ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్ : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఏ-3 భార్గవ్‌రామ్ కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. భార్గవ్ రామ్ బెంగళూరులో తలదాచుకున్నట్లు సమాచారం. దీంతో పోలీస్ ప్రత్యేక బృందాలు బెంగళూరు వెళ్లాయి. ఇదే కేసుకు సంబంధించి అరెస్టైన భూమా అఖిల ప్రియకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. బెయిల్ కోసం ఆమె తరుపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. మరి కొద్దిసేపట్లో సికింద్రాబాద్ కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ( ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు )
కాగా, మంగళవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లినవారు.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment