
బాల నటుడిగా కెరీర్ ఆరంభించాడు మానస్. సోడా గోలి సోడా, ప్రేమికుడు, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజ్ కాయ్ వంటి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియళ్లతో పాటు పలు షోలు, షార్ట్ ఫిలింస్‌లోనూ నటించాడు. తాజాగా అతడు బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పదహారో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టాడు. అమ్మను వదిలి ఎప్పుడూ లేనన్న అతడు ఇక్కడ ఇన్నిరోజులు ఉండటాన్ని చాలెంజ్‌గా తీసుకుంటానన్నాడు. చూడటానికి సాఫ్ట్‌గా కనిపించే మానస్‌లోని మాస్ యాంగిల్ బిగ్‌బాస్ గేమ్ ద్వారా అయినా బయటపడుతుందేమో చూడాలి!