
భార్యాబిడ్డలతో ఎన్టీఆర్
చిన్ని ఎన్టీఆర్, బుల్లి ఎన్టీఆర్ ఇలా ఫ్యాన్స్ ఎన్నో ముద్దు పేర్లు పెట్టారు హీరో ఎన్టీఆర్ చిన్న తనయుడికి. చిన్న కుమారుడికి ‘భార్గవ రామ్’ అని నామకరణం చేసినట్లు ఎన్టీఆర్ బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ది లిటిల్ వన్ ఈజ్ భార్గవ రామ్. నామకరణ ఉత్సవం. ఫ్యామిలీ టైమ్’ అంటూ ఇక్కడ మీరు చూస్తోన్న ఫొటోను షేర్ చేశారు ఎన్టీఆర్. 2011లో లక్ష్మీ ప్రణతిని పెళ్లాడారు ఎన్టీఆర్. మూడు సంవత్సరాల తర్వాత.. అంటే 2014లో ఈ దంపతులకు కలిగిన తొలి సంతానానికి అభయ్ రామ్ అని పేరు పెట్టారు. గత నెలలో లక్ష్మీ ప్రణతి మరో బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బాబుకి భార్గవ రామ్ అనే పేరు పెట్టడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment