
జూ.ఎన్టీఆర్ కొడుకు నామకరణ మహోత్సవం
హైదరాబాద్: నందమూరి వంశంలో మరో వారసుడికి ఈరోజే పేరుపెట్టారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ కొడుకు నామకరణ మహోత్సవం ఈరోజు జరిగింది. అభయ్ రామ్ అని పేరుపెట్టారు. ఈ రోజు తన కుమారుడికి నామకరణ మహోత్సవం జరిగినట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తనకు చాలా ఆనందంగా ఉందని కూడా తారక్ తెలిపారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి జూలై 22న అభయ్రామ్కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ కుమారుడికి అభయ్ రామ్ అని పేరుపెట్టిన విషయం తెలిసి అభిమానులు అభినందనలు తెలిపారు. పేరు బాగుందని ట్విట్ చేశారు. కొంతమంది బెస్ట్ ఆఫ్ లక్ అని పేర్కొన్నారు. మరి కొంతమంది అభయ్రామ్ను దీవించారు.