naming ceremony
-
యాదమ్మరాజు కూతురి ఊయల ఫంక్షన్.. స్టెల్లా భావోద్వేగం (ఫోటోలు)
-
ముద్దుల కూతురు నామకరణం వేడుక.. ఫోటోలు షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ (ఫోటోలు)
-
కుక్క పిల్లలకు బారసాల
-
బుల్లితెర నటి కూతురి నామకరణ వేడుక.. ఏ పేరు పెట్టారంటే?
-
తండ్రయిన 'బిగ్‌బాస్' మానస్.. ఫొటోలు వైరల్
బిగ్‌బాస్ ఫేమా మానస్ తండ్రయ్యాడు. కొన్నిరోజుల క్రితమే ఇతడి భార్య శ్రీజ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా పిల్లాడికి నామకరణోత్సవం జరిగింది. ధ్రువ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా మానస్ ఇన్ స్టాలో పోస్ట్ చేసి బయటపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.మానస్ విషయానికొస్తే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలైంది. 2011లో 'ఝలక్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు, గోలీ సోడా తదితర సినిమాలు చేశాడు. కానీ పెద్దగా పేరు రాలేదు. అలా కొన్నాళ్లకు తెలుగులో బిగ్‌బాస్ 5వ సీజన్లో పాల్గొన్నాడు. ఫైనల్ వరకు వచ్చాడు గానీ విన్నర్ కాలేకపోయాడు. కానీ మంచి ఫేమ్ సంపాదించాడు.(ఇదీ చదవండి: Bigg Boss 8: 13వ వారం నామినేషన్స్.. ఆ ఇద్దరు తప్పితే!)బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత 'కార్తీకదీపం' సీరియల్లో ఆఫర్ వచ్చింది. కాకపోతే అది పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత 'బ్రహ్మముడి' సీరియల్ చేశాడు. ఇది బుల్లితెరపై సూపర్ హిట్ అయింది. అలా సీరియల్ నటుడిగా మానస్ మంచి పేరు తెచ్చుకున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది నవంబర్‌లో మానస్.. శ్రీజని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయి ఏడాది గడవక ముందే అంటే ఈ ఏడాది జూలైలో గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ పిల్లాడికి పేరు పెట్టారు. ఆ ఫొటోలు పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) View this post on Instagram A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli) -
కుక్క పిల్లలకు బారసాల చేసిన కుటుంబం
-
సీరియల్ నటి మహేశ్వరి కుమారుడి నామకరణం వేడుక (ఫోటోలు)
-
ఘనంగా యాంకర్ లాస్య రెండో కుమారుడి నామకరణం (ఫొటోలు)
-
ఘనంగా బిగ్‌బాస్ ఫేమ్ బాలాదిత్య కూతురి నామకరణం.. ఫోటోలు వైరల్
-
అక్కడ పిల్లలకు ‘బాంబ్’, ‘గన్’ అనే పేర్లే పెట్టాలంటా.. లేదంటే?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా.. ఆ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది కిమ్ జోంగ్ ఉన్ పాలన. ఆ దేశం ఇతర దేశాలతో పోలిస్తే చాలా భిన్నం. నిరంకుశ పాలనలో ప్రపంచంతో సంబంధం లేకుండా భిన్నమైన నిబంధనలు పాటిస్తారు. వారికి సొంత క్యాలెండర్ ఉంటుంది. దేశం విడిచి వెళ్లేందుకు అనుమతులు కావాలి. విదేశీ సంగీతం అక్కడ నిషేధం. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కనీసం తల వెంట్రుకలు ఎలా కట్ చేసుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వమే చెబుతుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో కొత్త, విచిత్రమైన నిబంధనను తీసుకొచ్చింది కిమ్ సర్కార్. ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘బాంబ్’, ‘గన్’, ‘శాటిలైట్’ వంటి పేర్లను పెట్టాలని కొద్ది రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దేశభక్తి భావాన్ని పిల్లల్లో పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఉత్తర కొరియా ప్రభుత్వం పౌరుల పేర్లను నిర్ణయించటంపై వ్యతిరేకత వస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ కొరియా మాదిరిగానే.. ఇక్కడా పేర్ల చివర్లలో అచ్చులు ఉండేలా చూడాలని గతంలో సూచించగా.. తాజా నిర్ణయంతో మారిపోయాయి. భారీగా జరిమానా.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించే కుటుంబాలకు భారీగా జరిమానా విధించాలని కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు పలు నివేదికలు తెలిపాయి. చెప్పిన విధంగా పేర్లు లేకపోవటం సోషలిస్ట్ విధానానికి వ్యతిరేకమని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు.. కొత్త పేర్లు దక్షిణా కొరియాలో ఉండే పేర్లకు భిన్నంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఆగ్రహం.. తమ పిల్లల పేర్లను బాంబ్, గన్, శాటిలైట్ వంటి వాటితో పెట్టాలని సూచించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆదేశాలను పాటించేందుకు చాలా మంది వ్యతిరేకత చూపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తమ పేర్లను మార్చుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఉత్తర కొరియాకు చెందిన ఓ వ్యక్తి రేడియో ఫ్రీ ఆసియా(ఆర్ఎఫ్ఏ)తో తెలిపాడు. గత ఏడాది నవంబర్ నుంచే పేర్ల మార్పునకు సంబంధించిన నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్ -
బిడ్డకు పేరుపెట్టే సంబురం.. కమ్మేసిన విషాదం
యశవంతపుర: కుమారుడి నామకరణం కోసం ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుండగా మరో వైపు ఆ ఇంటిని విషాదం కమ్మేసింది. వేడుకకు అవసరమయ్యే సరుకుల కోసం వెళ్లిన చిన్నారి తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కర్ణాటక కలబురిగి జిల్లా జీవర్గి పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. హరనూరు గ్రామానిచి చెందిన బసలింగప్ప(28) ఈ మధ్యే బిడ్డ పుట్టాడు. కుమారుడికి బుధవారం నామకరణం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అవసరమైన సరుకుల కోసం బసలింగప్ప, బంధువు మహంతయ్య(60)లు బైకుపై జీవర్గికి వెళ్తుండగా వెనుకనుంచి బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ బస్సును వదిలేసి పరారయ్యాడు. పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఇదీ చదవండి: వీడసలు భర్తేనా?.. తండ్రిగా కూడా ఘోరం అసలు -
హరితేజ ఇంట్లో బారసాల ఫంక్షన్, పాప పేరేంటో తెలుసా?
బుల్లితెరపై యాంకర్‌గానూ వెండితెరపై నటిగానూ సత్తా చాటింది హరితేజ. తనకున్న క్రేజ్‌తో బిగ్‌బాస్ మొదటి సీజన్లోనూ అడుగు పెట్టిన ఆమె తన అల్లరితో, ఆటతో మరెంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఎక్కువగా వెండితెరపైనే ఫోకస్ పెట్టిన ఈ నటి ఇటీవలే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె తన ఇంట్లో కూతురి బారసాల ఫంక్షన్ జరిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురి ఫొటోను షేర్ చేసింది కానీ అందులో పాప ముఖం మాత్రం క్లారిటీగా చూపించలేదు. అయితే కూతురికి భూమి దీపక్‌రావు అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. "మా అమ్మానాన్న నాకు భూమి దీపక్ రావు అని పేరు పెట్టారు. భూమి అంటే చాలా సహనంతో ఉంటుందనుకుంటున్నారేమో.. కానీ వాళ్లకేం తెలుసు.. సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే అని.. మీరందరూ నన్ను భూమి అని పిలవచ్చు" అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. మొత్తానికి భూమిని ఎత్తుకున్న హరితేజ దంపతుల ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా డెలివరీ టైంలో హరితేజ ఎన్నో ఇబ్బందులు పడింది. తొమ్మిది నెలలు నిండిన సమయంలో ఆమెతో సహా ఇంట్లో అందరికీ(హరితేజ భర్తకు తప్ప) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తను టెన్షన్ పడితే కడుపులో ఉన్న బిడ్డకు మంచిది కాదని ఎక్కడలేని ధైర్యాన్ని కూడదీసుకుంది. బాధను దిగమింగుతూ బేబీ కోసం బలవంతంగా ముద్దలు తినేది. View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) డెలివరీ అయిన తర్వాత పాపకు నెగెటివ్ వచ్చిందన్న సంతోషం ఒకవైపు, పాపను కనీసం తాకనివ్వలేదు సరికదా, నేరుగా చూడనివ్వలేదన్న బాధ మరోవైపు ఆమెను స్థిమితంగా ఉండనివ్వలేదు. చివరకు పాప పుట్టిన 11 రోజులకు నెగెటివ్ రావడంతో పాపను చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది హరితేజ. -
పుష్పశ్రీవాణి కుమార్తె నామకరణ కార్యక్రమం
-
పిల్లల నామధ్యేయం.. కొత్తధనం
ఓ 30 లేదా 40 ఏళ్లు వెనక్కి వెళ్లండి. మన ముందు తరాల వారి పేర్లన్నీ గ్రామదేవతలు, కులదైవాలు కలిసొచ్చేలా ఉండేవి. ఇప్పుడలా కాదు.. నవతరం తల్లిదండ్రులు తమ పిల్లలకు పేర్లు పెట్టడానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. అందుకే పుస్తకాలు, ఇంటర్నెట్లో అన్ని రకాలుగా వడపోత పట్టి మరీ పేర్లు వెతుకుతున్నారు. పేరు పలకడానికి సులువుగా, వినసొంపుగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అందుకే నామకరణం చేసేటప్పుడు అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. నక్షత్రం, ఇష్టదైవం, అభిరుచి, తదితర అంశాల ఆధారంగా ఉత్తమ పేరు ఎంచుకుంటున్నారు. తక్కువ అక్షరాలు, అర్థవంతమైన వాటితో నామకరణం చేస్తున్నారు. ‘మీ అబ్బాయా..’ ‘మీ అమ్మాయా..’ ‘ఏం పేరు..?’ ‘మీ పిల్లల్లాగే పేర్లూ ముద్దు ముద్దుగా ఉన్నాయి..’ అని ఎవరైనా అంటే ఆ క్షణం తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు. సాక్షి, వెలిగండ్ల: సాధారణంగా పుట్టిన పాప.. బాబుకు పేరు పెట్టడానికి 21 రోజులకు నామకరణ మహోత్సవం నిర్వహిస్తారు. వీలుకానివారు 3వ నెలలో ఆ కార్యక్రమం చేస్తారు. జన్మ నక్షత్రం, ఇష్టదైవం, పూరీ్వకులు, ప్రదేశాల ప్రాధాన్యత ఆధారంగా తమ అభిరుచికి అనుగుణంగా తల్లిదండ్రులు పేరు ఎంపిక చేస్తున్నారు. నామకరణ మహోత్సవం రోజున పాప చెవి వద్ద ఆ పేరుతో పిలవడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వీకులు, దేవుళ్లు, సినీ నటులు గతంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. తల్లిదండ్రులు, తాత, ముత్తాతలు అంటే అపారమైన భక్తి, గౌరవం, ప్రేమ. వారి మరణానంతరం కుటుంబంలోని వారికి సంతానం కలిగితే తమ పూర్వీకులే మళ్లీ పుట్టారని భావించి వారి పేరే పెట్టేవారు. మరికొందరు తమ ఇష్టదైవం పేరు పెట్టడానికి ఆసక్తిచూపేవారు. సంతానం కలిగితే ‘స్వామి.. మీ పేరు పెట్టుకుంటాం..’ అని తల్లిదండ్రులు ముందే మొక్కుకుని పిల్లలు కలిగాక దేవుని పేరు పెట్టేవారు. దేశభక్తి మెండుగా ఉన్నవారు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతల పేర్లను తమ పిల్లలు, మనుమలు, మనుమరాళ్లకు పెట్టడం గర్వంగా భావించేవారు. ఇంకొందరు తమ అభిమాన సినీ నటులు పేర్లు పిల్లలకు పెట్టి మురిసిపోతుంటారు. అంతటివారు కావాలని కోరుకునేవారు. ఈ పేర్లన్నీ దాదాపు పొడవుగా(అక్షరాలు ఎక్కువగా) ఉండేవి. మారుతున్న దృక్పథం క్రమేణా పాత సంప్రదాయం కనుమరుగైంది. కట్టూబొట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలకు పెట్టే పేరులోనూ ఆధునికత కనిపించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు లేదా మూడు అక్షరాలు కలిగిన పేర్లు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముద్దు పేర్లు పేరుతో కాకుండా పిల్లలను ముద్దుపేరుతో పిలవడం ఇటీవల కాలంలో సాధారణమైంది. ఇదీ ప్రతి ఇంటిలోనూ కనిపిస్తోంది. మిన్ని, బన్ని, డాలి, హనీ, బబ్లూ, పింకూ, చింటు, టింకు, చిన్న, పింకి, యాపిల్, చెర్రీ, సన్నీ, అమ్ములు, ఫ్రూటీ తదితర పేర్లు మనకు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. -
యశ్ కొడుకు పేరేంటో తెలుసా?
-
యశ్ కొడుకు పేరేంటో తెలుసా?
కన్నడ స్టార్ యశ్ ఇంట ఆయన కుమారుడి నామకరణ మహోత్సవం జరిగింది. యశ్, రాధికల రెండో సంతానానికి ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసి వచ్చేలా "యధర్వ్" అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను రాఖీ భాయ్ అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో పచ్చని తోట మధ్యలో పూల పందిరి వేశారు. ఆ పందిట్లోకి రాధిక కొడుకును, యశ్ కూతురు ఐరాను ఎత్తుకుని వచ్చారు. యశ్‌తోపాటు, యధర్వ్ ఇద్దరూ పంచె కట్టుకుని పూజలో పాల్గొన్నారు. (చదవండి: బిగ్‌బాస్‌కు హ్యాండ్ ఇచ్చిన రఘు మాస్టర్!) ఈ కార్యక్రమానికి తక్కువ మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. కాగా యధర్వ్ ఆడుకుంటున్న ఫొటోలను కూడా హీరో తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదిలా వుండగా యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను థియేటర్లలో దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయనున్నారు. (చదవండి: ప్రకాశ్ రాజ్ ఆ పాత్ర చేయడం లేదు!) -
నిత్య నూతనం
చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. ఆయన చిన్నల్లుడు కల్యాణ్ దేవ్, శ్రీజ దంపతుల ముద్దుల తనయకు నవిష్క అని నామకరణం చేశారు. శుక్రవారం ఈ నామకరణ వేడుక జరిగింది. ‘మా చిన్నారికి నవిష్క అని పేరు పెట్టాం’ అంటూ కల్యాణ్‌దేవ్ సోషల్ మీడియాలోన ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘నవిష్క’ అంటే నిత్య నూతనం అని అర్థం అట. -
పెద్దోడు అభయ్ రామ్.. చిన్నోడు భార్గవ రామ్
చిన్ని ఎన్టీఆర్, బుల్లి ఎన్టీఆర్ ఇలా ఫ్యాన్స్ ఎన్నో ముద్దు పేర్లు పెట్టారు హీరో ఎన్టీఆర్ చిన్న తనయుడికి. చిన్న కుమారుడికి ‘భార్గవ రామ్’ అని నామకరణం చేసినట్లు ఎన్టీఆర్ బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ది లిటిల్ వన్ ఈజ్ భార్గవ రామ్. నామకరణ ఉత్సవం. ఫ్యామిలీ టైమ్’ అంటూ ఇక్కడ మీరు చూస్తోన్న ఫొటోను షేర్ చేశారు ఎన్టీఆర్. 2011లో లక్ష్మీ ప్రణతిని పెళ్లాడారు ఎన్టీఆర్. మూడు సంవత్సరాల తర్వాత.. అంటే 2014లో ఈ దంపతులకు కలిగిన తొలి సంతానానికి అభయ్ రామ్ అని పేరు పెట్టారు. గత నెలలో లక్ష్మీ ప్రణతి మరో బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బాబుకి భార్గవ రామ్ అనే పేరు పెట్టడం జరిగింది. -
కుక్క పిల్లలకు ఘనంగా బారసాల
కరీంనగర్ : సంతాన భాగ్యం లేని దంపతుల జంట తన పెంపుడు కుక్కకు పుట్టిన పిల్లలకు ఘనంగా బారసాల నిర్వహించారు. వివరాల్లోకి వెళితే కరీం నగర్ జిల్లా వావిలాలపల్లికి చెందిన రవి తన ఇంట్లోని కుక్కంటే ఎనలేని అభిమానం, ప్రేమ. తమకు సంతానం లేని లోటును ఆ కుక్క ద్వారా తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుక్క ఇటీవలే నాలుగు కూనలకు జన్మనిచ్చింది. దాంతో ఆ ఇంట్లో ఆనందరం వెల్లివిరిసింది. ఇంకేం.... అనుకున్నదే తడవుగా.. కుక్కపిల్లలకు కొత్త బట్టలు కుట్టించటం, బంధు మిత్రులను ఆహ్వానించి వారి సమక్షంలో వైభవంగా బారసాల నిర్వహించారు. అంతేకాకుండా ఆ బుజ్జి కూనలకు నామకరణం కూడా చేశారు. వచ్చిన బంధుమిత్రులు కుక్క పిల్లలకు అక్షింతలు వేసి ఆశీర్వదించి విందు భోజనం ఆరగించి వెళ్లారు. -
కుక్క పిల్లలకు బారసాల
-
జూ.ఎన్టీఆర్ కొడుకు నామకరణ మహోత్సవం
హైదరాబాద్: నందమూరి వంశంలో మరో వారసుడికి ఈరోజే పేరుపెట్టారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ కొడుకు నామకరణ మహోత్సవం ఈరోజు జరిగింది. అభయ్ రామ్ అని పేరుపెట్టారు. ఈ రోజు తన కుమారుడికి నామకరణ మహోత్సవం జరిగినట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తనకు చాలా ఆనందంగా ఉందని కూడా తారక్ తెలిపారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి జూలై 22న అభయ్‌రామ్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కుమారుడికి అభయ్ రామ్ అని పేరుపెట్టిన విషయం తెలిసి అభిమానులు అభినందనలు తెలిపారు. పేరు బాగుందని ట్విట్ చేశారు. కొంతమంది బెస్ట్ ఆఫ్ లక్ అని పేర్కొన్నారు. మరి కొంతమంది అభయ్‌రామ్‌ను దీవించారు.