్స్ ఉంటారు. కానీ హీరో ఎవరనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. శివాజీ కేవలం ఇద్దరి పట్ల మాత్రమే వ్యక్తిగత ఇష్టం చూపిస్తున్నాడు. మిగిలిన కంటెస్టెంట్ల గేమ్ చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు నేను రకరకాల మైండ్ సెట్ ఉన్నవాళ్లను చూశాను. కానీ శివాజీ లాంటి కంటెస్టెంట్‌ను ఇప్పటివరకు చూడలేదు’అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. -
ఓ ఇంటివాడు కాబోతున్న మానస్.. హల్దీ వేడుకలు షురూ
బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు మానస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శ్రీజతో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ మధ్యే వీరి ఎంగేజ్మెంట్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఆర్జే కాజల్, వీజే సన్నీ ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలో మానస్ ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా మానస్ ఇంట పెళ్లి పనులు షురూ అయ్యాయి. నేడు హల్దీ వేడుక జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇంటిని అందంగా ముస్తాబు చేశారు. పసుపు దంచే కార్యక్రమం ఉందంటూ మానస్ అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. పంచెకట్టులో మానస్ మెరిసిపోగా కొడుకును చూసి మురిసిపోయింది అతడి తల్లి పద్మిని. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన అభిమానులు మానస్‌కు శుభాకాంక్షలు చెప్తుంటే మరికొందరు మాత్రం అప్పుడే పెళ్లికి రెడీ అయిపోయావేంటి? అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Padmini Nagulapalli (@padmini.nagulapalli.7) -
బుల్లితెర నటుడి నిశ్చితార్థం.. వీడియో వైరల్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మానస్ బుల్లితెరపైనా సత్తా చాటాడు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యాడు. గేమ్ పరంగానే కాకుండా మెచ్యూర్డ్ థింకింగ్‌తో అటు కుటుంబ ప్రేక్షకుల్ని, ఇటు యువతని అమితంగా ఆకట్టుకున్నాడు. సీరియల్స్, సాంగ్స్, సినిమాలు చేస్తున్న మానస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శ్రీజ నిశ్శంకర్ రావుతో పెళ్లికి రెడీ అయ్యాడు. తాజాగా వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కాబోయే భార్య మెడలో పూల మాల వేసి మురిసిపోయాడు మానస్. ఆమెతో కలిసి నడుస్తూ.. నిండునూరేళ్లు కలిసి ప్రయాణించబోతున్నామని చెప్పకనే చెప్పాడు. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు తన బెస్ట్‌ఫ్రెండ్స్ కాజల్, సన్నీ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈమేరకు పలు ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by 🌟 sunny & maanas 🌟 (@mansun_warriors) View this post on Instagram A post shared by brahmamudi serial (@brahmamudi__) చదవండి: సర్ప్రైజ్ ఇచ్చిన జైలర్... ఓటీటీ డేట్ కన్ఫామ్, కానీ ప్లాట్‌ఫామ్ మారింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
ఫోక్ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన విష్ణుప్రియ
యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన భామ.. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ షోకు యాంకర్‌గా బుల్లితెరపై రాణించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్ హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా షేక్ చేస్తోంది. గతంలో మానస్‌తో కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన ముద్దుగుమ్మ మరోసారి సందడి చేసింది. బిగ్ బాస్ ఫేమ్ మానస్, విష్ణు ప్రియ కలిసి డ్యాన్స్ చేసిన ‘గంగులు’ అనే జానపద సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఈ పాటకు మానస్, విష్ణుప్రియ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఈ సాంగ్‌కు భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించగా.. జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ నృత్య దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్, పద్మిని నాగులపల్లి, ప్రముఖ నిర్మాత జయతి పాల్గొన్నారు. -
‘నువ్వే కావాలి అమ్మ’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
బిగ్‌బాస్ షోలో మానస్, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి దక్కుతుందో?
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఫైట్ జరుగుతోంది. ఇప్పటికే సిరి వచ్చి కంటెస్టెంట్స్‌తో మొదటి లెవల్ గేమ్ ఆడించి వెళ్లిపోగా తాజాగా మానస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఓ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇవ్వగా ఇందులో నుంచి అఖిల్, అషూ, బిందు మాధవి మొదటగా అవుట్ అయ్యారు. వీరు పోటీదారులను డిస్టర్బ్ చేసేందుకు ఛాన్స్ ఇవ్వడంతో గేమ్‌లో ఇంకా పోటీపడుతున్న కంటెస్టెంట్ల ఆటకు ఆటంకం కలిగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో బాబా, యాంకర్ శివ అవుట్ అయ్యారు. తర్వాతి లెవల్లో అరియానా గేమ్‌లో ఓడిపోగా నటరాజ్, అనిల్ మాత్రమే మిగిలారు. మరి వీరిలో ఎవరు ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాధించారనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! చదవండి: ఆన్లైన్లో లీకైన 'అవతార్ 2' సినిమా ట్రైలర్ !.. సినీప్రియులకు ఆహా గుడ్‌న్యూస్, మేలో ఏకంగా 40కి పైగా సినిమాలు! -
ప్రపోజ్ డే.. బ్రేకప్ ఎమోజీ షేర్ చేసిన షణ్ముఖ్
వాలంటైన్స్ డే దగ్గర పడుతోంది. సింగిల్స్ ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతుంటే అదే సింగిల్స్ కొందరు మాత్రం లవ్వు లేదు, గివ్వు లేదు.. లవ్వంటే ఇంట్రస్ట్ లేదంటూ పాటలు పాడుకుంటూ కాలం గడిపేస్తున్నారు. బ్రేకప్ అయిన వాళ్ల సంగతి సరేసరి.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాటిని ఎలా మర్చిపోవాలా? అని వేదన అనుభవిస్తున్నారు. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సాడ్ సాంగ్స్ పెట్టుకుంటూ బ్రేకప్ హార్ట్ ఎమోజీని జత చేస్తూ తన బాధను చెప్పకనే చెప్తున్నాడు. ఇది చూసిన అతడి సోదరుడు సంపత్ వినయ్.. 'ఫస్టూ చదువుకోండి.. ఈ ఏజ్‌లో లవ్ ఎందుకు?' అని రిప్లై ఇచ్చాడు. దీంతో షణ్నూ నా బాధ నీకేం తెలుసు అన్నట్లుగా ఓ ఎమోజీ పెట్టాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ మానస్ అయితే 'హ్యాపీ ప్రపోజ్ డే' అంటూ షణ్నూని మరింత ఉడికించాడు. 'హుష్, తప్పు తప్పుగా మాట్లాడొద్దు మా సింగిల్స్ దగ్గర' అని రిప్లై ఇవ్వగా 'హలో నేను కూడా సింగిలే..' అని బదులిచ్చాడు మానస్. -
పింకీ అలా అడిగిందంటే.. ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా : మానస్
Bigg Boss 5 Telugu Finalist Maanas Clear On Relationship With Priyanka Singh: బిగ్‌బాస్ సీజన్-5లో మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ మానస్. ఎమోషన్స్, గేమ్‌ను బ్యాలెన్స్ చేస్తూ టాప్ 5లో స్థానం సంపాదించుకున్న మానస్ తన ఆటతీరుతో, ప్రవర్తనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన బుల్లితెరపై కూడా సత్తా చాటాడు. చదవండి: బ్రేకప్‌పై తొలిసారి స్పందించిన షణ్ముఖ్.. పోస్ట్ వైరల్ చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బిగ్‌బాస్ షోతో పాపులర్ అయ్యాడు. అయితే మానస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది పింకీ లవ్ ట్రాక్. చాలా సార్లు తన ఇష్టాన్ని వ్యక్తపరిచినా మానస్ మాత్రం సున్నితంగానే నో చెప్పేవాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మానస్ ప్రియాంక గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'జైలు నామినేషన్ టాస్కుల్లో అవకాశం ఉన్నా రవిని కాకుండా జెస్సీని నామినేట్ చేసింది. ఆ సందర్భంలో ప్రియాంక నటిస్తున్నట్లు అనిపించింది. అంతకుముందు టవర్ టాస్కులో కూడా చీరను అడ్డుపెట్టి ఓడిపోయేలా చేసింది. ఈ రెండు సందర్భాల్లో ప్రియాంక నటిస్తున్నట్లు ఉంది అని కాజల్‌తో చెప్పాను. తను నా ఫ్రెండ్ కాబట్టి ఎక్స్‌ప్రెస్ చేశాను. వేరే వాళ్లతో చెప్పలేదు. కానీ కొందరికి అది బ్యాక్ బిచ్చింగ్లా అనిపించొచ్చు. హౌస్‌లో 90రోజులు జర్నీ చేసిన ప్రియాంక సైతం బయటికి వెళ్లాక ఈ ఫుటేజ్ చూసి.. నువ్వు నటించావా లేదా భరించావా అని వీకెండ్ ఎపిసోడ్లో అడిగింది. 24 గంటలు హౌస్‌లో నన్ను గమనించి కేవలం ఒక గంట ఫుటేజ్ చూసి అలా అడిగిందంటే అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా' అంటూ వివరించాడు. చదవండి: బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ -
బిగ్‌బాస్-5 మానస్ విలసవంతమైన ఇంటిని చూశారా?
Bigg Boss 5 Maanas Home Tour Video Goes Viral: బిగ్‌బాస్ సీజన్-5 ఫేమ్ మానస్ గురించి పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మానస్ బుల్లితెరపై కూడా సత్తా చాటాడు. బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యాడు. గేమ్ పరంగానే కాకుండా మెచ్యూర్డ్ థింకింగ్ తో అటు కుటుంబ ప్రేక్షకుల్ని ఇటు యువతని అమితంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సన్నీ, మానస్‌ల ఫ్రెండిప్కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్‌బాస్‌లో టాప్-4గా నిలిచిన మానస్‌కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను 'హోంటూర్'(Home tour)ద్వారా తల్లి పద్మజ వివరించింది. మానస్ సొంత డబ్బులతో ఇంటిని కొన్నామని, చిన్నప్పుడు హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మానస్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నంది అవార్డు వచ్చిందని తెలిపారు. ఎంతో అందమైన, విలసవంతమైన మానస్ ఇంటిని మీరు కూడా చేసేయండి. -
స్టేజ్‌పై సన్నీ అన్న మాటలకు ఎమోషనల్ అయిన సిరి
Bigg Boss 5 Winner Sunny Comments On Shanmukh Friendship With Siri:ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన సన్నీ టైటిల్ ఎగరేసుకుపోయాడు. టాస్కుల్లో వందశాతం ఆడటంతో పాటు హౌస్‌లో రియల్ ఎంటర్టైనర్ అనే పేరు సంపాదించాడు. దీంతో పాటు షణ్నూ-సిరిలపై నెగిటివిటి పెరగడం సన్నీకి మరింత లాభం చేకూర్చింది. మచ్చా అంటూ తనదైన మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నీ బిగ్‌బాస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గ్రాండ్ ఫినాలేలో మాట్లాడిన సన్నీ.. సిరి, షణ్నూల రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'షణ్నూ-సిరిల రిలేషన్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను. అది ఈ స్టేజ్ మీదే మాట్లాడాలి. సిరి, అండ్ షణ్ముఖ్ అలాంటి ఫ్రెండిష్ దొరకడం అదృష్టం. నాకు, మానస్‌కు మధ్య ఎలాంటి స్నేహం ఉందో వాళ్లిద్దరి మధ్య కూడా అదే ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. సన్నీ అన్న మాటలకు సిరి ఎమోషనల్ అయ్యింది. -
బిగ్‌బాస్ ద్వారా మానస్ ఎంత లాభపడ్డాడంటే?
Bigg Boss 5 Telugu Third Runner up Maanas Remuneration: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో మోస్ట్ అండర్రేటెడ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? అంటే అది మానస్ మాత్రమే! మాటలు తక్కువ చేతలు ఎక్కువగా ఉండే మానస్ ఎమోషన్స్, గేమ్‌ను బ్యాలెన్స్ చేస్తూ టాప్ 5లో స్థానం సంపాదించుకున్నాడు. ఫిజికల్ టాస్క్ అయినా, మైండ్ గేమ్ అయినా రెండింటినీ ఓ పట్టు పట్టేవాడు. బుల్లితెర నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన మానస్ బిగ్‌బాస్ హౌస్‌లో గొడవల్లో దూరకుండా తన పనేంటో తను చేసుకునేవాడు. సహనానికి మారుపేరుగా నిలిచిన మానస్ స్నేహం కోసం ఏదైనా చేసేవాడు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో బిగ్‌బాస్ ద్వారా అందరికీ చేరువ కావాలనుకున్నాడు. అనుకోవడమే కాదు తన ప్రవర్తనతో, ఆటతీరుతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ సీజన్లో థర్డ్ రన్నరప్‌గా నిలిచిన మానస్ బిగ్‌బాస్ షో ద్వారా ఎంత లాభపడ్డాడన్న విషయం ఇంట్రస్టింగ్‌గా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వారానికి అతడికి లక్షనుంచి లక్షన్నర రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ అతడు సుమారు 20 లక్షల వరకు వెనకేసినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థను నెలకొల్పాలనుకున్న మానస్ ఈ డబ్బుతో తన కలను సాకారం చేసుకుంటాడేమో చూడాలి! చదవండి: Bigg Boss 5 Telugu Winner Sunny: విన్నర్ సన్నీతో పాటు రన్నరప్ షణ్ముఖ్‌కు కూడా ప్లాట్ -
నాని ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను వదులుకున్న మానస్!
Bigg Boss 5 Telugu Grand Finale Highlights: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో సిరి ఎలిమినేట్ అవడంతో నలుగురు మాత్రమే మిగిలారు. సన్నీ, శ్రీరామ్, మానస్, షణ్ముఖ్ టైటిల్ బరిలో నిలిచారు. వీరిలో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు శ్యామ్ సింగరాయ్ టీమ్ నుంచి నాని, సాయిపల్లవి, కృతీ శెట్టి హౌస్‌లో అడుగుపెట్టారు. మీ నలుగురిలో ఒకరే గెలుస్తారు, కాబట్టి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయనుకున్నవారు డబ్బులు తీసుకుని ఎలిమినేట్ కావచ్చని నాని ఆఫర్ ఇచ్చాడు. సూట్‌కేసులో ఎంతుందో చెప్పను కానీ భారీ మొత్తమే ఉంటుందని ఫైనలిస్టులను టెంప్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఎవరూ ఆ డబ్బు తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో మానస్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఇప్పుడు ఓడిపోయావంటే ఇంకోసారి గెలుస్తావనే అంటూ మానస్‌లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు సాయిపల్లవి, కృతీశెట్టి. ఇక స్టేజీపైకి వచ్చిన మానస్ ఈ బిగ్‌బాస్ హౌస్‌లో హౌస్మేట్స్ హృదయాలను గెల్చుకున్నానన్నాడు. ఎవరు గెలవాలన్న నాగ్ ప్రశ్నకు సన్నీలో గెలవాలన్న ఫైర్ ఉందని, అతడే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. -
టైటిల్ రేసు నుంచి మానస్, సిరి అవుట్! మిగిలింది ముగ్గురే!
Bigg Boss Telugu 5 Grand Finale, Maanas, Siri Eliminated From BB House: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌కు శుభం కార్డు పలికే సమయం ఆసన్నమైంది. ట్రోఫీ ఎవరి వశం అవుతుందనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను కనీవినీ ఎరగని రీతిలో ప్లాన్ చేశారు నిర్వాహకులు. టాలీవుడ్ నుంచి స్టార్ సెలబ్రిటీలను స్పెషల్ గెస్టులుగా తీసుకొస్తుండటంతో పాటు బాలీవుడ్ స్టార్లను సైతం రంగంలోకి దింపారు. ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల డ్యాన్సులు, హంగామా ఉండనే ఉంటుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం మానస్, సిరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారట! కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు ఫైనలిస్టుల్లో నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేసే ప్రక్రియను ఒకరోజు ముందుగానే అంటే శనివారమే షూట్ చేశారు. ఈ క్రమంలో టైటిల్ రేసు నుంచి మొదటగా సిరి తప్పుకుందని లీకువీరులు సోషల్ మీడియాలో చాటింపు వేశారు. తర్వాత నాలుగో స్థానంలో మానస్ ఎలిమినేట్ అయినట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ సుకుమార్ డ్రోన్ల ద్వారా సిరి ఎలిమినేషన్‌ను ప్రకటించగా హీరోయిన్ సాయిపల్లవి చేతుల మీదుగా మానస్ ఎలిమినేషన్‌ను వెల్లడించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు లీకువీరులు చెప్పిన ప్రతీది నిజమవుతూ వస్తుండటంతో ఈ ఎలిమినేషన్స్ కూడా నిజమయ్యే ఉంటుందని నమ్ముతున్నారు ఆడియన్స్. పైగా అనధికారిక ఓటింగ్‌లోనూ మానస్, సిరి చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ఐదో స్థానంలో ఉన్నప్పుడు సిరి, నాలుగో స్థానంలో ఉన్నప్పుడు మానస్ ఎలిమినేట్ అవుతారని అందరూ అంచనా వేశారు. ఇప్పుడదే నిజమైనట్లు కనిపిస్తోంది. కాకపోతే మానస్ హౌస్‌లో ఉన్నప్పుడు బిగ్‌బాస్ రూ.10 లక్షలు ఆఫర్ చేయగా దాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. మరి ఈ ఆఫర్‌ను రెట్టింపు చేస్తే టాప్ 3లో ఉన్న షణ్ను, సన్నీ, శ్రీరామ్‌లలో ఎవరు తీసుకునే అవకాశం ఉందనేది ఫినాలేలో తేలనుంది! -
ఆడేసుకున్న మాజీ కంటెస్టెంట్లు, అంతా బిగ్‌బాస్ వరకే అన్న షణ్ను!
Bigg Boss Telugu 5, Episode 105: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఫైనలిస్టులతో మాజీ సీజన్ల కంటెస్టెంట్లు రచ్చరచ్చ చేశారు. మొదటగా ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్లు శివబాలాజీ, హరితేజ హౌస్‌మేట్స్‌తో ముచ్చటించారు. శ్రీరామ్‌తో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా వారు వెళ్లిపోతారని సెటైర్ వేయడంతో అతడు తల పట్టుకున్నాడు. తర్వాత ఒక పీపా పట్టుకుని ఊదితే ఆ పాటేంటో హౌస్మేట్స్ గెస్ చేయాలి. పాట సరిగ్గా గెస్ చేస్తే దానికి డ్యాన్స్ చేయాలి. ఈ క్రమంలో షణ్ను, సిరి కలిసి జంటగా స్టెప్పులేస్తుంటే మిగతా ముగ్గురు మాత్రం ఎవరికి వారే డ్యాన్స్ చేశారు. ఇది చూసిన హరితేజ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన ముగ్గురిపై జాలి చూపించింది. దీంతో రెచ్చిపోయిన శ్రీరామ్ సిరిని ఎలిమినేట్ చేసినట్లే చేసి మళ్లీ తీసుకొచ్చారంటూ జోక్ చేశాడు. ఇక హరితేజ బిగ్‌బాస్ షో గురించి, టాప్ 5 కంటెస్టెంట్ల గురించి హరికథ చెప్పి వీడ్కోలు తీసుకున్నారు. తర్వాత రెండో సీజన్ కంటెస్టెంట్లు గీతా మాధురి, రోల్ రైడా ఆటపాటలతో హౌస్‌మేట్స్‌ను అలరించారు. టాప్ 5లో చోటు దక్కించుకున్న సిరి తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఆదర్శం అంటూ తెగ పొగిడాడు. అయితే వచ్చిన కంటెస్టెంట్లు అందరూ పొగడ్తలతో పాటు షణ్ను, సిరిల ఫ్రెండ్షిప్పై సెటైర్లు వేస్తూ వారిని ఓ ఆటాడుకుండటంతో సన్నీ, మానస్, శ్రీరామ్ పడీపడీ నవ్వారు. అసలే చిన్న మాట అంటేనే తట్టుకోలేని షణ్ను ఇలా అందరూ కలిసి తన మీద పడిపోవడంతో అట్టుడికిపోయాడు. మనిద్దరం హైలైట్ అయిపోతున్నామని ముగ్గురికీ మండిపోతున్నట్లుందని సిరితో వాపోయాడు. అయితే సిరి మాత్రం ఏ షిప్ అయినా బిగ్‌బాస్ హౌస్ వరకే అని షణ్ను అన్న మాటను గుర్తు చేసుకుని బాధపడింది. దీంతో అతడు సిరిని ఓదార్చుతూ హగ్ చేసుకున్నాడు. ఇది చూసిన సన్నీ.. బయటకు వెళ్లాక షణ్ను హగ్ గురూ అయిపోతాడని కామెంట్ చేశాడు. అనంతరం నాలుగో సీజన్ కంటెస్టెంట్లు శివజ్యోతి, సావిత్రి హౌస్‌మేట్స్‌తో కబుర్లాడారు. బెలూన్లలోని హీలియం పీల్చుకుని పాట లేదా డైలాగులు చెప్పాలన్నారు. ఈ గేమ్‌లో హౌస్మేట్స్ గొంతులు మారిపోవడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఐదో సీజన్ కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్, అరియానా వచ్చీరాగానే శ్రీరామ్ చేసిన మొట్ట మొదటి ఆల్బమ్‌లోని సాంగ్ ప్లే చేయడంతో అతడు సర్ప్రైజ్ అయ్యాడు. ఆ వెంటనే కంటెస్టెంట్లందరినీ కొన్ని సరదా ప్రశ్నలడిగారు. అందులో భాగంగా డేటింగ్ యాప్‌లో ఎవరినైనా కలిశారా? అని అడగ్గా సన్నీ ఒకరిని కలిశాను కానీ ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పుకుంటూ పోయిందని, దీంతో తానే ఆమెను ఓదార్చాల్సి వచ్చిందన్నాడు. వేరే కంటెస్టెంట్ టవల్ వాడారా? అన్న ప్రశ్నకు షణ్ను.. శ్రీరామ్ టవల్ వాడానని చెప్పగా మధ్యలో సిరి కలగజేసుకుంటూ తన టవల్ కూడా వాడాడని ఆరోపించింది. కొన్ని ఫొటోలు చూపించి అవి హౌస్‌లో ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్న గేమ్‌లో శ్రీరామ్ గెలిచాడు. సిరి తాను తీసుకోవాలనుకుని మర్చిపోయిన ఫొటోను అఖిల్, అరియానా చూపించడంతో ఆమె చాలా సర్ప్రైజ్ అయింది. అంతేకాదు షణ్ను, సిరి ఆ ఫొటోలో ఏ పాటకైతే డ్యాన్స్ చేశారో మరోసారి అదే సాంగ్‌కు స్టెప్పులేశారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ సరదా సరదాగా సాగింది. -
Bigg Boss5 Telugu: బిగ్‌బాస్-5 విజేతగా సన్నీ?.. నెట్టింట లీకైన ఓటింగ్!
Bigg Boss Telugu 5 Grand Finale: Winner Prediction: బిగ్‌బాస్ సీజన్-5 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నాడు జరగనున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. దీంతో టైటిల్ విన్నర్ ఎవరన్న దానిపై సర్వంత ఉత్కంఠ నెలకొంది. టాప్-5 కంటెస్టెంట్లలో టైటిల్ కోసం గట్టి పోటీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం సన్నీ- షణ్ముక్‌ల మధ్యే ఉండనున్నట్లు తెలుస్తుంది. యూట్యూబ్ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చిన షణ్నూ ఓటింగ్‌లో మాత్రం సన్నీ కంటే వెనుక ఉన్నట్లు అన్ అఫీషియల్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పటివరకు ఓటింగ్ పర్సంటేజీలను చూస్తే సన్నీనే టాప్‌లో ఉన్నాడని తెలుస్తోంది. 34% ఓట్లతో సన్నీ విజేతగా నిలిచాడని సోషల్‌మీడియాలో టాక్ వినిపిస్తుంది. టైటిల్ రేసులో ఉన్న షణ్నూ 31%ఓట్లతో రెండో స్థానంలో, 20% ఓట్లతో శ్రీరామ్ మూడవ స్థానంలో, 8% ఓట్లతో మానస్ నాలుగో స్థానంలో నిలవగా , అత్యల్పంగా సిరికి7%ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు లీకు వీరులు చెప్పినట్లుగానే ఎపిసోడ్ సహా ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. దీంతో ఇప్పుడు మరోసారి లీకువీరులు అందించిన ఈ సమాచారం నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే ఫినాలే ప్రసారం అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే. -
అప్పుడు ఇప్పుడు మానసే విన్నర్!!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజుల సమయం ఉంది. అప్పటిదాకా ఏం చేయాలో అటు కంటెస్టెంట్లకే కాదు, ఇటు బిగ్‌బాస్‌కు కూడా పాలు పోవట్లేదు. నిన్న అయితే హౌస్మేట్స్ అంతా చిన్నపిల్లల్లా మారిపోయి దాగుడుమూతలు ఆడుకున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్ కూడా వారిదారిలోకే వచ్చాడు. ఇంతకుముందు ఆడిన టాస్కులనే మళ్లీ మళ్లీ ఆడించాడు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. లేబుల్ లేదు మచ్చా గేమ్‌లో షణ్ముఖ్, మానస్ పోటీపడగా మానస్ గెలిచినట్లు సమాచారం. బెలూన్స్ టాస్క్‌లో షణ్ను గెలిచినట్లు లీకైంది. కొన్ని శబ్ధాలను ప్లే చేసి అవేంటో పసిగట్టి రాయాలన్న టాస్క్‌లో సన్నీ బెకబెక సౌండ్‌ను Frogకు బదులుగా Forg అని తప్పుగా రాయడంతో అందరూ పగలబడి నవ్వారు. సిరి అయితే ఏకంగా అది కప్ప కాదంటూ ఎలుక అని రాసింది. దీంతో కప్పకు, ఎలుకకు ఉన్న సంబంధాన్ని చెప్పమన్నాడు బిగ్‌బాస్. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఫన్నీ టాస్కులతో సరదాగా గడిచిపోనున్నట్లు కనిపిస్తోంది. -
'సిరి-షణ్ను కంటెంట్ ఇవ్వడానికే వచ్చారు'
Bigg Boss Telugu 5, Episode 102: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఏం చేయాలో పాలు పోక దాగుడుమూతలు ఆడుకున్నారు. కాసేపు ఆడుకున్న తర్వాత మానస్ సన్నీ ముచ్చట్లు పెట్టుకున్నారు. మానస్ మాట్లాడుతూ.. శ్రీరామ్ ఆట తనకు నచ్చదని చెప్పాడు. అన్నీ ఆలోచించి ఆడతాడని అభిప్రాయపడ్డాడు. అనంతరం సిరికి తన జర్నీ చూసే అవకాశం లభించింది. ఈ క్రమంలో తన ఫొటోలన్నింటిని చూసుకుని తెగ మురిసిపోయింది. 'అల్లరి పిల్లగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే సిరిగా మీరు అందరికీ పరిచయం. కానీ ఎంతో ధైర్యంగా ఉండే సిరిలో జరుగుతున్న సంఘర్షణ వల్ల మీరు కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఎంచుకునేలా చేశాయి. మీ కన్నీళ్లు మౌనంగా ఆ విషయాన్ని చెప్పాయి. కానీ మీ నవ్వు చేసిన సందడిలో కన్నీళ్లు ఇంకిపోయాయి. పిట్ట కొంచెం కూత ఘనం అన్న మాట మీ విషయంలో నిజమైంది. ఈ బిగ్‌బాస్ ఇల్లు భావోద్వేగాల నిధి అయితే అందులో సిరి మీరు' అంటూ బిగ్‌బాస్ ఆమెను ఆకాశానికెత్తారు. తర్వాత ఆమె జర్నీ వీడియో చూపించడంతో సిరి ఎమోషనల్ అయింది. మరీ ముఖ్యంగా చోటు కనిపించగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత సిరి దొరికిందే ఛాన్స్ అని ఐదారు ఫొటోలు తీసుకొచ్చేసింది. షణ్నుతో కలిసి డ్యాన్స్ చేసిన ఫొటో కూడా పట్టుకొచ్చింది కానీ సర్ప్రైజ్ ఇద్దామని దాన్ని డైనింగ్ టేబుల్‌పై దాచిపెట్టింది. ఇంతలో బిగ్‌బాస్ అక్కడున్న సెట్‌నంతా తొలగించే క్రమంలో ఆ ఫొటోను కూడా మాయం చేయడంతో సిరి నిరాశపడింది. జర్నీ వీడియోలో మనిద్దరం కంటెంట్ ఇవ్వడానికే వచ్చాం అని మానస్ అన్నాడంటూ షణ్నుకు చెప్పింది సిరి. దీంతో ఆగ్రహించిన షణ్ను.. ఇందుకే వాళ్ల సాయం తీసుకోవద్దంటాను అని హితవు పలికాడు. అనంతరం బిగ్‌బాస్.. టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్లను వారి మరపురాని క్షణాలను పంచుకోవాలని సూచిస్తూనే అక్కడున్న కొన్ని ఫొటోలను బిగ్‌బాస్‌కు ఇవ్వాలని చెప్పాడు. ముందుగా మానస్ మాట్లాడుతూ.. టెడ్డీబేర్ టాస్కులో గెలిచినప్పుడు నేను, సన్నీ, యానీ మాస్టర్‌ను సంతోషంతో ఎత్తుకున్నాం.. అంటూ ఆ ఫొటోను బిగ్‌బాస్‌కిచ్చాడు. షణ్ముఖ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ జర్నీలోనే బాధాకరమైన విషయం అమ్మ లెటర్ ముక్కలు కావడం అంటూ దానికి సంబంధించిన ఫొటోను బోర్డుపై పెట్టాడు. సిరి వంతు రాగా 'బ్రిక్స్ ఛాలెంజ్ కంటే ముందు షణ్నుకు, నాకు గొడవ అయింది. ఫేక్ ఫ్రెండ్ అని తిట్టాను కానీ అది తప్పని ఈ టాస్క్‌తో రుజువైంది. ఈ జర్నీ మొత్తంలో నాకు అండగా నిలిచింది షణ్ను ఒక్కడే' అని చెప్పుకొచ్చింది. శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ ఇంట్లో నాకు మంచి బాండ్ కుదురిన ఫస్ట్ పర్సన్ హమీదా. ఆమె వెళ్లిపోయాక చాలా బాధేసింది. చాలా మిస్ అవుతున్నాను, ఈ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఈమె ఉండుంటే లోన్ రేంజర్ అన్న ట్యాగ్ వచ్చేది కాదని ఫీలడు. తర్వాత సన్నీ వంతురాగా.. బేటన్ టాస్కులో నా టీమ్ వాళ్లే నన్ను వరస్ట్ పర్ఫామర్ అన్నారు. అప్పుడు జైల్లో పడి బాధపడితే మానస్ కూడా ఏడ్చాడు అని చెప్పుకొచ్చాడు. అందరినీ నవ్వించడమే తన నినాదంగా పేర్కొన్నాడు. -
మానస్ టైటిల్ గెలవాలి: మంత్రి తలసాని
Maanas Rock Star Movie Poster Released: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి తర్వాత నటుడిగా, హీరోగా మరెన్నో వైవిధ్యమైన కథాంశాలతో కూడుకున్న చిత్రాల్లో నటించి బాగా పాపులర్ అయ్యాడు మానస్. బిగ్ బాస్ సీజన్ 5 లో 16వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మానస్ తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల్ని మెప్పించి టాప్5 లో స్థానం సంపాదించుకున్నాడు. మాటల్లో మెచ్యూరిటీ, టాస్కుల్లో చూపించే ఎనర్జీకి అందరూ ఫిదా అయ్యారు. తోటి కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ పట్ల అతను చూపించిన కేరింగ్, అతని మెచ్యూర్డ్ థింకింగ్‌కు యువత మాత్రమే కాదు కుటుంబ ప్రేక్షకులు కూడా మానస్‌కు ఆకర్షితులయ్యారు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన మానస్‌కు పవర్ స్టార్ అభిమానులు మద్దతిస్తూ అతడు టైటిల్ గెలవాలని సోషల్ మీడియాలో మద్దతిస్తున్నారు. తాజాగా 'మానస్ రాక్ స్టార్' అనే పోస్టర్‌ను ఆవిష్కరించిన కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మానస్ టైటిల్ విన్నర్ కావాలని కోరుకుంటూ అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎం.ఆర్.చౌదరి, టీర్ఎస్ లీడర్ నాగమణి, ఇంటర్నేషనల్ డ్రెస్సెస్ డిజైనర్ అపర్ణ, మానస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.తేజు తదితరులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli) -
బరాబర్ కప్పు గెలుస్తా, అమ్మకు ఇస్తా: సన్నీ ధీమా
Bigg Boss Telugu 5, Episode 100: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ నేటితో సెంచరీ కొట్టింది. ప్రస్తుతం ఉన్న సిరి, మానస్, శ్రీరామ్, షణ్ను, సన్నీలు గ్రాండ్ ఫినాలే కోసం రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మానస్- సన్నీ కప్పు గురించి కబుర్లాడారు. సన్నీ మాట్లాడుతూ.. 'టెన్షన్‌గా ఉంది, ఎలాగైనా టైటిల్ గెలవాలి, మా అమ్మకు కప్ ఇస్తరా బయ్.. ఇది ఫిక్స్.. ఏదైనా కానీ.. బరాబర్ కప్పు ఇస్తా..' అంటూ తన విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. అనంతరం బిగ్‌బాస్ ఫైనలిస్టుల జర్నీని కళ్లకు కట్టినట్లు చూపించడానికి రెడీ అయ్యాడు. మొదటగా ఫస్ట్ ఫైనలిస్టు శ్రీరామ్‌ను సర్ప్రైజ్ చేశాడు. అతడు గార్డెన్ ఏరియాలోకి వచ్చి ఇప్పటివరకు జరిగిన టాస్కుల తాలూకు వస్తువులు చూసి ముచ్చటపడిపోయాడు. అనంతరం బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మీ పాటే కాకుండా మాట, ఆటతో లక్షల మందిని పలకరించారు. ఆటలో మీరు చూపించిన పోరాట పటిమ, స్నేహితుల కోసం మీరు నిలబడ్డ తీరు ప్రపంచానికి కొత్త శ్రీరామ్‌ను పరిచయం చేశాయి. ఆట సాగుతున్నకొద్దీ మీకు దగ్గరైనవారు ఒక్కొక్కరిగా మీకు దూరమయ్యారు. ఎంతోమంది మిమ్మల్ని లోన్ రేంజర్ అన్నా మీరు వన్ మ్యాన్ ఆర్మీలా లక్ష్యం వైపు ముందుకెళ్లారు అంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు. ఇది చూసి శ్రీరామ్ ఎమోషనల్ అయ్యాడు. నా జీవితంలో ఈ రోజును మర్చిపోలేను. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను, బిగ్‌బాస్ నా ఎమోషన్స్‌ను బయటపెట్టగలిగింది.. ఈ జర్నీ నాకు వెరీవెరీ స్పెషల్ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నీ మనసుకు బాగా దగ్గరైన ఒక ఫొటోను తీసుకెళ్లమని బిగ్‌బాస్ అవకాశమివ్వగా శ్రీరామ్ తన చెల్లితో ఉన్న ఫొటోను తీసుకున్నాడు. తర్వాత మానస్ గార్డెన్ ఏరియాలోకి వచ్చాడు. అమ్మ ముద్దుల కొడుకుగా ఇంట్లో అడుగుపెట్టారు. ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి ఇప్పటివరకు మీ ఓర్పు, అందరినీ అర్థం చేసుకునే తత్వం ఈ ఇంట్లో మీకు ప్రత్యేక స్థానాన్ని తీసుకువచ్చాయి. స్నేహం కోసం ఆఖరివరకు నిలబడ్డ తీరు ప్రతి ఒక్కరినీ హత్తుకుంది. మనసు నొప్పించకుండా విషయం అర్థమయ్యేలా సున్నితంగా చెప్పడం, అవసరమైతే గొంతెత్తి నిలదీయడం మీకే చెల్లింది. మనసు, తెలివి రెండింటినీ సమంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యమం అని మెచ్చుకుంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్. ఈ జర్నీలో ఎత్తుపల్లాలు, స్వీట్ అండ్ సాడ్ మెమొరీస్ చూసి మానస్ కదిలిపోయాడు. తర్వాత ఒక ఫొటోగ్రాప్ తీసుకెళ్లమంటే బిగ్‌బాస్‌ను అభ్యర్థించి రెండు ఫొటోలు పట్టుకెళ్లాడు. అమ్మతో దిగిన ఫొటోతో పాటు తన ఫ్రెండ్ సన్నీతో ఉన్న ఫొటోను జాగ్రత్తగా కాపాడుకుంటానన్నాడు. ఇది చూసిన శ్రీరామ్ తానూ రెండు ఫొటోలు తెచ్చుకోవాల్సిందని నిరాశ చెందాడు. -
అలా ఆడటం మానస్ వల్లే సాధ్యం!
Bigg Boss 5 Telugu Today Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ట్రోఫీ.. హౌస్‌లో ఉన్న అందరి కళ్లు ఇప్పుడు దాని మీదే ఉన్నాయి. ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అని కసిమీదున్నారు కంటెస్టెంట్లు. ఇప్పటిదాకా టాప్ 5లో చోటు సంపాదించడం కోసం కష్టపడ్డ హౌస్మేట్స్.. తమకు టైటిల్‌ను సొంతం చేసే బాధ్యతను అభిమానుల భుజాలపై వేశారు. ఈ వారం ప్రేక్షకులు వేసే ఓట్లతో విన్నర్ ఎవరనేది డిసైడ్ కానుంది. ఇదిలా ఉంటే ఫైనలిస్టులకు బిగ్‌బాస్ వారి జర్నీ వీడియోలు చూపించాడు. ఆనందపు క్షణాలతో పాటు మర్చిపోలేని మధురానుభూతులను బాధాకరమైన సంఘటలను, పోట్లాటలను.. ఇలా అన్నింటినీ ఏవీ వేసి చూపించడంతో కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. 'ఈ ఇంట్లో మీ ప్రయాణం గాయకుడిగా మొదలైంది. ఒక్కోవారం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆటలో మీరు చూపించిన పటిమ, స్నేహితుల కోసం నిలబడ్డ తీరు ప్రపంచానికి ఒక కొత్త శ్రీరామ్‌ను పరిచయం చేశాయి. ముంచే కెరటాలు ఎన్ని ఉన్నా వాటిపై ఈదుకుంటూ వచ్చి ఉదయించే సూర్యుడు ఒక్కడే..' అంటూ శ్రీరామ్‌ను మెచ్చుకున్నాడు బిగ్‌బాస్. 'స్నేహం కోసం మీరు నిలబడ్డ తీరు ప్రతిఒక్కరినీ హత్తుకుంది. కొందరు తెలివితో మరికొందరు మనసుతో ఆడతారు. కానీ మీరు మనసు, తెలివిని సమంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యమైంది' అని మానస్‌పై ప్రశంసలు కురిపించాడు బిగ్‌బాస్. -
బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలకు నేనే మూల కారణం: కాజల్
Bigg Boss Telugu 5, Episode 99, Kajal Eliminated: వచ్చేవారం (డిసెంబర్ 19న) గ్రాండ్ ఫినాలే జరగబోతుందని వెల్లడించాడు కింగ్ నాగార్జున. అంటే నెక్స్ట్ సండే ఎవరు విన్నర్ అనేది తేలనుందన్నాడు. ఇక ఈరోజు ఎవరెవరు ఫినాలేలో అడుగుపెట్టనున్నారనేది కూడా తేల్చేశాడు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలుచుకుని శ్రీరామ్ ఫస్ట్ ఫైనలిస్టుగా నిలవగా సన్నీని రెండో ఫైనలిస్టుగా ప్రకటించారు. నేటి(డిసెంబర్ 12) ఎపిసోడ్లో సిరిని మూడో ఫైనలిస్టుగా, షణ్నును నాలుగో ఫైనలిస్టుగా వెల్లడించడంతో వాళ్లు సంతోషంలో మునిగి తేలారు. అనంతరం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వీడియో ద్వారా ప్రశ్నలను సంధించగా హౌస్మేట్స్ వాటికి సమాధానాలు చెప్పారు. ► జెస్సీ: షణ్నుకి, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో నాకు తెలుసు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? అని ఎప్పుడైనా ఆలోచించావా? షణ్ను: ఫ్యామిలీస్ ఇంట్లోకి వచ్చినప్పటినుంచి నాకూ ఈ ప్రశ్న ఎదురైంది. అది తప్పే, కానీ సిరి నా బెస్ట్‌ఫ్రెండ్.. జీవితాంతం ఆమెకు సపోర్ట్‌గా ఉంటాను. ► యానీ మాస్టర్: బిగ్‌బాస్ నుంచి వచ్చాక కొన్ని ఎపిసోడ్లు చూశాను. సన్నీ, మానస్ నా వెనకాల మాట్లాడారు. నేనెప్పుడూ నీ గురించి బ్యాక్ బిచింగ్ చేయలేదు. నువ్వు నా గుడ్ ఫ్రెండ్ అన్నాను. కానీ నువ్వు మాత్రం నేను నటిస్తున్నానని ఇంకా ఏవేవో అన్నావు. నిజంగా నీ మీద జెలసీ ఉంటే నిన్ను కెప్టెన్ చేయడం కోసం నేను కష్టపడకపోయేదాన్ని! సన్నీ: నేను బ్యాక్ బిచింగ్ చేయలేదు. యానీ మాస్టర్ కొన్నిసార్లు మాట మీద నిలబడదు, అప్పుడు నేను నా అభిప్రాయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నానంతే.. ఆమె నాకెప్పుడూ మంచి స్నేహితురాలే.. ► నటరాజ్ మాస్టర్: ఐస్ టాస్క్‌లో పింకీ చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ నడవలేకపోయాడు. టికెట్ టు ఫినాలే టాస్కులో వేరేవాళ్లు నీ తరపున గేమ్ ఆడారు. అంటే పింకీ చేసిన వైద్యం గేమ్పరంగా నీకు ప్లస్ అయిందా? మైనస్ అయిందా? శ్రీరామ్: ఇది ప్లస్సో, మైనసో పక్కనపెడితే నేను టాస్కుల్లో 100% ఇచ్చాను. నా ఆట నేను ఆడలేకపోయాను కాబట్టి మైనస్ అయింది. ► ప్రియాంక: ఇన్నిరోజులు హౌస్‌లో నన్ను భరించావా? నటించావా? మానస్: కచ్చితంగా భరించాను. నేనైతే నటించలేదు ► జెస్సీ: సిరి.. బిగ్‌బాస్ హౌస్‌లోకి గేమ్ ఆడటానికి వెళ్లావు కదా! కానీ నువ్వు గేమ్ మీద శ్రద్ధ తగ్గించి ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నాను అదీఇదీ అంటూ పిచ్చెక్కిపోతున్నావు, నీకిది అవసరమా? సిరి: గేమ్ ఆడటానికే వచ్చాను. మధ్యలో కొన్నికొన్ని ఎమోషన్స్ తీసుకుంటున్నాను. కానీ గేమ్‌లో ఎమోషనల్ కనెక్ట్ అయితే అవసరం లేదు ► ప్రియ: బయట ఎలా ఉంటావో తెలుసుకోవాలని ఉంది. సహజంగా నువ్వు ఇలాగే ఉంటావా? గేమ్ వరకేనా? కాజల్: నాకు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవాలనిపిస్తే అలానే రియాక్ట్ అవుతున్నా. నేనిలాగే ఉంటాను. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత మానస్‌ను ఐదో ఫైనలిస్టుగా ప్రకటించిన నాగ్ కాజల్ ఎలిమినేట్ అయినట్లు వెల్లడించాడు. దీంతో సన్నీ, మానస్ వెక్కివెక్కి ఏడ్చారు. ఇక శ్రీరామ్‌తో నువ్వెప్పటికీ నా బ్రదర్వే అని చెప్పుకొచ్చింది కాజల్. నన్ను బాగా మిస్సవ్వండి అంటూ బిగ్‌బాస్ హౌస్ నుంచి నిష్క్రమించింది. స్టేజీ మీదకు వచ్చిన కాజల్‌తో నాగార్జున ఓ ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు. ఐదు ఎమోషన్స్‌ను ఐదుగురు కంటెస్టెంట్లకు అంకితమివ్వాలన్నాడు. సన్నీ ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ ఇస్తే మానస్ ఐదు రెట్ల ఫ్రెండ్షిప్ చేస్తాడంది కాజల్. సిరి ఐదు రెట్ల ఎమోషన్ ఇస్తే, శ్రీరామ్ ఐదు రెట్ల యాక్షన్ చేస్తాడని తెలిపింది. షణ్ముఖ్ ఐదు రెట్ల డ్రామా చేస్తాడని పేర్కొంది. సిరిని కంట్రోల్ చేయడం, తిట్టడం, హగ్గులివ్వడం.. ఇలా ప్రతిదాంట్లో డ్రామా ఉంటుందని అభిప్రాయపడింది. తాను టాప్ 6లో ఉండగానే ఎలిమినేట్ అవుతానని కల వచ్చిందని, చివరకు అదే నిజమైందని నాగార్జునతో చెప్పుకొచ్చింది. చివరగా ఇంట్లో జరిగిన గొడవలన్నింటికీ తనే మూల కారణమని ఒప్పుకోవడం గమనార్హం. కానీ అవేవీ తను కావాలని చేయలేదని స్పష్టం చేసింది. ఫైనల్‌గా శ్రీరామ్, సిరి, మానస్, షణ్ను, సన్నీ ఈ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలిచి ట్రోఫీ కోసం పోటీపడనున్నారు. -
టోటల్ ఇమేజ్ డ్యామేజ్.. ఎవరు ఎలిమినేట్?
Bigg Boss 5 Telugu, 14th Week Elimination: ఒక్క ఎలిమినేషన్.. ఒకే ఒక్క ఎలిమినేషన్‌తో తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో టాప్ 5లో ఎవరుంటారన్నది తేలిపోనుంది. ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్‌లో కొన్ని మాత్రమే ట్విస్టులుండగా మిగతావన్నీ ఊహించినవే నిజమయ్యాయి! కానీ ఈ వారం మాత్రం ఎవరు హౌస్‌ను వీడనున్నారు? అన్నది చెప్పడం కొంత క్లిష్టంగా మారింది! టికెట్ టు ఫినాలే అందుకున్న శ్రీరామ్ మినహా సిరి, షణ్ను, సన్నీ, మానస్, కాజల్.. ఐదుగురూ నామినేషన్స్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో చూద్దాం.. అనధికారిక పోలింగ్స్‌లో షణ్ను, సన్నీలకు భారీ ఎత్తున ఓట్లు నమోదవుతున్నాయి. వీళ్ల ఫాలోయింగ్ చూస్తుంటే ఇద్దరూ టైటిల్ కోసం పోటీపడేలా ఉన్నారు.. కాబట్టి వీళ్లు ఎలిమినేట్ అవుతారన్న సందేహమే అవసరం లేదు. కానీ వీళ్లిద్దరి వల్ల మిగతావారి ఓటింగ్ జాతకాలు మారుతున్నట్లు కనిపిస్తోంది. సిరిని మానసికంగా వేధిస్తున్నాడంటూ షణ్ముఖ్‌పై ఈ వారం విపరీతమైన నెగెటివిటీ పెరిగిపోయింది. షణ్ను ప్రవర్తన వల్ల సిరి కూడా డిస్టర్బ్ అయినట్లు కనిపిస్తోంది. అందరికీ ఇచ్చిపడేసే సిరి షణ్ను తనను కంట్రోల్ చేస్తున్నా నిమ్మకు నీరెత్తనట్లు ఉండటంతో ఆమె మీద కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె ఓట్లకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. టాస్కుల్లో 100 % ఇచ్చే మానస్‌కు బాగానే ఓట్లు పడుతున్నాయి. ఎటొచ్చీ సిరి, కాజల్ తక్కువ ఓట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే 14వ వారం ఈ ఇద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ వారం కూడా ఒక లేడీ కంటెస్టెంట్ బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. కానీ బిగ్‌బాస్ వాళ్లిద్దరినీ ఫినాలేకు పంపాలనుకుంటే మాత్రం మానస్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్ ఉంది. మానస్, కాజల్‌లో ఎవరు ఎలిమినేట్ అయినా అది సన్నీకి ప్లస్ అవుతుంది. బయట నుంచి వారి ఫ్యాన్స్ సపోర్ట్‌తో మరిన్ని ఓట్లు సన్నీకి పడతాయి. లేదంటే వాళ్లిద్దరూ కూడా ఫినాలేలో అడుగుపెడితే మాత్రం సన్నీకి పడే ఓట్లు కూడా చీలిపోవచ్చు. అంటే సన్నీకి ఏడెనిమిది వేసి మిగతావాటిని మానస్, కాజల్‌కు వేసే అవకాశం ఉంది. ఒకవేళ సిరిని బయటకు పంపితే మాత్రం షణ్ముఖ్‌కు మరింత ప్లస్ అవుతుంది. ఇప్పటికే సిరి వల్ల ఇమేజ్ డ్యామేజ్ అవుతుండటంతో ఆమె బయటకు వస్తే నెగెటివిటీ తగ్గేందుకు ఆస్కారం ఉంది. మరి బిగ్‌బాస్ హౌస్‌కు ఈవారం ఎవరు టాటా చెప్తారో చూడాలి మరి! -
పవన్‌కల్యాణ్‌గా రఫ్ఫాడించిన మానస్, పింకీ లేదనేగా!
Bigg Boss Telugu 5 Promo: ఎప్పుడూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఫైటింగ్ చేసే కంటెస్టెంట్లు నేడు మాత్రం ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వినోదాన్ని పంచేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. ఇంటిసభ్యులందరూ వారికి నచ్చిన సూపర్ స్టార్లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆదేశించాడు బిగ్‌బాస్. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిలో దాదాపు అందరూ నటీనటులే కావడంతో ఈ టాస్క్ చేయడం వారికి ఈజీ అయింది. టాస్క్‌లో భాగంగా సన్నీ బాలయ్య గెటప్ వేయగా సిరి జెనీలియా, కాజల్ శ్రీదేవి, మానస్ పవన్ కల్యాణ్, శ్రీరామ్ చిరంజీవి, షణ్ముఖ్ సూర్య గెటప్‌లు వేశారు. అంతేకాదు ఆ స్టార్ నటుల ఫేమస్ క్యారెక్టర్లను కళ్ల ముందుంచుతూ అలరించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన మానస్ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా డ్యాన్స్‌తో రఫ్ఫాడించేశాడు. ఈ ప్రోమో చూసిన కొందరు నెటిజన్లు మానస్ హుషారు చూసి అవాక్కవుతున్నారు. పింకీ వెళ్లిపోయాక గాలికి వదిలేసిన పక్షిలా హాయిగా ఎగురుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ టాస్కులో కాజల్ గెలిచి ప్రేక్షకులను నేరుగా ఓట్లడిగే అవకాశాన్ని గెలుచుకున్నట్లు సమాచారం! -
సిరి - సన్నీకి లింకు, భరించలేకపోయిన షణ్ను
Bigg Boss 5 Telugu 14th Week Nominations, Episode 93: కాజల్‌కు మరీ ఎక్కువ అటాచ్ అవద్దని సిరికి సూచించాడు షణ్ను. ఆ వెంటనే ఫ్రెండ్షిప్ హగ్ అంటూ ఒకరికొకరు హగ్గిచ్చుకున్నారు. రాత్రవగానే కాజల్ సన్నీకి, సిరి షణ్నుకు దిష్టి తీశారు. మరోవైపు ప్రియాంక వెళ్లిపోయిన బాధతో మానస్ ఒంటరిగా కూర్చుంటే కాజల్, సన్నీ వెళ్లి అతడిని ఏడిపించారు. ప్రియాంక కోసం పాడిన లవ్ సాంగ్‌ను పాడుతూ మానస్‌ను టీజ్ చేశారు. మాది ఫ్రెండ్షిప్రా, లవ్ కాదురా అని మానస్ మొత్తుకున్నప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు. ఆ తర్వాత మానస్, కాజల్... సన్నీ, సిరి ఇద్దరికీ లింకు పెడుతూ జోక్ చేశారు. సిరి కనబడగానే నీ ఆలియాభట్ వస్తుందంటూ కామెంట్లు చేశారు. కానీ దీన్ని సరదాగా తీసుకోలేకపోయిన షణ్ను సిరిపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. మీ ఇద్దరి మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారని, నువ్వు జాగ్రత్తపడకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని హెచ్చరించాడు. వాళ్లు సరదాగా అన్నార్లే అని సిరి లైట్ తీసుకోవడంతో మరింత ఉడికెత్తిపోయిన షణ్ను ఇది చెప్పడం వల్ల నాకు ఒరిగేదేమీ లేదంటూ విసురుగా వెళ్లిపోయాడు. దీంతో సిరి ఏడ్చేసింది. తర్వాతి రోజు ఉదయం సన్నీ నటించిన సకలగుణాభిరామ సినిమాలోని సైకో సైకో పిల్లా సాంగ్ ప్లే చేయడంతో అతడు ఆనందంతో ఎగిరి గంతేశాడు. అటు షణ్ను మాత్రం మళ్లీ.. ఈ హౌస్‌లో ఎందుకున్నాను అంటూ తనలో తానే సణుక్కున్నాడు. 'నేను మోస్ట్ బోరింగ్ పర్సన్‌ను. ఇన్నివారాలు ఎలా ఉన్నానా? అనిపిస్తుంది. ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. కానీ నేను ఒంటరిగా పోరాడుతున్నాను, నా క్యారెక్టర్ ఇంతే.. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు నువ్వెక్కడా నాకు సాయం చేసినట్లు అనిపించలేదు బిగ్‌బాస్' అని కెమెరాలతో తన గోడు చెప్పుకున్నాడు. ఆ తర్వాత సిరి దగ్గరకెళ్లి మనిద్దరం దూరం కావాలని వాళ్లు ప్లాన్లు చేస్తున్నారని షణ్ను అభిప్రాయపడ్డాడు. సన్నీతో గొడవ పెట్టుకున్న ప్రియ, రవి అందరూ వెళ్లిపోయారని కాజల్ ఆలోచిస్తుంది. ఆమె నెక్స్ట్ నీ దగ్గరకే వస్తుందంటూ సిరిని హెచ్చరించాడు. నిన్ను నా నుంచి దూరం పెట్టాలని చూస్తున్నారు అని అభిప్రాయపడ్డాడు. అనంతరం బిగ్‌బాస్ 1 నుంచి 6 ర్యాంకుల వరకు మీ స్థానాలకు నిర్ణయించుకోవాలని ఇంటిసభ్యులను ఆదేశించాడు. దీంతో అందరూ ఏయే స్థానాల్లో నిలబడాలో ఒక్కొక్కరిగా వారి అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ముందుగా షణ్ను మాట్లాడుతూ.. ఫస్ట్ ప్లేస్‌లో నేను, సెకండ్ ప్లేస్‌లో శ్రీరామ్, మూడో స్థానంలో సన్నీ, నాల్గో స్థానంలో సిరి, ఐదారు స్థానాల్లో మానస్, కాజల్ ఉంటారన్నాడు. కాజల్ మాట్లాడుతూ.. నేను 1, సన్నీ 2, మానస్ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5, షణ్ముఖ్ 6 స్థానాల్లో ఉండాలని అభిప్రాయపడింది. మానస్ మాట్లాడుతూ.. సన్నీ 1, కాజల్ 2, షణ్ముఖ్ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5 స్థానాల్లో ఉండాలన్నాడు. శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. షణ్ముఖ్, సిరి 2, సన్నీ 3, కాజల్ 4, మానస్ 5వ ర్యాంకులో ఉండాలన్నాడు. ఫస్ట్ స్థానం ఆ దేవుడే నిర్ణయిస్తాడన్నాడు. తర్వాత సన్నీ వంతు రాగా.. కాజల్ 1, మానస్ 2, సిరి 3, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ 4, నేను 5వ స్థానంలో ఉంటానన్నాడు. అనంతరం సిరి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌కు అన్‌ఫిట్ అనుకున్నాను, కానీ ఆ అభిప్రాయాన్ని షణ్ను మార్చాడు కాబట్టి అతడిని ఫస్ట్ ర్యాంక్‌లో చూడాలనుంది. వాడి పక్కనే రెండో ర్యాంక్‌లో నేను ఉండాలనుకుంటున్నాను. సన్నీ 3, శ్రీరామ్ 4, మానస్, కాజల్ 5 ర్యాంకుల్లో ఉంటారు అని చెప్పుకొచ్చింది. అందరూ అభిప్రాయాలు చెప్పడం పూర్తయ్యాక.. సన్నీ 1, షణ్ను 2, కాజల్ 3, శ్రీరామ్ 4, మానస్ 5, సిరి 6 స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం బిగ్‌బాస్ శ్రీరామ్ మినహా మిగతా ఇంటిసభ్యులందరూ 14వ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారని ప్రకటించాడు. ర్యాంకుల టాస్కులో తన అభిప్రాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని షణ్ను ఆరవ స్థానంలో నిలబడటాన్ని సహించలేకపోయింది కాజల్. ఇదంతా కావాలనే చేశాడని ఫీలైంది. అలా షణ్ను-కాజల్ మధ్య మరోసారి ఫైట్ నడిచింది. దీంతో కాజల్ చాలా యాటిట్యూడ్ చూపిస్తుందన్నాడు షణ్ను. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంది సెటైర్ వేసిం సిరి. ఏదేమైనా ఈ వారం ఎలిమినేషన్‌తో టాప్ 5లో ఎవరుంటారనేది తేలిపోనుంది! -
నీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎప్పటికీ కావాలి మానస్!
Bigg Boss Telugu 5, Priyanka Singh Eliminated From BB5 Show: టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చీరావడంతోనే హౌస్‌మేట్స్‌తో ఓ వెరైటీ గేమ్ ఆడించాడు. బాగా ఫేమస్ అయిన పాత్రలు స్క్రీన్‌పై చూపించి అది ఎవరికి సెట్టవుతుందో చెప్పాలన్నాడు. దీంతో సన్నీ.. మహానటి పాత్ర ప్రియాంకకు పర్ఫెక్ట్గా సూటవుతుందన్నాడు. ఇంకొకరిని కంట్రోల్లో పెట్టే డా.వశీకరణ్ మరెవరో కాదు షణ్నునే అని చెప్పుకొచ్చింది సిరి. అందరినీ డామినేట్ చేసే పెదరాయుడు కూడా షణ్నునే అని ఫీలయ్యారు. నాకు దక్కకపోతే ఇంకెవ్వరికీ దక్కకూడదు అనుకునే నీలాంబరి మాత్రమే కాక వెన్నుపోటు పొడిచే కట్టప్ప, ఫిదాలోని భానుమతి.. ఇవన్నీ పాత్రలూ సిరికే నప్పుతాయని చెప్పుకొచ్చారు. సన్నీకి అర్జున్‌రెడ్డి, చిట్టిబాబు, ఎవరి మాటా వినని సీతయ్య ట్యాగ్‌లిచ్చారు. శ్రీరామ్ రేలంగి మావయ్య మాత్రమే కాదని దురదృష్టవంతుడైన మర్యాద రామన్న అని తెలిపారు. శ్రీరామ్‌కు ఎవరు క్లోజ్ అయినా బయటకు వెళ్లిపోతారు అని నాగ్ అనడంతో అందరూ నిజమేనంటూ నవ్వేశారు. తర్వాత మానస్, కాజల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అనంతరం నాగ్ ఇంటిసభ్యులతో లూడో గేమ్ ఆడించాడు. ఈ క్రమంలో మానస్ పిల్లోతో రొమాన్స్ చేయాలని నాగ్ ఆదేశించాడు. కానీ ఆచరణలో మానస్ విఫలమయ్యాడు. దిండుతో ఎలా రొమాన్స్ చేయడమని అతడు ఎదురు ప్రశ్నించగా పోనీ ప్రియాంకతో రొమాన్స్ చేస్తావా? అని సూటిగా అడిగేశాడు నాగ్. దీంతో షాకైన మానస్ వద్దు, దిండే నయమని ఫీలైనప్పటికీ అందరూ పట్టుబట్టి మరీ పింకీతో రొమాన్స్ చేయించారు. టాప్ 7లో ఎవరుంటారని ఊహించలేదని షణ్నుని అడగ్గా అతడు కాజల్ పేరు చెప్పాడు. ఈ కాజల్ హౌస్‌లో సింపతీ కోసం ప్రయత్నిస్తుందన్నాడు మానస్. హౌస్‌లో కామన్‌సెన్స్‌లేని వ్యక్తులు ఇద్దరున్నారని వారెవరో కాదు.. సిరి, పింకీ అని చెప్పుకొచ్చాడు షణ్ను. లూడో గేమ్‌లో సన్నీ, కాజల్ గెలిచారు. తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగానే ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. నాతో కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిందని మానస్‌తో చెప్పుకుంటూ బాధపడింది. స్టేజీపైకి వచ్చాక తన జర్నీ చూసుకుని ఏకధాటిగా ఏడ్చింది పింకీ. ఆమెతో చివరిసారిగా గేమ్ ఆడించాడు నాగ్. ఇప్పుడున్న టాప్ 6 కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు ఎలాంటి అభిప్రాయం ఉండేది? ఇప్పుడు వారిపై ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పాలన్నాడు. మొదటగా సిరి గురించి చెప్తూ.. ఇదేంటి నాకంటే అందంగా ఉందని అసూయపడ్డాను. కానీ అదెప్పుడూ నా చెల్లెలిగా అనిపిస్తుంది. తను ఈ హౌస్‌కు చాలా అవసరమని నొక్కి చెప్పింది. శ్రీరామ్‌తో ఫస్ట్ నుంచి ఇప్పటివరకు తన కనెక్షన్ ఒకేలా ఉందని తెలిపింది. శ్రీరామచంద్రను శ్రీకృష్ణుడు చేద్దామనుకున్నా కానీ అతడు రాముడిలాగే ఉండిపోయాడంది. షణ్ను పక్కింటబ్బాయిలా అనిపిస్తాడని, అతడిని తమ్ముడు అని పిలుద్దామనుకున్నాను. కానీ ముదిరిపోయిన బెండకాయ అని తెలిసి ఊరుకున్నానని చెప్పింది. హౌస్‌లో మొదటి రోజు సన్నీ అన్నయ్య నన్ను చూడగానే స్వప్నలోక సుందరి దొరికిందన్నాడు. కానీ నేను అన్నయ్య అని గాలి తీసేశానని నవ్వేసింది. కాజల్ చాలా అల్లరి చేస్తుందని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు మానస్‌ను చూసి హాయ్ చెప్తే అతడు స్పందించలేదు.. ఇతడికి ఎంత పొగరు? అసలు మాట్లాడొద్దనుకున్నాను. కానీ రానురానూ మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండ్ కుదిరింది. నీ నుంచి చాలా నేర్చుకున్నాను. నీతో ఫ్రెండ్షిప్ ఎప్పటికీ కావాలి. నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? అని పదేపదే అడుగుతుంటావు కదా, నేను నీ విజయాన్ని కోరుకుంటున్నాను అని చెప్తూ ఏడ్చేసింది పింకీ. ఆమె వెళ్లిపోతున్న బాధను బయటకు కనిపించనీయకుండా జాగ్రత్తపడ్డ మానస్.. 'ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో..' అంటూ పాటందుకుని తన భావాలను అభివ్యక్తీకరించాడు. ఐ లవ్యూ నా ప్రాణం పోయినా.. ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా అంటూ పాట రూపంలో ఆమె మీదున్న ప్రేమను ప్రకటించాడు. అంతేకాక ఈ పాటను పింకీకి అంకితమిస్తున్నాననడంతో ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. అలాగే సింగర్ శ్రీరామ్... ప్రియా ప్రియా.. చంపొద్దే అంటూ పింకీ కోసం సాంగ్ పాడాడు. అనంతరం ప్రియాంక భారమైన హృదయంతో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది. -
బిగ్‌బాస్: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే!
Bigg Boss 5 Telugu, Top 5 Finalists: టికెట్ టు ఫినాలే టాస్క్ ఏమోకానీ సిరి, శ్రీరామ్ ఇప్పటికీ తమంతట తాము నడవలేక నానా అవస్థ పడుతున్నారు. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప సరిగ్గా నిలబడలేకపోతున్నారు. రెండుమూడురోజులుగా కాళ్లకు కట్లు కట్టుకుని కుర్చీల్లోనే కూర్చుండిపోయారు. అలా అని టికెట్ టు ఫినాలేను గాలికి వదిలేయలేదు. కూర్చుని ఆడే గేమ్స్ స్వయంగా వాళ్లే ఆడారు కానీ ఫిజికల్ టాస్కుల్లో మాత్రం ఇతరుల సాయం తీసుకున్నారు. అలా సిరి రెండుసార్లు షణ్ను హెల్ప్ తీసుకోగా శ్రీరామ్.. షణ్ను, సన్నీ ఇద్దరి సాయం తీసుకున్నాడు. వాళ్లిద్దరి సాయంతో చివరి రౌండ్‌కు చేరుకున్న శ్రీరామ్ ఫైనల్లో మాత్రం అతడే ఆడి టికెట్ టు ఫినాలే గెలిచాడు. అలా ఈ సీజన్లో టాప్ 5లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే శ్రీరామ్‌తో పాటు ఎవరెవరు ఫినాలేలో అడుగు పెడతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్ టాప్ 3లో ఉంటారని నెటిజన్లు బలంగా అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ శ్రీరామ్‌ను వెనక్కి నెట్టి మానస్ టాప్ 3లో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. లేదంటే అతడు నాలుగో స్థానానికి పరిమితమయ్యేట్లు కనిపిస్తోంది. చివరి స్థానంలో లేడీ కంటెస్టెంట్ నిలిచేందుకు ఆస్కారం ఉంది. అయితే ఆ స్థానాన్ని సిరి, కాజల్‌లో ఎవరు దక్కించుకుంటారనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఊహించని ఎలిమినేషన్లతో ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తున్నాడు బిగ్‌బాస్. ఈ రెండు వారాలు ఎలిమినేషన్‌ను తప్పించుకునే కంటెస్టెంట్ ఫినాలేకు వెళ్తుంది. ఒకవేళ సిరి ఎలిమినేట్ అయితే మాత్రం ఫినాలేలో అడుగుపెట్టాలన్న కాజల్ కోరిక నెరవేరుతుంది. మరోపక్క ఈ వారం పింకీ వెళ్లిపోతుందని అనఫీషియల్ ఓటింగ్స్ చెప్తున్నాయి. ఒకవేళ అది నిజం కాకపోతే కాజల్ బయటకు వచ్చేస్తుందంటున్నారు. ఈ వారం జరగనున్న ఎలిమినేషన్‌తో టాప్ 5లో ఎవరుంటారనేదానిపై ఓ స్పష్టత రానుంది. -
ప్రియాంకకు బిగ్‌బాస్ వార్నింగ్, సొంత వైద్యం అక్కర్లేదని హెచ్చరిక!
Bigg Boss 5 Telugu, Episode 90: వీకెండ్ దగ్గరపడుతుందంటే చాలు హౌస్‌మేట్స్‌లో ఎక్కడలేని భయం తొంగి చూస్తుంది. ఈ వారం నేను లేదా కాజల్ ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉందని ప్రియాంక అభిప్రాయపడింది. కానీ షణ్ను మాత్రం మానస్ కూడా వెళ్లొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. అనఫీషియల్ పోలింగ్ చూస్తుంటే పింకీ మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక ఇంటిసభ్యులు 'టికెట్ టు ఫినాలే' టాస్క్‌లో ఫోకస్ ఛాలెంజ్ ఎంచుకున్నారు. ఇందులో భాగంగా కొన్ని శబ్ధాలు ప్లే చేయగా వాటిని సరిగ్గా గుర్తించి వరుస క్రమంలో రాసినవాళ్లు మొదటి స్థానంలో నిలుస్తారని బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే కాజల్ పదేపదే మధ్యలో మాట్లాడుతూ పోటీదారులను డిస్టర్బ్ చేయడంతో సన్నీ ఆమెపై ఫైర్ అయ్యాడు. ఇది తర్వాత చిలికి చిలికి గాలివానలా మారింది. ఇక హెలికాప్టర్ సౌండ్‌ను ట్రాక్టర్ అని, గురక శబ్ధాన్ని పులి గాండ్రింపు అని సిరి రాయడంతో అందరూ నవ్వాపుకోలేకపోయారు. షణ్ను అయితే ఈ విషయంలో సిరిని చాలా ఏడిపించాడు. ఈ ఛాలెంజ్‌లో సన్నీ, మానస్ ఎక్కువ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా శ్రీరామ్, సిరి తర్వాతి స్థానాల్లో నిలిచారు. గేమ్‌లో సన్నీని డిస్టర్బ్ చేసినందుకు కాజల్ పదేపదే సారీ చెప్పింది. అయినప్పటికీ సన్నీ తన మాటలను పట్టించుకోనట్లు నటిస్తూ ఆమెను మరింత ఉడికించాడు. చిర్రెత్తిపోయిన కాజల్.. టిష్యూ పేపర్‌ను ముఖం మీద విసరగా అసహనానికి లోనైన సన్నీ కామన్సెన్స్ లేదని తిట్టాడు. దీంతో కాజల్ దుప్పటి కప్పుకుని ఏడ్చేసింది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అక్యురెసీ అనే ఐదో ఛాలెంజ్ ఎంచుకున్నారు హౌస్మేట్స్. ఈ టాస్క్‌లో బోర్డుపై ఉన్న బల్బ్స్లో కొన్ని ఆన్, కొన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. తక్కువ సమయంలో అన్నింటినీ ఆన్ చేసినవారు ప్రథమస్థానంలో నిలుస్తారు. ఈ గేమ్‌లో ఇప్పటికీ సరిగా నడవలేకపోతున్న సిరి, శ్రీరామ్ ఇద్దరి తరపున షణ్ను ఆడాడు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్, సన్నీ, సిరి, మానస్ వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ ఛాలెంజ్‌లన్నీ ముగిసే సమయానికి చివరి రెండు స్థానాల్లో ఉన్న సిరి, సన్నీ రేసు నుంచి తప్పుకోగా మానస్, శ్రీరామ్ ఫినాలే టికెట్ కోసం పోటీపడ్డారు. సిరికి మోషన్స్ అవుతున్నాయంటే ప్రియాంక ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నించింది. షుగర్ వాటర్ తాగమని, అరటిపండు తినమని తనకు తోచిన సూచనలు ఇచ్చింది. ఇప్పటికే ఆమె చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ పూర్తిగా బెడ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు కొత్తగా సిరికి వైద్యసలహా ఇవ్వడంతో వెంటనే స్పందించిన బిగ్‌బాస్ నీకోసం కానీ, ఇతర ఇంటిసభ్యుల కోసం కానీ సొంత వైద్యం చేయడం శ్రేయస్కరం కాదని హెచ్చరించాడు. ఈ దెబ్బతో పింకీ తలెక్కడ పెట్టుకోవాలో తెలియక చిన్నబుచ్చుకుంది. ఆఖరి రౌండ్లో శ్రీరామ్, మానస్ పోటీపడగా శ్రీరామ్ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. షణ్ను, సన్నీ ఇద్దరూ తన గెలుపుకు సాయం చేశారని వారికి అభినందనలు తెలిపాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యానోచ్ అంటూ తెగ సంబరపడిపోయిన శ్రీరామ్‌కు పట్టరాని ఆనందంతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. మరోపక్క చివరిదాకా వచ్చి ఓటమిని చవిచూసినందుకు మానస్ దిగులుచెందాడు. ఫినాలే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని ఎంతగానో బాధపడ్డాడు. -
మానస్ బిగ్‌బాస్ హౌస్‌లో ఇరగదీస్తున్నాడు: రెడ్ హీరోయిన్
Bigg Boss 5 Telugu, Malvika Sharma Supports Maanas: బిగ్‌బాస్ షో ముగింపుకు వచ్చేకొద్దీ సెలబ్రిటీలు వారి అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించడం కోసం బయట బాగానే కష్టపడుతున్నారు. కొందరు షో ప్రారంభం నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తుంటే మరికొంతమంది ఫైనల్ ఎపిసోడ్‌కు రెండు వారాలే గడువు ఉన్న నేపథ్యంలో తమ మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ మధుప్రియ కూడా ఇద్దరు కంటెస్టెంట్లకు తన మద్దతు తెలిపింది. సింగర్ శ్రీరామచంద్రతో పాటు తన స్నేహితుడు మానస్‌కు ఓట్లేసి సేవ్ చేయండంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో వేడుకుంది. యాంకర్ సమీరా, కమెడియన్ అదిరే అభితో పాటు పలుబురు బుల్లితెర సెలబ్రిటీలు అతడికి మద్దతు పలుకుతున్నారు. అంతేకాదు రెడ్ హీరోయిన్ మాళవిక శర్మ సైతం మానస్‌కు అండగా నిలిచింది. 'మానస్ గురించి నేను చాలా విన్నాను. అతడు బిగ్‌బాస్ హౌస్‌లో ఇరగదీస్తున్నాడు. అందరూ అతడికి ఓటేస్తున్నారని ఆశిస్తున్నాను. నా ఓటు కూడా మానస్‌కే! అతడు తప్పకుండా గెలుస్తాడని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది మాళవిక. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli) -
'చూసుకుంటున్నాడు, హగ్గివ్వకపోతే ఎలా?' తల్లిని తలుచుకున్న సిరి
Bigg Boss Telugu 5, Episode 89: టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా.. 29 నిమిషాలు లెక్కపెట్టాల్సిన ఛాలెంజ్‌లో మానస్ మొదటి స్థానంలో నిలిచాడు. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ప్రియాంక, కాజల్, సన్నీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మానస్ సాయం చేసినా సన్నీ ఓడిపోవడంతో హౌస్మేట్స్ అతడిపై కౌంటర్లు వేశారు. మరోపక్క సిరి హగ్గివ్వంటూ షణ్నును అడిగింది. దీంతో అతడు కాస్త తటపటాయిస్తూనే ఫ్రెండ్షిప్హగ్ అని కెమెరాల వంక చూడగా.. నన్ను బాగా చూసుకుంటున్నాడు, మరి హగ్గివ్వకపోతే ఎలా అంటూ అతడిని హత్తుకుంది సిరి. వారి ఫ్రెండ్షిప్ గురించో మరేంటో కానీ.. మా అమ్మకు ఇప్పుడు అర్థమవుతుందని తనలో తానే అనుకుంది సిరి. అయితే వీళ్ల హగ్గులు చూసిన పింకీ.. తనకు కూడా ఓ హగ్గివ్వమని కోరింది కానీ అతడు మాత్రం పట్టించుకోలేదు. అనంతరం షణ్ను, కాజల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నిజంగా నేను తప్పైతే నీకంటే ముందే వెళ్లిపోతా! అని కాజల్‌తో శపథం చేశాడు షణ్ను. నువ్వెప్పుడూ నేను తప్పు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తావని ఫైర్ అయింది కాజల్. ఈ క్రమంలో షణ్ను నీ బొంద, కామన్సెన్స్ అంటూ కొన్ని అనవసర మాటలు జారాడు. తర్వాతరం హౌస్మేట్స్ స్కిల్ ఛాలెంజ్ స్వీకరించారు. ఇందులో భాగంగా ఏటవాలుగా ఉన్న స్టాండ్‌లో నీళ్లు పోసి అందులోని జార్స్‌లో ఉన్న బాల్స్ కింద పడేలా చేయాలి. ఎవరైతే అన్ని బాల్స్ ముందుగా కిందపడేలా చేస్తారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. ఐస్ టాస్క్ వల్ల ఇప్పటికీ నిలబడి నడవలేకపోతున్న శ్రీరామ్, సిరిల స్థానంలో సన్నీ, షణ్ను ఆడారు. ఇక ఈ గేమ్‌లో మానస్, శ్రీరామ్, సిరి, ప్రియాంక, కాజల్, సన్నీ, షణ్ముఖ్ వరుసగా ఏడు స్థానాల్లో నిలిచారు. మొత్తంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో మూడు ఛాలెంజ్‌లు పూర్తయ్యే సరికి తక్కువ పాయింట్లు ఉన్న కాజల్, ప్రియాంక రేసు నుంచి తప్పుకున్నట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. సన్నీ, షణ్ముఖ్లిద్దరికీ సమాన పాయింట్లు రావడంతో వీరికి మళ్లీ గేమ్ పెట్టగా ఇందులో సన్నీ గెలిచి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు. షణ్ను రేసు నుంచి వైదొలిగాడు. రేపటి ఎపిసోడ్లో మానస్, సన్నీ, షణ్ను, సిరిలకు చివరి పోటీ పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచి ఫినాలేలో మొదటగా అడుగు పెడతారో రేపటి ఎపిసోడ్లో చూడాలి! -
టికెట్ టు ఫినాలే రేసులో నుంచి వాళ్లు అవుట్!
Bigg Boss Telugu 5: ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క.. ఎన్ని రోజులు ఉన్నామన్నది కాదు ముఖ్యం.. ఫినాలేలో అడుగుపెట్టామా? లేదా? అన్నది పాయింట్! ఇప్పుడు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా ఫినాలే టికెట్ కోసం రేసు మొదలు పెట్టారు. మరి హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరు టికెట్ సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఎండురెన్స్, స్పీడ్ టాస్క్‌లు పూర్తవగా ముచ్చటగా మూడో టాస్క్ కూడా ప్రారంభమైనట్లు తాజా ప్రోమోలో కనిపిస్తోంది. స్కిల్ చాలెంజ్‌లో శ్రీరామ్, సిరి మినహా మిగతా అందరూ ఆడినట్లు కనిపించింది. నిన్నటి ఐస్‌క్యూబ్స్ గేమ్ ఫలితం కారణంగా సిరి, శ్రీరామ్ లేచి నిలబడలేని స్థితిలో ఉన్నారు. దీంతో వీరిద్దరి తరపున షణ్ను, సన్నీ గేమ్ ఆడినట్లు సమాచారం! మొత్తానికి మానస్, సన్నీ, సిరి, శ్రీరామ్ ఫైనల్ గేమ్‌కు అర్హత సాధించగా, కాజల్, ప్రియాంక, షణ్ను రేసు నుంచి అవుట్ అయినట్లు వినికిడి! మరి ఆ నలుగురిలో ఎవరు ముందుగా ఫినాలేలో అడుగుపెడతారో చూడాలి! -
జీవితంలో మాట్లాడను, కట్ చేస్తే కాసేపటికే హగ్గులు
Bigg Boss Telugu 5, Episode 87: ప్రియాంక.. కాజల్‌ను నామినేట్ చేయడంపై మానస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తను నిన్ను సపోర్ట్ చేసింది, కానీ నువ్వు ఆమెను ఫ్రెండ్ అనుకోలేదు కాబట్టే నామినేట్ చేశావని అసహనం వ్యక్తం చేశాడు. ముందు నీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోమని చెప్తూ అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్లిపోయాడు. అతడు చెప్పాలనుకుంది చెప్పాడు, మరి తన సమాధానం కూడా వినాలి కదా! అని నిలదీసింది పింకీ. నీది మాట్లాడటం అయిపోతే వెళ్లిపోతావా? అని ఆగ్రహంతో ఊగిపోయింది. కానీ కాసేపటికే మళ్లీ మానస్ దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలని చెప్పింది. అయితే అతడు మాత్రం నేనిప్పుడు మాట్లాడలేనన్నాడు. ఎవడో కోన్‌కిస్కా గొట్టం గాడు ఇలా అంటే పట్టించుకోను కానీ నువ్వంటే మాత్రం బాధపడతానని గట్టిగా అరిచేసింది పింకీ. ఎందుకు బాధపడతావని మానస్ అడగ్గానే ఒళ్లు కొవ్వెక్కి అంటూ ఏడ్చేసింది. నువ్వు నన్ను తప్పుగా ఫ్రూవ్ చేయాలని చూస్తున్నావంటూ మానస్ అనడంతో షాకైన పింకీ.. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేను జీవితంలో మాట్లాడను అని తేల్చి చెప్పింది. దీంతో మానస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రంతా మానస్- ప్రియాంక మధ్య ఈ గొడవ జరుగుతుంటే కాజల్ ఎంట్రీతో ఇది మరింత పెద్దదిగా మారింది. 'ఈ పంచాయితీలు వద్దు, నాకు నువ్వు నచ్చట్లేదు, నీతో మాట్లాడాలనుకోవడం' లేదు అంటూ మానస్ ఆమె ముఖం మీదే చెప్పాడు. అయినప్పటికీ పింకీ అతడితో మాట్లాడటానికి ఎంతగానో ప్రయత్నించగా కాజల్ అది కుదరనివ్వలేదు. దీంతో చిర్రెత్తిపోయిన పింకీ.. కాజల్‌ను షటప్ అని తిట్టి వెళ్లింది. ఆమె ఎక్కడుంటే అక్కడ గొడవలుంటాయనేది నిజమని, రెచ్చగొట్టి ఏమీ ఎరుగనట్లు సైలెంట్‌గా కూర్చుంటుందని నానా మాటలు అంది. కట్ చేస్తే పింకీ ఇంకా భోజనం చేయలేదని తెలిసిన మానస్.. ఆమెను తినమని బతిమాలాడు. తన కోపం, ఆవేశం, ఆవేదన అంతా కలిసి దుఃఖంగా ఉప్పొంగుకురాగా అతడిని హగ్ చేసుకుని ఏడ్చేసింది. దీంతో మానస్ ఆమెను ఓదార్చాడు. మరోపక్క కాజల్‌కు ఎలా ఓట్లేస్తున్నారో అర్థం కాక షణ్ను, సిరి తల పట్టుకున్నారు. సన్నీ ఫ్యాన్స్ తనకు ఓట్లేస్తారనే కాజల్ అతడితో సన్నిహితంగా ఉందన్నాడు షణ్ను. ఇంతలో షణ్ను కెప్టెన్సీ పూర్తయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. అనంతరం బిగ్‌బాస్ ప్రతిష్టాత్మకమైన "టికెట్ టు ఫినాలే" టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో మొదటి లెవల్ 'ఎండ్యురెన్స్ టాస్క్'లో భాగంగా కంటెస్టెంట్లు వీలైనంత ఎక్కువ సేపు ఐస్ టబ్‌లో ఉండాలి. ఒక్క కాలు బయటపెట్టినా సరే ఆ సమయంలో ఇతరులు వారి టబ్‌లోని బాల్స్ తీసుకోవచ్చని తెలిపాడు. ఆట మొదలవగానే అందరూ ఐస్ వాటర్‌లో నిలబడ్డారు. కానీ సన్నీకి చెరోవైపు కాజల్, మానస్, షణ్ను పక్కన సిరి ఉండటంతో వారి బాల్స్ దొంగిలించడానికి కూడా ప్రయత్నించడం లేదు. ఇది అర్థమైన బిగ్‌బాస్ వెంటనే రెండో లెవల్ మొదలవుతుందంటూ షణ్ను, సన్నీలను స్థానాలు మార్చుకోమని ఆదేశించాడు. దీంతో రేపటి ఎపిసోడ్లో అసలు గేమ్ మొదలైనట్లు కనిపిస్తోంది. అంతేకాదు..సిరికి, సన్నీకి మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. -
అంతా కలిసి సన్నీని విన్నర్‌గా తేల్చారు! టాప్ 5లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 5, Episode 84: కింగ్ నాగార్జున హౌస్మేట్స్ కోసం సర్ప్రైజ్ పట్టుకొచ్చాడు. కంటెస్టెంట్ల కోసం మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ స్టేజీపైకి వస్తారని చెప్పాడు. కానీ వాళ్లు మిమ్మల్ని కలవాలంటే మీకు బాగా నచ్చిన వస్తువులను త్యాగం చేయాలని మెలిక పెట్టాడు. అయినవాళ్లను చూడటం కన్నా విలువైనది ఏముంటుందనుకున్న హౌస్మేట్స్ అందుకు ఓకే అనేశారు. మొదటగా యాంకర్ రవి పాప బొమ్మను త్యాగం చేయడంతో అతడి తల్లి ఉమాదేవి స్టేజీపైకి వచ్చింది. ఫ్యామిలీ అంతా నిన్ను చూసి గర్వపడుతుందని నువ్వు బిగ్‌బాస్ హౌస్‌కు రాజువని మెచ్చుకుంది. రవి కోసం బిగ్‌బాస్ తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ కూడా షోకి విచ్చేశాడు. హౌస్‌లో ఎవరికి సపోర్ట్ చేయొద్దని, నీకు చెప్పాలనిపించిన పాయింట్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరాడు. అనంతరం ఉమావేవి.. రవి, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని చెప్పుకొచ్చింది. తర్వాత పింకీ మేకప్ కిట్ త్యాగం చేయగా ఆమెకోసం హాస్యనటులు సాయి, అప్పారావు వచ్చారు. వీరు ప్రియాంకను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, శ్రీరామ్, రవి, మానస్‌లను టాప్ 5లో ఉంచారు. ఈ సందర్భంగా పింకీ మాట్లాడుతూ.. 'నన్ను కన్నడ నుంచి తెలుగుకి తీసుకువచ్చి కామెడీ షో చేయించారు.. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం' అంటూ అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపింది. సన్నీ తనకు ఫ్రెండ్స్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌ను త్యాగం చేయగా ఇద్దరు ఫ్రెండ్స్ నిఖిల్, వెంకట్ స్టేజీపై సందడి చేశారు. కప్పు ముఖ్యం బిగిలూ అంటూనే బోర్డు మీద సన్నీని విన్నర్ స్థానంలో ఉంచారు. షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, కాజల్‌ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంచారు. మానస్.. తల్లి పంపిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేయగా అతడి కంటే ఎక్కువగా పింకీ బాధపడిపోయింది. తర్వాత మానస్ తండ్రి వెంకట్రావు, ఫ్రెండ్ అమర్దీప్ వచ్చాడు. ఏమీ లేనివాడిని తీసుకొచ్చి అన్నీ ఉన్నవాడిలా చేశాడు, నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే మానస్ వల్లేనంటూ అతడిని పొగిడేశాడు. అనంతరం మానస్‌ను ఫస్ట్ ప్లేస్‌లో సన్నీ, కాజల్, శ్రీరామ్, షణ్ముఖ్‌ను మిగిలిన నాలుగు స్థానాల్లో పెట్టారు. కాజల్ ఎంతగానో ఇష్టపడే బొమ్మను త్యాగాల పెట్టెలో పడేసింది. ఆమెను కలవడానికి సోదరితో పాటు, సింగర్ లిప్సిక కూడా వచ్చారు. వీళ్లు కాజల్‌ను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, షణ్ను, శ్రీరామచంద్ర, మానస్‌ను తర్వాతి స్థానాల్లో పెట్టారు. అనంతరం శ్రీరామ్.. హమీదా ఇచ్చిన కానుకను త్యాగం చేయగా అతడి కోసం తల్లి, స్నేహితురాలు వచ్చారు. వీళ్లు శ్రీరామ్, రవి, ప్రియాంక సింగ్, సన్నీ, షణ్ముఖ్‌లు వరుసగా టాప్ 5లో ఉంటారని జోస్యం చెప్పారు. సిరి కోసం వచ్చిన శ్రీహాన్.. సన్నీ, షణ్ముఖ్, రవి, శ్రీరామ్, సిరిలు వరుసగా టాప్ 5లో ఉంటారన్నాడు. చివరగా షణ్ముఖ్.. తన ప్రేయసి దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్‌ను భారంగా త్యాగం చేశాడు. అతడి కోసం మొదట అన్నయ్య సంపత్ రాగా తర్వాత దీప్తి సునయన స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో షణ్ను ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్ అయిపోవద్దని దీప్తి సూచించింది. నాకు నువ్వేంటో తెలుసంటూ అతడికి ముద్దులు పంపించింది. షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని వీళ్లు అభిప్రాయపడ్డారు. ఫినాలేలో కలుద్దామంటూ వీడ్కోలు తీసుకుంది. ఈరోజు వచ్చిన మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్ సన్నీని టాప్ 5లోని మొదటి రెండు స్థానాల్లో పెడుతూ అతడే విన్నర్ అని చెప్పకనే చెప్పారు. -
ఎలిమినేట్ అవుతానని బలంగా ఫిక్సయిన ప్రియాంక!
Bigg Boss Telugu 5 Unseen: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో మరో ఎలిమినేషన్ జరగబోతోంది. ఈ 12వ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. కాజల్, సిరి, ప్రియాంక సింగ్‌లలో ఎవరు హౌస్‌ను వీడనున్నారనేది రేపు తేలనుంది. అయితే ఈ వారం తాను వెళ్లిపోవడం ఖాయం అని ముందే ఫిక్సైపోయింది పింకీ. అన్‌సీన్ వీడియోలో మానస్ దగ్గరకు వెళ్లి కూర్చున్న ప్రియాంక.. ఈ వీక్ నేను వెళ్లిపోతే ప్రతిరోజూ బొట్టు పెట్టుకుని పడుకోమని సూచించింది. అలాంటి సెంటిమెంట్స్ లేవని తెలుసు కదా, ఏదో నువ్వు పెడతావని పెట్టుకుంటున్నా అంతేనని మానస్ సమాధానమివ్వగా మరి మొన్నెందుకు పెట్టుకున్నావని కూపీ లాగింది. సమయానికి భోజనం చేయు, బట్టలు ఎప్పటికప్పుడు ఉతికేసుకో, రెండు రోజులకొకసారి తలకు నూనె పెట్టుకో అని మానస్‌కు ఏమేం చేయాలో లిస్టు చెప్పుకురాసాగింది. ఆమె మాటలను మధ్యలో అడ్డుకున్న అతడు నువ్వు ఏం వెళ్లిపోవులే అని సముదాయించాడు. అయితే పింకీ మాత్రం నేను వెళ్తానని ఫిక్సయ్యాను అని కరాఖండిగా తేల్చేసింది. ఎందుకు? హౌస్‌లో ఇప్పటికే చాలా రోజులు ఎక్కువ ఉండిపోయాననుకుంటున్నావా? అని మానస్ మధ్యలో పంచ్ వేశాడు. మరి ప్రియాంక ఊహించిందే నిజమవుతుందా? ట్రోఫీ గెలవాలన్న కల కలగానే మిగిలిపోనుందా? అన్నది చూడాలి! -
హగ్గులు వద్దన్నందుకు తల్లిపై సిరి ఫైర్, ఏడ్చేసిన షణ్ను!
Bigg Boss Telugu 5, Episode 82: కుటుంబ సభ్యుల ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో ఆనందం తాండవం చేసింది. హౌస్మేట్స్ అందరూ వచ్చిన అతిథులను చూసి తెగ సంతోషపడ్డారు. నెక్స్ట్ ఎవరు వస్తారా? అని ఎవరికివారు ఆశగా గేట్ల వంక చూశారు. నిన్న కాజల్ ఫ్యామిలీ హౌస్‌లో సందడి చేయగా నేడు శ్రీరామ్, మానస్, సిరి ఇంటిసభ్యులు వచ్చారు. మరి వాళ్లేం అన్నారు? హౌస్‌లో ఎంత రచ్చ చేశారన్నది నేటి (నవంబర్ 25) ఎపిసోడ్లో చూసేద్దాం.. శ్రీరామ్ కోసం ఆమె సోదరి అశ్విని హౌస్‌లోకి వచ్చింది. అందరితో పలకరింపులు అయిపోయాక శ్రీరామ్‌కు గేమ్‌లో సలహాలు సూచనలు ఇచ్చింది. నీ పాయింట్ నువ్వు చెప్పు, కానీ ఎదుటివాళ్లు చెప్పేది కూడా వినమని సూచించింది. నిన్ను గెలిచి రమ్మని బామ్మ మరీమరీ చెప్పిందని అది నిజం చేసి రావాలంటూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. తర్వాత మానస్ తల్లి పద్మిని హౌస్‌లో అడుగు పెట్టింది. వచ్చీరావడంతోనే హౌస్ అంతా చుట్టేస్తూ తెగ సందడి చేసింది. మానస్‌తో పర్సనల్‌గా మాట్లాడుతూ.. నీ దృష్టంతా టాప్ 5లో చేరడంపైనే ఉండాలని నొక్కి చెప్పింది. నిన్ను విన్నర్‌గా చూడాలనుకుంటున్నానని మనసులోని మాటను బయటపెట్టింది. పక్కవాళ్లు డిస్టర్బ్ చేస్తున్నా డిస్టర్బ్ కాకుండా ఆడితే తప్పకుండా ఫినాలేకు చేరుకుంటావని ధైర్యం నూరిపోసింది. ఇక తనను హౌస్మేట్స్ ఆంటీ అని పిలవగా అక్క అని పిలవండని సూచించడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. అందరికంటే పింకీ అందంగా కనిపిస్తుందని ఆమెను మెచ్చుకుంది. శ్రీరామ్.. తనకు, మానస్‌కు మీలాంటి ఒక అమ్మాయిని చూడమని రిక్వెస్ట్ చేయగా శ్రీదేవి.. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేస్తానంది. అంతలోనే హమీదా వెయిట్ చేస్తోందిలే అంటూ పంచ్ విసిరింది. ఆమె ఎనర్జీకి మంత్రముగ్ధుడైన శ్రీరామ్ నీవన్నీవే, నీవే.. అంటూ అందమైన పాట పాడాడు. తర్వాత ఆమె అందరికీ వీడ్కోలు పలుకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బీబీ ఎక్స్‌ప్రెస్ టాస్క్‌లో భాగంగా షణ్ను పాజ్‌లో ఉన్నప్పుడు హౌస్మేట్స్ అతడికి గర్భవతి వేషం వేయగా, సిరికి మీసాలు దించి ఆటపట్టించారు. అనంతరం సిరి తల్లి శ్రీదేవి హౌస్‌లోకి రాగా షణ్ముఖ్‌ను నువ్వు హగ్ చేసుకోవడం నచ్చలేదని ముక్కుసూటిగా చెప్పింది. తండ్రి లేని పిల్ల కదా! షణ్ముఖ్ తండ్రిగా, అన్నగా అన్ని రకాలుగా సాయం చేస్తూ దగ్గరవుతుండటం నచ్చలేదంది. దగ్గరవడం మంచిదే కానీ హగ్గులు నచ్చట్లేదని చెప్పగా సిరి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఆమెను పక్కకు తీసుకెళ్లింది. హగ్ చేసుకోవడం నచ్చలేదని ఎందుకలా అన్నావు? అలా అనకూడదు కదా! ఫీలవుతారు అని ఆగ్రహించింది. తల్లిగా అనిపించింది చెప్పవలసిన బాధ్యత తనకుందని జవాబిచ్చింది శ్రీదేవి. అందరిముందు కాకుండా నాకు పర్సనల్‌గా చెప్పాల్సిందని సిరి నొచ్చుకుంది. నువ్వెలాగో టాప్ 5లో ఉంటావంటున్నారు, కానీ నువ్వు మాత్రం కప్పు పట్టుకునే రావాలి అని సిరికి మరీమరీ చెప్పింది ఆమె తల్లి. తర్వాత తన కష్టాలు చెప్పుకుంటూ బాధపడింది. 'సిరికి ఊహ తెలిసినప్పుడే వాళ్ల డాడీ చనిపోయారు. చిన్న పాన్‌షాప్ పెట్టి ఆమెను చదివించాను. ఎన్నో మాటలు పడ్డాను. కష్టపడి చదివించినందుకు నా పిల్లలు నాకు మంచి పేరు తెచ్చారు. నన్ను సిరి తల్లిగా గుర్తిస్తున్నారు. ఆమెకు తల్లినయినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను' అని చెప్పుకొచ్చింది. ఆమె వెళ్లిపోయాక సిరి వచ్చి హగ్ చేసుకుని ఏడవగా షణ్ను ఆమెను మనసారా హత్తుకుని ఓదార్చలేకపోయాడు. నా గేమ్ కూడా వదిలేసి ఇంత సపోర్ట్ చేస్తే ఆమె తల్లితో ఇలా మాట పడాల్సి వచ్చిందని ఫీలయ్యాడు. అలా హగ్గులు నచ్చలేదని ఆమె తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాడు. ఈ హౌస్‌లో ఉండేందుకు తనకు అర్హత లేదని, ఇంకా ఎందుకున్నానో అర్థం కావట్లేదని తనలో తానే కుమిలిపోయాడు. మరోవైపు తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రియాంక మానస్‌ను నిలదీసింది. నువ్వు నా దగ్గరనుంచి ఎక్కువగా ఆశిస్తున్నావని, నేను ఫ్రెండ్‌గా వచ్చి మాట్లాడితే నీకు ఇంతేనా అనిపిస్తుందంటూ ఆమెను ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. మానస్ చెప్పేది అర్థం అయిందో లేదో తెలియదు కానీ వెంటనే పింకీ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. అనంతరం సన్నీ తల్లి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చింది. తన బర్త్‌డేను హౌస్‌మేట్స్‌తో సెలబ్రేట్ చేసుకోనుంది. ఆ సెలబ్రేషన్స్ రేపటి ఎపిసోడ్లో ప్రసారం కానున్నాయి. -
పాన్‌షాప్ పెట్టి చదివించాను, ఎన్నో మాటలు పడ్డాను: సిరి తల్లి
Bigg Boss 5 Telugu Promo: నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్‌తో రణరంగంగా మారిన బిగ్‌బాస్ హౌస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో చల్లబడిపోయింది. ఆవేశంతో చిందులు తొక్కిన కంటెస్టెంట్లు వారి ఆత్మీయులను చూడగానే మెత్తబడిపోయారు. కొన్ని వారాల తర్వాత కన్నవారు, కట్టుకున్నవారు కళ్ల ముందుకు రావడంతో ఎమోషల్ అవుతున్నారు. నిన్నటి ఎపిసోడ్లో కాజల్ భర్త, కూతురు హౌస్‌లో అడుగుపెట్టగా నేడు శ్రీరామ్ సోదరి, సిరి తల్లి, మానస్ తల్లి, సన్నీ తల్లి ఇంట్లోకి వస్తున్నట్లు ప్రోమో రిలీజ్ చేశాడు బిగ్‌బాస్. సన్నీ తన తల్లిని చూడగానే నిన్ను ఎక్కడో చూశానే అంటూ సరదాగా మాట్లాడాడు. మానస్ తల్లి అయితే తన వాక్చాతుర్యంతో హౌస్మేట్స్ అందరినీ ఇట్టే కలుపుకుపోయింది. 'నాకు, మానస్‌కు మీలాంటి అమ్మాయిని చూడండి' అని శ్రీరామ్ అడగ్గా.. 'బయట హమీదా వెయిటింగేమో' అని మానస్ తల్లి పంచ్ ఇచ్చింది. దీంతో శ్రీరామ్ సిగ్గుతో ముఖం దాచుకున్నాడు. 'సిరికి ఊహ తెలిసినప్పుడే డాడీ చనిపోయారు, పాన్ షాప్ పెట్టి ఆమెను చదివించాను. జనాలతో ఎన్నో మాటలు పడ్డాను. ఈ బిగ్‌బాస్‌ను కోట్లాది మంది చూస్తున్నారు. నన్ను బిగ్‌బాస్ సిరి తల్లిగా గుర్తుపడుతున్నారు' అంటూ భావోద్వేగానికి లోనైంది సిరి తల్లి. బాత్రూంకి వెళ్లాలనుకున్న షణ్నును లోనికి వెళ్లనీయకుండా పాజ్ అంటూ అతడిని కదలకుండా ఉండమన్నాడు బిగ్‌బాస్. దొరికిందే ఛాన్స్ అనుకున్న హౌస్మేట్స్ అతడిని అమ్మాయిగా అందంగా ముస్తాబు చేశారు. -
బిగ్‌బాస్: మానస్‌కి ప్రపోజ్ చేసిన పింకీ.. నెట్టింట వైరల్
Pinky Proposes To Maanas Unseen Video Goes Viral: బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కొందరు కంటెస్టెంట్లకు సైతం అప్పటివరకు రాని గుర్తింపు బిగ్‌బాస్ ద్వారా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే వంద రోజులకు పైగా సాగే బిగ్‌బాస్ హౌస్‌లో లవ్‌ట్రాక్‌లు కూడా సహాజమే. అప్పటివరకు ఎలాంటి కనెక్టివిటి లేని వాళ్లు సైతం బెస్ట్‌ఫ్రెండ్స్‌గా మారిపోతారు. మరికొందరేమో ఆ రిలేషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారు. తాజాగా ప్రియాంక సింగ్(పింకీ) అలాంటి ప్రయత్నమే చేసింది. రోజురోజుకి మానస్‌పై పెంచుకుంటున్న ప్రేమను బయటపెట్టేసింది. సోమవారం(నవంబర్22)న జరిగిన ఎపిసోడ్లో పింకీ మానస్‌కి ప్రపోజ్ చేసింది. 'నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అనిపిస్తుంది. మొదటి రోజు నుంచి నిన్ను చేస్తుంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదన్న సంగతి నాకు తెలుసు కానీ నీ విషయంలో నాకు బాగా అనిపిస్తుంది' అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. ఇది బిగ్‌బాస్ అన్‌సీన్‌లో ప్లే అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మానస్ నుంచి ఏం ఆశిస్తున్నావు? ఉలిక్కిపడ్డ ప్రియాంక
Bigg Boss Telugu 5 Promo: సండే ఫండే మాత్రమే కాదు ఎలిమినేషన్ డే కూడా అంటున్నాడు హోస్ట్ నాగార్జున. ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌తో వినోదాత్మకమైన గేమ్స్ ఆడించి చివర్లో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి రెడీ అయిపోయాడు. తాజా ప్రోమోను చూస్తుంటే నాగ్.. కంటెస్టెంట్లతో ఆసక్తికర గేమ్ ఆడించినట్లు కనిపిస్తోంది. కంటెస్టెంట్లు ఇతర ఇంటిసభ్యులను అడగాలనుకున్న ప్రశ్నలను పేపర్ మీద రాసివ్వగా నాగ్ వాటిని అడుగుతున్నాడు. ఫిజికల్ టాస్క్ అనగానే సన్నీ సైడ్ చూస్తావు, తను మరీ అంత వైల్డా? అని షణ్నును క్వశ్చన్ చేయగా అతడు ఫక్కుమని నవ్వేశాడు. ఇక మానస్‌ను.. ప్రియాంకతో నీ ఫ్యూచర్ రిలేషన్ ఏంటని ప్రశ్నించగా దానికతడు తడుముకోకుండా ఫ్రెండ్షిప్ అని బదులిచ్చాడు. మానస్ నుంచి ఏం ఆశిస్తున్నావని ప్రియాంకను అడగ్గా ముందు ఈ తిక్క ప్రశ్న ఎవరడిగారని ఆరా తీసింది. దీంతో నాగ్.. మానసే అడిగాడు అని చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. యానీ మాస్టర్‌ను.. మీ బుర్రను వంంట చేసేటప్పుడు, రెడీ అయ్యేటప్పుడు మాత్రమే వాడతారా? అని అడగడంతో ఆమె నోరెళ్లబెట్టింది. దీనికి యానీ.. అలా ఏం లేదని ఆన్సరిచ్చింది. నీ చుట్టూ ఉన్నవాళ్లను వాడుకుని ఆడుతున్నావెందుకని నాగ్ ప్రశ్నించగా ఈ హౌస్‌లో ఉంది వాడుకోవడానికే కదా అని ఆన్సరిచ్చాడు రవి. -
షణ్నుతో ఈ ఫీలింగ్ తప్పని తెలిసినా చేయాలనిపిస్తోంది: సిరి
Bigg Boss Telugu 5, Episode 77: 'నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా' టాస్క్‌లో సన్నీని గెలిపించడం కోసం కాజల్ కెప్టెన్ మానస్‌తో కయ్యానికి దిగింది. అతడు ఎడ్డెం అంటే తెడ్డెం అంటూ తిరకాసులు పెట్టింది. సన్నీ గెలవాలంటే సిరి, యానీ ఇద్దరి ఫొటో కాల్చేయాల్సిందేనని మొండిపట్టు పట్టింది. హౌస్ అంతా కళ్లలో నిప్పులు పోసుకుంటున్నా తను మాత్రం సన్నీ కోసం ఒంటరిగా ఫైట్ చేసింది. మానస్ ఎంత ఒప్పించినా ఆమె వెనక్కి తగ్గలేదు. వీరిద్దరూ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో యానీ, సిరి ఇద్దరి ఫొటోలు కాలిపోయాయి. ఎన్ని రౌండ్లయినా ఒక్కసారైనా ఫొటో కాలని సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కడంతో అతడు సంతోషంతో స్టెప్పులేశాడు. పాస్ గెలుచుకున్న సన్నీ.. బోరుమని ఏడ్చిన యానీ అయితే సిరి, యానీ మాత్రం.. డ్రామాలాడుతున్నారంటూ కాజల్‌ను ఏకిపారేశారు. యానీ అయితే వెక్కెక్కి ఏడుస్తూ వాళ్లతో మాట్లాడేది లేదని శపథం చేసింది. తొండి గేమ్‌లు, నాటకాలంటూ ఆవేశంలో నానా మాటలు అనేసింది. వీరిని కూల్ చేయాల్సింది పోయిన రవి అందుకు భిన్నంగా అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడాడు. ఇప్పుడు ఆడోళ్లను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడింది సన్నీ కాదా? అంటూ హౌస్‌మేట్స్‌ను మరింత రెచ్చగొట్టాడు. యానీ రోదన చూడలేకపోయిన శ్రీరామ్ ఒక అడుగు ముందుకేసి.. ఆమెను అంతలా ఏడిపిస్తూ, తన ఉసురు పోసుకోవడం అవసరమా? అని ప్రశ్నించాడు. దీంతో బిత్తరపోయిన కాజల్ ఉసురు పోసుకోవడం వంటి పెద్దపెద్ద మాటలు అనాల్సిన అవసరం లేదని, ఇది గేమ్ అని కుండ బద్ధలు కొట్టింది. ఆ నలుగురికి గోల్డ్ ఇచ్చిన రవి తర్వాత నాగార్జున... ఈ వారం బెస్ట్ పర్ఫామర్కు బంగారం, వరస్ట్ పర్ఫామర్కు బొగ్గు ఇవ్వాలని ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మాజీ కెప్టెన్ రవి.. ప్రియాంక సింగ్, మానస్, యానీ, శ్రీరామ్‌లకు బంగారం ఇచ్చాడు. సన్నీ, కాజల్, సిరి, షణ్నుతో పాటు తనకు తాను బొగ్గిచ్చుకున్నాడు. ఈ సందర్భంగా నాగ్.. స్విమ్మింగ్ టాస్క్‌లో సన్నీ మీద పగ తీర్చుకున్నావ్ కదూ! అని రవి మీద అనుమానం వ్యక్తం చేయగా అతడు అలాంటిదేం లేదని బుకాయించాడు. అలాగే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో శ్రీరామ్ దగ్గరున్న నెగెటివ్ పవర్‌ను తీసుకుని బంగారం కోల్పోయి బకరా అయ్యావని కామెంట్ చేశాడు. తప్పా? రైటా? తెలియట్లేదు, లైఫ్‌లో ఎప్పుడూ ఇలా అవలేదు బాత్రూం లోపల, బయట తల కొట్టుకుంటూ నిన్ను నువ్వు ఎందుకు గాయపర్చుకున్నావని నాగ్ సిరిని ప్రశ్నించాడు. ఆమను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించుకుని మాట్లాడాడు. కోట్లమంది నిన్ను చూసి ఈ అమ్మాయిలా ఉండాలనుకోవాలి కానీ ఈవిడలా మాత్రం ఉండకూడదు అని భావించకూడదని సుద్దులు చెప్పాడు. తన సమస్యేంటో చెప్పమన్నాడు. దీంతో ఓపెన్ అయిన సిరి.. 'నేను ఎమోషనల్ పర్సన్. నేను ఎదుటివాళ్లను హర్ట్ చేసే వ్యక్తిని కాను. ఎవరేం అన్నా నన్ను నేనే బాధపెట్టుకుంటాను. రోజులు గడిచేకొద్దీ షణ్నుతో నా కనెక్షన్ ఇంకా ఎమోషనల్ అయిపోతుంది. ఇది తప్పా? రైటా? తెలియట్లేదు. లైఫ్‌లో ఎప్పుడూ ఇలా అవలేదు. కానీ నేను నటించడం లేదు. నాకు ఈ ఫీలింగ్ తప్పని తెలిసినా సరే చేయాలనిపిస్తే చేసేస్తున్నా' అని చెప్తూ బాధపడింది సిరి. ఇంకోసారి ఇలా గాయపర్చుకుంటే బిగ్‌బాస్ హౌస్ నుంచి పంపించేస్తానని నాగ్ వార్నింగ్ ఇవ్వగా మరోసారి రిపీట్ చేయనని మాటిచ్చింది సిరి. గేమ్ కన్నా నా మీదే ఆసక్తి చూపిస్తోంది: మానస్ కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చిన షణ్ను.. మెంటల్లీ వీక్ అయిపోయాను. సిరి అలా తనను తాను గాయపర్చుకోవడానికి కారణం నేనే, అంటే తప్పు నాదే అని అంగీకరించాడు. ప్రేయసి దీప్తి సునయనను మిస్ అవుతున్నావా? అన్న ప్రశ్నకు అవునని తలూపాడు. అంతలా దీప్తిని మిస్ అవుతుంటే, ఇక్కడ ఉండలేకపోతే ఈ క్షణమే వెళ్లిపోమని గేట్లు తెరిచాడు నాగ్. పదేపదే ఇలా ట్రిప్ అవ్వకూడదని సూచించాడు. తర్వాత మానస్ కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చాడు. ప్రియాంక హౌస్‌లో ఎవరినీ నమ్మదని, ఎవరితోనూ ఎక్కువ క్లోజ్‌గా ఉండదన్నాడు. నన్ను మాత్రమే ఎక్కువగా నమ్ముతూ కొన్నిసార్లు గేమ్ కన్నా నామీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని, అది తనకు ఇబ్బందిగా మారిందన్నాడు. యానీ, నీ ప్రవర్తన హద్దులు మీరుతోంది: నాగ్ మానస్ మాటలు విన్నాక నాగ్.. ప్రియాంక అతడి కోసం ఏడ్చేసిన వీడియో చూపించాడు. ఆమె ఫీలింగ్స్ ఎక్కడివరకు వెళ్తున్నాయో చూసుకోమన్నాడు. తను నొచ్చుకుంటుందని ఏమీ చెప్పకపోతే పరిస్థితులు చేదాటిపోతాయని హెచ్చరించాడు. కాజల్‌తో ప్రవర్తించిన తీరు బాగోలేదని యానీకి చురకలు అంటించాడు నాగ్. వెక్కిరించడం కొంతవరకే బాగుంటుందని, కానీ అది హద్దులు మీరుతోందని హెచ్చరించాడు. అయితే యానీ మాత్రం తనది చైల్డిష్ బిహేవియర్ అని, ఏదున్నా ముఖం మీదే చెప్తానంటూ ఏవేవో చెప్తూ చివరాఖరకు వెక్కిరించడం మానుకుంటానని హామీ ఇచ్చింది. అనంతరం శ్రీరామచంద్ర, సన్నీ సేఫ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. -
లవర్స్‌ను తలుచుకుంటూనే హగ్గుల్లో మునిగిపోయిన సిరి-షణ్ను
Bigg Boss 5 Telugu, Episode 75: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో రవికి సూపర్ పవర్ తీసుకునే ఛాన్స్ రాగా అతడు మాత్రం ఈ అవకాశాన్ని సన్నీకిస్తానన్నాడు. 25 బంగారు ముత్యాలు చెల్లించి ఈ పవర్‌ను పొందాలని సన్నీకి చెప్పాడు. అయితే సన్నీ మాత్రం తనకు ఏ పవర్ వద్దని మొండికేశాడు. రంగంలోకి దిగిన ఇంటిసభ్యులు అతడిని ఎలాగోలా ఒప్పించారు. ఇంతకీ పవరేంటంటే.. మైన్‌లోకి వెళ్లే హౌస్‌మేట్స్‌లో నుంచి ఒకరిని తొలగించి వారి స్థానంలో వెళ్లి ఆడాలి. ఎదుటివాళ్లను గ్రూప్ గేమ్ అని మందలించే రవి, శ్రీరామ్, యానీ కుమ్మక్కై గేమ్ ఆడారు. శ్రీరామ్ తన దగ్గరున్న ముత్యాలను యానీకి ఇద్దామని నిర్ణయించుకున్నాడు. అయితే దాన్నో దొంగతనంలా సీన్ క్రియేట్ చేశారు. అప్పటిదాకా దొంగతనం చేస్తే తప్పన్న రవి.. ఎందుకాలస్యం, వెంటనే వెళ్లి దొబ్బేయండి అని సూచించడం గమనార్హం. దీంతో యానీ... అందరిముందూ ఏదో దొంగతనం చేసినట్లుగా కవరింగ్ ఇస్త శ్రీరామ్ ముత్యాలు తీసేసుకుంది. సన్నీ ఏదో ఫ్రస్టేషన్లో ఉన్నాడని అర్థమైన కాజల్ అతడి వెంటే నడిచింది. నా తోకలాగా వెనకే వస్తున్నావేంటి? అని చిరాకుపడ్డాడు సన్నీ. దీంతో మిగతా హౌస్మేట్స్ ఆమెకిలా జరగాల్సిందే అన్నట్లుగా ఓ లుక్కిచ్చారు. అందరి ముందు తనను అవమానించాడని కాజల్ ఏడ్చేయగా సన్నీ సారీ చెప్పి ఆమెను ఓదార్చాడు. తనకిచ్చిన పవర్‌ను కూడా ఆమెకు ఇవ్వడానికి ప్రయత్నించాడు కానీ అది కుదరదని తేల్చాడు సంచాలకుడైన రవి. దీంతో అతడు తన పవర్నుపయోగించి శ్రీరామ్ స్థానంలో మైన్‌లోకి వెళ్లి అయిష్టంగా గేమ్ ఆడాడు. మొత్తంగా గేమ్ ముగిసేసరికి మానస్, ప్రియాంక, సిరి, యానీ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. కాజల్ బాధపడితేనే నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి, అలాంటిది ఆమె డిస్కనెక్టెడ్ అని ముఖం మీదే చెప్తే ఎలా ఉంటుందన్నాడు మానస్. అందుకే కాజల్‌తో మాట్లాడట్లేదని సన్నీతో చెప్పాడు. అటు ప్రియాంకతోనూ మాటలు బంద్ చేశాడు. మరోపక్క షణ్ముఖ్.. పదేపదే దీప్తి సునయనను గుర్తు చేసుకున్నాడు. అటు సిరి కూడా శ్రీహాన్‌ను గుర్తు చేసుకుంది. తర్వాత సిరి ఐ హేట్ యూ అంటూ లిప్‌స్టిక్‌తో పేపర్ మీద రాసిచ్చింది. ఫీలైన షణ్ను సారీ చెప్పి హగ్గిచ్చాడు. దీంతో సిరి కూడా అతడికి హగ్గిస్తూనే ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. మరోపక్క పింకీ.. తనను ఫ్రెండ్‌గా కాకపోయినా కనీసం మనిషిలా ట్రీట్ చేస్తే చాలంటూ మానస్‌ను వేడుకుంది. ఇదిలా వుటే ఈ వారం ప్రెస్టేజ్ 25 వేల గిఫ్ట్ వోచర్ యానీ సొంతమవగా ఆమె ఆనందంతో స్టెప్పులేసింది. తర్వాత ఇంటిసభ్యులతో కొన్ని క్షణాలు ఇంటికి అంకితం అనే సరదా టాస్క్ ఆడించాడు బిగ్‌బాస్. ఇందులో జంటలుగా విడిపోయిన హౌస్మేట్స్ ఓసారి బిగ్‌బాస్ హౌస్‌ను భూతద్దంలో చూసొచ్చి గేమ్ ఆడారు. ఫైనల్‌గా మాత్రం ఎక్కువ పాయింట్లతో యానీ మాస్టర్- శ్రీరామ్ జోడీ చెరో రూ.5000ల గిఫ్ట్ వోచర్ గెలుపొందింది. -
తొలిసారి కెప్టెన్ అయిన మానస్, కుంగిపోతున్న సన్నీ!
Bigg Boss 5 Telugu Promo, Maanas Is New Captain!: గత ఆదివారం యాంకర్ రవి అందరి ముందు తనది బ్యాడ్ బిహేవియర్ అంటూ మాట్లాడటం తట్టుకోలేకపోయాడు సన్నీ. అందుకే అతడు ఏం చేసినా, ఏం మాట్లాడినా తీసుకోలేకపోతున్నాడు. ఎప్పటిలా సరదాగా ఉండలేకపోతున్నాడు. తాజాగా అతడు సంచాలకుడిగా ఉన్న గేమ్‌లోనూ కొట్లాటకు దిగాడు. అయితే రవి.. ఈ దూరాన్ని తగ్గిద్దామనుకున్నాడో? మరింకేదో కానీ తనకు వచ్చిన పవర్‌ను సన్నీకి త్యాగం చేయడానికి రెడీ అయ్యాడు. అదేమాట బిగ్‌బాస్‌కు చెప్పాడు. కానీ సన్నీ మాత్రం అతడిస్తానంటున్న పవర్‌ను తీసుకోవడానికి రెడీగా లేనని తేల్చి చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ అతడికి నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించగా చివరాఖరకు అయిష్టంగానే సరేనంటూ తలూపాడు. ఆ పవర్ ద్వారా సన్నీ తదుపరి సైరన్ వచ్చినప్పుడు ఒకరిని తొలగించి వారి స్థానంలో మైన్‌లో దిగి బంగారం వెతికే అవకాశాన్ని కొట్టేశాడు. ఇదిలా ఉంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌తో పాటు కెప్టెన్సీ టాస్క్ కూడా ముగిసిందని, మానస్ కొత్త కెప్టెన్‌గా అవతరించాడని లీకువీరులు సోషల్ మీడియాలో చాటింపు చేశారు. మానస్ తొలిసారి కెప్టెన్ అయినందుకు కొందరు నెటిజన్లు సంతోషిస్తూనే మరోపక్క సన్నీ బాధతో కుమిలిపోతున్నాడని విచారం వ్యక్తం చేస్తున్నారు. -
ఒకరికి లైఫ్ ఇచ్చి మరీ వెళ్లిపోయిన జెస్సీ
Bigg Boss Telugu 5, Episode 71, Jessie Exit From Show: బిగ్‌బాస్ షో ద్వారా గంగవ్వ కొత్తింటి కల నెరవేరిందన్న శుభవార్తను హౌస్‌మేట్స్‌కు తెలియజేశాడు నాగార్జున. గంగవ్వ ఇంటిని వీడియో ద్వారా హౌస్‌మేట్స్‌కు చూపించాడు. తర్వాత ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించి గేమ్స్ ఆడించాడు. టీమ్ Aలో షణ్ముఖ్, యానీ, ప్రియాంక, సన్నీ ఉండగా మిగిలినవారంతో టీమ్ Bలో ఉన్నారు. మానస్ సంచాలకుడిగా వ్యవహరించాడు. మొదటి గేమ్‌లో కంటెస్టెంట్లు డ్యాన్స్ చేస్తున్న క్రమంలో నాగార్జున ఫైర్, ఐస్, వాటర్ అని పలికినప్పుడు ఆయా బోర్డుల దగ్గరకు పరిగెత్తుకెళ్లాలి. చివరగా బోర్డును చేరుకున్న వ్యక్తి ఓడిపోయినట్లు లెక్క! అంతేకాకుండా వారికి పనిష్మెంట్ కూడా ఉంటుంది. అలా ఈ గేమ్‌లో నాగ్.. రవితో గోడకుర్చీ వేయించి, షణ్నును మోకాళ్ల మీద కూర్చోబెట్టి, సిరిని ఒంటికాలిపై, యానీని రెండు చేతులు పైకెట్టి నిల్చోబెట్టాడు. మొత్తంగా ఈ గేమ్‌లో A టీమ్‌లోని సన్నీ గెలిచాడు. తర్వాత గేమ్‌లో హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు చూపించగా అది ఎవరో గుర్తుపట్టాలన్నాడు నాగ్. ఈ గేమ్‌లోనూ A టీమ్ విజయం సాధించింది. తర్వాతి గేమ్‌లో కొన్ని పదాలున్న మెడల్స్‌ను దానికి సరిగ్గా సరిపోయే వ్యక్తికి వేయాలన్నాడు. సన్నీ.. ఫేక్ అన్న మెడల్‌ను రవికి వేశాడు. మానస్.. ప్రియాంక తనకు తలనొప్పిగా మారిందన్నాడు. శ్రీరామ్.. గేమ్‌లో కాజల్ కన్నింగ్ అని చెప్పాడు. రవి.. పొగరుబోతు(యారోగెంట్) అన్న మెడల్‌ను యానీకి ఇచ్చాడు. ప్రియాంక సింగ్.. షణ్ముఖ్ సెల్ఫిష్ అని చెప్పింది. యానీ.. సన్నీ సెల్ఫిష్ అంది. కాజల్.. సిరి డబుల్ ఫేస్ (రెండు నాలుకల పాము) అని తెలిపింది. సిరి.. షణ్ముఖ్ ప్రతిసారి నేను వెళ్లిపోతానేమోనని నెగెటివ్‌గా మాట్లాడుతాడని బుంగమూతి పెట్టుకుంది. తర్వాత మానస్, కాజల్ ఇద్దరూ సేఫ్ అని ప్రకటించిన నాగ్ మీ ఇద్దరూ కాకుండా మరొక హౌస్‌మేట్ వెళ్లిపోతున్నాడని చెప్పాడు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ ఆరోగ్యం బాగోలేనందున అతడిని పంపించివేయక తప్పదని వెల్లడించాడు. అలా మానస్, కాజల్‌లలో ఒకరికి బదులుగా అసలు నామినేషన్లోనే లేని జెస్సీ ఆట నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. స్టేజీ మీదకు వచ్చిన పిదప తన జర్నీ వీడియో చూసుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. నిజానికి పలు పోల్స్‌లో కాజల్ తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉంది. ఆమె ఎలిమినేట్ అవడం ఖాయం అనుకున్నారంతా! కానీ చివరకు జెస్సీని పంపించేయడంతో ఆమెను సేవ్ చేసి లైఫ్ ఇచ్చినట్లైంది. -
మానస్‌ను వాడుకుంది చాలు, వదిలెయ్: పింకీపై నెటిజన్ల ఫైర్
Bigg Boss Telugu 5, Priyanka Stop Using Maanas: ఎప్పుడూ గొడవలతో ఊగిపోయే కంటెస్టెంట్లు సైలెంట్‌గా ఉన్నారేంటి అనుకునేలోపే హౌస్మేట్స్ అందరూ విశ్వరూపం చూపించారు. ఒక్క కెప్టెన్సీ టాస్క్‌లోనే యానీ- కాజల్, సిరి, షణ్ను- సన్నీ, రవి- మానస్ గొడవపడ్డారు. ఈ కొట్లాటల తర్వాత వీళ్లెలా ఉన్నారో తెలియదు గానీ అభిమానులు మాత్రం ఆవేశంతో ఊగిపోతున్నారు. మా అభిమాన కంటెస్టెంట్ చేసింది కరెక్ట్ అంటూ ఎవరి ఫ్యాన్స్ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయడంలో తప్పు లేదు కానీ అవతలి కంటెస్టెంట్ మీద విరుచుకుపడుతూ నానా మాటలు అంటున్నారు. పింకీ వెన్నుపోటు పొడిచిందా? దీంతో నిన్నటి నుంచి సన్నీ, షణ్నుల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. వీళ్ల ఫ్యాన్స్ ఒకరినొకరు దూషించుకుంటూ నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదిలా వుంటే నిన్నటి టాస్క్‌లో ప్రియాంక వల్ల సన్నీ కెప్టెన్సీ కోల్పోయాడని చాలామంది వాదిస్తున్నారు. ప్రియాంక చీర తగిలే రెండుసార్లు అతడి టవర్ కూలిపోయింది. దీంతో మానస్ కూడా పింకీపై అనుమానం వ్యక్తం చేశాడు. ఒకసారంటే ఏదో అనుకోకుండా జరిగిందనుకోవచ్చు, కానీ రెండుసార్లు ఎలా సాధ్యమని సందేహపడ్డాడు. తను కావాలనే చేసినట్లు అనిపిస్తోందని మానస్, సన్నీ అభిప్రాయపడ్డారు. నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిస్తే ఎలా? అని సన్నీ బాధపడ్డాడు. ఇక పింకీ వల్ల మానస్ గ్రాఫ్ కూడా పడిపోతుందని ఆయన ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. మానస్‌కు ఆ వీడియో చూపించాల్సిందే దీంతో మానస్‌ను వదిలెయ్ ప్రియాంక(#PriyankaStopUsingMaanas) అన్న హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో వైరల్‌గా మారింది. మానస్ ఆటను పింకీ సర్వనాశనం చేస్తోందంటూ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్‌లో కావాలనే తన తనలతో టవర్ కూలిపోయేలా చేసి సన్నీకి నమ్మకద్రోహం చేసిందని విమర్శిస్తున్నారు. ఈ వీడియోను బిగ్‌బాస్ సన్నీ, మానస్‌లకు చూపించి వారి కళ్లు తెరిపించాలని కోరుకుంటున్నారు. అయితే ప్రియాంక అభిమానులు మాత్రం మానస్‌ను ఎంతో ప్రేమించే పింకీ అతడి నమ్మకాన్ని వమ్ము చేయదంటున్నారు. అనుకోకుండా జరిగిన పొరపాటుకు ఆమెను అనుమానించి కించపరచొద్దని కోరుతున్నారు. Wow... pinky , what a gamer you are 😡.. Claps needed 👏👏👏... #BiggBossTelugu5 #PriyankaStopUsingMaanas https://t.co/ljwNn1hBR7 — Sharmila (@Sharmila_146) November 13, 2021 Pinky did on purpose it was not saree but she only lean on the Sunny's box tower & acting as if she haven't did on purpose..#Sunny may or may not have won with equation 5:3 but double side pinky spoiled his fair chance.#PriyankaStopUsingMaanas #Maanas #Sunny#BiggBossTelugu5 pic.twitter.com/xW4eTjxBXY — CommonMan 🍥 (@Truly_CommonMan) November 13, 2021 Pinky please play ur game and let #Maanas play his game @StarMaa stop pushing priyanka onto maanas #BiggBossTelugu5 #priyankastopusingmaanas https://t.co/EgzNa4hd62 — MS👑 (@viren730) November 13, 2021 -
జెస్సీకి తిరగబెట్టిన రోగం, కొత్త లక్షణాలతో సతమతం!
Bigg Boss 5 Telugu, Episode 68: బిగ్‌బాస్ షోలో బీబీ హోటల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో హోటల్‌కు విచ్చేసిన అతిథులు సన్నీ, సిరి, కాజల్, ప్రియాంక, మానస్.. అక్కడి సిబ్బందితో సపర్యలు చేయించుకుంటూ టిప్పులివ్వకుండా విసిగించారు. వీరి ప్రవర్తనతో చిర్రెత్తిపోయిన హోటల్ స్టాఫ్ ముందు పైసలు తీయండి, కావాల్సినంత సేవలు చేయించుకోండి అని అభ్యర్థించినప్పటికీ వారు వినిపించుకోలేదు. రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని తెలిసిపోయింది! చేసేదేం లేక సిబ్బంది అతిథుల సేవల్లో తరించారు. హనీమూన్ కపుల్ ప్రియాంక- మానస్‌ల కోసం యానీ మాస్టర్ పూలతో బెడ్ అలంకరించింది. మీ శోభనం కోసం అన్నీ సిద్ధం చేశానని చెప్తుండగా సన్నీ వెళ్లి ఆ బెడ్‌మీద పడి దొర్లి దాన్ని నాశనం చేశాడు. మరోపక్క షణ్ముఖ్.. నువ్వు దొంగతనం చేశావన్న విషయం తనకు తెలుసంటూ రవితో నేరుగా చెప్పాడు. అడ్డంగా దొరికిపోయినప్పటికీ రవి మాత్రం తాను తీయలేదని బుకాయించాడు. టాస్క్ చెడగొట్టే పనిలో భాగంగా కాజల్ వాటర్ బాటిల్లో కారం పోశాడు. అయితే హౌస్మేట్స్ ఇది చేసింది రవే అని పసిగట్టారు. అతడికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని, ఇక నుంచి రవికి డబ్బులు ఇవ్వకూడదని ఓ నిర్ణయానికి వచ్చారు. డబ్బులివ్వడం లేదని ఏడ్చేసిన యానీ మరోపక్క సన్నీ.. పింకీ-మానస్‌ల క్యాండిల్ లైట్ డిన్నర్‌ను సర్వనాశనం చేశాడు. దీంతో అలకమంచం ఎక్కిన పింకీని బుజ్జగించి కూల్ చేశాడు మానస్. ఇదిలా వుంటే తన డబ్బులు కొట్టేశారన్న బాధలో ఉన్న కాజల్ ఎలాగైనా వాటిని సంపాదించుకోవాలనుకుంది. ఇందుకోసం యానీ బ్యాగులో నుంచి డబ్బులు దొంగిలించింది. కానీ హౌస్మేట్స్ మాత్రం ఇది కచ్చితంగా రవి పనే అయ్యుంటుందని అతడి మీద అనుమానం వ్యక్తం చేశారు. బండెడు పనులు చేయించుకుని చారానా వంతు టిప్పు ఇస్తున్నారని అసహనానికి లోనైన యానీ ఇన్ని పనులు చేయిస్తున్నారు.. నేను మనిషినా? పశువునా? అని ఆవేశపడింది. కుక్కల్లా పనులు చేయిస్తున్నారు, కానీ డబ్బులు ఇవ్వరు అంటూ ఏడ్చేసింది. జెస్సీకి తిరగబెట్టిన రోగం ఇలాగైతే తమకు డబ్బులు రావని అర్థమైన సిబ్బంది మాకు 10 వేల రూపాయలు ఇచ్చేవరకు అతిథులెవరికీ ఫుడ్ పెట్టమని తేల్చి చెప్పారు. దీంతో అతిథులు ఓ మెట్టు దిగి వచ్చి డబ్బులు ఇచ్చి ఆహారం అందుకున్నారు. ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ తను సరిగా చూడలేకపోతున్నానని, ఒక వైపుకు నెట్టేసినట్లు పడిపోతున్నానని బిగ్‌బాస్‌కు చెప్పుకున్నాడు. పడుకున్నప్పుడు స్నేక్ ఉన్నట్లుగా అనిపిస్తుందన్నాడు. దీంతో అతడిని చెకప్ చేసేందుకు డాక్టర్ రాగా.. జెస్సీ తన చేతులు లావైనట్లు అనిపిస్తోందని ఇలా ఇంతకుముందెన్నడూ అనిపించలేదని తెలిపాడు. నీకు మెరుగైన వైద్యం అవరసరమన్న డాక్టర్, అందుకు తగ్గట్టు మంచి ట్రీట్మెంట్ ఇస్తామని, ధైర్యంగా ఉండమని జెస్సీకి భరోసా ఇచ్చాడు. -
సీక్రెట్ రూమ్‌కు జెస్సీ, రగిలిపోయిన షణ్ముఖ్!
Bigg Boss 5 Telugu, Episode 66: జెస్సీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడి ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. నీకు మెడికల్ ట్రీట్మెంట్ అవసరమని, ఇందుకోసం బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నాడు. దీంతో జెస్సీ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ 'బిగ్‌బాస్ నా లైఫ్ అనుకున్నా, ఇంతవరకు వచ్చినందుకు హ్యాపీ' అంటూనే అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు. జెస్సీ తిరిగొస్తాడు కదూ* జెస్సీ ఉన్నఫళంగా హౌస్ వదిలి వెళ్తాడని చెప్పగానే షణ్ముఖ్, సిరి గుక్కపెట్టి ఏడ్చారు. సిరి అయితే అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని తలపై ఆప్యాయంగా ముద్దు పెట్టింది. జెస్సీ వెళ్లిపోయే ముందు చివరిసారిగా హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ.. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు సన్నీ, మానస్, పింకీ, కాజల్, యానీ.. అందరూ పాంపరింగ్ చేశారంటూ బాధపడ్డాడు. తన ఫ్రెండ్స్ షణ్ను, సిరి ఇద్దరు ఉన్నంతవరకు బిగ్‌బాస్ జర్నీ చూస్తానని చెప్తూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడు లేకపోవడంతో తీవ్రంగా దుఃఖించిన సిరి.. జెస్సీ తిరిగొస్తాడేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది. మానస్ కోసమే వచ్చావా?: పింకీపై కాజల్ ఫైర్ మరోపక్క నామినేషన్స్ ఎఫెక్ట్‌తో ప్రియాంక సింగ్ మీద అలక బూనాడు మానస్. ఆమె దగ్గరవ్వాలని ప్రయత్నించేకొద్దీ అతడు తప్పించుకు తిరిగాడు. నేనేమైనా తప్పు చేస్తే చెప్పంటూ బతిమాలినప్పటికీ మానస్ మాత్రం అసలు పట్టించుకోలేదు. దీంతో పింకీ.. మానస్ ఎందుకు మాట్లాడట్లేదో తెలియడం లేదని తెగ ఫీలైంది. ఇది విన్న కాజల్.. నువ్వు తనకోసం వచ్చావా? అని ఫైర్ అయింది. మనం గేమ్ ఆడటానికి వచ్చాం, మానసే నేరుగా వచ్చి మాట్లాడేదాకా వెయిట్ చెయ్, లేదంటే వదిలెయ్ అని సలహా ఇచ్చింది. (చదవండి: చివరి క్షణంలో బిగ్‌బాస్ ట్విస్ట్.. నామినేషన్స్‌లో ఐదుగురు) మాట్లాడే అధికారమే కోల్పోయావు: సన్నీ పైకి గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ కాజల్ బాధను దిగమింగుతోంది. నామినేషన్స్‌లో తన ఫ్రెండ్స్ సన్నీ, మానస్‌లను సేవ్ చేయనందుకు వారు మాట్లాడకపోవడంతో ఎంతగానో బాధపడింది. ఎలాగో ఈవారం ఎలిమినేట్ అవుతానని అటు కాజల్, ఇటు మానస్ ఎవరికి వారే అభిప్రాయపడ్డారు. అయితే మానస్ వెళ్లిపోతాడంటే తట్టుకోలేకపోయిన పింకీ.. అలా అనొద్దని వేడుకుంది. దీంతో చిర్రెత్తిపోయిన సన్నీ.. నువ్వు మాట్లాడే అధికారమే కోల్పోయావని తేల్చేశాడు. ఇక కాజల్ నామినేషన్స్ సమయంలో వారిని సేవ్ చేయకుండా నమ్మకాన్ని వమ్ము చేసినందుకు సారీ చెప్పింది. ఎప్పటిలా ఉందామని ఎన్నిసార్లు బతిమాలినా, ఎన్నిసార్లు సారీ చెప్పినా సన్నీ, మానస్ వినిపించుకోకపోవడంతో తను కూడా ఏడ్చేసింది. సీక్రెట్ రూమ్‌లో జెస్సీ, క్వారంటైన్ అయ్యాక హౌస్‌కు! ఇదిలా వుంటే జెస్సీని బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్‌లో ఉంచాడు బిగ్‌బాస్. శ్రీరామ్.. కాజల్ బాగా ఇన్ఫ్లూయెన్స్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. మరోపక్క మానస్.. పింకీ ఇచ్చిన వస్తువులను తిరిగిచ్చేయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. రవి కోసం బంటులా పని చేస్తే మాత్రం పింకీని అస్సలు నమ్మనని తెగేసి చెప్పాడు. తాను, జెస్సీ, షణ్ను ముగ్గురం కంటెండర్ అవగానే కెప్టెన్ అయ్యామని చెప్తూ ఉప్పొంగిపోయింది సిరి. కానీ నేను కంటెండర్ అవగానే నామినేట్ అవుతున్నానని రవి అనగా.. ఎలిమినేట్ మాత్రం అవడం లేదు, అదే నా బాధ అని మనసులో మాట బయటపెట్టాడు షణ్ను. నా మీదే జోకులా, నేనేంటో చూపిస్తా! తర్వాత సిరి అందరిముందే తన మీద జోకేసిందని తెగ ఫీలయ్యాడు షణ్ను. ఎవడన్నా జోకేస్తే చెప్పు తీసి కొట్టేవాడినని చిరాకుపడ్డాడు. క్లోజ్ ఫ్రెండే జోకేస్తే తీసుకోని షణ్ను రవి జోక్ చేస్తే ఊరుకుంటాడా? అందరి ముందు తన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేయడంతో బాగా హర్టయ్యాడు. ఇలాంటి వెకిలి జోకులను తాను తీసుకోలేనని ముఖం మీదే చెప్పాడు. పింకీ నన్ను గెలికింది, ఇక ఎలా ఉంటుందో చూడని సిరితో చెప్పుకొచ్చాడు. ఇలా చనువు తీసుకుని అతి చేస్తారనే మనుషుల్ని దూరం పెడతానని పేర్కొన్నాడు. (చదవండి: ఒకరి జీవితంతో ఆడుకోకండి: విశ్వ వార్నింగ్) ముద్ద వద్దు, ముద్దులే కావాలన్న మానస్ సన్నీ, మానస్‌ల పోరుతో ఆలోచనలో పడ్డ కాజల్.. షణ్నును సేవ్ చేయకుండా నన్నెందుకు సేవ్ చేశావని శ్రీరామ్‌ను అడిగింది. దీంతో అతడు మనిద్దరి మధ్య గొడవకు ముగింపు పలకడానికే చేశానని బదులిచ్చాడు. ఎట్టకేలకు మానస్ కోపాన్ని కరిగించేసింది ప్రియాంక. భోజనం ప్లేటు పట్టుకుని ముద్దు కావాలా? ముద్ద కావాలా? అని అడిగితే మానస్ ముద్దే కావాలన్నాడు. దీంతో ప్రియాంక దొరికిందే ఛాన్స్ అనుకుని ముద్దుల మీద ముద్దులిచ్చింది. -
ప్రియాంక సింగ్‌కు పెళ్లి చేస్తా: మానస్ తల్లి
Maanas Mother Comments On Pinky Marriage: 'దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు నీతో హ్యాపీగా ఉండేదాన్ని' అంటూ అర్ధరాత్రి తన బాధను మానస్‌తో చెప్పుకుంటూ బాధపడింది ప్రియాంక సింగ్. రోజురోజుకీ అతడి మీద ప్రేమను పెంచుకుంటూ, అతడి గురించే ఆలోచిస్తూ కాలం గడిపేస్తోంది పింకీ. ఆమె పరిస్థితి చూసి అభిమానులు కలవరపడుతున్నారు. బిగ్‌బాస్ తర్వాత రోజూ మానస్‌తో ఉండలేవు, తరచూ మాట్లాడే అవకాశం ఉండదు, అసలు అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలీదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా వుంటే ఓ ఇంటర్వ్యూలో మానస్ తల్లి పద్మిని.. ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఆమె చాలా మంచి అమ్మాయి, నాకెంతో ఇష్టం. ఓసారి ప్రియాంక.. మానస్‌ను హజ్బెండ్ మెటీరియల్ అంది. కానీ, మానస్ ఆమె కేవలం మరదలని చెప్పాడు. బిగ్‌బాస్ అనేది 110 రోజుల ఆట. ఈ షోలో ఎంతమంది జంటలు బయటకొచ్చారు? ఎంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు? ఏదైనా బిగ్‌బాస్ షో వరకే అని అందులో ఉన్న కంటెస్టెంట్లకు బాగా తెలుసు. కాకపోతే హౌస్‌లో ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. హౌస్‌లో మానస్‌కు ఎవరూ సెట్ కారు. నేను ఎవర్ని వేలు పెట్టి చూపిస్తే మానస్ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ప్రియాంక సింగ్.. నా కొడుకును పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఒప్పుకోను. ఆమెను తగిన అబ్బాయిని చూపించి పెళ్లి చేస్తా. అలా ప్రియాంకకు నేను సపోర్ట్ చేస్తాను, ఏదైనా సాయం చేస్తాను అని చెప్పింది. ఇక మానస్ ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ.. అతడు చదువుతున్న సమయంలో ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్లిపోవడానికి రెడీ అయింది. దీంతో ఏం చేయాలని నన్ను అడిగాడు. నీదింకా చిన్న వయసు. కరెక్ట్‌గా సెటిల్ అవకుండా అమెరికా వెళ్లడం కరెక్ట్ కాదేమోనన్నాను. మానస్ సరేనని ఆగిపోయాడు. అలా కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు అని పేర్కొంది పద్మిని. (చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో అతడు హీరో, ఆమె విలన్!) -
జెస్సీకి అస్వస్థత, లెక్క చేయని షణ్ముఖ్, సిరి
Bigg Boss 5 Telugu, 9th Week Nominations: జెస్సీ పొద్దుటినుంచి వాంతింగ్ చేసుకుంటుంటే పక్కనే ఉండి కాసేపు అతడికి అండగా నిలబడ్డాడు. జెస్సీ ఆరోగ్యం బాగోలేకపోతే షణ్నూ, సిరి ఏమాత్రం పట్టించుకోవట్లేదేంటని సన్నీ మానస్‌తో వాపోయాడు. కానీ మానస్ వాళ్ల మధ్యలోకి వెళ్లకని సలహా ఇచ్చాడు. మరోవైపు జెస్సీ లోపలికి వెళ్లి బెడ్‌పై కూర్చుని అవస్థ పడుతున్నాడు. అతడి పక్కనే ఉన్న షణ్ను చూసి వదిలేశాడే కానీ, కనీసం ఏమైందని కూడా ఆరా తీయకపోవడం గమనార్హం. సీక్రెట్ టాస్క్ ఫెయిలయినప్పటి నుంచి జెస్సీని వాళ్లు దూరం పెడుతున్నారని మానస్ అభిప్రాయపడ్డాడు. అనంతరం 9వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఇంటి సభ్యులకు ఫోమ్ పూసి తగు కారణాలు చెప్పి నామినేట్ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ప్రతివారం ఎవరో ఒకరు వెళ్లిపోవాలని, నువ్వెళ్లిపోయినా నాకు ఫరాఖ్ పడదంటూ శ్రీరామ్‌ను నామినేట్ చేశాడు మానస్. నువ్వు ఉన్నా ఫరాఖ్ పడదని కౌంటరిచ్చాడు శ్రీరామ్. తర్వాత సంచాలకుడిగా సరైన నిర్ణయం తీసుకోలేదని జెస్సీని నామినేట్ చేశాడు. కాలేజీ బ్యాచ్‌లాంటి గొడవలొద్దంటూ శ్రీరామ్.. సన్నీ, మానస్‌ను నామినేట్ చేశాడు. 'అన్నీ గుడ్ క్వాలిటీస్, ఫెంటాస్టిక్ పర్సన్.. కానీ ధైర్యం కోల్పోతున్నావ్' అంటూ రవి.. మానస్‌ను, తర్వాత కాజల్‌ను నామినేట్ చేశాడు. పింకీ.. స్ట్రాంగ్ అంటూ విశ్వను, రవి ఆలోచనలను అందుకోలేకపోతున్నానని అతడిని నామినేట్ చేసింది. సిరి.. సన్నీ, యానీని; జెస్సీ.. సన్నీ, మానస్‌ను; సన్నీ.. జెస్సీ, సిరిని నామినేట్ చేశారు. స్ట్రాంగ్‌గా ఉండేవాళ్లు వెళ్లిపోవాలంటే వీక్‌గా ఉండేవాళ్లు కూడా ఈ ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ విశ్వ ప్రియాంకను, తర్వాత మానస్‌ను నామినేట్ చేశాడు. ఇక కాజల్- రవి మధ్య మరోసారి ఫైట్ జరిగింది. ఆమె రవితోపాటు శ్రీరామ్‌ను నామినేట్ చేసింది. యానీ.. సిరి, కాజల్‌ను నామినేట్ చేసింది. షణ్ను.. మానస్‌తో పాటు ప్రియాంకను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'ప్రియాంక నీ గేమ్ నువ్వే ఆడు, అందరిలో నువ్వే స్ట్రాంగ్ అనిపిస్తావు' అని సలహా ఇచ్చాడు. దీంతో చిర్రెత్తిపోయిన పింకీ.. 'నామినేట్ చేసి వెళ్లిపోయాక ఇంకెవరు ఆడతారు?' అని చిర్రుబుర్రులాడింది. అయినా నేను ఏ గేమ్ సరిగా ఆడటం లేదో చెప్పాలి కదా! అని ఆవేశపడింది. షణ్ను ఫోమ్ పూయబోతే పింకీ ఆ ప్లేట్‌ను తన ముఖాన గట్టిగా కొట్టుకుంది. నామినేషన్ పూర్తయ్యాక సిరి మరోసారి సన్నీని ఎందుకు నామినేట్ చేశానో అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. కానీ ఇది వారిద్దరి మధ్య గొడవలకు దారి తీసింది. హైలైట్ అవ్వాలనే ఇలా చేసింది అని సన్నీ మానస్ గుసగుసలు పెట్టడంతో వినేసిన సిరి... నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరూ పడరిక్కడ అని గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈ వారం మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, యానీ, విశ్వ నామినేట్ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. చదవండి: బిగ్‌బాస్‌లో లోబో మిత్రువులు, శత్రువులు ఎవరో తెలుసా? -
బ్రహ్మ కాకుండా నామినేషన్లో ఉన్నది ఎవరంటే?
Bigg Boss Telugu 5 Promo, 9th Week Nominations: బిగ్‌బాస్ హౌస్ కంటెస్టెంట్ల కోపతాపాలతో భగ్గున మండుతోంది. అసలే నామినేషన్స్ డే. వారిని కూల్ చేయడం బిగ్‌బాస్ వల్ల కూడా కాదు. ఫైర్ మీదున్న హౌస్మేట్స్ మాస్క్ తీసి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రవి- మానస్‌కు, శ్రీరామ్- కాజల్‌కు, శ్రీరామ్- మానస్‌కు మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. 'నీ ఇంటి పేరు పొగరా? నీ ఇంటిపేరు పొగరుబోతా?' అని కాజల్‌ను ప్రశ్నించాడు శ్రీరామ్. దీనికి కాజల్ స్పందిస్తూ.. నీ రియాక్షన్సే నచ్చడం లేదంటూ నామినేట్ చేసింది. తర్వాత రవిని నామినేట్ చేస్తూ.. నిన్ను ఎదగకుండా ఆపడానికి ట్రై చేయలేదని.. తనే కాదు, హౌస్‌లో ఎవరూ ఆ పని చేయలేరని చెప్పింది. ఇక పింకీ వంతు రాగా రవి అన్న కంటే ఎవరూ బాగా ఆలోచించలేరంటూ నామినేట్ చేసింది. 'ప్రియాంక నీ గేమ్ నువ్వే ఆడు, వేరే గేమ్ ఆడొద్దు' అంటూ నామినేట్ చేశాడు షణ్ను. ఇలా అనేసి నామినేట్ చేసి బయటకు పంపించాక నా గేమ్ ఇంకెవరు ఆడతారు? అని ఫైర్ అయింది పింకీ. అతడు ఫోమ్ పూస్తుంటే అతడిని ఏమీ చేయలేక ఆ ప్లేటును గట్టిగా ముఖానికి కొట్టుకుంది. నువ్వు వెళ్లిపోతే నాకు ఫరాఖ్ పడదని శ్రీరామ్‌ను నామినేట్ చేశాడు మానస్. నువ్వు ఉన్నా కూడా నాకు ఫరాఖ్ పడదని రివర్స్ కౌంటరిచ్చాడు రామ్. ఇక ఈ 9వ వారం నామినేషన్లో కెప్టెన్ షణ్ముఖ్ తప్ప మిగతా అందరూ నామినేట్ అయ్యారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే యానీ గత ఆదివారం సంపాదించిన స్పెషల్ పవర్‌తో నామినేషన్ నుంచి బయటపడుతుందా? లేదా ఆ పవర్‌ను ఇప్పుడెందుకులే! అని భద్రంగా దాచిపెట్టుకుంటుందా? అన్నది చూడాలి! -
తన్నడం కరెక్టా?: సన్నీ ఫొటో చించి పడేసిన నాగ్
Bigg Boss 5 Telugu Promo: కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో పెద్ద లొల్లే జరిగింది. టాస్క్ ముగిసి షణ్ముఖ్ కెప్టెన్ అయినా కూడా సన్నీ, మానస్ దాన్నే తలుచుకుంటూ ఓపక్క బాధపడుతూ, మరోపక్క హౌస్మేట్స్ మీద నిప్పులు చెరిగారు. ముఖ్యంఆ ఆ టాస్క్‌లో సంచాలకుడిగా వ్యవహరించిన జెస్సీని ఆడేసుకున్నారు. అతడు కూడా వీళ్లిద్దరికీ గట్టిగానే సమాధానమిచ్చాడు. తాజాగా ఈ గొడవను ప్రస్తావిస్తూ సన్నీని ఆడేసుకున్నా హోస్ట్ నాగ్. తొండిగా ఆడటమేంటని కాజల్ మీద సెటైర్ వేశాడు నాగ్. హౌస్‌లో ఏమైనా అన్యాయం జరుగుతోందా? అని నాగ్ అడగ్గా సంచాలకుడి నిర్ణయం నచ్చలేదని చెప్పాడు మానస్. దీంతో నాగ్.. సంచాలకుడి నిర్ణయమే ఫైనల్ అని తేల్చేశాడు. ఇక సన్నీ.. తనను చాలామంది ప్రొవోక్ చేశారని చెప్పగా అభ్యంతరం వ్యక్తం చేసిన నాగ్.. మీద మీదకు వెళ్లిపోతావా? అని నిలదీశాడు. ఒక మనిషి ఒక వస్తువు పట్టుకుంటే దాన్ని తన్నడం కరెక్ట్ అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రూల్స్ ఉన్నాయి కాబట్టే వాళ్లు తిరిగి కొట్టలేదని చెప్తూ అతడి ఫొటోను చింపి పడేశాడు నాగ్. తర్వాత నాగ్.. కంటెస్టెంట్లతో వైకుంఠపాళి ఆడించాడు. రవి తన మైండ్ చదివేస్తాడేమోనని భయంగా ఉందన్నాడు షణ్ను. ఏంటి? రవి బ్రహ్మ మైండ్‌నే చదివేస్తున్నాడా! అని ఆశ్చర్యపోయాడు నాగ్. ఒకపక్క పంచాయితీలు, మరోపక్క టాస్క్‌ల వినోదాలు.. అన్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
అది నిరూపిస్తే బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతా: సన్నీ సవాల్
Bigg Boss Telugu 5, Episode 55: కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన గొడవ నుంచి తేరుకోలేకపోయాడు సన్నీ. తాను, మానస్ ఎలా ఓడిపోయానని చెప్తారని ఆవేశంతో ఊగిపోయాడు. ఇదంతా హౌస్‌లో నుంచి చూసిన రవి.. సన్నీతో మాట్లాడు కానీ మానస్‌తో మాట్లాడొద్దు అని జెస్సీకి సలహా ఇచ్చాడు. గేమ్‌లో ఉన్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే మండుతుందని ఫైర్ అయ్యాడు శ్రీరామ్. మరోపక్క రవి ఈవారం పెద్దగా పర్ఫామ్ చేయలేదని అభిప్రాయపడ్డాడు షణ్ను. అటు కాజల్ మాత్రం శ్రీరామ్ ఇంకా మాస్క్ తీయలేదని సన్నీ, మానస్‌లతో చెప్పుకొచ్చింది. అటు శ్రీరామ్.. నామినేషన్స్ తప్పించుకునేందుకు కాజల్ కాంట్రవర్శీలకు పోవడం లేదని పేర్కొనగా రవి అవునని తలూడించాడు. ఆమెను సేఫ్ ప్లేయర్‌గా అభివర్ణించాడు. తర్వాత హౌస్‌లో వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని ఆదేశించాడు బిగ్‌బాస్. ముందుగా కెప్టెన్ షణ్ను.. నీ ఫ్రెండ్స్ వల్ల నీ గేమ్ కనిపించలేదంటూ కాజల్ పేరు సూచించాడు. సన్నీ.. సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాడంటూ జెస్సీ పేరు చెప్పాడు. ఇక మానస్ కూడా సంచాలకుడిగా సరిగా పని చేయలేదని జెస్సీనే వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు. రవి, సిరి.. సన్నీని; యానీ.. ప్రియాంకను; ప్రియాంక సింగ్, లోబో.. యానీ మాస్టర్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా.పేర్కొన్నారు టాస్క్‌లో శ్రీరామ్ ప్రవర్తన ప్రొవోకింగ్‌గా అనిపించిందని చెప్పింది కాజల్. తర్వాత జెస్సీ.. సన్నీని వరస్ట్ పర్ఫామర్ అని చెప్పే క్రమంలో వీళ్లిద్దరికీ మరోసారి గొడవైంది. నీ గేమ్ నువ్వు ఆడు, పక్కవాళ్ల గేమ్ ఆడకు అని హెచ్చరిస్తూ కాజల్ చెత్తగా ఆడిందన్నాడు శ్రీరామ్. మొత్తంగా ఈ టాస్క్ ముగిసే సమయానికి కాజల్, సన్నీకి మూడేసి ఓట్లు పడ్డాయి. దీంతో కెప్టెన్ షణ్ను.. సన్నీ బస్తాను తన్నడం నచ్చలేదంటూ అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో త్రిమూర్తులకు, సన్నీకి మధ్య పెద్ద గొడవ జరిగింది. సిరి కత్తి పట్టుకోవడం తప్పు కాదా? అని ప్రశ్నించాడు జెస్సీని కావాలని తన్నాను అని నిరూపిస్తే ఇప్పటికిప్పుడు హౌస్‌లో నుంచి వెళ్లిపోతానన్నాడు. అతడికి మద్దతుగా రంగంలోకి దిగి వాదనకు దిగారు మానస్, కాజల్. చివర్లో యానీ.. తన ఓటును సన్నీకి మార్చడంతో ఇంట్లో అందరికన్నా ఎక్కువగా సన్నీకే 4 ఓట్లు పడ్డాయి. దీంతో అతడిని జైల్లో వేశారు. -
అయ్యో పింకీ, మానస్ కోసం పరితపించిపోతుందిగా!
ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ అవగా అందులో ఆరుగురు అమ్మాయిలే కావడం గమనార్హం. ప్రస్తుతం హౌస్‌లో లేడీ కంటెస్టెంట్లు యానీ మాస్టర్, ప్రియాంక సింగ్, కాజల్, సిరి మాత్రమే మిగిలారు. వీళ్లలో యానీ మాస్టర్ ప్రతివారం తనకు స్ట్రాంగ్ అనిపించినవాళ్లను నామినేట్ చేస్తూ వస్తోంది. ఆటలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఇక కాజల్.. మాటకు ముందూవెనకా స్ట్రాటజీ అనే పదం తీయకుండా ఉండదు. ఆటలోనూ స్ట్రాటజీ ప్లే చేశానని చెప్తూ ఉంటుంది. సిరి.. షణ్ముఖ్‌తో దోస్తీతో బాగానే స్క్రీన్ స్పేస్ దక్కించుకుంటోంది. అలాగే ఆటలోనూ మిగతావారికి టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. మిగిలిందల్లా ప్రియాంక సింగ్.. జీవితాన్ని కాచి వడబోసింది. ఇంటాబయట ఎన్నో సమస్యలను ఎదుర్కొని, వాటన్నింటినీ సమర్థవంతంగా దాటుకుని ఇక్కడిదాకా వచ్చింది. తన జీవితం ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు మార్గదర్శకంలాంటిది. కానీ ఆమె బిగ్‌బాస్ షోను సరిగా వినియోగించుకోలేకపోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిగ్‌బాస్ షోలో ఆమె గురి.. ట్రోఫీ, టాప్ 5పై కాకుండా కేవలం మానస్ మీదే ఉంది. ఎంతసేపూ అతడి కోసమే ఆలోచిస్తూ, అతడి గురించే కబుర్లు చెప్తూ, అతడిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఆ మధ్య ఓ టాస్క్‌లో మానస్‌ను పెళ్లాడేసి గాల్లో తేలిపోయింది. రానురానూ ఆమెకు మానస్ మీదే ప్రేమ పెరుగుతుందే తప్ప రవ్వంతైనా తగ్గడం లేదు. ఇది ఆమె గేమ్‌ను దెబ్బ తీస్తోంది. గేమ్‌ల మీద పెద్దగా దృష్టి సారించలేకపోతుంది. మొన్నామధ్య బంగారు కోడిపెట్ట టాస్కులోనూ మానస్ గుడ్లకు రక్షణగా ఉంటూ తన గేమ్ పక్కనపెట్టేసింది. రంగు పడుద్ది టాస్కులోనూ ప్రియాంక గెలుస్తుందని అంతా అనుకుంటే అనూహ్యంగా యానీ విజయాన్ని అందుకుంది. ఇక మానస్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతడికి కుంకుమ పెట్టడం, రెప్ప వాల్చకుండా అతడినే చూస్తూ తనను తాను మైమరిచిపోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా పింకీ మరోసారి మానస్ మీద ప్రేమను చాటుకుంది. బిగ్‌బాస్ అన్‌సీన్ వీడియోలో హౌస్మేట్స్ ఆరుబయట నిద్రించారు. తెల్లవారుతుండే సమయంలో మెలకువ వచ్చిన పింకీ మానస్‌కు ఎండ తగులుతోందని గ్రహించింది. వెంటనే అక్కడున్న దిండును అడ్డుపెట్టి ముఖానికి ఎంత తగలనీయకుండా జాగ్రత్త పడింది. తరువాత స్కార్ఫ్లాంటిది ఒకటి పట్టుకుని ఎండ నుంచి రక్షిస్తూ అక్కడే కూర్చుంది. అయితే ఇలా ఎంతసేపు ఉండాలో, ఏమో అనుకుందో ఏమో కానీ వెంటనే బట్టలు ఆరేసుకోవడానికి వినియోగించే స్టాండ్‌ను తీసుకొచ్చి మానస్ కాళ్ల దగ్గర పెట్టింది. అప్పుడుకానీ అతడికి ఎండ తగలట్లేదని అర్థమైన పింకీ హమ్మయ్య అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ కేరింగ్ చూసిన నెటిజన్లు కొందరు పాపం పింకీ, ఎంతలా ప్రేమిస్తుందో అని కామెంట్లు చేస్తుండగా మరికొందరు మాత్రం.. 'మానస్‌ను వదిలేయ్, తన గేమ్ తనను ఆడనివ్వు', 'ఈమె మానస్ కోసమే బిగ్‌బాస్‌కు వచ్చిందా?' అంటూ ఫైర్ అవుతున్నారు. -
డబ్బుల కోసం రాలేదు, నన్ను బయటకు పంపండి: రవి ఆవేదన
Bigg Boss Telugu, Episode 53: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో అందరూ పాల్గొనడానికి వీల్లేనందున ఎవరు డ్రాప్ అవుతారన్న దానిపై హౌస్మేట్స్ చర్చించారు. ఈ సందర్భంగా కెప్టెన్ సన్నీ మాట్లాడుతూ.. టాస్క్‌లో డ్రాప్ అవుతానన్న జెస్సీ.. మళ్లీ వచ్చి ఆడతానన్నాడంటూ ఇంటిసభ్యుల దగ్గర ప్రస్తావించాడు. జెస్సీకి ఆడాలని ఉన్నందున అతడి కోసం టాస్క్‌లో నుంచి వైదొలగడానికి యానీ, సన్నీ సిద్ధమయ్యారు. కానీ జెస్సీ మాత్రం తను అన్‌ఫిట్ అని, తనే డ్రాప్ అవుతానని చెప్పాడు. తనకోసం యానీ టాస్క్ నుంచి తప్పుకోవడం ఇష్టం లేదన్నాడు. ఆమె గేమ్ ఆడి గెలవాలని, ఎందుకంటే ఆమె అందరికీ వండి పెడుతుందని, ఒకవేళ కెప్టెన్ అయితే మరిన్నివారాలు ఆమె హౌస్‌లో ఉన్నవాళ్లకు వంట చేస్తుందని చెప్పుకొచ్చాడు. రంగు పడుద్ది.. 'అభయహస్తం' అనే కెప్టెన్సీ టాస్క్‌లో 'రంగు పడుద్ది' అనే నాలుగో ఛాలెంజ్ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ ఛాలెంజ్‌లో కాన్వాస్‌పై ఎవరి రంగు ఎక్కువగా ఉంటుందో వాళ్లు గెలిచినట్లు. ఈ టాస్క్‌లో ప్రియాంకపై యానీ గెలవడంతో పాటు హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాన్ని పొందింది. మరోపక్క షణ్ను మీద ఉన్న చనువుతో మనిద్దరం కలిసి ఓ సాంగ్ చేద్దాంరా అని తన మనసులోని మాటను బయటపెట్టింది సిరి. దీంతో చికాకుపడ్డ షణ్ను.. 'హమీదా కూడా ఇంతే.. వర్క్ అనేసరికి నేను గుర్తొస్తాను. బయటకు వెళ్లి వీడియోలు చేద్దాం అనేసరికి నేను గుర్తొస్తాను' అని అసహనం ప్రదర్శించాడు. దీంతో హర్ట్ అయిన సిరి 'నీతో సాంగ్ చేయడానికే నేనిదంతా చేస్తున్నానా?' అని చిర్రుబుర్రులాడింది. ఆమె అలకబూనిందని అర్థమైన షణ్ను వెంటనే సారీ చెప్పాడు. కానీ అప్పటికే పీకల్లోతు కోపంలో ఉన్న సిరి.. 'ఎవడిక్కావాల్రా సారీ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసి.. నాకు ఒళ్లు మండిపోతుంది' అని ఫైర్ అయింది. ఇక ఎప్పటిలాగే కాసేపటికే ఇద్దరూ తిరిగి మామూలైపోయారు. నేను డబ్బుల కోసం రాలేదు: రవి బిగ్‌బాస్ ఇచ్చిన 5వ చాలెంజ్ 'కారులో హుషారుగా' టాస్క్‌లో భాగంగా పోటీదారులు బొమ్మ కారును నడిపిస్తూ పూల కుండీలను వారి బాక్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో కాజల్‌పై సన్నీ విజయం సాధించాడు. అయితే కాజల్ గేమ్ లైట్ తీసుకుందని షణ్ను, సిరితో చెప్పుకొచ్చాడు రవి. ఈ క్రమంలో హౌస్‌లో కొద్దివారాలుగా ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను వారిముందుంచాడు. 'నేను డబ్బుల కోసం రాలేదు. నా భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. వాళ్లు ఎలా ఉన్నారో చెప్పండి, లేదంటే నన్నైనా బయటకు పంపండి. దానిక్కూడా నేను సిద్ధమే, కానీ ఈ ఒత్తిడి నా వల్ల కావడం లేదు' అని వాపోయాడు. మరోపక్క మానస్.. రవి గేమర్ అని అభిప్రాయపడ్డాడు. అతడు ఎప్పుడు? ఎవరిని ఎలిమినేట్ చేయాలి? అని ప్లాన్ చేస్తుంటాడని కాజల్‌తో చెప్పుకొచ్చాడు. మానస్ అడుగుపెట్టాక వార్ వన్‌సైడ్ 'బంతిలో ఉంది భాగ్యం' అనే స్పెషల్ టాస్క్‌తో కెప్టెన్సీ పోటీదారులయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో బజర్ మోగినప్పుడు సర్కిల్లో ఉన్న బంతి సాధించిన ప్రతిసారి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయవచ్చు. ఈ గేమ్‌లో వరుసగా బంతి సాధించిన మానస్.. విశ్వ, రవి, జెస్సీ, లోబో, కాజల్, పింకీలను ఎలిమినేట్ చేసి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఫైనల్‌గా ఈ వారం కెప్టెన్సీ కోసం షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ, మానస్ పోటీపడుతున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు తెలిపాడు. అంతేకాకుండా బిగ్‌బాస్ హౌస్‌లో లాక్డౌన్ ఎత్తేస్తున్నట్లు వెల్లడించాడు. -
ప్రియాంకతో మానస్ పెళ్లి, టెన్షన్లో యానీ!
Bigg Boss Telugu 5, Episode 49: వీజే సన్నీ.. కాజల్‌ను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకున్నాడు. తన కెప్టెన్సీని గతవారం ఎలిమినేట్ అయిన సెట్ శ్వేతకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు 'సరైన మ్యాచ్‌ను వెతకండి' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా హౌస్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ వారికి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాల్సి ఉంటుంది. ముందుగా శ్రీరామ్.. తనను పెళ్లాడే అమ్మాయి బబ్లీగా, దేన్నైనా అల్లుకుపోయేలా ఉండాలన్నాడు. సన్నీ.. నమ్మకం, నిజాయితీ, అర్థం చేసుకునే స్వభావం తనకు కాబోయే అమ్మాయిలో తప్పకుండా ఉండాలన్నాడు. ఎంతో కేరింగ్ చూపించే పింకీలాంటి అమ్మాయిని ఎవరు చేసుకున్నా అదృష్టవంతులేనని చెప్పుకొచ్చాడు. నా గర్ల్‌ఫ్రెండ్ నన్నే చూడాలి: షణ్ముఖ్ మానస్ తను చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తూ.. 'నేను ఎక్కువ అలుగుతాను, అప్పుడు తనే ముందుగా నన్ను బుజ్జగించాలి. ఇద్దరి కుటుంబాలను ప్రేమగా చూసుకోవాలి' అని తెలిపాడు. అతడు మాట్లాడుతున్నంత సేపు ప్రియాంక తెగ సిగ్గుపడిపోవడం గమనార్హం. పింకీ వంతు వచ్చేసరికి.. 'అబ్బాయి నాకంటే ఎక్కువ హైట్ ఉండాలి. మంచివాడై ఉండాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ల ఫ్యామిలీని నా ఫ్యామిలీలా చూసుకుంటాను, నా దగ్గర బోలెడంత ప్రేమ ఉంది, అది అతడికి ఇచ్చేస్తాను' అని చెప్పుకొచ్చింది. నా గర్ల్‌ఫ్రెండ్ నన్నే చూడాలి, ఇంకెవర్నీ చూడొద్దని షణ్ముఖ్. నా దగ్గర పొగరు చూపించొద్దని సిరి వారి అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. జెస్సీ మినహా మిగతా అందరూ పింకీ-మానస్‌ను బెస్ట్ కపుల్‌గా పేర్కొన్నారు. దీంతో బిగ్‌బాస్ వారిద్దరూ పూలదండలు మార్చుకునేలా చేసి పెళ్లి జరిపించేశాడు. అనంతరం వీళ్లిద్దరూ 'గువ్వా గోరికంతో..' పాటకు జంటగా స్టెప్పులేశారు. రవి గేమ్ ఆడట్లేదు, మనతో ఆడుతున్నాడు అయితే పింకీ మానస్ ధ్యాసలో పడి తన గేమ్ కూడా పట్టించుకోవట్లేదని భయపడిపోయింది యానీ. దీంతో రవి.. నాకు మానస్ మదర్ కూడా తెలుసు. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో 'బంగారు కోడిపెట్ట' టాస్క్‌లో సిరి స్టిక్కర్లు తానే తీశానని సీక్రెట్ బయటపెట్టాడు. దీంతో ప్రియ ఈ విషయాన్ని సిరి చెవిలో ఊదింది. కానీ తాను చెప్పానని మాత్రం ఎవరికీ చెప్పొద్దని సిరితో ఒట్టేయించుకుంది. ఇదిలా వుంటే రవి గేమ్ ఆడటానికి ప్రయత్నించట్లేదని, మనతో ఆడటానికి ట్రై చేస్తున్నాడని కాజల్‌తో గుసగుసలాడాడు షణ్ను. శ్రీరామ్ కూడా రవికి లొంగిపోయాడని, లోబో, విశ్వ రవి కోసమే ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. మరోపక్క రవి.. తానే స్టిక్కర్లు తీశానని నేరుగా సిరితో చెప్పేశాడు. అడ్డంగా దొరికిపోయిన రవి, ఏకిపారేసిన నాగ్ నాగార్జున.. ఈవారం వరస్ట్ పర్ఫామర్ ఎవరో చెప్పమని ఇంటిసభ్యులను ఆదేశించాడు. రేషన్ మేనేజర్‌గా ప్రియాంక సింగ్ ఫెయిలైందని రవి ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నాగ్.. సిరి స్టిక్కర్లు దొంగతనం చేయడం సరైందే కానీ అమ్మతోడు ఎందుకు వేశావని రవిని నిలదీశాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన రవి.. అది తప్పేనని ఒప్పుకుంటూనే కావాలని చేయలేదని బుకాయించాడు. తర్వాత షణ్ముఖ్.. సిరిని వరస్ట్ పర్ఫామర్ అని తెలిపాడు. సిరి.. కాజల్‌ను, విశ్వ.. టాస్క్‌ల్లో జీరో అంటూ ప్రియాంకను వరస్ట్ పర్ఫామర్లుగా సూచించారు. ప్రియాంక, జెస్సీ, ప్రియ.. విశ్వను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నారు. ఎన్నిసార్లు చెంప పగలగొడతావు?: నాగ్ చెంప పగలగొడతాను అని ఎన్నిసార్లు అంటావని ప్రియను నిలదీశాడు నాగ్. దీనికి వివరణ ఇచ్చేందుకు ప్రియ ప్రయత్నిస్తూ.. 'బుట్టలో ఎగ్స్ తీయబోతుంటే సన్నీ నన్ను నెట్టేయగా ముందుకు పడిపోయాను. అతడు నానా మాటలు అనడంతో నాతో ఫిజికల్ అయితే మాత్రం చెంప పగలగొడతాను అని తిట్టాను' అని ఒప్పుకుంది. మరీ అన్నిసార్లు తిట్టకని సుతిమెత్తగా హెచ్చరించాడు నాగ్. తర్వాత యానీ మాస్టర్.. జెస్సీని, శ్రీరామ్.. మానస్‌ను, కాజల్.. ప్రియను, మానస్.. షణ్ముఖ్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా చెప్పుకొచ్చారు. చెత్త ఆటగాడిగా ఎంపికైన విశ్వ ఇక బంగారు కోడిపెట్ట టాస్క్‌లో సన్నీ గ్రూప్ సహాయం తీసుకుని ఆడినందుకు కెప్టెన్సీ రద్దైందని ప్రకటించి చిన్న ఝలుక్ ఇచ్చాడు నాగ్. ఇండివిడ్యువల్ టాస్క్ అని రాసి ఉన్నా కూడా సన్నీ- కాజల్, మానస్- ప్రియాంక కలిసి ఆడారని, దానివల్ల తాను కెప్టెన్ కాలేకపోయానని ఎమోషనల్ అయింది యానీ..సన్నీ ధైర్యం చేసుకుని ప్రియను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పాడు. దీంతో ప్రియ, సన్నీ ఒకరికొకరు గాల్లో ముద్దులు పంపుకున్నారు. ఇక మెజారిటీ సభ్యులు విశ్వను చెత్త ఆటగాడిగా పేర్కొనడంతో సోమవారం అతడిని జైల్లోకి పంపిస్తారని చెప్పాడు నాగ్. తర్వాత శ్రీరామ్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. కాజల్ లాంటి వాళ్లు నాకు నచ్చరు: లోబో బిగ్‌బాస్ హౌస్‌ను శుభ్రంగా ఉంచుకోలేదని తిట్టిపోశాడు నాగ్. హౌస్‌ను ఎంత గలీజ్ చేశారో చూడండి అంటూ కంటెస్టెంట్లకు హౌస్‌నంతా వీడియోలో చూపించాడు. తర్వాత లోబోను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన నాగ్.. 'తోపు, డూపు' గేమ్ ఆడించాడు. లోబో ముందుగా ఆరుగురు డూపుల గురించి చెప్తూ.. కాజల్ లాంటి జనాలు నాకు నచ్చరు, ఆమె ఊసరవెళ్లి అన్నాడు. ప్రియ.. వేరేవాళ్లతో అంతా చేపిస్తూ సైలెంట్‌గా కూర్చుంటది, వెనకాల ఒకమాట, ముందొకమాట మాట్లాడుతుందని చీదరించుకున్నాడు. రవికి అవసరమున్నప్పుడే ఈ లోబో గుర్తొస్తాడని బాధపడ్డాడు. యానీ.. స్మార్ట్ అని, షణ్ముఖ్ యాటిట్యూడ్ నచ్చదని, అతడు యాక్టింగ్ చేస్తున్నాడని తెలిపాడు. వీళ్లు కాకుండా మిగిలిన ఆరుగురు తోపులని చెప్పాడు. అనంతరం నాగార్జున కాజల్ సేఫ్ అని వెల్లడించాడు. ఇక ఈ వారం ప్రియ వెళ్లిపోతుందని నాగ్ కన్నా ముందే లీకువీరులు నెట్టింట ప్రచారం మొదలెట్టిన విషయం తెలిసిందే! -
సన్నీ మీదకు చేయెత్తిన ప్రియ, చెంప పగలగొడతానని వార్నింగ్!
Bigg Boss Telugu 5, Episode 45: బిగ్‌బాస్ హౌస్‌లో ఏడోవారం జరిగిన నామినేషన్స్ కంటెస్టెంట్లు కాకుండా సన్నీ ఒక్కడే చేసినట్లు ఉందన్నాడు మానస్. ఈ మాట హౌస్మేట్స్ అంటున్నారని సన్నీతో చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన సన్నీ.. ప్రియ రవిని నామినేట్ చేసింది, దాన్ని నేను ఓకే చేశానంతే అని సింపుల్‌గా చెప్పేశాడు. నామినేషన్స్‌లో సిల్లీ రీజన్స్ చెప్తారా? వాళ్లాడితే గేమ్, నేనాడితే క్రైమా? అని అసహనం వ్యక్తం చేశాడు. ఏదేమైనా టాస్కుల్లో ఫ్రెండ్షిప్ చూపిస్తే ఓడిపోయినట్లేనని జెస్సీతో చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఇక నామినేషన్స్ మంట నుంచి ఇంకా బయటపడని ప్రియాంక.. దమ్ముంటే గేమ్ ఆడు, సేఫ్ గేమ్ కాదంటూ కాజల్నుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె డ్రామా క్వీన్ అని పేరు పెట్టింది. ఆఖరికి తనను మానస్ కూడా అర్థం చేసుకోవట్లేదంటూ ఏడ్చేసింది. అతడిని ఇంత ఇష్టపడుతాను కదా, అతడికి నా మనసేంటో అర్థం కాలేదా? నన్నెందుకు దూరం పెడుతున్నాడు అంటూ యానీ మాస్టర్ దగ్గర తన గోడు వెల్లబోసుకుంది. ఇంతలో మానస్.. ఆమె దగ్గరకు వెళ్లి ఓదార్చాడు. అంతేకాదు, ఆమె కోరికమేరకు గోరుముద్దలు తినిపించాడు. దీంతో అప్పటిదాకా ముఖం మాడ్చుకున్న పింకీ ముఖం మానస్ రాకతో సంతోషంతో విప్పారింది. తను కూడా ఒక కెమెరా అని, నీ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుందని మానస్‌ను హెచ్చరించింది. నామినేషన్స్‌లో సన్నీ తప్పు చేసి ఒప్పుకోడేంటని రవి చిరాకు పడుతుండగా.. వాడు తప్పు చేశాడంటే నేను ఒప్పుకోనని తెగేసి చెప్పింది కాజల్. దీంతో వారిద్దరూ ఈ విషయంపై కాసేపు చర్చోపచర్చలు చేసుకోగా చివరికి రవికి సారీ చెప్పింది కాజల్. అనంతరం బిగ్‌బాస్ బంగారు కోడిపెట్ట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో ప్రభావతి అనే కోడి.. కూత పెట్టి గుడ్లు పెడుతుంది. కొన్నిసార్లు కోడిగుడ్ల వర్షం కూడా కురుస్తుంది. ఏ ఇంటిసభ్యుడు ఎక్కువ గుడ్లను అందుకుని వాటిపై తమ ముఖం ఉన్న స్టిక్కర్స్ పెడతారో వారే కెప్టెన్సీకి పోటీపడతారు. నేను అందరి గుడ్ల జోలికొస్త, దొంగతనం చేస్తా, ఎవరేం చేసుకుంటరో చేసుకోండి, అదే నా స్ట్రాటజీ అని ముందుగానే హౌస్‌మేట్స్‌ను హెచ్చరించింది ప్రియ. దీంతో ముందు జాగ్రత్తగా సన్నీ తన గుడ్లను కాపాడమంటూ కాజల్ సాయం కోరాడు. అయితే ఇది ఇండివిడ్యువల్ టాస్క్ అని, సన్నీ, కాజల్ కలిసి ఆడటం వల్ల ఈ టాస్క్ రద్దయ్యే అవకాశం ఉంటుందని రవి దగ్గర అనుమానం వ్యక్తం చేసింది యానీ. ఇక సన్నీ బుట్టలోని గుడ్లను అదును చూసి మాయం చేసింది ప్రియ. తన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డ సన్నీ తన జోలికొస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో స్పందించిన ప్రియ ఆ గుడ్లను తానే దోచుకున్నానని క్లారిటీ ఇచ్చింది. ఆమెను ఏమనాలో అర్థమవక సతమతమైన సన్నీ.. చేతగానోళ్లలాగా ఒక మూలన కూచోవడం కాదు, మంచిగా గేమ్ ఆడు అని సూచించాడు సన్నీ. నేను బరాబర్ దొంగతనం చేస్తానని కౌంటరిచ్చింది ప్రియ. తనను రెచ్చగొట్టడంతో ఆవేశపడ్డ సన్నీ అక్కడున్న కడ్డీని కొట్టాడు. దీంతో కామన్ సెన్స్ వాడంటూ మరింత రెచ్చిపోయింది ప్రియ. ఇదిలా వుంటే మానస్ ప్రియ దగ్గరకు వెళ్లి, ఆమె ఇచ్చిన గుడ్లు తీసుకోవడం గమనార్హం. ఈ టాస్క్‌లో లోబో ఆడితే మస్త్ మజా వచ్చేదని గుర్తు చేసుకున్నారు సన్నీ, రవి. ఇది చూసి సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో ఫుల్ ఖుషీగా ఫీలయ్యాడు. చివర్లో సన్నీ, కాజల్ బుట్టల్లోని గుడ్లను సిరి, శ్రీరామ్ లేపేశారు. ఇంతటితో ఫస్ట్ రౌండ్ ముగియగా ఈ రౌండ్లో అత్యధికంగా మానస్ దగ్గర 32 గుడ్లు ఉన్నాయి. అయితే పింకీ అతడికి తన గుడ్లన్నీ ఇచ్చేసిందని, పైగా మానస్ ప్రియ దగ్గర కూడా తీసుకున్నాడని విమర్శించింది యానీ. షణ్ముఖ్, సిరి మరోసారి లొల్లి పెట్టుకోగా సిరి ఏడ్చేసింది. అటు మానస్.. సన్నీ దగ్గరకు వెళ్లి ఏడ్చేశాడు. దీంతో అతడిని దగ్గరకు తీసుకున్న సన్నీ.. మనం బయటకెళ్లాక లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటామంటూ ఓదార్చాడు. ఇక రేపటి ఎపిసోడ్లో ప్రియ- సన్నీల గొడవ తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రియ సన్నీ బుట్ట మీద కన్నేయగా అతడు వెంటనే వచ్చి తన బుట్టను కాపాడుకున్నాడు. ఈ క్రమంలో ప్రియను నెట్టేయగా ఆమె అతడి మీదకు చేయి చేసుకోబోయింది. అంతేకాకుండా చెంప పగలగొడతానంటూ వార్నింగ్ ఇచ్చింది. కొట్టుకునేంతవరకు వెళ్లిన వీరిద్దరినీ ఆపడం ఇంటిసభ్యుల వల్ల కావట్లేదు. మరి ఈ గొడవ చల్లారుతుందా? లేదా? అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలి! -
స్మోకింగ్ రూమ్‌లో ఏడ్చేసిన సన్నీ, మానస్..
సంతోషం, దుఃఖం, కోపం, వైరం, అలకలు, గిల్లికజ్జాలు, మనస్పర్థలు, పశ్చాత్తాపాలు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఇవన్నీ సర్వసాధారణమే! అయితే పరిస్థితులను బట్టి వాటికి ఎదురీదుతూ ముందుకు వెళ్లాలి, అన్నింటినీ జయించగలగాలి! అప్పుడే గెలుపుకు చేరువయ్యేది! బిగ్‌బాస్ కంటెస్టెంట్లతోనే కాదు, వారి ఎమోషన్స్‌తోనూ ఆటలాడుతాడు. ఇందుకు తార్కాణంగా నిలిచిందీ ప్రోమో. తాజాగా రిలీజైన ప్రోమోలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సన్నీ, మానస్ స్మోకింగ్ రూమ్‌లో వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో లోబో, విశ్వ.. అటు సన్నీని, ఇటు మానస్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. 'నీకు ఎవరో ఒక్కరే ఇష్టముంటే వేరు.. కానీ అందరూ ఇష్టమైనవాళ్లే అంటే ఎలా డార్లింగ్?' అని సన్నీని ఊరడించాడు విశ్వ. ఏదేమైనా వీళ్లిద్దరూ ఇలా ఏడ్చేయడాన్ని చూసి అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. సన్నీ, మానస్.. ఇద్దరూ ఫైటర్లే అని, మీరు ఏడిస్తే మాకు బాధగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆటలో జరిగేవాటిని మనసుకు తీసుకోకూడదని హితవు పలుకుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ ఇద్దరి దుఃఖం వెనక గల కారణాలేంటో తెలియాలంటే ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే! -
ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్‌గా మారడాన్ని స్వాగతించిన తండ్రి
Bigg Boss Telugu 5, Episode 32: బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన 'రాజ్యానికి ఒక్కడే రాజు' టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి లెవల్లో ఇచ్చిన కుస్తీపోటీలో విశ్వ మానస్‌ను ఓడించి పైచేయి సాధించాడు. తర్వాత తనతో పోటీలోకి దిగిన యానీ మాస్టర్‌ను చిత్తుచిత్తుగా ఓడించాడు జెస్సీ. అనంతరం ప్రియాంక సింగ్‌ను అతి సునాయాసంగా ఓడించింది శ్వేత. మొత్తంగా ఈ టాస్క్‌లో యాంకర్ రవి రెండు పాయింట్ల ఆధిక్యంతో గెలిచాడు. దీంతో అతడికి 150 నాణాలు వచ్చాయి. అయితే ఖజానాలో నుంచి నాణాలు దొంగిలిస్తున్నారంటూ విశ్వ చిర్రుబుర్రులాడాడు. కానీ విశ్వ పేరు పెట్టి ఎవరినీ తిట్టకపోవడంతో మానస్ ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరికీ మధ్య చిన్నపాటి వాగ్వాదమే జరిగింది. సైగలతో సంభాషించుకున్న శ్రీరామ్, హమీదా ఇక రాత్రిపూట దుప్పటి కప్పుకుని జెస్సీ, సిరి, షణ్ముఖ్ నాణాలు పంచుకున్నారు మరోపక్క హమీదా శ్రీరామ్‌ను తన కౌగిలిలో బంధించింది. తర్వాత వీళ్లిద్దరూ ఎప్పటిలాగే సైగలతో సంభాషించుకుని గుడ్‌నైట్ చెప్పుకున్నారు. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు 'రాజుగారి గోడ' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఖాళీ గోడలపై హౌస్మేట్స్ వారికి నచ్చిన రాజు ఫొటోలను అతికించాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగే సమయానికి ఏ రాకుమారుడి ఫొటోలు ఎక్కువ ఉంటే అతడే గెలిచినట్లు లెక్క! శ్రీరామ్ గాలి తీసేశారు..: షణ్ను దీంతో సన్నీకి సపోర్ట్‌గా మానస్, జెస్సీ బరిలోకి దిగారు. ఈ క్రమంలో యువరాజు రవికి మద్దతుగా వచ్చిన విశ్వను ఆపేందుకు మానస్ తీవ్రంగా ప్రయత్నించాడు. జెస్సీ అయితే ఏకంగా శ్రీరామచంద్రను ఎత్తి పడేశాడు. అయితే శ్రీరామే జెస్సీని కొడుతున్నాడని, అది కళ్లారా చూశానని ఆవేశపడ్డాడు సన్నీ. దీంతో చిర్రెత్తిపోయిన శ్రీరామ్.. ఏకంగా గోడను మొత్తం నేలకూల్చాడు. కానీ చివరగా ఈ టాస్క్‌లో యువరాజు సన్నీ విజయం సాధించడం విశేషం. సన్నీ గెలుపును అభినందించిన షణ్ను.. ఇప్పటిదాకా స్ట్రాంగ్ అనుకున్న శ్రీరామ్ గాలి తీసేశారంటూ సెటైర్ వేశాడు. ఆ అవార్డు ఉంటే అది కాజల్‌కే చెల్లుతుంది: యానీ ఇంతలో కాజల్ నాణాలు దొంగతనం చేయడం చూశాడు రవి. అయితే అందుకు తగిన ఆధారాలు చూపించమంటూ బుకాయించింది కాజల్. అడ్డంగా దొరికాక కూడా తప్పించుకోవాలని ప్రయత్నించిన కాజల్ యవ్వారంతో ఇరకాటంలో పడ్డాడు రవి.. ఆమెతో పెట్టుకుంటే పనులు అయినట్లేనని ఆమెను అలా వదిలేశాడు. ఈ సీను అంతా చూసిన యానీ మాస్టర్.. నిజానికి ప్రోవోక్ అనే అవార్డు ఉంటే అది కాజల్‌కే ఇవ్వాలంది. ఇంతలో సిరి.. సడన్‌గా రవి రాజ్యంలో నుంచి సన్నీ రాజ్యంలోకి షిఫ్ట్ అయింది. మళ్లీ గెలిచిన సన్నీ.. అనంతరం బిగ్‌బాస్.. 'లాక్కో లాక్కో తాడు' టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు రాకుమారులతో పాటు, వారి ప్రజలు తాడును లాగాల్సి ఉంటుంది. ఏ రాకుమారుడైతే ఇతర రాజ్యంలోని ప్రజలను తమవైపు లాక్కుంటారో వారే గెలిచినట్లు లెక్క! ఈ టాస్క్‌లో మరోసారి యువరాజు సన్నీ గెలుపు సాధించడంతో అతడి ప్రజానీకం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక రేపటి ఎపిసోడ్లో ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు ఆమెగా మారిన విషయాన్ని పింకీ తండ్రి స్వాగతించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పింకీ ఎంతో భావోద్వేగానికి లోనవగా హౌస్ మొత్తం కూడా ఎమోషనల్‌గా మారినట్లు కనిపిస్తోంది. -
సన్నీ Vs రవి: తొడగొట్టి సవాలు విసిరిన విశ్వ!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. ఈ రాజ్యానికి ఒక్కడే రాజు అని కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే కుర్చీ కోసం యాంకర్ రవి, సన్నీ ఇద్దరూ తెగ కష్టపడుతున్నారు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఖజానాలోని నాణాలను కూడా పంచుతున్నారు. ఈ క్రమంలో సిరి, షణ్ముఖ్, జెస్సీ, ప్రియాంక సింగ్, లోబో, ప్రియ.. సన్నీకి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించగా.. రవికి.. విశ్వ, శ్రీరామ్, హమీదా, శ్వేత, యానీ సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించారు. ఇక ఇద్దరు రాజుల కోసం విశ్వ, మానస్ బురదలో ఫైట్ చేసినట్లు కనిపించింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. దమ్ముంటే ముందుకొచ్చి ఆడాలి, కానీ దొంగబుద్ధులు ఏంది? అని తొడగొట్టి ప్రశ్నించాడు విశ్వ. పేరు తీసి మాట్లాడు, కానీ అందరినీ ఎందుకు అంటున్నావని ఆవేశపడ్డాడు మానస్. మరి హౌస్‌లో ఏం జరిగింది? ఎవరు కెప్టెన్ అయ్యారు? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్ గేట్లు పగలగొట్టుకుని పోదామనుకున్నా!: నటరాజ్ మాస్టర్
Bigg Boss Telugu 5, Episode 29: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఐదో వారంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా హౌస్మేట్స్ నాగ్‌కు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. 'నిన్నే పెళ్లాడతా' సినిమాలోని పాటలకు కంటెస్టెంట్లు స్పెషల్ పర్ఫామెన్స్ ఇవ్వగా.. ఇంప్రెస్ అయిన నాగ్ తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని కాంప్లిమెంట్ ఇచ్చాడు. తర్వాత నాగ్ సండేను ఫండే చేసేందుకు ఇంటిసభ్యులను రెండు టీములుగా విడగొట్టాడు. శ్రీరామ్, నటరాజ్, యానీ, ప్రియ, మానస్, జెస్సీ, సిరి, రవి A టీమ్ కాగా మిగతావారు B టీమ్‌లో ఉన్నారు. షర్ట్ విప్పిన విశ్వ, పింకీ డ్యాన్స్ అరాచకం.. గేమ్‌లో భాగంగా ప్రతి టీమ్లోనుంచి ఒక్కొక్కరు బాక్స్‌లో నుంచి చీటీ తీయాలి. అందులో ఉన్న సినిమా పేరును హింట్ ఇస్తూ డ్రాయింగ్ వేయాలి. అది చూసి సదరు టీమ్ మెంబర్స్ సరైన ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేస్తే డ్రాయింగ్ వేసిన కంటెస్టెంట్ వారికి నచ్చినవాళ్లతో డ్యాన్స్ చేయొచ్చు. ఈ క్రమంలో విశ్వ- ప్రియాంక సింగ్ నరుడా.. ఓ నరుడా సాంగ్‌కు రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేశారు. పింకీ విశ్వ చొక్కా విప్పేయగా.. అతడు ఆమెను ఎత్తుకుని, హత్తుకుని మరీ స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో అక్కడున్నవారితోపాటు నాగ్ కూడా ఇది వేరే లెవల్‌కు వెళ్తోందని భావించిన పాట ఆపేయండనని కోరడం విశేషం. మొత్తంగా ఈ గేమ్‌లో టీమ్ A గెలవగా, విజయానందంతో చిందులేసింది. తర్వాత యానీ మాస్టర్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. దాక్కోదాక్కో మేక.. తర్వాత ఇంటిసభ్యులతో నాగ్ 'దాక్కోదాక్కో మేక' గేమ్ ఆడించాడు. ఇందులో ఎవరు పులి, ఎవరు మేక అని పేర్లు చెప్పిన నాగ్ 30 సెకన్లలో మేకను పట్టుకోకపోతే పులి చచ్చిపోతుందని, పులికి పనిష్మెంట్ ఉంటుందన్నాడు. ఒకవేళ మేకను పట్టుకుంటే మేక చచ్చిపోవడంతో పాటు వారికి పనిష్మెంట్ ఉంటుందని తెలిపాడు. మొదటగా పులిగా వచ్చిన శ్రీరామ్.. హమీదాను వేటాడి పట్టుకున్నాడు. దీంతో హమీదా తనకు విధించిన శిక్షలో భాగంగా డ్యాన్స్ చేసి అందరినీ పడగొట్టింది. మానస్‌ను వెంటాడి వేటాడిన ప్రియాంక.. తర్వాత జెస్సీని పట్టుకోవడంలో విఫలమైన శ్వేతను నాలుకతో ముక్కును టచ్ చేయాలన్నాడు నాగ్. కానీ శ్వేత ఎంత ప్రయత్నించినా ముక్కును అందుకోలేకపోగా సిరి చాలా ఈజీగా నాలుకతో ముక్కును తాకింది. అనంతరం పులిలా వచ్చిన ప్రియాంక.. మానస్‌ను వెంటాడి వేటాడగా అతడు చిక్కకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్‌లో పడటంతో నాగ్‌తో సహా అందరూ షాకయ్యారు. తర్వాత అతడికేమీ కాలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆటలో ఓడిపోయిన మానస్ పదిసార్లు కప్ప గెంతులు వేశాడు. సిరిని ఎత్తుకుని తిప్పిన షణ్ముఖ్ తర్వాత ప్రియ.. ఎంతకూ సన్నీని పట్టుకోలేకపోవడంతో ఆమెను హూలా హూప్తో డ్యాన్స్ చేయమన్నాడు నాగ్. హూప్‌ను తిప్పడం సాధ్యపడని ప్రియ దాంతో డ్యాన్స్ చేయడానికి ముప్పు తిప్పలు పడింది. అనంతరం సిరి.. షణ్నును పట్టేసుకోగా ఓడిపోయిన షణ్ముఖ్‌తో బెల్లీ డ్యాన్స్ చేయించాడు నాగ్. పులిలా వచ్చిన కాజల్.. లోబో మీద పంజా విసరడంతో అతడు 15 పుషప్స్ చేయక తప్పలేదు. అనంతరం రవి.. యానీ మాస్టర్‌ను ఇట్టే పట్టేసుకున్నాడు. దీంతో యానీ.. రవి చేతిలో ఓడిపోయానని డైలాగ్ చెప్తూ తీన్మార్ స్టెప్పులేసింది. తర్వాత సిరి సేవ్ అయినట్లు ప్రకటించగా సంతోషం పట్టలేకపోయిన షణ్ను సిరిని ఎత్తుకుని తిప్పాడు. నిజాయితీగా ఉండటమే నటరాజ్ చేసిన తప్పా? చివరగా బావ, బావమరుదులైన లోబో, నటరాజ్ ఇద్దరే మిగలగా.. హార్ట్ బీట్ సౌండ్‌తో టెన్షన్ పెంచేసిన నాగ్.. నటరాజ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో లోబో, యానీ, హమీదా గుక్కపెట్టి ఏడ్చేశారు. కడసారి బిగ్‌బాస్ హౌస్‌ను కళ్లారా చూసుకున్న నటరాజ్ కన్నీళ్లతో హౌస్‌కు వీడ్కోలు పలికాడు. మాస్టర్ పది మందికి పెట్టేవాడే కానీ అతడు ఇక్కడ సరిగా అన్నం కూడా తినలేదని బాధపడ్డాడు సన్నీ. నిజాయితీగా, స్ట్రిక్ట్‌గా ఉండటమే ఆయన చేసిన తప్పా? అని పింకీ ఎమోషనల్ అయింది. అనంతరం స్టేజీ మీదకు వచ్చిన నటరాజ్ బిగ్‌బాస్ హౌస్‌లో తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. హౌస్‌లో నుంచి వెళ్తున్నానంటే నా భార్యకు నా అవసరం ఉందేమోనని అభిప్రాయపడ్డాడు. నిజానికి బిగ్‌బాస్ గేట్లు పగలగొట్టుకుని బయటకు పోయేటంత అంతర్మథనానికి లోనయ్యానని తెలిపాడు. దీంతో అతడిని ఓదార్చిన నాగ్.. బిగ్‌బాస్ షోకు రావడంతోనే నువ్వు సాధించేశావని ధైర్యం నూరిపోశాడు. మానస్ గాడిద, ప్రియాంక చిలక.. అనంతరం నటరాజ్.. హౌస్‌లోని కంటెస్టెంట్లకు జంతువుల పేర్లను సూచిస్తూ గేమ్ ఆడాడు. సిరి తన జోలికొస్తే కాటేసే పాము అని చెప్పాడు. లోబో ఎలుకలా దూరి కిచెన్‌లో అంతా తినేస్తాడని పేర్కొన్నాడు. విశ్వ.. ప్రతిదానికి భయపడొద్దని, వేరేవాళ్ల కోసం మంచిగా మాట్లాడొద్దని అతడిని ఊసరవెల్లితో పోల్చాడు. శ్రీరామచంద్ర మూడోవారం నుంచి అమాంతం పెరిగిపోయాడని అతడిని మొసలితో పోల్చాడు. ప్రియాంక సింగ్.. అందరికీ ప్రేమతో వడ్డించే చిలక అని చెప్పుకొచ్చాడు. సింహం.. తానేనన్న నటరాజ్.. మానస్ గాడిదలా చాకిరీ చేస్తాడన్నాడు. రవి.. యాంకరింగ్ చేసిన తెలివితో ఆడుతున్నాడని అతడే గుంటనక్క అని వెల్లడించాడు. చివర్లో హమీదా.. నాగ్ వేసుకున్న టీ షర్ట్ మీద ఆశ పడటంతో హోస్ట్ దాన్ని తప్పకుండా ఇచ్చేస్తానని హమీ ఇచ్చాడు. -
అర్హత లేదంటూ 7 కత్తిపోట్లు, బాధతో విలవిల్లాడిపోయిన సన్నీ
Bigg Boss 5 Telugu, Episode 26: కెప్టెన్సీ అంటే కంటెస్టెంట్లకు ఓ వరంలాంటిది. నామినేషన్స్ నుంచి తప్పించే ఓ ఆయుధం వంటిది. అలాంటి కెప్టెన్సీ చాన్స్‌ను దక్కించుకునేందుకు ఇంటిసభ్యులు హోరాహోరీగా పోరాడారు. చివరికి ముగ్గురు బరిలో నిలిచారు. కానీ హౌస్మేట్స్ మద్దతుతో శ్రీరామచంద్ర గెలిచాడు. మరి హౌస్మేట్స్ ఎవరెవరికి సపోర్ట్ చేశారు? నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. పిజ్జాలు ఆరగించిన కంటెస్టెంట్లు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నేడు కూడా కొనసాగింది. మెరుపుల శబ్ధం రాగానే బజర్ నొక్కిన శ్వేత.. సిరి-షణ్ముఖ్‌లను తమకు పోటీదారులుగా ఎంచుకున్నారు. వీరికి బిగ్‌బాస్ 'చిక్కులో చిక్కుకోకు' అనే టాస్క్ ఇచ్చాడు. చిక్కులు పడి ఉన్న తాళ్లను విడదీసే ఈ టాస్కులో శ్వేత టీమ్ గెలిచింది. ఇంతటితో గేమ్ ముగిసిందన్న బిగ్‌బాస్ ఏ జంటలు ఎక్కువగా బరువు తగ్గాయో చెక్ చేసుకోమన్నాడు. ఈ క్రమంలో మానస్ రెండు రోజుల్లోనే ఆరు కిలోల బరువు తగ్గి అందరితో ఔరా అనిపించుకున్నాడు. మొత్తానికి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ముగియడంతో అప్పటిదాకా ఆకలితో నకనకలాడుతున్న ఇంటిసభ్యులకు రుచికరమైన పిజ్జాలు పంపించాడు. వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చిన కంటెస్టెంట్లు ఆవురావురుమని తిన్నారు. నిన్ను రేషన్ మేనేజర్ చేస్తా: హమీదాకు శ్రీరామ్ ఆఫర్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో.. సన్నీ-మానస్, హమీదా- శ్రీరామచంద్ర, యానీ మాస్టర్- శ్వేత జంటలు ఎక్కువ బరువు కోల్పోయాయి. ఒక్కో జంటలో నుంచి ఒక్కొక్కరు కెప్టెన్సీకి పోటీదా చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో ఈ మూడు జంటలు తమలో ఎవర్ని పంపించాలా? అని తెగ చర్చించారు. ఈ క్రమంలో కెప్టెన్ తర్వాత ముఖ్యమైన పోస్ట్ ఏంటని శ్రీరామ్ ప్రశ్నించగా హమీదా రేషన్ మేనేజర్ అని ఆన్సరిచ్చింది. తనకు రేషన్ మేనేజర్ ఇష్టం లేదన్న శ్రీరామ్ తను గెలిస్తే హమీదాకు ఆ పోస్ట్ ఇప్పిస్తానన్నాడు. ఏ కారణం లేకపోయినా తనను నామినేట్ చేస్తున్నారని, కెప్టెన్ అయితే ఒకవారం ఇమ్యూనిటీ వస్తుందని ఆశపడ్డాడు. ఎలాగో సన్నీ పోటీలో నిలబడ్డా అతడికి ఎవరూ సపోర్ట్ చేయరని చెప్పాడు. అనంతరం శ్రీరామచంద్ర, శ్వేత, సన్నీ 'కత్తులతో సావాసం' అనే కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొన్నారు. ఇందులో హౌస్మేట్స్ కెప్టెన్‌కు అర్హులు కారు అనుకున్నవారి బెల్ట్‌ను కత్తితో పొడవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. కెప్టెన్ డ్రెస్ తెచ్చుకున్నా, అది వేసుకోవడానికైనా గెలిపించండి నేను కెప్టెన్ డ్రెస్ తెచ్చుకున్నా, అది వేసుకోవడానికైనా నన్ను గెలిపించండని సన్నీ పేరుపేరునా అభ్యర్థించాడు. శ్రీరామ్ మాత్రం.. మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వారికే ఓటేయండని ప్రచారం నిర్వహించాడు. ఈ ప్రచారం ముగియగానే అసలు టాస్క్ మొదలైంది. ముందుగా శ్వేత మాట్లాడుతూ.. తను కెప్టెన్ అయితే హౌస్ స్ట్రిక్ట్‌గా మారుతుందని హెచ్చరిక వదిలింది. ఇక శ్రీరామ్.. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తను సాల్వ్ చేస్తానని చెప్పాడు. సన్నీ.. అందరూ తనకు సమానమే అని, హౌస్‌లో పక్షపాతంగా వ్యవహరించనని ప్రామిస్ చేశాడు. నీకింకా కెప్టెన్ అయ్యే సమయం రాలేదు తర్వాత హౌస్మేట్స్ ఒక్కొక్కరిగా ముందుకు వస్తూ పోటీదారుల్లో ఎవరు కెప్టెన్సీకి అనర్హులో వారికి కత్తి గుచ్చారు. మొదటగా వచ్చిన విశ్వ.. సన్నీ బెల్ట్‌కు కత్తి గుచ్చాడు. తర్వాత షణ్ను.. మన మధ్య అంత ర్యాపో లేదంటూ మళ్లీ సన్నీకే కత్తి గుచ్చాడు. అయితే ఈ రెండు కత్తిపోట్లను సన్నీ ముందే ఊహించాడు. విశ్వ సింపథీ గేమ్ ఆడుతున్నాడని, అతడిక్కడ ఫేక్ గేమ్ ఆడుతున్నాడని శ్రీరామ్‌తో చెప్పుకొచ్చాడు. తర్వాత సిరి.. సన్నీకే గుచ్చాలని లేదంటూనే అతడినే కత్తితో పొడిచింది. నీకింకా కెప్టెన్ అయ్యే టైం రాలేదంటూ లోబో కూడా సన్నీని ఒక్క పోటు పొడిచాడు. అయితే లోబో పొడుస్తాడని ఊహించని సన్నీ కంటతడి పెట్టుకోవడంతో మానస్ ఓదార్చాడు. హమీదా.. శ్వేతను; ప్రియ, నటరాజ్ మాస్టర్.. సన్నీని; యానీ మాస్టర్.. శ్రీరామ్‌ను కత్తితో పొడిచారు. కెప్టెన్‌గా నువ్వేదైనా చెప్తే జనాలు అంత సీరియస్‌గా తీసుకోలేరేమోనని రవి, త్వరగా ఆవేశపడతావంటూ ప్రియాంక సింగ్.. మరోసారి సన్నీకి కత్తిపోట్ల రుచి చూపించారు. ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది, కత్తితో పొడవలేను: కాజల్ తర్వాత సన్నీ రవి దగ్గరకు వెళ్లి ఇక్కడ హౌస్‌లో ఏ కెప్టెన్ కూడా కమాండింగ్ చేయట్లేదని కౌంటరిచ్చాడు. తర్వాత వచ్చిన మానస్.. సన్నీని పొడిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. మిగిలిన ఇద్దరిలో ఎవరు తనను ఇంప్రెస్ చేస్తే వారిని పొడవనని మాటిచ్చాడు. దీంతో ఇద్దరూ.. కెప్టెన్ అయితే అలా ఉంటాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని ఉపన్యాసాలివ్వగా మానస్ శ్వేతను కత్తితో గుచ్చి శ్రీరామ్‌కు సపోర్ట్ చేశాడు. నిజానికి సన్నీని కసాకసా వేద్దాం అనుకున్నా, కానీ నాకు ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది, కాబట్టి అతడిని కత్తితో గుచ్చి బాధపెట్టలేను అంటూ శ్వేతను కత్తితో పొడిచింది కాజల్. తర్వాత వచ్చిన జెస్సీ.. సన్నీ, శ్వేత తన మనసులో కెప్టెన్లంటూ శ్రీరామ్‌ను కత్తితో గుచ్చాడు. తక్కువ కత్తిపోట్లు పడ్డ శ్రీరామ్ బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగో కెప్టెన్‌గా అవతరించాడు. శ్రీరామ్‌కు ఎందుకు సపోర్ట్ చేశాడు?: సన్నీ అయితే కెప్టెన్సీకి అవకాశం ఉన్న శ్వేతకు మానస్ కత్తి గుచ్చడంతో అయోమయానికి లోనయ్యాడు సన్నీ. నిజానికి తన మాటలతో ఇంప్రెస్ చేసింది శ్వేత అయితే శ్రీరామ్‌కు ఎందుకు సపోర్ట్ చేశాడో అర్థం కావడం లేదని, ఇదే విషయాన్ని వాడినే అడిగి కడిగిపారేస్తానని ఆవేశపడ్డాడు. మరోపక్క మానస్ కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని వదులుకున్నందుకు తెగ ఫీలైంది పింకీ. నువ్వే కెప్టెన్ అవుతావనుకున్నా, ఇంకోసారి అస్సలు కాంప్రమైజ్ అవ్వకు అని అతడి దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇచ్చింది. -
కత్తితో కసితీరా పొడిచారు! తట్టుకోలేకపోయిన సన్నీ
బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం రావడం ఒకెత్తైతే ఇక్కడ వాళ్లేంటో ప్రూవ్ చేసుకోవడం మరో ఎత్తు. ఇక్కడ వారి ప్రవర్తనను ఒక్కటే పరిశీలనలోకి తీసుకోరు ప్రేక్షకులు. టాస్కుల్లో ఆటతీరు, మిగతా ఇంటిసభ్యులతో వారి ప్రవర్తన.. ఇలా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఓట్లు వేస్తుంటారు. ఇక ఈ వారం నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబో, యాంకర్ రవి, ప్రియ, కాజల్, సిరి హన్మంత్, సన్నీ నామినేషన్లో ఉన్నారు. వీరిలో సన్నీ కెప్టెన్సీ కోసం పోటీపడుతున్నాడు. శ్వేత, శ్రీరామ్, సన్నీ కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడగా వీరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎన్నుకోమని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో ప్రియ, లోబో, నటరాజ్ మాస్టర్, షణ్ముఖ్, సిరి సహా పలువురు సన్నీ కెప్టెన్ కాకూడదని అతడిని కత్తులతో పొడిచారు. త్వరగా ఆవేశపడతావని ప్రియాంక సింగ్ కత్తితో పొడవగా నా ఆవేశం ఇంకా చూడలేదని ఆన్సరిచ్చాడు సన్నీ. ఛాన్స్ రాగానే సన్నీని కత్తులతో కసాకసా పొడిచేద్దామనుకున్నానంది కాజల్. కానీ అప్పటికే ఎన్నో కత్తులు అతడి నడుముకు కట్టిన బెల్టుకు పొడిచి ఉండటంతో తటపటాయించింది. అయితే లోబో తనకు మద్దతివ్వకుండా ఇలా నేరుగా పొడుస్తాడని ఊహించలేదని సన్నీ మానస్ దగ్గర తన బాధను వ్యక్తం చేశాడు. కొందరు ఆడుతున్న సింపథీ గేమ్ ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. హౌస్‌లో ఇంతమంది తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి తట్టుకోలేకపోయాడు సన్నీ. దీంతో మానస్ అతడిని ఓదార్చుతూ.. టాస్కులో ఓడిపోవడం విషయం పక్కన పెడితే ఎవరేంటో తెలిసే అవకాశం వచ్చింది కదా అని ధైర్యం చెప్పాడు. -
కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు, గెలుపెవరిదో తెలుసా?
Bigg Boss Telugu 5, Episode 25: బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ వల్ల హౌస్‌మేట్స్‌కు అన్నం విలువేంటో తెలుసొచ్చింది. కడుపులో పేగులు అరుస్తున్నా గేమ్ కోసం వారి ఆకలిని చంపుకుని మరీ ఆడారు. వీరి జిహ్వచాపల్యానికి పరీక్ష పెడుతూ బిగ్‌బాస్ పదేపదే రుచికరమైన వంటకాలను పంపించాడు. మరి వాటిని ఎవరెవరు ఆరగించారు? ఎవరు గెలిచారు? అనేది తెలియాలంటే నేటి(సెప్టెంబర్ 29) ఎపిసోడ్ చదివేయాల్సిందే! ఎలాగైనా ఒక్క బజర్ అయినా కొట్టి బరువు తగ్గాల్సిందేనని సన్నీ, మానస్ తెగ ఆశపడ్డారు. కానీ అదేసమయంలో ముద్దపప్పు, ఆవకాయ గుర్తొస్తుందంటూ ఊహల్లో తేలిపోయారు. అటు లోబో పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. కానీ అతడి జంటసభ్యుడు అయిన నటరాజ్ మాస్టర్ మాత్రం ఎలాగైనా నోరు కట్టేసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతో లోబో సరేనని తలూపాడు. మరోపక్క బిగ్‌బాస్ పావ్‌బాజీ పంపించగా ఇంటిసభ్యులు దాన్ని తిరస్కరించారు. ఆకలికి, ఆహారానికి మధ్య గ్యాప్‌లో బతికేస్తున్న ఎన్నో జీవితాలకు ఏదైనా మంచి సందేశమివ్వాలని బిగ్‌బాస్ ఆదేశమివ్వడంతో హౌస్మేట్స్ చిన్న స్కిట్ వేసి అందరినీ అలరించారు. అనంతరం కెప్టెన్ జెస్సీ తన ఆదేశాలను బేఖాతరు చేశాడని బిగ్‌బాస్ ఆగ్రహించాడు. ఇంట్లోని ఆహార పదార్థాలను ఇచ్చేయమని చెప్పినప్పుడు లోబో, సన్నీ తింటున్నా ఏమనకుండా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతడికి పెద్ద శిక్ష విధించాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో నుంచి జెస్సీతో పాటు అతడి జోడీ కాజల్‌ను అనర్హులుగా ప్రకటించాడు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన జెస్సీ.. ఏ ఒక్కరూ తన మాట వినలేదని చిర్రెత్తిపోయాడు. తనను టార్గెట్ చేయడమైతే వచ్చని చిందులు తొక్కాడు. అయినా కెప్టెన్‌కు సహకరించకపోవడం మన తప్పేనని కొందరు ఇంటిసభ్యులు పశ్చాత్తాపపడుతుంటే నటరాజ్ మాస్టర్ మాత్రం అసలు కెప్టెన్ ఇలా ఉంటాడా? కమాండింగ్‌గా ఉండాలి అని హితబోధ చేశాడు. ఇక జెస్సీని చెడగొడుతున్నారని సన్నీ, మానస్ అభిప్రాయపడ్డారు. మరోవైపు షణ్ముఖ్.. జెస్సీని కూర్చోబెట్టుకుని ఇక్కడ అందరూ సమానమే, ఎవరినీ అన్న, తమ్ముడు అని కాకుండా పేరు పెట్టి పిలవమని సూచించాడు. తర్వాత పిడుగుల శబ్ధం వినబడగానే విశ్వ మొదటగా వెళ్లి బజర్ నొక్కాడు. దీంతో విశ్వ-రవి జోడీ.. ప్రియాంక సింగ్-ప్రియను పోటీదారులుగా ఎంచుకున్నారు. ఈ రెండు గ్రూపులకు కట్టెలు కొట్టడాన్ని టాస్క్‌గా ఇచ్చారు. ఇందులో 'విశ్వ' ప్రతాపం చూపించడంతో వీళ్ల జంట గెలిచింది. ఇక షణ్ముఖ్ మరోసారి.. టాస్కులో నీ వల్ల ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నానని రవితో చెప్పుకొచ్చాడు. అసలు నీవల్ల జెస్సీ ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడని రవి రివర్స్ కౌంటరివ్వగా వాడే నాకు చెప్తూ ఉంటాడని కవరింగ్ ఇచ్చాడు షణ్ను. నీతో మాట్లాడటమే లేదు, అయినా ఇంకా ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నా అనడమేంటో అర్థం కావడం లేదని అయోమయానికి లోనయ్యాడు. దీన్ని తెగేదాకా లాగడం అనవసరమని భావించి అక్కడితో ఆ విషయానికి ఫుల్స్టాప్ పెట్టాడు రవి. ఇంతలో బిగ్‌బాస్ బర్గర్ అండ్ ఫ్రైడ్ చికెన్ పంపించగా దాన్ని ఆరగిస్తానంటూ జెస్సీ ముందుకు వచ్చాడు. కానీ అంతలోనే పింకీ వచ్చి ఆ ప్లేటు పట్టుకెళ్లిపోయింది. లోబో ఆకలి చూపులు అర్థమైన రవి.. నటరాజ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి ఎందుకైనా మంచిది, నీ జోడీని ఓ కంట కనిపెడుతూ ఉండమని హెచ్చరించాడు. అలా హెచ్చరించాడో లేదో, అటు లోబో ఆకలిని తట్టుకోలేక చెత్త కవర్లో ఫుడ్ కోసం వెతికాడు. అతడి బాధ అర్థమైన మాస్టర్.. నీకు ఆకలైతే తినేసేయ్ అని చెప్పాడు. తర్వాతి రౌండ్లో సన్నీ బజర్ నొక్కగా, అతడు లోబో-నటరాజ్ మాస్టర్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. వీరికి బిగ్‌బాస్ మునుగుతారా? తేలుతారా? అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో కొన్ని వస్తువులు నీళ్లలో మునుగుతాయా? లేదా? అన్నది కరెక్ట్‌గా గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తెలివిగా ఆడిన మానస్-సన్నీ గెలుపొందారు. తర్వాత బిగ్‌బాస్ మటన్ బిర్యానీ పంపడంతో అందరూ ఆవురావురుమని ఆరగించారు. నటరాజ్ మాస్టర్, శ్రీరామ్, సన్నీ, హమీదా, సిరి, షణ్ముఖ్, మానస్ మాత్రం ముక్క కూడా ముట్టకుండా ఉపవాసం చేశారు. మొత్తంగా ఎక్కువ కిలోలు తగ్గిన మూడు జోడీల నుంచి ముగ్గురు.. సన్నీ, శ్రీరామ్, శ్వేత కెప్టెన్సీకోసం పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. వీరిలో శ్రీరామచంద్ర నాలుగో కెప్టెన్‌గా అవతరించాడని అంటున్నారు. మరి అందులో ఎంత నిజముందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. -
బిగ్‌బాస్ షోలో నాకు నచ్చిన వ్యక్తి అతడే!: సందీప్ కిషన్
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు బుల్లితెర నటుడు మానస్ నాగులపల్లి. హౌస్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉంటున్నాడు. ఎక్కడా ఆవేశానికి పోకుండా ప్రతి విషయాన్ని చాలా సెన్సిటివ్‌గా డీల్ చేస్తున్నాడు. ఎదుటివాళ్లు ఎంత రెచ్చగొట్టినా తన సహనాన్ని కోల్పోకపోవడం అతడిలో ఉన్న స్పెషాలిటీ. ఇప్పుడు మానస్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. అతడికి ప్రముఖ టాలీవుడ్ హీరో నుంచి మద్దతు లభించింది. సందీప్ కిషన్ మానస్‌కు సపోర్ట్ చేయమని అభ్యర్థిస్తూ ఓ వీడియో చేశాడు. నిజానికి ఈ వీడియో బిగ్‌బాస్ షో ప్రారంభానికి ముందే చేసినప్పటికీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోలో సందీప్ కిషన్ ఏమన్నాడంటే.. 'హలో అందరికీ , నేను మీ సందీప్ కిషన్‌ను. బిగ్‌బాస్ షోలో నాకు నచ్చిన, బాగా కావాల్సిన వ్యక్తి మానస్ నాగులపల్లి పాల్గొన్నాడు. ఎంతో మంచి మనసున్న అతడు మీ అందరికీ నచ్చుతాడనుకుంటున్నాను. మానస్ చాలామంది మనసులు గెలుచుకుని బయటకు వస్తాడని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్, లవ్ యూ..' అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli) -
హమీదాకు గోరుముద్దలు: భరించలేకపోయిన ప్రియాంక సింగ్
Bigg Boss Telugu 5, Episode 20: బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తెలుసుకున్నానన్నాడు షణ్ముఖ్. సిరి తనతో మాట్లాడమని ఎంత బతిమిలాడినా అతడు మాత్రం పట్టించుకోలేదు. బెడ్డు దగ్గరకొచ్చి బుజ్జగించినా అతడు చలించలేదు. తర్వాత బిగ్‌బాస్ అతికిందంటే అదృష్టమే అనే లగ్జరీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఫుడ్ ఐటమ్స్ రాసి ఉన్న బంతులు గోడకు విసరాలి. ఏవైతే గోడకు అతుకుతాయో అవి హౌస్‌మేట్స్‌కు అందుతాయని తెలిపాడు. ఈ టాస్క్‌లో విశ్వ ఫోయిలవగా సన్నీ, రవి, శ్రీరామ్ కిందామీదా పడి పూర్తి చేశారు. కాళ్లు విరగ్గొట్టేసేవాడిని.. ఆవేశంతో ఊగిపోయిన మాస్టర్ మానస్ హమీదాకు గోరు ముద్దలు తినిపిస్తూ ఇంటి ముచ్చట్లు మాట్లాడాడు. ఈ మధ్య లహరి పొసెసివ్‌గా ప్రవర్తిస్తోందన్నాడు. మొన్న అమ్ముకు రోటీ తినిపిస్తుండగా నువ్వు కూడా తినిపించమన్నావు.. సరే, ఇద్దరికీ కలిసి తినిపిద్దాం అని అక్కడకు వెళ్లి కూర్చుందాం అంటే కుదరదు అని చెప్పేసింది, ఇక్కడే ఇంకో రోటీ తినిపించమని అని మొండిగా ప్రవర్తించిందన్నాడు. మరోపక్క నటరాజ్ మాస్టర్ దేనికో బాగా ఉడుక్కున్నాడు. 'ఎలా ఆడాలన్న బేసిక్ నాలెడ్జ్ లేదు, సెన్స్ కూడా ఉండదు. ఏమైనా అంటే ప్రొఫెషనల్ డైలాగులు.. బయటైతే కాళ్లు విరగ్గొట్టేసేవాడిని..' అంటూ ఏవేవో మాట్లాడాడు. దీంతో అక్కడున్న సన్నీ, రవి, యానీ మాస్టర్, లోబో ఎవరి గురించి అంటున్నారో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానో టైం వచ్చినప్పుడు డైరెక్ట్‌గా చెప్తానన్నాడు. అయితే ఆయన అంటోంది తననే అని అటు యాంకర్ రవి, ఇటు జెస్సీ ఎవరికి వారే తెగ ఫీలయ్యారు. మాస్టర్ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడని రవి అభిప్రాయపడ్డాడు. మానస్ జైలుకు వెళ్లడం కూడా స్ట్రాటజీనే! తర్వాత ఇంటిసభ్యులందరూ టాస్క్‌లతో పాటు ఇంట్లోని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బెస్ట్, వరస్ట్ పర్ఫామ్స్ను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. కెప్టెన్ జెస్సీ.. హమీదాను; షణ్ముఖ్, హమీదా, సిరి, కాజల్, రవి, నటరాజ్ మాస్టర్, శ్రీరామచంద్ర.. మానస్‌ను; విశ్వ, లహరి.. ప్రియను; యానీ మాస్టర్.. సన్నీని; శ్వేత వర్మ.. నటరాజ్ మాస్టర్, సన్నీ.. షణ్ముఖ్లనను వరస్ట్ పర్ఫామర్లుగా సూచించారు. మానస్.. తనకు తానే నచ్చలేదంటూ తన పేరు చెప్పుకున్నాడు. అది కుదరదని కెప్టెన్ వారించడంతో మానస్.. జెస్సీ పేరును సూచించాడు. మొత్తంగా ఎక్కువ ఓట్లు వచ్చిన మానస్‌ను చెత్త ఆటగాడిగా అభివర్ణిస్తూ అతడిని జైల్లో వేశారు. అయితే జైలుకు వెళ్లడం కూడా ఒక స్ట్రాటజీ అని యానీ అభిప్రాయపడింది. ఆ కోతిముఖానికి తినిపించడం అవసరమా?: పింకీ మానస్ జైల్లో ఉన్నందుకు ప్రియాంక సింగ్ ఆ జైలు దగ్గరే తచ్చాడింది. హమీదాకు తినిపించినందుకు బాగా హర్టయిన పింకీ.. నువ్వు జైల్లో ఉన్నావు కదా! మరి హమీదాకు ఎవరు తినిపిస్తారు? అని అడిగింది. అంతలోనే అందుకుంటూ ఆమెకు రెండు చేతులు బాగానే ఉన్నాయి కదా, అయినా మూడు పూటలా తినిపిస్తున్నాడు అని అక్కసు వెళ్లగక్కింది. తర్వాత మాత్రం తన జెలసీని పట్టించుకోవద్దని, అలా అని పూర్తిగా పట్టించుకోకుండా ఉండొద్దని సూచించింది. హమీదాకు తినిపిస్తుంటే ఆ కోతిముఖం దానికి అవసరమా? అన్నానని చెప్పింది. దీంతో మానస్.. ఆమె తనకు ఫ్రెండ్ అని, సిస్టర్ అనమంటే కూడా అంటానని అనడంతో సంతోషపడ్డ పింకీ.. వద్దులే, ఫ్రెండ్‌లానే ఉండమని చెప్పింది. అవసరమైతే శ్రీరామ్‌కు అయినా రాఖీ కడతా కానీ నీకు మాత్రం కట్టనని మానస్‌కు తెగేసి చెప్పింది. తప్పు హౌస్మేట్స్ది, శిక్ష కెప్టెన్‌కు! తర్వాత లోబో పట్టపగలే నిద్ర పోవడంతో కుక్కలు మొరిగాయి. దీంతో కెప్టెన్ జెస్సీ ఇంట్లోకి పరుగు తీసి లోబోను నిలదీయగా కానీ తాను నిద్రపోలేదని బుకాయించాడు. కెప్టెన్‌గా తన మాట ఎవరూ పట్టించుకోవట్లేదని ఫీలైన జెస్సీ.. ఇంట్లో చాలామంది తప్పులు చేస్తున్నారని, వారికి బదులుగా తాను శిక్ష తీసుకుంటానంటూ గుంజీలు తీశాడు. అనంతరం బిగ్‌బాస్ ఇంట్లో సడన్‌గా పసిపాప ఏడుపులు, నవ్వులు వినిపించడంతో అందరూ షాకయ్యారు. ఎవరైనా వస్తున్నారా అని ఆతృతగా గేటు వంక చూశారు. కానీ బిగ్‌బాస్ మాత్రం ఓ బేబీ బొమ్మను పంపించాడు. పసిపాప నవ్వులు వినగానే చాలామంది వారి కన్నబిడ్డలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. భార్యను చూసి బోరుమని ఏడ్చిన నటరాజ్ ఇంతలో నటరాజ్ భార్య నీతూ సీమంతం వేడుకల వీడియోను చూపించాడు బిగ్‌బాస్. తన భార్యను చూడగానే నటరాజ్ మాస్టర్ కళ్ల వెంట నీళ్లు ధారలు కట్టాయి. 'నువ్వు రాత్రి మాట్లాడేటప్పుడు బేబీ కదిలేది కదా, ఇప్పుడు బిగ్‌బాస్‌లో నీ వాయిస్ విని నాతో డిష్యుం డిష్యుం చేస్తుంది. బేబీ బాగా కదులుతుంది. నా గురించి టెన్షన్ పడకు. సాధించే రావాలి. జాగ్రత్త' అని భార్య చెప్పిన మాటలు విని ఆయన భోరుమని ఏడ్చేశాడు. సిరి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నా షణ్నూ మాత్రం ఆమెను దూరం పెడుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని కాజల్‌తో చెప్పుకుంటూ బాధపడింది సిరి. షణ్ముఖ్ తనతో ఫేక్‌గా ఉంటున్నాడని, మనస్ఫూర్తిగా లేడని వాపోయింది. జెస్సీతో డిస్కనెక్ట్ అయ్యానని తెలిపింది. మన మధ్య రిలేషన్ ఏంటి?: శ్రీరామ్ ఇక హమీదా, శ్రీరామ్ రాత్రిపూట కబుర్లాడారు. హమీదా ఏదో చెప్పడానికి ప్రయత్నించగా.. నీ మైండ్‌లో ఏముందో చెప్పేసెయ్ అన్నాడు శ్రీరామ్. నేను సన్నీని, మానస్‌ను, నిన్ను ఒకేలా చూడట్లేదని నొక్కి చెప్పింది. కొన్నిసార్లు నాకు అర్థం అవుతావు, కొన్నిసార్లు అర్థం కావని శ్రీరామ్‌ను చూసి బుంగమూతి పెట్టుకుంది. దీంతో శ్రీరామ్.. హమీదాకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నీకు, మానస్‌కు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, కానీ మనిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ కూడా కావచ్చు అని చెప్పాడు. మనిద్దరి రిలేషన్ క్వశ్చన్మార్క్లో ఉందని శ్రీరామ్ చెప్పడంతో ఫక్కున నవ్వేసింది హమీదా. మరి వీళ్ల మధ్య ఏ రిలేషన్ ఉందనేది ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి! -
ఎనిమిదిన్నరేళ్ల రిలేషన్షిప్.. కానీ నన్ను నమ్మలేదు!: మానస్
Bigg Boss 5 Telugu, Maanas First Love Story: బయటకు ఎంతో కూల్‌గా కనిపించే మానస్ ఒకప్పుడు ఇలా అస్సలు లేడట. అల్లరి చేస్తూ చిన్నపాటి రౌడీలా ఉండేవాడట! మరి మానస్ ఈ రేంజ్లో మారిపోవడానికి కారణం తన ఫస్ట్ లవ్ అంటున్నాడు. తను తొలిసారిగా మనసు పారేసుకున్న అమ్మాయి గురించి చెప్తూ.. 'మాది ఎనిమిదన్నరేళ్ల రిలేషన్షిప్. ఇద్దరం ఒకే స్కూల్. ఇప్పుడున్న మానస్ ఒకప్పుడు ఇలా లేడు. అందరినీ ఏడిపిస్తూ చిన్నపాటి రౌడీలా ఉండేవాడు. అక్టోబర్ 30న ఆమె బర్త్‌డే. తను రెడ్ చుడీదార్ వేసుకుని వచ్చింది. చాలా చాలా అందంగా ఉంది. ఆరోజు నేను తలకు నూనె పెట్టుకుని గ్రీన్ టీషర్ట్ వేసుకుని వెళ్లాను. ఆ అవతారంలో ఆమె ముందుకు వెళ్లాలంటే ఏదోలా అనిపించింది. తనకు నచ్చుతానా? లేదా? అని భయపడిపోయా! అయితే ఆమెకు టీషర్ట్స్ అంటే ఇష్టమని ఆరోజే తెలిసింది. నేను ఆ రోజు టీషర్ట్ వేసుకోవడం తనకు నచ్చింది. అలా మేము మాట్లాడుకున్నాం. ఒకానొకరోజు ప్రపోజ్ చేశా.. ఆమె మెలికలు తిరిగిపోతూ డ్యాన్స్ చేసింది. తనకు డ్యాన్స్ అంటే ఇష్టం. అలా నాకూ డ్యాన్స్ అంటే ఇష్టం ఏర్పడింది. కానీ తను ఆదిత్య అనే అబ్బాయితో డ్యాన్స్ చేసేది. నాకు నచ్చేది కాదు, కానీ చెప్పలేకపోయాను. అది మా ఇద్దరి మధ్య కొంచెం దూరాన్ని పెంచింది. ఆదిత్యకు ఆల్రెడీ గర్ల్‌ఫ్రెండ్ ఉందని ఆమె చెప్పేది. కానీ అతడు నీవైపు చూసే చూపు సరిగా లేదని చెప్పాను. ఆమె నమ్మలేదు. ఆ తర్వాత నన్ను ప్రేమించడం కూడా మానేసింది. ఆమె నా ఫస్ట్ లవ్, లవ్ యూ బాబీ. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి' అంటూ ఎమోషనల్ అయ్యాడు మానస్. -
బిగ్‌బాస్: వరస్ట్ పర్ఫామర్ ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ హౌస్‌లో ఏకాభిప్రాయం అన్నది అంత ఈజీ కాదు. అందులోనూ బెస్ట్, వరస్ట్ పర్ఫామర్స్ను ఎంచుకోమన్నప్పుడు కంటెస్టెంట్లు ఎవరికి వారు తామే బెస్ట్ ఇచ్చామని చెప్తుంటారు. ఒకవేళ ఎవరైనా తమకంటే ఎక్కువగా కష్టపడినట్లు అనిపించినప్పుడు మాత్రమే ఇతరుల పేర్లను చెప్తుంటారు. ఇక వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమన్నప్పుడు కూడా కొందరు వ్యక్తిగత విబేధాలను మనసులో పెట్టుకుని, మరికొందరు ఆటను దృష్టిలో ఉంచుకుని ఆయా పేర్లను సూచిస్తుంటారు. తాజాగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎంచుకోమని ఆదేశించాడు. దీంతో మానస్.. తననే వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. అలా కుదరదని కెప్టెన్ జెస్సీ చెప్పడంతో మానస్ కెప్టెన్‌నే నామినేట్ చేశాడు. మరోపక్క నటరాజ్ మాస్టర్ ఎవరి మీదో బాగా ఫైర్ అవుతున్నాడు. ఎలా ఆడాలో కూడా తెలీదంటూ చిరాకు పడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈవారం చెత్త ఆటగాడిగా ఇంటిసభ్యులు మానస్‌ను ఎన్నుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త లీకైంది. దీని ప్రకారం జెస్సీ, సన్నీల తర్వాత మానస్ జైలులో బందీ అవనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్: మూడో వారం నామినేషన్స్‌లో ఐదుగురు!
Bigg Boss Telugu 5, 3rd Week Nominations: బిగ్‌బాస్ హౌస్‌లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా, నవ్వించినా, నవ్వులపాలైనా, ఏడ్చినా, ఒకరిని ఏడిపించినా, సేఫ్ గేమ్ ఆడినా, ఆడకపోయినా, ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా.. బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టాక ఎప్పుడో ఒకసారైనా ఈ గండం బారిన పడక తప్పదు. ఈ నామినేషన్స్ కంటెస్టెంట్ల బలాబలాలను నిరూపించడమే కాకుండా ప్రేక్షకులు ఎవరి వైపు నిలబడుతున్నారన్న విషయాన్ని కూడా సుస్పష్టం చేస్తాయి. 19 మంది సెలబ్రిటీలతో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ రెండు వారాలు పూర్తి చేసుకుంది. సరయు, ఉమాదేవి హౌస్‌ను వీడివెళ్లడంతో ఇంటిసభ్యుల సంఖ్య 17కు చేరింది. వీరిలో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు హౌస్‌లో నామినేషన్స్ జరిగాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక సింగ్, లహరి నామినేషన్స్‌లో ఉన్నారట! వీరిలో మానస్ మొదటి వారం, ప్రియ, ప్రియాంక సింగ్ రెండో వారం నామినేషన్లను ఎదుర్కొన్నారు. శ్రీరామచంద్ర, లహరి మాత్రం తొలిసారి నామినేషన్ జోన్లో అడుగు పెట్టారు. మరి వీరిలో ఎవరు బాగా ఆడి ఈ గండం నుంచి గట్టెక్కుతారు? ఎవరు హౌస్‌కు వీడ్కోలు పలుకుతారు? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.