Bhargava Ram
-
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: 75 పేజీల చార్జిషీట్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో 75 పేజీల చార్జీషీట్‌ను సిద్ధం చేసినట్లు పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 5న భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి అనుచరులతో కలిసి ఐటీ అధికారులమని చెప్పి ప్రవీణ్‌రావు ఇంట్లో ప్రవేశించారు. ఆ తర్వాత ప్రవీణ్‌రావు సోదరులను సినిఫక్కీలో కిడ్నాప్ చేసిన సంఘటన తెలిసిందే. కాగా, సంచలనంగా మారిన ఈ కేసులో.. అఖిల ప్రియ దంపతులతోపాటు, మరో 30 మందిపై బోయిన్పల్లి పోలీసులు కేసులను నమోదు చేశారు. ఈ క్రమంలో .. కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాప్ సమయంలో ఒక్కొక్కరి పాత్రను వివరించారు. చదవండి: Bhuma Akhila Priya: బోయిన్పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు -
తప్పించుకునేందుకు తప్పుడు సర్టిఫికెట్
సాక్షి, కంటోన్మెంట్: బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్, అతని సోదరుల కిడ్నాప్ కేసులో కీలక నిందితులైన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్‌రామ్‌లపై మరో కేసు నమోదైంది. కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా కోర్టు హాజరును తప్పించుకునే క్రమంలో తప్పుడు కోవిడ్ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను సమర్పించి పోలీసులకు దొరికి పోయారు. దీంతో వీరిరువురితో పాటు మరో ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. బోయిన్పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసుకు సంబంధించి ఈ నెల 3న టెస్టు ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ) నిర్వహించారు. అయితే తనకు కోవిడ్ సోకిందని భార్గవరామ్ పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు. లాయర్ ద్వారా సికింద్రాబాద్‌లోని 10వ ఏసీఎంఎం కోర్టుకు నివేదించారు. పోలీసులు ఆరా తీయగా నిందితుడు తప్పుడు కోవిడ్ ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచినట్లు తేలింది. దీంతో భార్గవ రామ్‌కు సహకరించిన జగత్ విఖ్యాత్‌తో పాటు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే వినయ్, ల్యాబ్ టెక్నీషినయన్ శ్రీదేవి, గాయత్రిల్యాబ్‌లో పనిచేసే రత్నాకర్‌లపై కేసు నమోదు చేశారు. వినయ్, రత్నాకర్‌లను రిమాండ్‌కు తరలించారు. భార్గవరామ్, జగత్‌విఖ్యాత్ పరారీలో ఉన్నారు. కిడ్నాప్ కేసులో బెయిల్‌పై ఉన్న వీరిరువురిపై మరో కేసు నమోదు కావడం గమనార్హం. -
భార్గవ్రామ్కు కోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్రామ్కు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురయ్యింది. భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: ఈవెంట్‌లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే) అఖిలప్రియకు బెయిల్ మంజూరు అఖిలప్రియకు శుక్రవారం సెసెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న అఖిలప్రియ.. రేపు(శనివారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: డిసెంబర్లోనే స్కెచ్ వేశారు! -
బెంగళూరులో ఏ-3 భార్గవరామ్?
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఏ-3 భార్గవ్‌రామ్ కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. భార్గవ్ రామ్ బెంగళూరులో తలదాచుకున్నట్లు సమాచారం. దీంతో పోలీస్ ప్రత్యేక బృందాలు బెంగళూరు వెళ్లాయి. ఇదే కేసుకు సంబంధించి అరెస్టైన భూమా అఖిల ప్రియకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. బెయిల్ కోసం ఆమె తరుపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. మరి కొద్దిసేపట్లో సికింద్రాబాద్ కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ( ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు ) కాగా, మంగళవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లినవారు.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని పట్టుకున్నారు. -
భార్గవ రామ్ @ 1
చిన్న తనయుడు భార్గవ రామ్ పుట్టినరోజున (శుక్రవారం) హీరో ఎన్టీఆర్ రెట్టింపు ఆనందంతో సమయాన్ని గడిపారు. ఆ మధుర జ్ఞాపకాలను ఫొటోలుగా మలిచి అభిమానులతో షేర్ చేసుకున్నారు ఎన్టీఆర్. ‘‘భార్గవ రామ్ ఏడాది పూర్తి చేసుకున్నాడు’’ అన్నారు ఎన్టీఆర్. 2011లో లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2014లో ఈ దంపతులకు అభయ్ రామ్ జన్మించాడు. రెండో కొడుకు భార్గవ రామ్‌కు ఈ శుక్రవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అన్నదమ్ములిద్దర్నీ ఫొటో తీసి, దాన్ని కూడా షేర్ చేశారు ఎన్టీఆర్. ఇక సినిమాల విషయానికి వస్తే... రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ మరో హీరో. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించే పేర్లలో ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్, తమిళ దర్శకుడు అట్లీ పేర్లు వినిపిస్తున్నాయి. -
పెద్దోడు అభయ్ రామ్.. చిన్నోడు భార్గవ రామ్
చిన్ని ఎన్టీఆర్, బుల్లి ఎన్టీఆర్ ఇలా ఫ్యాన్స్ ఎన్నో ముద్దు పేర్లు పెట్టారు హీరో ఎన్టీఆర్ చిన్న తనయుడికి. చిన్న కుమారుడికి ‘భార్గవ రామ్’ అని నామకరణం చేసినట్లు ఎన్టీఆర్ బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ది లిటిల్ వన్ ఈజ్ భార్గవ రామ్. నామకరణ ఉత్సవం. ఫ్యామిలీ టైమ్’ అంటూ ఇక్కడ మీరు చూస్తోన్న ఫొటోను షేర్ చేశారు ఎన్టీఆర్. 2011లో లక్ష్మీ ప్రణతిని పెళ్లాడారు ఎన్టీఆర్. మూడు సంవత్సరాల తర్వాత.. అంటే 2014లో ఈ దంపతులకు కలిగిన తొలి సంతానానికి అభయ్ రామ్ అని పేరు పెట్టారు. గత నెలలో లక్ష్మీ ప్రణతి మరో బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బాబుకి భార్గవ రామ్ అనే పేరు పెట్టడం జరిగింది. -
ఎన్టీఆర్ చిన్న కొడుకు పేరేంటంటే..!
గత నెల 14న ఎన్టీఆర్ దంపతులకు మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముద్దులొలికే చిన్నారి ఫొటోను అభిమానుల కోసం తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ఎన్టీఆర్ తాజాగా చిన్నారి పేరును రివీల్ చేశారు. తమ రెండో కుమారుడికి భార్గవ రామ్ అని నామకరణం చేశారు ఎన్టీఆర్, ప్రణీత దంపతులు. వీరికి ఇప్పటికే అభయ్ రామ్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. The little one is, Bhargava Ram https://t.co/2mp6DTTMO0 — Jr NTR (@tarak9999) 4 July 2018