తండ్రయిన 'బిగ్‌బాస్' మానస్‌.. ఫొటోలు వైరల్ | Bigg Boss Fame Maanas Son Naming Ceremony Photos Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Bigg Boss Maanas Son Photos: కొడుక్కి నామకరణం.. ఏం పేరు పెట్టాడంటే?

Published Mon, Nov 25 2024 1:38 PM | Last Updated on Mon, Nov 25 2024 2:16 PM

Bigg Boss Fame Maanas Son Name Ceremony

బిగ్‌బాస్ ఫేమా మానస్ తండ్రయ్యాడు. కొన్నిరోజుల క్రితమే ఇతడి భార్య శ్రీజ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా పిల్లాడికి నామకరణోత్సవం జరిగింది. ధ్రువ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా మానస్ ఇన్ స్టాలో పోస్ట్ చేసి బయటపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

మానస్ విషయానికొస్తే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలైంది. 2011లో 'ఝలక్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు, గోలీ సోడా తదితర సినిమాలు చేశాడు. కానీ పెద్దగా పేరు రాలేదు. అలా కొన్నాళ్లకు తెలుగులో బిగ్‌బాస్ 5వ సీజన్‌లో పాల్గొన్నాడు. ఫైనల్ వరకు వచ్చాడు గానీ విన్నర్ కాలేకపోయాడు. కానీ మంచి ఫేమ్ సంపాదించాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 8: 13వ వారం నామినేషన్స్.. ఆ ఇద్దరు తప్పితే!)

బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత 'కార్తీకదీపం' సీరియల్‌లో ఆఫర్ వచ్చింది. కాకపోతే అది పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత 'బ్రహ్మముడి' సీరియల్ చేశాడు. ఇది బుల్లితెరపై సూపర్ హిట్ అయింది. అలా సీరియల్ నటుడిగా మానస్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది నవంబర్‌లో మానస్.. శ్రీజని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయి ఏడాది గడవక ముందే అంటే ఈ ఏడాది జూలైలో గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టాడు. రీసెంట్‌గా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ పిల్లాడికి పేరు పెట్టారు. ఆ ఫొటోలు పోస్ట్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement