స్పెషల్ విషెస్
బర్త్‌డేకు ఫస్ట్ విష్ మనకు చాలా ప్రియమైన వారి దగ్గరి నుంచో, మనకు చాలా దగ్గరైన వారి నుంచో వినాలని కోరుకుంటాం. ఆ విషెస్‌ను చాలా ప్రీషియస్గా కూడా ఫీల్ అవుతాం. హీరో ఎన్టీఆర్ కూడా ఈ ‘ప్రీషియస్ విషెస్‌ను’ లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నారు. తన బర్త్ డేకు ఫస్ట్ విషెస్ తనయుడు అభయ్‌రామ్ దగ్గరి నుంచి వినడానికి ఎక్కువగా ఇష్టపడతారట. ఈ విషయాన్ని లాస్ట్ ఇయర్ ట్వీటర్లో షేర్ చేశారు ఎన్టీఆర్. మే 20 (ఆదివారం) ఎన్టీఆర్ బర్త్ డే.
ఈ సంవత్సరం కూడా ఆయనకు ఫస్ట్ బర్త్‌డే విష్ తనయుడు అభయ్రామే తెలిపారట. కొడుకుతో దిగిన ఫొటోను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘ఫైనల్లీ అభయ్ నా కళ్లు మూయడం మానేశాడు. (లాస్ట్ ఇయర్ బర్త్ డే పార్టీ ఫొటో షేర్ చేస్తూ.. ఎందుకో తెలీదు. అభయ్ నా కళ్లు క్లోజ్ చేయడానికి ఇష్టపడుతుంటాడు’ అన్నారు). అభయ్‌రామ్ అప్పుడే పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడూ నా ఫస్ట్ అండ్ ప్రీషియస్ విషెస్ అభయే చెప్పాడు’’ అని పేర్కొన్నారు.