bhuma akhilapriya
-
అక్రమాల ప్రియ
పేరేమో అందరికీ ‘ప్రియం’గా అనిపిస్తుంది.. వ్యవహార శైలి చూసినా, విన్నా అన్నీ అప్రియాలే... టీడీపీ హయాంలో మంత్రిగా అవకాశం లభించేసరికి దోపిడీకి లైసెన్సు పొందినట్లయింది.ఈమె గారి పతి పేరులోనే దేవుడు...∗ లీలల్లో రావణుడే... ఈ సతీపతుల విచ్చలవిడి దోపిడీకినంద్యాల సమీపంలోని ఓ నియోజకవర్గం అడ్డాగా మారింది. నీరు–చెట్టు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు, తాగునీటి పేరిట వీరి అక్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వీరి దోపిడీని లెక్కగడితే రూ.వంద కోట్లు దాటి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ దంపతుల కంటికి నదురుగా ఎవరి స్థలమైనా కనిపించినా.. లేదా.. స్థల వివాదాల్లో న్యాయం చేయాలని ఎవరైనా వీరి వద్దకు వచ్చినా.. పిట్టపోరు.. పిట్టపోరు.. పిల్లి తీర్చిందన్న చందంగా ఆ స్థలాలను కాజేసే దాకా వీరు నిద్రపోరు. ∗మాయ మాటలతో రైతులను వంచించడంలో ఈ దంపతులను మించిన వారు లేరని వీరిఅఘాయిత్యాలే చెబుతాయి..∗ఎవరైనా వీరి అన్యాయాలనుప్రశ్నించారో వారిపై విరుచుకుపడతారు. డబ్బుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడరనివీరి చరిత్ర చెబుతోంది. జైలుకెళ్లి వచ్చినా పద్ధతి మార్చుకోకపోవడం వీరికే చెల్లింది. సతి ఆదేశం.. పతి దౌర్జన్యం.. చింతకుంట గ్రామానికి చెందిన గూడా నరసింహుడు భార్య వెంకట లక్షమ్మకు ఆళ్లగడ్డ పట్టణ శివారులో 25 సెంట్ల స్థలముంది. ఆ స్థలాన్ని మహమ్మద్‌హుసేన్, నూర్ అహమ్మద్ల నుంచి 1995 మార్చి 27న కొనుగోలు చేసి రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. రూ.2 కోట్ల విలువ చేసే ఈ స్థలం ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఈ దంపతులు ఓ సర్వేయర్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ద్వారా 1952లో అల్లిసా పేరిట రిజి్రస్టేషన్ డాక్యుమెంట్‌ను బయటకు తీశారు. అవుకు మండలం సంగపట్నంలో నివసించే వారి మనవడు నూర్‌బాషాకు నచ్చజెప్పి మూడు భాగాలుగా చేసి 2022 డిసెంబర్1న అనుచరుల పేరున రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇప్పుడు ‘గూడా’ దంపతులు లబోదిబోమంటున్నారు. ఈ అరాచక దంపతుల దౌర్జన్యంలో ఇది మరో కోణం. సాక్షి, టాస్‌్కఫోర్స్: గత ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన యువ మహిళా మంత్రి అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అక్రమాలను అవలీలగా చేసేశారు. ఇప్పుడామె అధికారంలో లేకున్నా... కబ్జాలకు కొదవలేదు. ఎదిరించేవారిపై దౌర్జన్యాలకూ వెనుకాడటం లేదు. ఆమెతోపాటు ఆమె రెండో భర్త చేసిన అరాచకాలు అన్నీఇన్నీకావు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ పనిచేసినా వారికి వాటాలు ముట్టజెప్పాల్సి వచ్చేది.కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ నియామకాల్లోనూ ఈ సతీపతుల వసూళ్ల దందా సాగింది. అభివృద్ధి పనుల్లోనూ ఆ దంపతులు రూ.కోట్లలో పర్సంటేజీలు మూటగట్టుకున్నారు. చివరకు పారిశుద్ధ్య కార్మికుల నియామకంలోనూ వసూళ్లు కొనసాగించారు. వివిధ పనుల్లో టెండర్లతో పని లేకుండా రూ.200 కోట్ల వరకూ స్వాహా చేశారు. అధికారం కోల్పోయినా తమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అభివృద్ధి పేరుతో అక్రమాలు... ఆమె టీడీపీ హయాంలో నియోజకవర్గంలో వివిధ పనుల కోసం కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకుని వాటిని పక్కదారి పట్టించారు. అధికారులను బెదిరించి పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన ప్రతి పనినీ తన అనుయాయులకే టెండర్‌తో ప్రమేయం లేకుండా కట్టబెట్టించి వారి వద్ద పర్సంటేజీలు నొక్కేశారు. దౌర్జన్యాలకు నిదర్శనాలివిగో.. ∗ తాజాగా ఓ పంచాయితీ కోసం ఇంటికొచ్చిన ఓ ముస్లిం మైనార్టీ నాయకుడిని అందరూ చూస్తుండగానే మాజీ మంత్రి దంపతుల ఆదేశాల మేరకు అనుచరులు చితకబాది వారి వద్దనున్న రూ.1.30 కోట్లు దోచే యడం ఇప్పుడు సంచలనమైంది. ∗ జగత్ డెయిరీకి చెందిన అమాయక రైతుల పేర్లపై బ్యాంకు రుణాలు తీసుకుని మంత్రి తిరిగి చెల్లించకపోవడంతో ఆ రైతులు డిఫాల్టర్లుగా మారి పంట రుణాలూ పొందలేక అల్లాడిపోయారు. ∗ మంత్రిగా ఉన్నప్పుడు కమీషన్లకు ఆశపడి మున్సిపల్ శానిటరీ, స్వీపర్ పోస్టులతోపాటు టూరిజం శాఖలో విద్యుత్ సబ్స్టేషన్లలో ఉద్యోగాలను అమ్ముకున్నారు. ∗ నీరు చెట్టు పనుల్లో అడిగినంత కమీషన్ ఇవ్వలేదని భాచాపురం గ్రామ నాయకుడి చెక్‌బుక్ దొంగిలించి అతనిపై చెక్‌బౌన్స్ కేసు పెట్టి వేధించారు. ∗ మాజీ మంత్రి ప్రస్తుత భర్త ద్వారా ఖాళీ స్థలాలపై కన్నేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. భూ కబ్జాలకు పాల్పడి బాధితులను చంపుతామని బెదిరించారు. వ్యాపారవర్గాలను భయభ్రాంతులకు గురి చేశారు. ∗ అవసరమైనప్పుడు అప్పులిచ్చి ఆదుకున్న స్నేహితులు, శ్రేయోభిలాషులను మోసం చేశారు. రుణాలు ఎగ్గొట్టారు. వారిని ఇంట్లోకీ రానివ్వకుండా అవమానించారు.∗ తండ్రి ఇంటిపేరును దుర్వినియోగం చేయడంతో విసిగిపోయిన బంధువులు ఆమెకు దూరమయ్యారు. ఆమెను, ఆమె భర్తను బహిష్కరించారు. ఎన్నికల్లో పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ∗ నాలుగేళ్లుగా హైదరాబాద్‌కే పరిమితమైన మాజీ మంత్రి దంపతులు ఇప్పుడు ఎన్నికలు రావడంతో పదవి కోసం మళ్లీ నియోజకవర్గంలో తిష్టవేశారు. ∗ నంద్యాలకు ఆనుకుని ఉన్న నియోజకవర్గంలోని మూడు మండలాల గుండా ప్రవహించే వక్కిలేరులో అప్పటి టీడీపీ మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఏటా నీరు–చెట్టు పేరిట పనులు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 350 పనులుగా దీన్ని విభజించి తన బంధువులైన రామతీర్థ పుట్టాలమ్మ ఆలయ అప్పటి చైర్మన్ (ప్రస్తుత బీజేపీ నాయకుడు), అప్పటి సహకార సంఘం చైర్మన్, కోటకందుకూరు మాజీ సర్పంచికి అప్పగించారు.వారు వాగులో అరకొర పనులు చేసి ఏకంగా రూ.3 కోట్లకు పైగా నిధులు కొల్లగొట్టారు. ఇందులో నాటి మంత్రికి సగం ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వర్క్ ఆర్డర్ లేకపోయినా అధికారులను బెదిరించి బిల్లులు చేయించుకున్నట్లు సమాచారం. ∗ రుద్రవరం మండలం నాగులవరం సమీపంలోని టీజీపీ పంట కాలువలో పూడిక తీసినట్టు అధికారులు బిల్లులూ మంజూరు చేశారు. ఇదే గ్రామానికి చెందిన నాటి మంత్రి అనుచరుడు ఇలాంటి పది పనులు సుమారు రూ.కోటితో చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు పనులు నాసిరకంగా చేపట్టగా, ఆరు పనులను అసలు చేయకుండానే బిల్లులు ఆమోదింపజేసుకుని రూ.60 లక్షలు మింగేశారని సమాచారం. ఇలా పైపై పనులు చేపట్టి దాదాపు రూ.130 కోట్ల మేర నాటి మంత్రి, జన్మభూమి కమిటీలు, వారి అనుచరులు బొక్కేశారు. రైతులకు ఉచితంగా ఇచ్చే శనగ విత్తనాల నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని ఇతర రాష్ట్రాల నుంచి మినుములను రప్పించి ఇక్కడి రైతులవే అని చెప్పి కొల్లగొట్టేశారు. తాగునీటి సరఫరా పేరుతో దోపిడీ... చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్యను తమకు అనుకూలంగా మార్చుకుని అప్పటి మంత్రిగా అడ్డంగా దోచేశారు. పట్టణంలో ట్యాంకరుకు రూ.500 నుంచి రూ.750 వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. మంత్రి అనుచరులు ట్యాంకర్లను కొని మున్సిపాలిటీకి అద్దెకిచ్చారు. నీటిని వారు తరలించకుండానే కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వేషంలో వెళ్లి కిడ్నాప్.. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమి ఆక్రమించుకునేందుకు మాజీ మంత్రి, ఆమె వర్గీయులు చేసిన కిడ్నాప్ సినిమాను తలపించింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల వేషంలో వెళ్లి కిడ్నాప్ చేయడంతో అప్పట్లో సంచలనమైంది. అయితే తీరా కిడ్నాప్ చేసిన మనుషులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు కావడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కిడ్నాప్ చేసిన వ్యవహారంలో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె ఏ1 నిందితురాలు. నెలల తరబడి జైలు జీవితం గడిపారు. కిడ్నాప్ కేసులో ఓ మహిళా మాజీ మంత్రి జైలుకు వెళ్లడం అదే తొలిసారి. -
మా వల్ల కాదు బాబూ..
సాక్షి, నంద్యాల : రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోటీకి ముందే టీడీపీ చేతులెత్తేస్తోందా? భూమా అఖిల ప్రియ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అల్టీమేటం జారీ చేశారా? తనకే టికెట్ ఇస్తున్నట్లు మంగళవారం నాటి సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారా? మరోవైపు ఆమె ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయారా? పార్టీ కోసం కనీస ఖర్చులు సైతం పెట్టుకోలేని స్థితికి చేరుకున్నారా? అనుచరులందరూ చేజారి పోతున్నారా? తన విచిత్ర వైఖరితో అందరినీ దూరం చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ స్థానికులు ‘అవును’ అని సమాధానం చెబుతున్నారు. మంగళవారం (నేడు) పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘రా కదలిరా’ సభకు ఏర్పాట్ల విషయంలో ఆ పార్టీ వైఖరి తేటతెల్లమైంది. పార్టీ అధ్యక్షుడు వస్తున్నారంటే టికెట్ ఆశిస్తున్న వారు ఎవరైనా జనసమీకరణపైనే దృష్టి పెడతారు. నియోజకవర్గంలో తన బలం చెక్కుచెదరలేదని ఎలాగైనా సరే నిరూపించుకోవడానికి ఎన్ని పాట్లయినా పడతారు. కానీ ఆళ్లగడ్డలో మాత్రం అందుకు విరుద్ద పరిస్థితి కనిపిస్తోంది. నేటి సభకు జన సమీకరణ, ప్రజలకు భోజనాలు, తరలింపు ఏర్పాట్లు.. ఇలా ఏమీ కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. వాస్తవానికి మంగళవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభను టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందితో సభను నిర్వహించి తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. సభ నిర్వహణకు కనీసం రూ.రెండు కోట్లు ఖర్చవుతుందని, ఆమాత్రం ఖర్చుతో ఏర్పాట్లు చేయాలని పార్టీ అధిష్టానం నుంచి సూచనలు అందినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఈ మాత్రం ఖర్చు పెట్టేందుకు కూడా ఆళ్లగడ్డ టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీనమేషాలు లెక్కిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే తనకే టికెట్ ఇస్తామని సభలో ప్రకటించాలని డిమాండ్ చేసినట్లు తెలియవచ్చింది. అఖిల ఆరి్థక పరిస్థితి, ఇతరత్రా విషయాలన్నీ పూర్తిగా తెలుసుకున్న అధిష్టానం అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని, సభ నిర్వహణ అంతా పార్టీనే చూసుకుంటుందని, ఆ మేరకు జన సమీకరణ ఏర్పాట్లు జిల్లాలోని ఇతర టీడీపీ నేతలకు అప్పగించినట్లు ఆ పారీ్టకి చెందిన ఓ నాయకుడు తెలిపారు. జన సమీకరణ ఎలా? సభకు అయ్యే ఖర్చు పెట్టుకోలేనని తెగేసి చెప్పిన అఖిలప్రియ.. మరో వైపు ఎలాగైనా టికెట్ తనే దక్కించుకోవాలని ప్రయాసపడుతోంది. అయితే ఆమెకు సొంత పార్టీ నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతోంది. మరోవైపు తమ నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలిస్తే ఆ క్రెడిట్ అంతా అఖిలప్రియకు దక్కుతుందని.. ఇలా చేస్తే మనకేంటి లాభమని టీడీపీ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. సభ విజయవంతమైతే తన వల్లే సభ సక్సెస్ అయ్యిందని.. విఫలమైతే ఆ నెపం తమ మీద వేస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన సమీకరణ బాధ్యత మీదే కదా అని జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు నేరుగా అఖిలప్రియను ప్రశి్నంచినట్లు సమాచారం. మరోవైపు ఆళ్లగడ్డ టికెట్ తమకేనంటూ జనసేన నాయకులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. కాగా, ఆళ్లగడ్డ పట్టణంలోని బీబీఆర్ పాఠశాల సమీపంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న తన స్థలాన్ని పాడు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆళ్లగడ్డ బీజేపీ కన్వినర్ భూమా కిశోర్ రెడ్డి చెబుతున్నారు. మరోవైపు భూమా అఖిలప్రియ భర్త భార్గవరాంతో నియోజకవర్గ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సభ ఖర్చులను పూర్తిగా తమ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సభ నిర్వహణ గురించి పట్టించుకోకుండా.. సభకు ఏవీ సుబ్బారెడ్డి వస్తే బాగోదంటూ భూమా అఖిలప్రియ హెచ్చరించడం కొసమెరుపు. -
గెలుపుపై నమ్మకం కోల్పోయిన టీడీపీ ప్రముఖులు
సాక్షిప్రతినిధి కర్నూలు : గెలుపు, ఓటమి సమస్య కాదు.. గత 20 ఏళ్లుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. ఇది మాకు తెలుసు. అయితే నియోజకవర్గస్థానం ముఖ్యం. ఒక్కసారి టిక్కెట్ వదులుకుని నియోజకవర్గాన్ని పోగొట్టుకుంటే తిరిగి అందుకోవడం చాలా కష్టం. అందుకే గెలిచినా, ఓడినా పోటీ చేయడం ముఖ్యం. – ఇటీవల టీడీపీ నేతలు బాహాటంగానే చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. ఈ మాటలు చూస్తే తెలుగుదేశం పార్టీ నేతల్లో గెలుపుపై పెద్దగా ఆశల్లేవనే విషయం సుస్పష్టమవుతోంది. కేవలం రాజకీయ ఉనికి కోసం పోటీ చేయాలని తాపత్రయ పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంత శ్రమించినా అధికార పార్టీని ఢీకొట్టడం అంత సులభం కాదనే ధోరణిలో ఉన్నారు. అయితే నియోజకవర్గ స్థానాలను కాపాడుకోవడంలో ఎవరికివారు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో వర్గవిభేదాలు బట్టబయలవుతున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాలతో పాటు కర్నూలు పార్లమెంట్ స్థానంలో కూడా వర్గవిభేదాలతో టీడీపీ సతమతమవుతోంది. నంద్యాలలో నాలుగు ముక్కలాట మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంలో ఆళ్లగడ్డలో పరిస్థితి బాగోలేదని, మూడు నెలల్లో మార్పు రావాలని, లేదంటే పార్టీ ప్రత్యామ్నాయం చూసుకుంటుందని లోకేశ్ చెప్పినట్లు తెలిసిందే. ఈ క్రమంలో అఖిల ఆదివారం నంద్యాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని నంద్యాల, గోస్పాడు కార్యకర్తలకు వారం రోజుల నుంచే ఆమె వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆహా్వనించారు. విషయం తెలిసి అఖిలతో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడారు. ఇన్చార్జ్గా భూమా బ్రహ్మనందరెడ్డి ఉన్నప్పుడు పార్టీ కార్యాలయం ప్రారంభించడం సరికాదని చెప్పారు. ఆమె ససేమిరా అనడంతో అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో అఖిలతో నేరుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఎవ్వరినీ ఖాతరు చేయకుండా అఖిల ఆఫీసు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అఖిల సోదరుడు భూమా బ్రహా్మనందరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్‌తో పాటు వీరి అనుచరులు దూరంగా ఉన్నారు. కార్యక్రమానికి ఎవ్వరూ వెళ్లకుండా భూమా బ్రహ్మానందరెడ్డి కట్టడి చేశారు. ఫరూక్ కూడా తన వర్గాన్ని వెళ్లకుండా నివారించారు. ఇప్పటికే నంద్యాలలో భూమా బ్రహ్మనందరెడ్డి, ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయి ఉన్నారు. ఈ క్రమంలో అఖిల రాకతో టీడీపీలో నాలుగో కుంపటి రగిలినట్లయింది. అయితే అఖిల మాత్రం.. నంద్యాలలో తన తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని, తాను ఆళ్లగడ్డ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. భవిష్యత్‌లో నంద్యాల మునిసిపల్ చైర్మన్‌గా విఖ్యాత్‌ను పోటీ చేయించి, 2029 ఎన్నికల్లో విఖ్యాత్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ అడుగుతామని అఖిల వివరిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని, ఆళ్లగడ్డలో పరిస్థితి బాగోలేకపోవడంతో నంద్యాల టిక్కెట్ అఖిల ఆశిస్తున్నారని భూమా బ్రహ్మానందరెడ్డి, ఫరూక్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి దసరా నుంచి పూర్తిగా ఆళ్లగడ్డ రాజకీయాలపై దృష్టి పెడతానని తన వర్గీయులతో వ్యాఖ్యానిస్తున్నారు. ఆదోని టిక్కెట్ ‘మీనాక్షి’కి లేనట్టే! వయోభారంతో తాను పోటీచేయలేనని తన కుమారుడు భూపాల్చౌదరికి ఆదోని టిక్కెట్ ఇవ్వాలని లోకేశ్‌కు మీనాక్షినాయుడు విన్నవించారు. అయితే ఆదోని టిక్కెట్ ఈ దఫా బీసీలకు ఇచ్చే యోచనలో ఉన్నామని లోకేశ్ తేల్చిచెప్పారు. ఆదోనిలో ‘కమ్మ’ సామాజికవర్గానికి టిక్కెట్ ఇస్తే ఫలితం ఉండబోదని, అక్కడ బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఆదోని నుంచి టీడీపీ నేతలు దేవేంద్రప్ప, సూరం భాస్కర్‌రెడ్డి, గుడిసె కృష్ణమ్మతో పాటు మైనారీ్టనేత రవూఫ్ టిక్కెట్ ఆశిస్తున్నారు. మనుగడ కోసం ‘కోట్ల’ యత్నం కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి 2014 వరకూ కర్నూలు రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇప్పుడు అతని రాజకీయ ప్రయాణం దారితెన్నూ లేనివిధంగా తయారైంది. 2014, 2019లో ఎంపీగా ఓడిపోవడంతో రాజకీయ మనుగడపై నమ్మకం సన్నగిల్లింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుస్తారని, తాను పోటీ చేసినా ‘హ్యాట్రిక్ ఓటమి’ తప్పదు అనే భావనకు వచ్చారు. అందుకే ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా ఈ నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయి టీడీపీ మరింత బలహీనమైంది. ఎమ్మిగనూరులో కార్యాలయం ప్రారం¿ోత్సవం నుంచి కోట్ల చేస్తున్న రాజకీయాలపై లోకేశ్‌కు జయనాగేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధిష్టానంతో మాట్లాడిన కోట్లకు పార్టీ కొత్త విషయం చెప్పింది. కుటుంబానికి ఒక్క టిక్కెట్ మాత్రమే ఇస్తామని, మీ ఇంట్లో ఎవరు పోటీ చేస్తారో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తే మంత్రాలయం టిక్కెట్ ఇస్తామని, ఆలూరు బోయలకు ఇస్తామని, సుజాతమ్మ ఆలూరు నుంచి పోటీ చేస్తే మంత్రాలయం బోయలకు ఇస్తామని వారు స్పష్టం చేశారు. దీంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ‘కోట్ల’ కుటుంబం ఉంది. ఇటీవల గోనెగండ్లలో విలేకరుల సమావేశంలో కూడా ‘కర్నూలు ఎంపీగా తానుకానీ లేదా మరొకరు కానీ పోటీ చేస్తారని’ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. తాను ఎంపీ అభ్యరి్థగా రాలేదని, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వచ్చానన్నారు. ఎంపీ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని ధైర్యంగా చెప్పలేకపోయారు. అంటే తన స్థానంపై తనకే నమ్మకం, స్పష్టత లేదనే విషయం సుస్పష్టమవుతోంది. మరోవైపు జయనాగేశ్వరరెడ్డిపై కూడా టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మిగనూరు నుంచి ఈ దఫా కొత్త ముఖాన్ని బరిలోకి దింపే యోచనలో టీడీపీ ఉందని లోకేశ్‌ను కలిసిన కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. దీంతో జయనాగేశ్వరరెడ్డికి కూడా టిక్కెట్ దక్కే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. -
డిసెంబర్లోనే స్కెచ్ వేశారు!
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు తదితరుల్ని కిడ్నాప్ చేసేందుకు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ డిసెంబర్లోనే స్కెచ్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే అనివార్య కారణాలతో ఈ నెల మొదటి వారానికి వాయిదా పడింది. మరోపక్క కిడ్నాప్ చేసే సమయంలో భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు చేజిక్కించుకోవడానికి భార్గవ్ విశ్వప్రయత్నం చేశాడు. ఈ కేసులో బందిపోటు అభియోగాలను కూడా పోలీసులు చేరుస్తూ సోమవారం సికింద్రాబాద్ న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు. అయితే ఈ తరహా నేరాలకు సంబంధించిన పిటిషన్లను నాంపల్లి సెషన్స్ కోర్టు మాత్రమే విచారించాల్సి ఉండటంతో అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను కోర్టు రిటర్న్ చేసింది. స్కెచ్ ఇలా వేశారు.. హఫీజ్‌పేటలోని భూమిని చేజిక్కించుకోవడానికి ప్రవీణ్‌రావు తదితరులను కిడ్నాప్ చేయడమే మార్గమని అఖిలప్రియ, భార్గవ్‌రామ్ గత నెల నిర్ణయించుకున్నారు. గుంటూరు శ్రీను ద్వారా మాదాల సిద్ధార్థ్‌కు సమాచారం ఇచ్చి కొందరు అనుచరులతో రావాలని చెప్పారు. దాదాపు 10 మందిని వెంట తీసుకుని డిసెంబర్ 25న హైదరాబాద్‌కు సిద్ధార్థ్ చేరుకున్నాడు. వారికి శివార్లలోని ఓ లాడ్జిలో బస కల్పించిన భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీనులు కుట్ర అమలుకు ఆలస్యమవు తుందని, డిసెంబర్ 31 తర్వాత అమలు చేద్దామని చెప్పి పంపారు. తిరిగి ఈ నెల 2న హైదరాబాద్ రావాలని సమాచారం ఇవ్వడంతో సిద్ధార్థ్ దాదాపు 25 మందిని తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. విజయవాడ, పరిసర ప్రాంతాల వారికి ఒకే బస్సులో టికెట్లు బుక్ చేశాడు. షేర్ల వ్యాపారానికి సంబంధించి బోయిన్‌పల్లికి చెందిన కొందరు ‘మంత్రి గారిని’(అఖిలప్రియ) మోసం చేయడంతో వారిపై ఐటీ దాడులు చేయిస్తోందని సిద్ధార్థ్ తన అనుచరులకు చెప్పాడు. ఆ అధికారులకు మనం సహాయంగా ఉండాలని నమ్మబలికాడు. ఇలా వచ్చిన వారంతా కూకట్‌పల్లిలోని ఓ హోటల్లో బస చేశారు. కిడ్నాప్ చేసే రోజు బాధితుల ఇంటికి వెళ్లకూడదని భార్గవ్ రామ్ తొలుత భావించాడు. అయితే బాధితులతో బలవంతంగా ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నా.. హఫీజ్‌పేట స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు చేజిక్కించుకోకపోతే దాన్ని సొంతం చేసుకోవడం కష్టమవుతుందని అనుకున్నాడు. చదవండి: (ఈవెంట్‌లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే) దీంతో కిడ్నాప్ రోజు భార్గవ్‌రామ్, అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి కూడా బాధితుల ఇంటికి వెళ్లారు. కుటుంబీకులను ఓ గదిలో, ముగ్గురు అన్నదమ్ములను హాలులో నిర్బంధించాక వీరిద్దరూ ఇల్లంతా గాలించారు. అయితే ఆ పత్రాలను ప్రవీణ్‌రావు బ్యాంకు లాకర్లో ఉంచడంతో అవి దొరకలేదు. ముగ్గురు బాధితులను కిడ్నాప్ చేసిన ఈ ముఠా ఇంట్లోని ల్యాప్‌టాప్‌తోపాటు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లింది. మరోవైపు ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు, ప్రధాన నిందితురాలు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన సికింద్రాబాద్ 11వ అదనపు మెట్రో పాలిటన్ కోర్టు, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా బోయిన్పల్లి పోలీసులకు నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
ఈవెంట్‌లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మందిని హైదరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇప్పటికే టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు మల్లికార్జునరెడ్డి, బోయ సంపత్, బాలా చెన్నయ్‌లకు సంకెళ్లు వేయగా.. తాజాగా పట్టుబడిన వారితో ఈ సంఖ్య 19కి చేరింది. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. అఖిలప్రియ పోలీసు కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఆ నేరం జరిగిన సమయంలో ఉపయోగించిన సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ కేసులో నిందితులను అరెస్టు చేస్తున్నారు. అచ్చం ఓ ఈవెంట్లో ప్లాన్ చేసిన ఈ కేసు వివరాలను ఆదివారం బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ మీడియాకు తెలిపారు. ముందస్తు వ్యూహం... కిడ్నాప్ ఎలా చేయాలన్న దానిపై అఖిలప్రియ.. భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులతో జనవరి 2న కేపీహెచ్‌బీలోని లోధా అపార్ట్మెంట్లోని నివాసంలో, 4న యూసుఫ్‌గూడలోని ఎంజీహెచ్ పాఠశాలలో సమావేశమయ్యారు. గుంటూరు శ్రీను.. సిద్ధార్థను కలసి కిడ్నాప్ చేసేందుకు 15 నుంచి 20 మందిని సమకూర్చాలంటూ కోరాడు. దీనికోసం అతనికి రూ.5 లక్షలు, మిగిలిన వారికి రూ.25,000ల చొప్పున ఇస్తామని చెప్పాడు. ముందుగా రూ.74,000లు చెల్లించాడు. ఆ తర్వాత సిద్ధార్థ పంపిన వారందరికి కూకట్పల్లి ఫోరమ్ మాల్‌కు సమీపంలోని ‘ఎట్ హోమ్’లాడ్జ్‌లో వసతి కల్పించాడు. అనంతరం కిడ్నాప్ చేసే సమయంలో వీరు అధికారులుగా నటించేందుకు ఫార్మల్ డ్రెస్సుల కోసం కొలతలు కూడా తీసుకున్నాడు. మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌ల ద్వారా 10 స్టాంప్ పేపర్లు.. భార్గవ్‌రామ్, విఖ్యాత్‌రెడ్డి పేరులతో 10 స్టాంప్ పేపర్లు ఉండేలా కొన్నాడు. అలాగే ఆరు సెల్ఫోన్లు, బొమ్మ తుపాకీ కొనుగోలు చేశాడు. ఓ జిరాక్స్ షాప్ వద్ద ఓ పేపర్‌పై నకిలీ వాహన నంబర్లు ముద్రించి కిడ్నాప్ సమయంలో ఉపయోగించిన కారు నంబర్ ప్లేట్లపై అతికించారు. (చదవండి: మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్’!) పక్కాగా కిడ్నాప్.. జనవరి 5న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎంజీహెచ్ పాఠశాల వద్ద నిందితులు అందరూ కలిశారు. ఈ కేసులో ఏ2–గా ఉన్న భార్గవ్‌రామ్ ఐటీ అధికారులు, పోలీసు ఆఫీసర్లుగా ఎలా వ్యవహరించాలనే దానిపై మిగిలినవారికి వివరించాడు. బోయ సంపత్, బాలా చెన్నై మనోవికాస్‌నగర్‌లోని కృష్ణా రెసిడెన్సీకు మధ్యాహ్నం సమయంలో వెళ్లి రెక్కీ నిర్వహించారు. బాధితుల కదలికలను ఎప్పటికప్పుడూ చేరవేశారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం ఐదు కార్లలో బాధితుల ఇంటికి వెళ్లి ఐటీ, పోలీసులుగా చెబుతూ ఐటీ కార్డులు, సెర్చ్ వారంట్లు చూపెట్టి సోదాలు చేశారు. సెల్ఫోన్లు, ట్యాబ్‌లు తీసుకున్నారు. కూర్చోబెట్టి విచారణ చేశారు. అనంతరం ప్రవీణ్‌కుమార్, నవీన్‌కుమార్, సునీల్ కుమార్ల చేతులు తాళ్లతో కట్టేశారు. కళ్లు కనపడకుండా ఉండేందుకు ముఖాలకు మాస్కులు కట్టారు. ఆ తర్వాత ముగ్గురిని వేర్వేరు వాహనాల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మొయినాబాద్‌లోని భార్గవ్‌రామ్ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత కర్రలతో కొడతామంటూ, చంపుతామంటూ బెదిరించి రాసిన పేపర్లపై కూడా సంతకాలు చేయించారు. అయితే బాధితుల గురించి పోలీసులు వెతుకుతున్నారని సమాచారం తెలుసుకున్న వీరు బాధితులను ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని సన్‌సిటీ దగ్గరలో అదే రోజూ రాత్రి వదిలివెళ్లారు. వాడిన వాహనాలివే... భార్గవ్‌రామ్ తల్లి కిర్మణ్మయి నాయుడు పేరుతో రిజిష్టర్ అయిన ఏపీ21 సీకే 2804 నంబర్ ప్లేట్ గల ఇన్నోవా కారు. దీనికి టీఎస్09 బీజెడ్ 9538(నకిలీ నంబర్) స్టిక్కర్‌ను అంటించారు. అలాగే ఏపీ21సీఈ 1088 నంబర్ ప్లేట్ గల స్కార్పియోకు టీఎస్09 ఎఫ్ఎక్స్ 3625 నంబర్‌ను, ఏపీ07 ఈడీ 0875 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్‌కు టీఎస్07 యూవీ 2583 నంబర్‌ను వినియోగించారు. అలాగే ఏపీ21 బీకే 3999 నంబర్ ప్లేట్ గల ఎక్స్‌యూవీ 500 వాహనానికి, వోక్స్వ్యాగన్ పోలోలకు ఉపయోగించిన నకిలీ నంబర్లను ఇంకా కనుక్కోవాల్సి ఉందని డీసీపీ కల్మేశ్వర్ తెలిపారు. ఎవరెవరి పాత్రలు ఏంటంటే.. మాదాల సిద్ధార్థ: ఈవెంట్ మేనేజర్ అయిన ఇతను కిడ్నాప్‌నకు సహకరించేందుకు 20 మందిని సమకూర్చడంతో పాటు స్విఫ్ట్ డిజైర్ కారును కూడా వినియోగించాడు. ఏపీ 09 ఈడీ 0875 కారుతో పాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బొజ్జగని దేవప్రసాద్: కారును డ్రైవ్ చేయడంతో పాటు కిడ్నాప్‌లో పాల్గొన్నాడు. దేవరకొండ కృష్ణవంశీ, కందుల శివ: పోలీసు డ్రెస్సు ధరించి కానిస్టేబుల్స్‌గా నటించారు. వీరంతా..: మొగిలి భాను, రాగోలు అంజయ్య, పదిర రవిచంద్ర, పంచిగలి రాజా, బానోత్ సాయిలు, దేవరకొండ కృష్ణ సాయి, దేవరకొండ నాగార్జున, బొజ్జగాని సాయి, మీసాల శ్రీను, అనీపాక ప్రకాష్, షేక్ దావూద్ కూడా కిడ్నాప్‌లో పాల్గొన్నారు. -
అతడి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి కారు డ్రైవర్ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా.. కిడ్నాప్‌లో జగత్‌విఖ్యాత్‌కు ప్రమేయం ఉన్నట్లు అతడు వెల్లడించినట్లు సమాచారం. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌తో పాటు అతడు కూడా.. బాధితుడు ప్రవీణ్‌రావు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులమంటూ.. వారిని బెదిరించినట్లు సమాచారం. వీరిద్దరు స్పాట్లో ఉండగా... లోథా అపార్ట్మెంట్లో ఉన్న అఖిలప్రియ ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా కిడ్నాప్ తర్వాత.. భార్గవ్, జగత్‌విఖ్యాత్ ఒకే వాహనంలో వెళ్లినట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగత్ విఖ్యాత్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: అక్షయ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ) మూడోరోజు విచారణ.. 300 ప్రశ్నలు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ మూడోరోజు విచారణ ముగిసింది. ఈ క్రమంలో.. ఆమె భర్త భార్గవ్‌రామ్ సొంత పాంహౌజ్‌లో.. బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు అఖిలప్రియకు 300 ప్రశ్నలు సంధించిన పోలీసులు.. ఈ కేసులో నిందితులైన భార్గవ్‌రామ్, చంద్రహాస్, గుంటూరు శ్రీను ఆచూకీపై ఆరా తీశారు. టెక్నికల్ సాక్ష్యాలను అఖిలప్రియ ముందు ఉంచటంతో.. పలు ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భార్గవ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
పోలీసుల అదుపులో భార్గవ్‌రామ్!?
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. గోవాలో నలుగురు నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సిద్ధార్థ్‌తో పాటు ముగ్గురిని హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. అయితే ఈ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త, నిందితుడు భార్గవ్‌రామ్ ఆచూకీ మాత్రం లభించలేదు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెంగళూరు, చెన్నై, గోవా, ఏపీలో ప్రత్యేక బృందాలు అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ఈ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతడి కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుతో పాటు మరికొంత మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.(చదవండి: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. అఖిలప్రియ!) ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది: డీసీపీ బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితులు పరారీలోనే ఉన్నారని నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగెన్వర్ తెలిపారు. భార్గవరామ్, గుంటూరు శ్రీను ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా.. న్యాయవాది సమక్షంలో అఖిల ప్రియ విచారణ సాగుతోందన్న డీసీపీ.. రెండో రోజు విచారణ పూర్తయినట్లు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం వరకు అఖిలప్రియ తమ కస్టడీలోనే ఉంటుందని తెలిపారు. ఆమె హెల్త్ కండీషన్ బాగుందని పేర్కొన్నారు. ఇక విచారణలో భాగంగా కొన్ని కాగా కిడ్నాప్ చేయడానికి గల ఉద్దేశంపైనే ప్రధానంగా విచారణ సాగినట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితుల సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు అఖిల ప్రియ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశ్నలకు మాత్రమే అఖిల ప్రియ జవాబు ఇచ్చారని.. మరికొన్నింటికి గుర్తు లేదంటూ సమాధానం దాట వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం నాటి దర్యాప్తు కీలకంగా మారనుంది. -
అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియను అరెస్టు చేయకపోతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని హైదరాబాద్ పోలీసులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. హఫీజ్‌పేటలో ప్రవీణ్‌రావు 2016లో ఖరీదు చేసిన 25 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాన్ని అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి తదితరులు పరిష్కరించారు. అప్పట్లోనే ఒప్పందం ప్రకారం నిర్ణీత మొత్తాన్ని ప్రవీణ్‌రావు చెల్లించారు. ఇటీవల ఆ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో తమకు అప్పట్లో ఇచ్చిన మొత్తం చాలదని, భారీ మొత్తం చెల్లించాలని, లేదంటే ఆ భూమిలో వాటా కావాలని అఖిలప్రియ, ఆమె భర్త భార్గరామ్ కలసి ప్రవీణ్‌రావుపై ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగా నెరవేర్చుకోవడానికే గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాశ్ తదితరులతో కలసి మంగళవారం రాత్రి బాధితుల్ని కిడ్నాప్ చేయించారు. ఈ క్రమంలో చిలుకూరులో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో నిర్బంధించి సెటిల్మెంట్ చేసుకో వాలని బెదిరిస్తూ కర్రలతో వారిపై దాడి చేశారు. ఆపై ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించు కున్నారు. ఈ కిడ్నాపులకు సంబంధించిన వార్త మీడియాలో రావడంతో తీవ్ర కలకలం రేగిందని, పోలీసుల వేట ముమ్మరం కావడంతో అఖిలప్రియ తదితరులు అప్రమత్తమయ్యారు. ఆమె సూచన మేరకు ప్రవీణ్, సునీల్, నవీన్‌లను మెహిదీపట్నం సన్‌సిటీ సమీపంలోని కాళీమాత దేవాలయం వద్ద వదిలి వెళ్లారు. అఖిలప్రియ రాజకీయంగా పలుకు బడి ఉన్న నేత కావడంతో సాక్ష్యాలు తారుమారు చేయడంతోపాటు సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పోలీసులు కోర్టుకు నివేదిం చారు. దర్యాప్తునకు కూడా ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.(చదవండి: బెంగళూరులో ఏ-3 భార్గవరామ్?) అరెస్టు చేయకపోతే... పరారీలో ఉన్న ఆమె భర్త భార్గవ్రామ్కు నేరచరిత్ర ఉందని, అఖిలప్రియను అరెస్టు చేయకపోతే ఇద్దరూ కలిసి నేరాలు కొనసాగించవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా అనేక మంది నిందితులు పరారీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. బాధితులతోపాటు వారి కుటుంబీకులపై మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితుల్ని అరెస్టు చేయడం ద్వారా బాధితులకురక్షణ కల్పించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. భార్గవ్‌రామ్‌తోపాటు ఇతర నిందితుల్ని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భార్గవ్‌రామ్ ఉన్నాడని అనుమానిస్తున్న పోలీసులు ఓ టీమ్‌ను అక్కడకు పంపారు. 6 నెలల క్రితమే పథకం! కాగా ప్రవీణ్ రావు తదితరుల్ని కిడ్నాప్ చేయడానికి అఖిలప్రియ దాదాపు 6 నెలల క్రితమే పథకం వేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గుంటూరు శ్రీను నకిలీ నంబర్ ప్లేట్‌తో కూడిన వాహనంలో సంచరిస్తుండగా బోయిన్పల్లి పోలీసులు ఐదు నెలల క్రితమే పట్టుకున్నారు. అలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నించగా... తాను కొందరి కోసం పనిచేస్తుంటానని, ఈ నేపథ్యంలోనే ముప్పు పొంచి ఉండటంతో తరచూ వాహనం నంబర్ ప్లేట్లు మారుస్తుంటానని చెప్పి తప్పించుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి అప్పట్లో నకిలీ నంబర్ ప్లేట్‌తో ప్రవీణ్‌రావు ఇంటి వద్ద రెక్కీ కోసమే గుంటూరు శ్రీను వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని ఏపీకి పంపారు. -
బెంగళూరులో ఏ-3 భార్గవరామ్?
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఏ-3 భార్గవ్‌రామ్ కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. భార్గవ్ రామ్ బెంగళూరులో తలదాచుకున్నట్లు సమాచారం. దీంతో పోలీస్ ప్రత్యేక బృందాలు బెంగళూరు వెళ్లాయి. ఇదే కేసుకు సంబంధించి అరెస్టైన భూమా అఖిల ప్రియకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. బెయిల్ కోసం ఆమె తరుపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. మరి కొద్దిసేపట్లో సికింద్రాబాద్ కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ( ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు ) కాగా, మంగళవారం అర్థరాత్రి ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లినవారు.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అనంతరం ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని పట్టుకున్నారు. -
ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ అరెస్ట య్యారు. హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్‌రావుతోపాటు ఆయన సోదరులను మంగళవారం రాత్రి సినీఫక్కీలో కిడ్నాప్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అఖిలప్రియను ఏ1గా నిర్ధారించిన హైదరాబాద్ పోలీసులు.. బుధవారం ఆమెను అరెస్టు చేసి మారేడుపల్లిలోని 11వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆశాలత 14 రోజుల రిమాండ్ విధించడంతో అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతోపాటు మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. భూవివాదమే కారణం.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హఫీజ్‌పేటలో 40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదమే ఈ కిడ్నాప్‌నకు కారణమని తెలుస్తోంది. ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోద రులు సునీల్‌రావు, నవీన్‌రావులను కిడ్నాప్ చేసి బెదిరించడం ద్వారా ఆ స్థలాన్ని తమ పేరుతో రాయించుకోవాలని అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ పథ కం వేశారు. ఈ బాధ్యతల్ని తమ అనుచరుడైన శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శ్రీనుకు అప్పగించారు. నేరచరిత్ర ఉన్న ఇతడిపై గుంటూరులో రౌడీషీట్ ఉన్నట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం రంగంలోకి దిగిన గుంటూరు శ్రీను.. సాయి, చంటి, ప్రకాష్ సహా 14మంది శ్రీకృష్ణనగర్‌లో ఉన్న భార్గవ్‌కు చెందిన ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్లో సమావేశమయ్యారు. అక్కడే తాము వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్, మహేంద్ర వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చి నకిలీవి తగిలించారు. అధికారుల్లా కనిపించేందుకు అందరూ ఫార్మల్ వస్త్రాలు, మెడలో టైలు ధరించారు. ఓ నిందితుడు పోలీసు యూనిఫాం వేసుకుని చేతితో లాఠీ కూడా పట్టున్నాడు. ఇవన్నీ ఫిల్మ్‌నగర్‌లో సినిమా షూటింగ్స్‌కు అద్దెకు ఇచ్చే దుకాణం నుంచి తెచ్చినట్లు అనుమానిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డులు, బోగస్ సెర్చ్ వారెంట్లు కూడా తయారు చేసుకున్నారు. సోదాల పేరుతో హడావుడి చేసి... అంతా సిద్ధమైన తర్వాత మూడు వాహనాల్లో బయలుదేరి రాత్రి 7.20 గంటల ప్రాంతంలో బోయిన్‌పల్లిలో ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. ఆదాయపు పన్ను అధికారులమని చెప్పి ఇంట్లోకి వెళ్లారు. ప్రవీణ్, సునీల్, నవీన్‌లను హాలులో ఉంచిన నిందితులు.. మిగిలిన కుటుంబ సభ్యులందరినీ ఓ బెడ్రూమ్లో బంధించారు. దాదాపు 20 నిమిషాలు సోదాల పేరుతో హడావిడి చేశారు. అనంతరం ఆ ముగ్గురి కళ్లకూ గంతలు కట్టి బయటకు తీసుకొచ్చారు. ముగ్గురినీ వేర్వేరు వాహనాల్లో ఎక్కించుకుని వారి చేతులు, కాళ్లూ కట్టేశారు. బోయిన్పల్లి నుంచి సికింద్రాబాద్, ప్యాట్నీ, మెహదీపట్నం మీదుగా చిలుకూరులో ఉన్న భార్గవ్ స్నేహితుడి ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడే ముగ్గురినీ నిర్బంధించి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. మరోవైపు రాత్రి 8.20 గంటల ప్రాంతంలో పొరుగింట్లో ఉండే సచిత అనే మహిళ ప్రవీణ్‌రావు ఇంటికి వచ్చారు. ఓ గది నుంచి శబ్దాలు రావడం, బయట నుంచి గడియపెట్టి ఉండటం గమనించిన ఆమె.. తలుపు తీశారు. దీంతో గది బయటకు వచ్చిన కుటుంబీకులు ప్రవీణ్, నవీన్, సునీల్ కనిపించకపోయే సరికి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి కిడ్నాప్ జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. జల్లెడ పట్టిన ప్రత్యేక బృందాలు... ప్రవీణ్‌రావు తదితరులు కిడ్నాప్ అయిన విషయాన్ని వారి బంధువు కె.మనీష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అఖిలప్రియతోపాటు ఆమె భర్త భార్గవరామ్, ఏవీ సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 15 బృందాలను రంగంలోకి దింపారు. మూడు కమిషనరేట్లలో పోలీసులు జల్లెడ పడుతుండటం, ఇరుగుపొరుగు రాష్ట్రాలకూ సమాచారం ఇవ్వడం, మీడియా హడావుడి నేపథ్యంలో నిందితులు పునరాలోచనలో పడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కోకాపేట వద్ద బందీలను వదిలేశారు. బాధితులు ఆ విషయాన్ని నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్‌కు చెప్పడంతో పోలీసులు అక్కడకు వెళ్లి ముగ్గురినీ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం బుధవారం ఉదయం 11.20 గంటలకు బోయిన్పల్లి పోలీసులు అఖిలప్రియను అదుపులోకి తీసుకుని బేగంపేటలోని మహిళా ఠాణాకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం 12.40కి అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో హైడ్రామా.. అఖిలప్రియ అరెస్టు అనంతరం గాంధీ ఆస్పత్రి వద్ద స్వల్ప హైడ్రామా చోటుచేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో వాహనం దిగుతూనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అత్యవసర విభాగంలో చేర్పించి వైద్యసేవలు అందించడంతో కోలుకున్నారు. ఈ క్రమంలో అఖిలప్రియతోపాటు కుటుంబసభ్యులు హంగామా చేశారు. అఖిలప్రియకు ఫిట్స్ వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన్నారని వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. ఆమె గర్భవతి అని కూడా అబద్ధాలు చెప్పారు. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు గంటలపాటు అఖిలప్రియకు అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమె గర్భవతి కాదని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని నిర్దారించారు. అనంతరం అఖిలప్రియను మీడియా కంటపడనీయకుండా పోలీసులు అక్కడ నుంచి న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. పోలీసుల అదుపులో సుబ్బారెడ్డి ఈ కిడ్నాప్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏవీ సుబ్బారెడ్డిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో నివసించే సుబ్బారెడ్డి.. ఈ కేసులో తన పేరు రావడంతో మీడియాతో మాట్లాడారు. మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ విషయం గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే సుబ్బారెడ్డిని నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకున్నామని, విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కిడ్నాప్లతో నాకు సంబంధం లేదు ప్రవీణ్‌రావుతో కొన్ని అంశాల్లో వివాదాలు ఉన్నాయి. బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్లతో ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసులో నన్ను నిందితుడిగా ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. గతంలో భూమా అఖిలప్రియ తదితరులు నన్ను చంపడానికి ప్రయత్నించారు. కొందరికి సుపారీ కూడా ఇచ్చారు. అలాంటివారితో కలిసి ఎలా పనిచేస్తాను? – మీడియాతో ఏవీ సుబ్బారెడ్డి ఆ భూమి విలువ రూ.400 కోట్ల పైమాటే.. హఫీజ్‌పేట్: ఈ కిడ్నాప్ వ్యవహారానికి కారణమైన భూమి అత్యంత విలువైనదేనని తెలుస్తోంది. శేరిలింగంపల్లి మండలం న్యూ హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్ 80లోని 25 ఎకరాల భూమిపై ఏళ్లుగా వివాదం నెలకొంది. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ.400 కోట్ల పైమాటే. ఈ భూమి తమదంటే తమదంటూ ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే, అది ప్రభుత్వ భూమేనని ఆధారాలతో నిర్ధారించలేకపోవడంతో 2003లో హైకోర్టులో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, ఆ భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉన్నామని కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్‌రావు తదితరులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదం ముదిరి కిడ్నాప్‌కు దారితీసినట్టు తెలుస్తోంది. 17 ఏళ్ల క్రితం ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినా.. సర్కారు మాత్రం అది ప్రభుత్వ భూమేనని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును పున:సమీక్షించాలని గత నెలలో సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించినట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. (చదవండి: సికింద్రాబాద్ కోర్టుకు అఖిలప్రియ!) -
ఎస్పీని కలిసిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, ఆయన కుమార్తె జస్వంతి గురువారం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిశారు. తనను హత్యచేసేందుకు కుట్ర పన్నిన భూమా అఖిల ప్రియను వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్పీకి ఏవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఏ4 అయిన భూమా అఖిల ప్రియను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు. ఏ1 నుండి ఏ6 వరకు అందరినీ అరెస్టు చేసిన పోలీసులు ఏ4ను ఎందుకు వదిలేశారు. నన్ను హత్య చేసేందుకు భూమా కుటుంబం సఫారీ ఇచ్చిన మాట వాస్తవం కాదా’’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే మూడు నోటీసులు ఇచ్చినా అఖిల ప్రియ, ఆమె భర్త నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. నిర్భయంగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. ముందస్తు బెయిల్ వస్తే వాళ్ళు పోలీసులకు పలికే పరిస్థితి లేదని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే తనపై మళ్లీ దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూమా అఖిలప్రియ మహిళ ముసుగులో హత్యా రాజకీయాలు చేస్తోందని ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి మండిపడ్డారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో రాజకీయంగా తమను ఎదుర్కోలేక అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. -
సిట్టింగులకే సీట్లు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులపై దాదాపు స్పష్టత వచ్చింది. జిల్లాలోని మెజారిటీ సీట్లలో సిట్టింగులకే ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం నియోజకవర్గాల్లో ప్రస్తుతమున్న అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్దనరెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డికే సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పాణ్యం, నందికొట్కూరు సీట్ల విషయం మాత్రం ఇంకా తేలలేదు. పాణ్యంలో ఇన్చార్జ్ ఏరాసు ప్రతాప్‌రెడ్డి పనితీరు బాగోలేకపోవడం.. నందికొట్కూరు ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డికి, గతంలో పోటీ చేసిన లబ్బి వెంకటస్వామికి మధ్య వైరుధ్యాల కారణంగా ఈ రెండు సీట్లను తేల్చలేదని తెలుస్తోంది. నంద్యాల సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి ఇవ్వడాన్ని ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఏవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అయితే, మంత్రి ఫరూక్ మాత్రం బ్రహ్మానందరెడ్డికి మద్దతు తెలిపినట్టు సమాచారం. ప్రాథమికంగా నంద్యాల సీటు బ్రహ్మనందరెడ్డికే ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇప్పటికే కర్నూలు పార్లమెంటు పరిధిలోని కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆలూరుకు కోట్ల సుజాతమ్మ, ఆదోని బుట్టారేణుక, ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం తిక్కారెడ్డి, పత్తికొండ కేఈ శ్యాంబాబుతో పాటు నంద్యాల పార్లమెంటు పరిధిలోని డోన్‌కు కేఈ ప్రతాప్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కోడుమూరు, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యే సీట్లతో పాటు నంద్యాల ఎంపీ సీటును టీడీపీ ఖరారు చేయాల్సి ఉంది. రూ.60 కోట్లు సమకూర్చుకోవాలని... కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉండనున్నారు. నంద్యాల ఎంపీ సీటు విషయంలో మాత్రం ఇంకా తేలలేదు. మొదట్లో మాండ్ర శివానందరెడ్డి పేరు వినిపించింది. అయితే, ఈ సీటు తమకే కావాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి పట్టుబట్టడంతో చంద్రబాబు కొత్త కొర్రీలను వేసినట్టు సమాచారం. ఎన్నికల ఖర్చు కోసం రూ.60 కోట్లు సమకూర్చుకోవాలని, సదరు మొత్తం డిపాజిట్‌ను తమకు చూపాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఇప్పటికే తాము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తెలిసీ రూ. 60 కోట్లు అడగడం ఏమిటని ఎస్పీవై రెడ్డి వర్గం వాపోతోంది. తాము అంత మొత్తం సమకూర్చుకోలేమనే ఉద్దేశంతోనే ఈ విధంగా కొర్రీలు వేశారని ఆక్రోశం వెలిబుచ్చుతోంది. ఎంపీ సీటు ఇస్తామని చెబుతూనే ఎగ్గొట్టేందుకు ఈ కొత్త విధానాన్ని తెరమీదకు తెచ్చారని అంటున్నారు. ఎవరినీ అడగకుండా తమను మాత్రమే డబ్బు గురించి అడగటం ఏమిటని వాపోతున్నారు. మరోవైపు ఎన్నికల ఖర్చుకు అవసరమైన మొత్తం తన వద్ద లేదని నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి నేరుగా చంద్రబాబు ముందే కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. ఎన్నికల ఖర్చును పార్టీనే భరించాలని కూడా కోరినట్టు తెలిసింది. ఈ విధంగా ఖర్చును భరించలేమన్న వారికి సీటు కేటాయిస్తున్నట్టు చెప్పి.. తమను మాత్రం ఎందుకు రూ.60 కోట్లు అడిగారని ఎస్పీవై రెడ్డి వర్గం వాపోతోంది. -
దోపిడీ పథకంగా నీరు–చెట్టు
రుద్రవరం: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నీరుచెట్టు పథకం పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె అనుచరుల దోపిడీకి అడ్డాగా మారిందని టీడీపీ మాజీ ఇన్చార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి విమర్శించారు. స్థానికేతరులతో పనులు చేయించి రూ.కోట్లు ఆర్జించారని ఆరోపించారు. రూ. 5లక్షల ఎంపీ ల్యాడ్స్, రూ.15లక్షల ఉపాధి కర్నూలు జిల్లా నిధులతో రుద్రవరం మండలం నర్సాపురం సమీపంలో పెద్దబావి రస్తా నిర్మాణానికి ఎంపీటీసీ సభ్యుడు బలరామిరెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. కార్యక్రమానికి ఇరిగెల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుగంగ కాలువలు అధ్వానంగా ఉన్నా మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. ఆమెకు అక్రమార్జనపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదన్నారు. నీరు – చెట్టు పథకం కింద అళ్లగడ్డ నియోజవర్గంలో రూ.100కోట్ల పనులు చేపట్టగా 20శాతం పనులు కూడా చేయించకుండా నిధులు మింగేశారని ఆరోపించారు. వీరి తీరు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. నీరు–చెట్టు పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీఎంను కోరినట్లు ఆయన తెలిపారు. నెలరోజుల్లో సీఎం స్పందించకుంటే జిల్లాలో చాలా మార్పులు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ జెడ్పీటీసీ సభ్యుడు చాంద్‌బాషా, నర్సాపురం నాయకులు సుద్దుల క్రిష్ణుడు, రుద్రవరం టీడీపీ నాయకులు మౌలాలి తదితరులు పాల్గొన్నారు. -
అఖిలప్రియను మంత్రి పదవి నుంచి తొలగించాలి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఖిలప్రియను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మానభంగాలకు ఉసిగొల్పుతున్నారంటూ ప్రధాని మోదీపై ఆమె వ్యాఖ్యలు చేయడం సంస్కారహీనం ఆయన విమర్శించారు. ప్రభుత్వ సొమ్ముతో నవనిర్మాణ దీక్షలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. 2019లో టీడీపీకి ఓటేస్తే తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని, చంద్రబాబును ప్రపంచ దేశాల అధినేతగా ప్రజలు పంపించాలని ఆయన వ్యాఖ్యానించారు. -
కోడలు మంత్రి కావడంతో ఎమ్మెల్యే ...
సెంటు స్థలం లేని పేదలు ఆవాసం కోసం వృథాగా ఉన్న భూముల్లో గుడిసెలు వేసుకుంటే అది అక్రమం..వెంటనే పోలీసులు వాలిపోతారు..రెవెన్యూ అధికారులు దగ్గర ఉండి స్థలాలను ఖాళీ చేయిస్తారు. కాళ్లకు మొక్కినా కనికరించరు. అదే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే..తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే ప్రభుత్వ స్థలం తక్కువ ధరకు లీజుకు దొరుకుతుంది. ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 99 ఏళ్లు ఆ భూమిని స్వాధీనంలో ఉంచుకోవచ్చు. ఆర్థికంగా ఎదగనూ వచ్చు. ఇందుకు ఏ నిబంధనలు అడ్డురావు. పైగా మంత్రి బంధువుగా ఉంటే వ్యవహారాన్ని అడ్డులేకుండా చక్కబెట్టుకోవచ్చు. కర్నూలు నగరంలో ఇలానే జరుగుతోంది. విలువైన పర్యాటక స్థలాన్ని కాజేయడానికి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చురుగ్గా పావులు కదుపుతుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు ; అధికారపార్టీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కన్ను పర్యాటక శాఖ స్థలంపై పడింది. ఇప్పటికే ఆయన.. భారీగా క్రైస్తవ ఆస్తులను లీజు పద్ధతిలో తీసుకున్నారు. అదే పద్ధతిలో పర్యాటక శాఖ స్థలాలను కైవసం చేసుకోవాలని యత్నిస్తున్నారు. కోడలు భూమా అఖిలప్రియ పర్యాటక శాఖ మంత్రిగా ఉండడంతో వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఏకంగా 99 ఏళ్ల పాటు నామమాత్రపు లీజుకు ఎకరన్నర స్థలాన్ని తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న పర్యాటకశాఖ స్థలాన్ని లీజు ప్రాతిపదికన తీసుకుని భారీ షాపింగ్ మాల్స్ ఏర్పాటు కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే, ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండానే చేజిక్కించుకోవాలనేది ఆలోచనగా ఉంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులల్లో టెండర్లను పిలిచినప్పటికీ ఎవరూ అడ్డురాకుండా చేసుకునేలా ఆయన అనుచరులు బెదిరింపులకు కూడా దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సదరు స్థలం వద్దకు ఎమ్మెల్యే అనుచరులు రాకపోకలు సాగిస్తూ వ్యవహారాలు నడుపుతున్నారు. దీంతో పర్యాటకశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మునిసిపాలిటీలోని టెండర్ల వ్యవహారంలో ఏకచక్రాధిప్యతంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కన్ను ఇప్పుడు పర్యాటకశాఖ స్థలంపై పడడం చర్చనీయాంశమైంది. ఎవరూ పోటీలో లేకుండా...! కర్నూలులో వెంకటరమణ కాలనీకి మంచి గుర్తింపు ఉంది. పర్యాటక శాఖకు ఇక్కడ సుమారు 5 ఎకరాల వరకు స్థలం ఉంది. ఇందులో క్యాంటీన్, లాడ్జింగ్‌తో పాటు బారు కూడా పర్యాటకశాఖకు ఉంది. అదేవిధంగా ఒక ఫంక్షన్‌హాల్ నిర్వహిస్తున్నారు. ఇంకా రెండు ఎకరాల వరకూ ఖాళీ స్థలం ఉంది. ఇందులో ఎకరన్నర స్థలంపై ఎమ్మెల్యే ఎస్వీమోహన్ రెడ్డి కన్ను పడింది. ఈ స్థలాన్ని తక్కువ ధర లీజుకే కాజేయాలనేది ఆయన యత్నంగా ఉంది. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వశాఖకు చెందిన స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే టెండర్లను పిలవడం పరిపాటి. అక్కడ ఏమి ఏర్పాటు చేయాలనే విషయాన్ని సదరు శాఖనే నిర్ణయిస్తుంది. అయితే, కర్నూలులోని వెంకటరమణ కాలనీలోని పర్యాటకశాఖ స్థలం విషయంలో మాత్రం ఇప్పటివరకు పర్యాటకశాఖ టెండర్‌ను పిలవలేదు. ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండానే లీజు పద్ధతిలో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ టెండర్ అనివార్యమైతే... ఎవరు టెండర్లో పాల్గొనకుండా చూసుకోవాలనేది కూడా ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరులు రెండు, మూడు రోజులకోసారి పర్యాటకశాఖ స్థలం వద్దకు వెళ్లి చక్కర్లు కొడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులే వాపోతున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పనుల్లో ఏ చిన్న కాంట్రాక్టర్ బరిలో ఉండకుండా ఎమ్మెల్యే తన మనుషులకే టెండర్లను కట్టబెడుతున్నారు. అదీ అంచనా వ్యయాన్ని పెంచి పనులు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కోడలు మంత్రి అఖిప్రియ చూస్తున్న పర్యాటక శాఖపై కన్నేశారు. లీజు పద్ధతిలో పర్యాటక స్థలాన్ని చేజిక్కించుకునేందుకు యత్నించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
'చల్లా'రని సెగ!
నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో సెగలు రేపుతోంది. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డికి కడప రీజియన్ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఆ పదవి వద్దని ఆయన తేల్చిచెప్పారు. టీడీపీలో చేరిన సమయంలో తనకు ఎమ్మెల్సీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చి విస్మరించిందని మండిపడుతున్నారు. ఇన్ని రోజులుగా పార్టీని అంటిపెట్టుకున్న తనను ఈ విధంగా అవమానిస్తారా అని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు : టీడీపీ అధిష్టానంపై ఆ పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారు. ఇన్నాళ్లు వాడుకొని వదిలేస్తారా అని మండిపడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఇందుకు వేదికగా మారింది. 2014లో పామర్రు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వర్ల రామయ్యకు ఆర్టీసీ రాష్ట్రస్థాయి చైర్మన్ పోస్టు ఇచ్చి...1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసినతనకు రీజియన్ స్థాయి పోస్టు ఇవ్వడం ఏమిటని చల్లా రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా నామినేటెడ్ పోస్టును ఆశించారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ పోస్టును ఇస్తామని కూడా ఆయనకు టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత నామినేటెడ్ పోస్టుల్లో స్థానం దక్కకపోవడంపై ఏవీ కినుక వహించారు. పెరుగుతున్న విభేదాలు.. కర్నూలులో ఎంపీ టీజీ, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, ఫరూఖ్ కుమారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బనగానపల్లెలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, చల్లా రామకృష్ణా రెడ్డి, కోడుమూరులో విష్ణు, కొత్తకోట వర్గాలకు పొసగడం లేదు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి, తుగ్గలి నాగేంద్రల మధ్య కూడా విభేదాలు పొడచూపాయి. బహిరంగ వేదికల మీద వీరు పరస్పరం విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి వైఖరిపై పార్టీలోని అనేక మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. పాణ్యం నియోజకవర్గంలో కూడా ఇన్చార్జీ ఏరాసు ప్రతాపరెడ్డి వైఖరిపై పార్టీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ కనీసం కార్యకర్తలకు పనులు ఇవ్వకుండా సొంతానికి చేసుకుంటుండంపై ఆ పార్టీ నేతలు కుమిలిపోతున్నారు. ఇన్చార్జ్ మంత్రిపై అసహనం.. జిల్లాలో విభేదాలు పెరిగిపోవడం..అసంతృప్తులు ఎక్కువగా ఉండడంతో ఇన్చార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో జిల్లాకు చెందిన పార్టీ నేతలతో గురువారం జరిగిన సమావేశంలో ఇన్చార్జ్ మంత్రిగా కాల్వ శ్రీనివాసులు పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రిని నిలదీశారు. అదేవిధంగా మంత్రి అఖిలప్రియ వైఖరితో పాటు నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని కూడా సీఎం మందలించినట్టు సమాచారం. సీనియర్ పార్టీ నేతలను కలుపుకుని పోవడంతో పూర్తిగా విఫలమయ్యారని స్పష్టం చేసినట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. -
‘పర్యాటక శాఖతో సంబంధం లేకుండా..’
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణా నది పవిత్ర సంగమం ప్రాంతంలో 22 నిండుప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. ఈ ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కొన్ని విషయాలను స్పష్టం చేశారు. మంత్రి బోటింగ్ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. బోటింగ్ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని చెప్పారు. ఇప్పటివరకు నదిలో పడవలు నడుపుకునేందుకు పర్యాటక శాఖతో సంబంధం లేకుండా జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆ విధంగా అనుమతులు తీసుకున్నవారెవ్వరూ పర్యాటక శాఖతో అగ్రిమెంట్కావటం లేదని మంత్రి అన్నారు. ఈ లోపాలు సరిదద్దేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని మంత్రి అన్నారు. విధివిధానాల్లో మార్పులు తీసుకొస్తామని, కొత్త పర్యాటక విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని ఆమె వివరించారు. పర్యాటక విధానంతోపాటు నీటి విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఈతగాళ్లను గుర్తించేందుకు వారికి ప్రత్యేక యూనిఫాం ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రమాదానికి గురైన బోటుకు జలవనరులు, పర్యాటక శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని మంత్రి అఖిలప్రియ స్పష్టం చేశారు. గతంలో పలు ప్రమాదాలు ⇒ పి.గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద వశిష్ట గోదావరి పాయలో 2012 నవంబర్ 18వ తేదీ సాయంత్రం మత్స్యకార కుటుంబాలకు చెందిన 30 మందితో వెళ్తున్న ఇంజిన్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్యలంకకు చెందిన కుటుంబాల వారు అదే జిల్లాకు చెందిన మాచేనమ్మ అమ్మవారి గుడికి నదీ మార్గంలో ఉదయం వెళ్లారు. సాయంత్రం తిరిగి బోటుపై ఇళ్లకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ⇒ గత ఏడాది జూన్, జూలై నెలల్లో బొబ్బర్లంక వద్ద కాటన్ బ్యారేజి నుంచి ఒకేసారి నీరు వదిలేయడంతో లంక పొలాలకు వెళ్లే రైతుల్లో నలుగురు చనిపోయారు. వద్దిపర్రు, పేరవరం గ్రామాల రైతులు బోటు మీద వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. -
ఎన్నికల ప్రచారంలో అఖిలప్రియకు భంగపాటు
నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భూమా కుటుంబానికి అడుగడునా నిరసనలు ఎదురవుతున్నాయి. గత ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించినా తమ సమస్యలు తీర్చడం లేదంటూ స్థానికులు నిలదీస్తున్నారు. అభివృద్ధి చేస్తారని ఓట్లేస్తే న్యాయం జరగలేదంటూ భూమా అఖిలప్రియను అడ్డుకుంటున్నారు. ‘సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ సమస్యలు అలానే ఉన్నాయి. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? అన్యాయం జరిగినా స్పందించలేదు. ఎన్నికలు వస్తే మాత్రం ఓట్లు అడుగుతారా?’ అంటూ నంద్యాలలో మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె సోదరుడు విఖ్యాత రెడ్డిని స్థానికులు నిలదీసిన తీరుది. నంద్యాల తొమ్మిదో వార్డు గడిపాడు ప్రాంతంలో అఖిలప్రియ, విఖ్యాత రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏడేళ్ల క్రితం నంద్యాల సమీపంలోని అయ్యలూరు గ్రామ పంచాయితీలోని సిద్ధార్థ నగర్ లో 854 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం మరిన్ని ఇళ్లు కట్టిస్తామని చెప్పడంతో ఇప్పటికే అక్కడ నిర్మాణాలు చేపట్టిన లబ్థిదారుల ఇళ్ల బేస్మెంట్ల ను కూల్చివేశారు. న్యాయం చేయాలంటూ బాధితులు ఎన్నిసార్లు ధర్నాలు, విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. అప్పటినుంచి ఆగ్రహంగా ఉన్న స్థానికులు ఉప ఎన్నిక కోసం ఓట్లు అడిగేందుకు వచ్చిన టీడీపీ నేతలను నిలదీశారు. తమ సమస్యలు తీర్చిన తర్వాత ఓట్ల కోసం తమ కాలనీలకు రావాలంటూ మహిళలు తేల్చిచెప్పి అఖిలప్రియకు ఒకింత షాక్ ఇచ్చారు. దీంతో టీడీపీ నేతలు మరోమాట మాట్లాడకుండా అక్కడ నుంచి వెనుదిరిగారు. -
ఎన్నికల ప్రచారంలో అఖిలప్రియకు భంగపాటు
-
అఖిల, సుబ్బారెడ్డిలతో విడివిడిగా మంతనాలు
అమరావతి: కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం భేటీ అయ్యారు. జిల్లాకు చెందిన మంత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలతో విడివిడిగా చంద్రబాబు విడివిడిగా చర్చించారు. వీరితో సమావేశం కొనసాగుతోంది. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షునిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారయింది. కాగా, జిల్లా నేతలతో జరిపిన సమావేశంలో ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమాపై చర్చ జరిగింది. ఏడు జిల్లాల పరిధిలో రూ.1680 కోట్లతో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో సగానికి పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నదని సీఎం తెలిపారు. ఒక్క అనంత జిల్లాకే రూ.1032 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, కర్నూలు జిల్లాకు రూ.325 కోట్లు, చిత్తూరుకు రూ.163 కోట్లు, కడపకు రూ.77 కోట్లు, ప్రకాశం జిల్లాకు రూ.72 కోట్లు, శ్రీకాకుళంజిల్లాకు రూ.6.55 కోట్లు, నెల్లూరుకు రూ.3.81 కోట్ల మేర ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. పంటల బీమా కింద రూ.534 కోట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. -
కాసేపట్లో కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ
అమరావతి: కర్నూలు జిల్లా టీడీపీ నేతల పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. జిల్లా నేతలతో చంద్రబాబు నాయుడు ఇవాళ సమావేశం అవుతున్నారు ఈ భేటీకి జిల్లా ఇన్ఛార్జ్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి భూమా అఖిలప్రియ, టీజీ వెంకటేష్, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు హాజరు కానున్నారు పార్టీలో సమన్వయం, నేతల్లో విభేదాలు, నంద్యాల ఉప ఎన్నిక తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. భూమా అఖిలప్రియ మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి భూమా నాగిరెడ్డికి సన్నిహితుడు అయిన ఏవీ సుబ్బారెడ్డిని మరింత దూరం పెడుతున్నట్టు సమాచారం. దీంతో అసంతృప్తి చెందిన ఆయన అఖిలప్రియపై తిరుగుబాటు ప్రకటించారు. మరోవైపు నంద్యాలలో భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరినప్పటి నుంచి గ్రూపు రాజకీయాలు తీవ్రస్థాయికి చేరాయి. ఆయన మరణం తర్వాత కూడా అవేవీ చల్లారకపోగా మరింత రాజుకున్నాయి. ప్రధానంగా సీటు ఎవరిదనే విషయంలో తగాదాలు మరింత ముదిరాయి. ఇదే నేపథ్యంలో సీటు తమకేనని.. భూమా కుటుంబానికి కాకుండా శిల్పాకు ఇస్తే ఓడిస్తామని ఫరూఖ్, ఎస్పీవై రెడ్డిలు తెగేసి చెప్పారు. ఈ పరిస్థితుల్లో శిల్పా మోహన్ రెడ్డి కాస్తా పార్టీ మారారు. ఇక నంద్యాల సీటు విషయంలో తమకు ఎదురులేదనుకున్న భూమా కుటుంబానికి తాజాగా ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్ కాస్తా చెమటలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో నంద్యాల సీటు విషయంపై చర్చించడంతో పాటు తగాదాలను పరిష్కరించేందుకు జిల్లానేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో సీటు ఎవరికి ఇద్దామనే అంశంపై భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు మాజీ మంత్రి ఫరూఖ్, ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డిల పేర్లను కూడా ఆ పార్టీ అధిష్టానం తాజాగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇది భూమా కుటుంబానికి మింగుడుపడని వ్యవహారంగా మారినట్టు సమాచారం. -
అలకలు.. లుకలుకలు!
మింగుడుపడని మంత్రి అఖిల వైఖరి - దూరమవుతున్న భూమా అనుచరులు - గుర్రుగా ఆప్తమిత్రుడు ఏవీ - 20 రోజులుగా కనీస పలకరింపులు కరువు - నంద్యాల ఉప ఎన్నికకు ముందు సీఎంకు టెన్షన్ - నేడు జిల్లా నేతలతో హడావుడిగా సమావేశం సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలకు ముందు అధికారపార్టీలో చెలరేగుతున్న పరిణామాలు ఆ పార్టీ అధిష్టానానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీకి బలంగా ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కాస్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సీఎం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. దీనికితోడు తాజాగా భూమా నాగిరెడ్డికి అత్యంత ఆప్తమిత్రుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి మంత్రి భూమా అఖిలప్రియ వైఖరిపై గుర్రుగా ఉండటం మరింత టెన్షన్‌ను పుట్టించింది. అంతేకాకుండా గత 20 రోజులుగా ఏవీ సుబ్బా రెడ్డికి మంత్రి అఖిలప్రియ కనీసం ఫోన్ కూడా చేయలేదని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. భూమాకు అనుచరులుగా ఉన్న వారు కూడా ఏవీకి, భూమాకు ఉన్న అనుబంధం గుర్తు తెచ్చుకుంటూ... ప్రస్తుతం అఖిలప్రియ వ్యవహరిస్తున్న శైలిని చూసి బిత్తరపోతున్నారు. తన తండ్రికి అంత ఆప్తుడిగా ఉన్న ఏవీనే పక్కనే పెట్టే విధంగా ఆమె వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలకు ముందుగా జరుగుతున్న ఈ పరిణామాలు ఆ పార్టీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో శనివారం హడావుడిగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రగిలిపోతున్న ఏవీ.. వాస్తవానికి భూమా నాగిరెడ్డికి, ఏవీ సుబ్బా రెడ్డికి మధ్య అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఒకరు ఒక మాట చెప్పారంటే అది ఇద్దరి మాటగానే చెల్లుబాటు అయ్యేది. భూమా నాగిరెడ్డి ప్రతి కదలికలోనూ ఏవీ సుబ్బారెడ్డి ఉండేవారు. అయితే, ఆయన మరణించిన తర్వాత ఏవీ సుబ్బారెడ్డితో భూమా కుటుంబం అంతగా సన్నిహిత సంబంధాలు నెరపడం లేదనే విమర్శలు ఉన్నాయి. భూమా అఖిలప్రియ మంత్రి పదవి అలంకరించిన తర్వాత ఏవీని మరింత దూరం పెడుతున్నట్టు సమాచారం. ఇదే నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన ఏ కార్యక్రమానికి కూడా ఏవీకి ఆమె కబురు పంపలేదు. గత 20 రోజులుగా కనీసం ఆయనకు ఫోన్ కూడా చేయలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో రగిలిపోతున్న ఆయన తన అనుచరులతో గురువారమే సమావేశమయ్యారు. మరోసారి శుక్రవారం కూడా సమావేశమై మంత్రి వైఖరిపై చర్చించారు. ఇక పార్టీకి దూరమవుదామనేదాకా వ్యవహారం వెళ్లినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు జోక్యం చేసుకుని ఏవీ సుబ్బారెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. అంతేకాకుండా అఖిలప్రియకు కూడా ఫోన్ చేసి కలుపుకుని వెళ్లాలని ఆదేశించినట్టు సమాచారం. నేడు తేలేనా? నంద్యాలలో భూమా నాగిరెడ్డి అధికార పార్టీలో చేరినప్పటి నుంచి గ్రూపు రాజకీయాలు తీవ్రస్థాయికి చేరాయి. ఆయన మరణం తర్వాత కూడా అవేవీ చల్లారకపోగా మరింత రాజుకున్నాయి. ప్రధానంగా సీటు ఎవరిదనే విషయంలో తగాదాలు మరింత ముదిరాయి. ఇదే నేపథ్యంలో సీటు తమకేనని.. భూమా కుటుంబానికి కాకుండా శిల్పాకు ఇస్తే ఓడిస్తామని ఫరూఖ్, ఎస్పీవై రెడ్డిలు తెగేసి చెప్పారు. ఈ పరిస్థితుల్లో శిల్పా మోహన్ రెడ్డి కాస్తా పార్టీ మారారు. ఇక నంద్యాల సీటు విషయంలో తమకు ఎదురులేదనుకున్న భూమా కుటుంబానికి తాజాగా ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్ కాస్తా చెమటలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో నంద్యాల సీటు విషయంపై చర్చించడంతో పాటు తగాదాలను పరిష్కరించేందుకు విజయవాడలో శనివారం జిల్లానేలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో సీటు ఎవరికి ఇద్దామనే అంశంపై భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు మాజీ మంత్రి ఫరూఖ్, ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డిల పేర్లను కూడా ఆ పార్టీ అధిష్టానం తాజాగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇది భూమా కుటుంబానికి మింగుడుపడని వ్యవహారంగా మారినట్టు సమాచారం. -
అఖిలప్రియ, సుజయ బాధ్యతల స్వీకరణ
అమరావతి: ఇటీవల మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన భూమా అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పర్యాటక శాఖ మంత్రిగా అఖిలప్రియ, గనుల శాఖ మంత్రిగా సుజయ కృష్ణ రంగారావులు తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. పేద కళాకారులకు ఆర్థిక సాయం చేసే ఫైల్‌పై అఖిలప్రియ తొలి సంతకం చేశారు. టెంపుల్ టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఆమె చెప్పారు. త్వరలో విశాఖ నుంచి అరకు వరకు పర్యాటక రైలు ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. జీఆర్డీ, జీకేఆర్, మినర్వా గ్రాండ్, బాలాజీ రిసార్డ్స్తో ఎంవోయూల ఫైల్‌పై సంతకం చేశారు. ఏపీటీటీసీ యాప్‌ను ఆవిష్కరించారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంటే బాబుకు భయం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తమ పార్టీ ఎమ్మెల్యేలను చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకు భయమని జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో ఏకంగా 11 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉండటంతో ఆయన ఇక్కడికి వస్తే బ్యాలెన్స్ కోల్పోతున్నారని మండిపడ్డారు. ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్సార్సీపీని వదిలి టీడీపీలో చేరే ప్రసక్తేలేద ని శుక్రవారం.. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరిత, ఎస్వీ మోహన్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఐజయ్య, మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డిలు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంక్రాంతిలోగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారని.. దీనిని ప్రజలు నమ్మబోరన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేత లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని...వైఎస్ కు టుంబం వెంటే ఉంటామని స్పష్టం చేశా రు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తలి పాలు తాగి రొమ్ము గుద్దే రకం..! టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఎమ్మెల్యేలు విమర్శించారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయారని, డ్వాక్రా మహిళల రుణమాఫీ ఊసే ఎత్తడం లేదన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని.. ఇటువంటి పరిస్థితులల్లో జన్మభూమి సభలో ప్రజలు నిలదీస్తున్నారని.. ఈ సమస్యల నుంచి దృష్టి మళ్లిం చేందుకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారనే ప్రచారం చేస్తున్నారన్నారు. అధికార పార్టీకి బాకాలూదుతున్న ఒక మీడియా.. ప్రజా సమస్యలపై వార్తలు రాయాలని సూచించారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉందని.. అందుకే వలసలను ప్రోత్సహించేందుకు సీఎం కు యుక్తులు పన్నుతున్నారన్నారు. అయితే ఆయన చేష్టలు తమ వద్ద ఉడకబోవన్నారు. చంద్రబాబు నైజం తమకు తెలుసునని.. ఆయన తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేరకమని మండిపడ్డారు. త్వరలో క ర్నూలు కార్పొరేషన్ ఎన్నిక లు ఉన్నాయని.. ప్ర జలు తగిన బు ద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్సీపీలోకి వస్తున్నామంటున్నారు.. వాస్తవానికి ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలే అసంతృప్తిగా ఉన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారన్నారు. అందుకే వైఎస్సార్సీపీలోకి వస్తామని..వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాలని అసెంబ్లీలో అనేక మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితి ఉంటే.. వైఎస్సార్సీపీని బలహీనం చేసే ఉద్దేశంతో అబద్ధపు ప్రచారానికి దిగుతున్నారన్నారు. అది జన్మలో సాధ్యమయ్యే పని కాదని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. వ్యక్తిగత పనులతో తన తండ్రి భూమా నాగిరెడ్డి సమావేశానికి రాలేకపోయారని, అయితే కొన్ని పత్రికలు.. పార్టీ మారాలనే ఉద్దేశంతోనే భూమా హాజరు కాలేదని రాస్తాయేమోనని భూమా అఖిలప్రియ చమత్కరించారు. -
రాబిన్ హుడ్ కాదు...రాబింగ్ హుడ్...
-
రాబిన్ హుడ్ కాదు...రాబింగ్ హుడ్...
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రాబింగ్ హుడ్లా వ్యవహరిస్తోందని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. ఆమె గురువారం అసెంబ్లీలో డీజిల్, పెట్రోల్‌పై వ్యాట్ పెంపు గురించి మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పటికీ రాష్ట్రప్రభుత్వం వ్యాట్ విధించడం సామాన్యులపై పెనుభారం పడుతోందన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా వ్యాట్ విధిస్తున్నారని అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు నుంచి రైతులు వరకూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఉదంతాన్నిను అఖిలప్రియ సభలో ప్రస్తావించారు. రాబిన్ హుడ్ ధనవంతులను దోచుకొని...ఆ సంపదను పేదలకు పంచితే... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదలను దోచుకుని... ఆ సందపను సంపన్నులకు పెడుతోందని అన్నారు. సర్కార్ రాబింగ్ హుడ్ అని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే...మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం సరికాదన్నారు. రైతులు ట్రాన్స్‌పోర్టు ఖర్చులను భరించలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేకహోదా కోసం అధికార, ప్రతిపక్షంతో పాటు స్పీకర్ సహా ...కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుందామని అఖిలప్రియ కోరారు. -
దౌత్య మంత్రం
‘ఆళ్లగడ్డ’ ఏకగ్రీవానికి మార్గం సుగమం * రాజకీయ అనుభవంతో చక్రం తిప్పిన భూమా * వ్యూహాత్మక అడుగులతో చల్లారిన వేడి * టీడీపీ, కాంగ్రెస్ స్వచ్ఛంద సహకారం సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి అడ్డంకులు తొలగిపోయాయి. రెండు రోజుల క్రితం వరకు పోటీ తప్పదనే భావన సర్వత్రా వ్యక్తమైంది. ఊహించని విధంగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చూపిన రాజకీయ చతురత ఏకగ్రీవానికి బాటలు వేసింది. అన్ని రాజకీయ పార్టీలతో తనకున్న సత్సంబంధాలను ఉపయోగించుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో లేకుండా చేయడంలో సఫలీకృతులయ్యారు. భూమాకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవమే ఇందుకు ఉపకరించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. అప్పటికే ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఆమె పేరును అభ్యర్థుల17వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించినట్లుగానే ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే సాంకేతిక కారణాలతో ఉప ఎన్నికకు ఆలస్యంగా పచ్చజెండా ఊపింది. దీంతో ఈనెల 17న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఆళ్లగడ్డలో రాజకీయ సందడి నెలకొంది. శాసనసభ్యులు చనిపోయి.. ఆ స్థానంలో వారి కుటుంబ సభ్యులు పోటీలో నిలిస్తే ఇతర పార్టీలేవీ తమ అభ్యర్థులను బరిలో నిలపరాదనే సంప్రదాయం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇక్కడా అదే పరిస్థితి ఉంటుందని అందరూ భావించారు. కానీ టీడీపీ నేతలు పోటీలు నిలుస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఆ మేరకు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వద్ద పంచాయితీ పెట్టారు. ఉప ముఖ్యమంత్రితోనూ చర్చించారు. ఇద్దరు ఆశావహులు బరిలో నిలిచే విషయమై పోటీపడ్డారు. ఇదంతా నాణేకి ఒకవైపు మాత్రమే. భూమా నాగిరెడ్డి తనకున్న విస్తృత రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చక్రం తిప్పడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టరాదని ఒకప్పుడు చంద్రబాబే స్వయంగా ప్రతిపాదించిన అంశాన్ని ఆ పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఆ పార్టీ ముఖ్య నేతలతో దౌత్యం నెరిపి టీడీపీ నాయకులను పోటీకి దూరంగా ఉంచగలిగారు. పోటీకి దూరంగా ఉందామంటూ ఆ పార్టీ అధినేత ద్వారానే ఆశావహులను ఒప్పించగలగటం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. పీసీసీపై డీసీసీచే ఒత్తిళ్లు నందిగామ ఉప ఎన్నికలో బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ.. ఆ సందర్భంలోనే ఆళ్లగడ్డ ఉప ఎన్నికలోనూ పార్టీ తరఫున అభ్యర్థిని బరిలో నిలుపుతామని స్పష్టం చేసింది. పీసీసీ నిర్ణయంతో తొలుత ఇక్కడ నలుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను డీసీసీ అధ్యక్షుడు పార్టీ పెద్దల ముందుంచారు. తీరా నామినేషన్ల ఘట్టం ముగిసే సమయానికి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పోటీలో నిలవటం లేదని స్వయంగా ప్రకటించేలా భూమా పావులు కదిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కేంద్ర రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డితో మంతనాలు నెరిపి.. ఆ వెంటనే జిల్లా కాంగ్రెస్ నేతలు, డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్యతో సమావేశమై పోటీకి దూరంగా ఉండాలనే విషయమై తీర్మానం చేయించడంలో విజయం సాధించారు. ఒక దశలో డీసీసీచే పీసీసీపైనే ఒత్తిడి తీసుకొచ్చి ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు మార్గం సుగమమం చేసుకోవడం విశేషం. -
జగనన్నను సీఎంగా చూడాలన్నదే అమ్మ ఆశయం
ఉయ్యాలవాడ, న్యూస్‌లైన్: దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి ఏనాడు పదవుల కోసం ఆరాటపడలేదని, జగనన్నను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే అమ్మ ఆశయమమని ఆమె పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియ అన్నారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం మండలంలోని ఆర్.పాంపల్లె, కొండుపల్లె, సర్వాయిపల్లె, పెద్దయమ్మనూరు, బోడెమ్మనూరు గ్రామాల్లో ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శోభానాగిరెడ్డి భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆమె చూపించిన ప్రేమాభిమానాలు అందరి హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచాయన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి అమ్మకు ఘనమైన నివాళి అర్పించాలని ఓటర్లను కోరారు. ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారని, ఆ అభిమానాన్ని ఓట్ల ద్వారా అమ్మకు చూపించాలన్నారు. అమ్మకు వేసే ప్రతి ఓటు దేశంలోనే చారిత్రాత్మకం అవుతుందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. బోడెమ్మనూరులో వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ మెంబర్ ఫక్కీరా ఖాసింసాహెబ్ మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతోనే తెలుగుదేశం పతనానికి పునాది పడిందన్నారు. సర్వాయిపల్లె గ్రామంలో మాజీ గ్రామ సర్పంచ్ ఆవుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీ తెచ్చి శోభమ్మ ప్రజల హృదయాల్లో నిలిచిందని చాటుతామన్నారు. ప్రచారంలో ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల ఆ పార్టీ మండల కన్వీనర్లు మారంరెడ్డి అయ్యపురెడ్డి, గాండ్ల పుల్లయ్య, కోవెలకుంట్ల మార్కెట్‌యార్డ్ మెంబర్ బుడ్డా చంద్రమోహన్‌రెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్‌లు రామగోపాల్‌రెడ్డి, కర్రా రాజానందరెడ్డి, బత్తుల రామచంద్రుడు, గడ్డం దస్తగిరిరెడ్డి, పోచా రాధాకృష్ణారెడ్డి, సింగల్‌విండో ఉపాధ్యక్షుడు మద్దూరు రామకృష్ణారెడ్డి, ఉయ్యాలవాడ సింగల్‌విండో అధ్యక్షుడు బుడ్డా విశ్వనాథరెడ్డి, ఆ పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి, బోరెడ్డి నర్సిరెడ్డి, శింగం వెంకటేశ్వరరెడ్డి, బుడ్డా రామిరెడ్డి, బోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గోపిరెడ్డి హరిప్రసాదరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా మహిళలు పాల్గొన్నారు. -
అమ్మను భారీ మెజార్టీతో గెలిపిద్దాం
ఆళ్లగడ్డ : దివంగత ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ, ఆమె చూపించిన ప్రేమ, అభిమానాలు అందరి హృదయాల్లో నిలిచి ఉన్నాయని కుమార్తె భూమా అఖిలప్రియ అన్నారు. అమ్మను భారీ మెజార్టీతో గెలిపించి ఆమెకు ఘనమైన నివాళి అర్పిద్దామని పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం మండలంలోని భాగ్యనగరం, కొండాపురం, రామచంద్రాపురం, దొర్నిపాడు, అమ్మిరెడ్డినగరం, అర్జునాపురం గ్రామాల్లో ఆమె రోడ్‌షో నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా నిరాజనాలు పట్టి ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొండాపురం గ్రామంలోలో ఆమె మాట్లాడుతూ.. అమ్మ ఎల్లప్పుడూ ప్రజల క్షేమం కోసమె తపించేవారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి శోభానాగిరెడ్డి ఎంతో కృషి చేశారని విజయ డెయిరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి అన్నారు. లక్ష మెజార్టీతో ఆమెను గెలిపించి రుణం తీర్చుకుందామన్నారు.