న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ తదితరులు పాల్గొన్న ఈ కీలక భేటీలో తీసుకున్న నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసి నుంచే మోదీ పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఈ ఒక్క చోటు నుంచేనా లేక మరో నియోజకవర్గం నుంచి సైతం పోటీచేస్తారా అనేది నిర్ణయించలేదని సమాచారం.
2014 ఎన్నికల్లో మోదీ రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అభ్యర్థుల ఖరారులో గెలుపు అవకాశాలు, వయోపరిమితి వంటివి పరిగణనలోకి తీసుకోవాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ..జార్ఖండ్‌లోని ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోనుందని వెల్లడించారు. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఈ పార్టీ కి రాష్ట్రంలోని ఒక సీటు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment