
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఖిలప్రియను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మానభంగాలకు ఉసిగొల్పుతున్నారంటూ ప్రధాని మోదీపై ఆమె వ్యాఖ్యలు చేయడం సంస్కారహీనం ఆయన విమర్శించారు. ప్రభుత్వ సొమ్ముతో నవనిర్మాణ దీక్షలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. 2019లో టీడీపీకి ఓటేస్తే తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని, చంద్రబాబును ప్రపంచ దేశాల అధినేతగా ప్రజలు పంపించాలని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment