Varanashi
-
బీజేపీ సీనియర్ నేత కన్నుమూత
వారణాసి: యూపీకి బీజేపీ సీనియర్ నేత శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి కన్నుమూశారు. ఆయన వారణాసి సౌత్ సీటు నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనను ఆస్పత్రిలో పరామర్శించారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఆయనకు ఫోన్ చేసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మృతికి అన్ని పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి.శ్యామ్‌దేవ్ రాయ్ వారణాసిలోని దుర్గాకుండ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు వారణాసిలో నిర్వహించనున్నట్లు సమాచారం. నిజాయితీపరుడైన నేతగా ఆయనకు గుర్దింపు ఉంది. 2017లో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు.ఇది కూడా చదవండి: Sambhal Controversy: ‘అది మసీదు కాదు.. హరిహరుల ఆలయం’ -
దీపావళి వేడుకలు: అయోధ్య నుంచి అమృత్సర్ వరకూ..
దీపావళి.. దివ్యకాంతుల మధ్య జరుపుకునే ఆనందాల పండుగ. మన దేశంలోని అందరూ జరుపుకునే అతి పెద్ద పండుగ దీపావళి. దేశంలోని వివిధ ప్రాంతాలలో దీపావళికి ప్రత్యేక సంప్రదాయాలనున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను భావిస్తారు. అయోధ్యలో ఈ ఏడాది దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే పలు ప్రధాన నగరాల్లోనూ దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి.అయోధ్యఈ ఏడాది ప్రపంచమంతా అయోధ్యలో జరిగే దీపావళి వేడుకలను చూసేందుకు పరితపిస్తోంది. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. 500 ఏళ్ల తరువాత శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టితుడయ్యాడు. రామాయణంలోని వివరాల ప్రకారం శ్రీరాముడు రావణాసురుడిని ఓడించి 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళికి అయోధ్యలో 28 లక్షల దీపాలు వెలిగించి, ప్రపంచ రికార్డు నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వారణాసికాశీ అని కూడా పిలిచే వారణాసి భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచంలోని పురాతన నగరాలలో వారణాసి ఒకటి. ఇక్కడి గాలిలో ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంటుంది. ప్రతి సంవత్సరం దీపావళికి లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలివస్తుంటారు. ఇక్కడ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.ఉదయపూర్రాజస్థాన్లోని ఉదయపూర్ నగరం సరస్సుల నగరంగా పేరొందింది. ఇక్కడ కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. నగరంలోని వీధులను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. సరస్సుల ఒడ్డున ఉన్న ప్యాలెస్‌లు విద్యుత్ దీపకాంతులతో వెలుగొందుతుంటాయి. ఉదయపూర్‌లోని పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.అమృత్సర్అమృత్సర్లో దీపావళి వేడుకలు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. స్వర్ణ దేవాలయంలో దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి నాడు గ్వాలియర్ కోట నుండి ఆరవ సిక్కు గురువుతో పాటు 52 మంది ఇతర ఖైదీలను విడుదల చేసిన రోజును సిక్కు సోదరులు గుర్తు చేసుకుంటారు. గోల్డెన్ టెంపుల్ కూడా బంగారు దీపాలతో ప్రకాశవంతంగా మారిపోతుంది.కోల్కతాపశ్చిమబెంగాల్లో దీపావళి నాడు కాళీ పూజలు నిర్వహిస్తారు. అమావాస్య రాత్రివేళ కాళీ పూజలు చేస్తారు. దీంతో దీపావళి రాత్రి వేళ నగరం దీపకాంతులతో శోభాయమానంగా మారిపోతుంది.ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు -
గంగలో భక్తుల పుణ్యస్నానాలు.. తీరంలో సందడి
ఈరోజు (ఆదివారం) గంగా దసరా.. ఈ సందర్భంగా భక్తులు వారణాసిలోని గంగా దశాశ్వమేధ ఘాట్‌లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఘాట్ల వద్ద భక్తుల సందడి నెలకొంది. అలాగే ప్రయాగ్‌రాజ్, అయోధ్య, హరిద్వార్‌లోని గంగా ఘాట్ల వద్ద భక్తుల రద్దీ నెలకొంది.గంగా నది ఘాట్ల వద్ద స్నానాలు చేసే భక్తులకు భద్రత కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్‌కుమార్ పలువురు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్నానఘట్టాలను పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించాలని, నదీ ఘాట్ల వద్ద తగినంత వెలుతురు ఉండేలా చూడాలని, బారికేడింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.గత కొన్నేళ్లుగా ఉత్సవాల నేపధ్యంలో తలెత్తుతున్న వివాదాలను గుర్తుంచుకుని, ఊరేగింపు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని పోలీసులకు డీజపీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిశితంగా పరిశీలించాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో యూపీ-112 వాహనాలను మోహరించాలని కోరారు. #WATCH | Varanasi, UP: Devotees take a holy dip at the Dashashwamedh Ghat of the Sacred Ganga on the occasion of Ganga Dussehra. pic.twitter.com/DlZPo3rlDV— ANI (@ANI) June 16, 2024 -
ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
లోక్‌సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే. ఎందుకంటే ప్రధాని మోదీ ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో స్టాండప్ కమెడియన్ 'శ్యామ్ రంగీలా' ప్రధాని మోదీపై పోటీ చేయాలనీ ప్రయత్నించారు. అయితే అతని నామినేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తిరస్కరణకు గురైంది. దీంతో మోదీ పోటీ చేస్తున్న వారణాసి బరిలో దిగాలనుకున్న శ్యామ్ రంగీలా ఎవరనేది ప్రశ్నగా మారిపోయింది.. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూసెయ్యండి.రాజస్థాన్‌కు చెందిన శ్యామ్ రంగీలా.. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. ఈ ఎన్నికల్లో ఆయనపైనే పోటీ చేస్తున్నట్టు ప్రకటించి వార్తల్లోకెక్కాడు. ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాడు శ్యామ్ రంగీలా. నామినేషన్ తిరస్కరణకు గురవడంతో.. ప్రధానిపై పోటీ చేసే అవకాశం మిస్ అయ్యాడు. అయితే నామినేషన్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.మే 10, 13వ తేదీల్లో నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా.. తన పత్రాలను ఎవరూ తీసుకోలేదంటూ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశాడు శ్యామ్ రంగీలా. చివరి రోజైన మే 14న ఇదే పరిస్థితి అని తెలిపాడు. అనేక ప్రయత్నాల తరువాత నామినేషన్ల గడువు ముగియడానికి రెండు నిమిషాల ముందు.. అధికారులు తన డాక్యుమెంట్లు తీసుకున్నారని చెప్పాడు.మరుసటిరోజు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి శ్యామ్ రంగీలా పత్రాలను తిరస్కరించారు. నామినేషన్ సంపూర్ణంగా లేదని, అఫిడవిట్‌పై ప్రమాణం చేయలేదని పేర్కొన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తన పత్రాలను తిరస్కరించారని శ్యామ్ రంగీలా ఆరోపించారు.లోక్‌సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుంది. దీనికి మే 14న ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ బరిలోకి దిగారు. వారణాసిలో పోటీకి మొత్తం 55 మంది నామినేషన్లు వేయగా.. 36 పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోజార్టీ పెంచేందుకే పోటీలో ఉన్నవారిని తప్పిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.ఆధ్యాత్మిక నగరమైన వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీచేయడం వరుసగా ఇది మూడోసారి. తొలిసారి 2014లో ఇక్కడి నుంచి పోటీచేసిన ప్రధాని.. 56శాతం ఓట్లతో విజయం సాధించారు. 2019లో దాదాపు 5 లక్షల మోజార్టీతో తిరుగులేని విజయం దక్కించుకున్నారు. ఈసారి మెజార్టీ 5లక్షలు దాటి పోతుందని ధీమా వ్యక్తంచేస్తోంది బీజేపీ. ఓ కమెడియన్ పోటీచేసినంత మాత్రాన.. మోదీ ఆధిక్యత తగ్గుతుందని అనుకోవడం విపక్షాల తెలివితక్కువతనమని కొట్టిపారేసింది. -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు
లక్నో: ముప్పై ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ నేత సోదరుడి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్– రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీకి వారణాసి కోర్టు జీవిత ఖైదు విధించింది. 1991 ఆగస్ట్ 3వ తేదీన కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ సోదరుడు అవధేశ్ రాయ్ వారణాసిలోని ఆయన ఇంటిగేటు వద్దే హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి అన్సారీతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవధేశ్ రాయ్ హత్య కేసును విచారించిన ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక జడ్జి అవనీశ్ గౌతమ్ అన్సారీకి జీవిత ఖైదుతోపాటు రూ.1.20 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు లాయర్ ఒకరు చెప్పారు. బందా జైలులో ఉన్న అన్సారీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరయ్యారు. వేర్వేరు రాష్ట్రాల్లో 61కి పైగా క్రిమినల్ కేసులను అన్సారీ ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు ఆరు కేసుల్లో దోషిగా తేలింది. ఒక కేసుకు సంబంధించి ఏప్రిల్‌లో ఘాజీపూర్ కోర్టు అన్సారీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. యూపీలోని మౌసదర్ స్థానం నుంచి అయిదు పర్యాయాలు అన్సారీ ఎమ్మెల్యే అయ్యాడు. 2022 ఎన్నికల్లో ఆయన కొడుకు అబ్బాస్ అన్సారీ సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. -
చిన్నారికి థాంక్స్ చెప్పిన మోదీ..!
వారణాసి : ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్రమోదీ ఓ చిన్నారి విన్నపాన్ని ఆలకించారు. శుక్రవారం నామినేషన్ వేయడానికి ముందు రోడ్‌షో నిర్వహించిన మోదీ అభిమానులు, కార్యకర్తల్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తుండగా.. చేతిలో ఓ చీటి పట్టుకున్న చిన్నారి ఆయనకు సంజ్ఞ చేసింది. అది గ్రహించిన మోదీ ఆ చిన్నారి చేతిలో ఉన్న చీటిని తీసుకోవాల్సిందిగా స్పెషల్ ప్రొటెక్షన్ కమాండోలకు (ఎస్పీజీ) చెప్పారు. అనంతరం ఆ కాగితాన్ని చదివిన మోదీ చిన్నారికి థాంక్స్ చెప్పారు. ‘థాంక్యూ బేటా’ అంటూ ప్రసంగం కొనసాగించారు. ‘స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్ల తర్వాత అధికార పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు అంగీకరించాలి. ప్రజలు తమ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. గత నెలన్నర రోజులగా దేశంలోని అన్ని ప్రదేశాలు తిరిగాను. మోదీ, షా, యోగి అందరూ బీజేపీ కార్యకర్తలే. ఈ ఎన్నికల్లో మా తరపున దేశప్రజలు పోరాడుతున్నారు’ అని చెప్పారు. ఇక వారణాసిలో ఘన విజయం సాధించడం.. పోటీచేసిన అన్ని చోట్ల బీజేపీ జెండా ఎగురవేయడం మన ముందున్న రెండు ప్రధాన అంశాలని అన్నారు. బీజేపీ ప్రతి బూత్ కార్యకర్త విజయం సాధించి కాషాయ జెండా మరింత ఎత్తున ఎగిరేలా చేయాలని పిలుపునిచ్చారు. ‘ఈసారి కూడా నేను రికార్డు విజయం సాధించాలని కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. నా విజయమొక్కటే ముఖ్యం కాదు. దేశం ప్రజాస్వామ్య విజయం సాధించాలన్న దానిపైనే నాకు ఎక్కువ ఆసక్తి. తనకు గంగమ్మ దీవెనలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ’ అన్నారు. -
గత ఐదేళ్లు శ్రమించాం.. వచ్చే ఐదేళ్లలో ఫలితాలు
వారణాసి/దర్భంగా: ఏ ఉగ్రమూకలకైనా సరికొత్త భారత్ దిమ్మతిరిగే జవాబు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలోని ఏ నగరంలోనూ, పుణ్యక్షేత్రాలు, ఆలయాల్లోనూ బాంబు పేలుళ్లు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. ఇటీవల కుంభమేళాను సైతం విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించామని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలపై వైమానికదాడుల నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ భారత్‌కు అండగా నిలుస్తున్నాయని వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం అదే ప్రాంతంలో 42 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామనీ, తమ ప్రభుత్వం ఇలాగే పనిచేస్తుందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సొంత నియోజకవర్గం వారణాసిలో గురువారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్నీ చేసేశా అని చెప్పను.. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేయడంపై మోదీ మాట్లాడుతూ..‘నేను వారణాసిలో ఏయే అభివృద్ధి పనులను చేపట్టాలని భావించానో అవన్నీ పూర్తి చేసేశానని చెప్పను. కానీ ఆ అభివృద్ధి పనులు మాత్రం ఇప్పుడు సరైన దిశలో, వేగంగా జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో మేం నిజాయితీగా పనిచేశాం. దాని ఫలితాలు రాబోయే ఐదేళ్లలో ప్రజలు చూడబోతున్నారు’ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ప్రస్తుతం పెనుసమస్యగా మారిపోయిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇటీవల శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ప్రజలంతా ప్రార్థనల కోసం కుటుంబాలతో కలిసి చర్చిలకు వచ్చారు. కానీ వాళ్లు ప్రాణాలతో ఇళ్లకు తిరిగి వెళ్లలేదు. వాళ్లకు జీవితంలో అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నింటిని ఉగ్రవాదులు ఒక్కసారిగా లాగేసుకున్నారు. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించకపోతే దేశానికి అన్యాయం చేసినట్లే’ అని స్పష్టం చేశారు. అనుమతిస్తే నామినేషన్ వేస్తా.. ఉగ్రవాదులకు తమదైన భాషలో జవాబు చెప్పే ధైర్యం కాశీ(వారణాసి) తనకు ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ‘మీ అందరికీ సేవచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమే. మీరంతా అనుమతిస్తే మరోసారి నేను నామినేషన్ దాఖలు చేస్తా’ అని తెలిపారు. ‘మీ అందరికీ మరోసారి సేవచేసేందుకు ఓట్లడిగే ముందు గత ఐదేళ్లలో ఏం చేశానో చెప్పాల్సిన బాధ్యత, జవాబుదారీతనం నాపై ఉన్నాయి. కానీ కొంతమంది(కాంగ్రెస్ పార్టీ) మాత్రం 70 ఏళ్లు పాలించినా ఏం చేశారో చెప్పరు. అది వారిష్టం’ అని చురకలు అంటించారు. వారణాసిలో నామినేషన్ నేడే.. ప్రధాని మోదీ బీజేపీ తరఫున వారణాసిలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. తొలుత ఉదయం 9.30 గంటలకు వారణాసిలోని బూత్‌స్థాయి నేతలు, కార్యకర్తలతో మోదీ సమావేశమవుతారని వెల్లడించారు. కాలభైరవుడికి ఉదయం 11 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నామినేషన్ వేసేందుకు వెళతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, అకాలీదళ్ నేత ప్రకాశ్‌సింగ్ బాదల్, ఎల్జేపీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్ హాజరవుతారని చెప్పారు. వీరితో పాటు అన్నాడీఎంకే, అప్నాదళ్, నార్త్–ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ నేతలు హాజరయ్యే అవకాశముందన్నారు. లాంతర్ల రోజులు పోయాయి.. బిహార్ పర్యటనలో భాగంగా రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పించారు. బిహార్‌లో లాంతర్లకు(ఆర్జేడీ ఎన్నికల గుర్తు) కాలం చెల్లిందనీ, ఇప్పుడు ఇంటింటికి విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఈ లాంతర్వాలాలు(ఆర్జేడీ నేతలు) ప్రజల ఇళ్లకు విద్యుత్ సౌకర్యాన్ని తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ వీరంతా తమ కుటుంబాల్లో వెలుగు నింపుకునే పనిలో బిజీగా ఉన్నారు. వీళ్లలో ఒకరు ఫామ్‌హౌస్ కడుతుంటే, మరొకరు ఏకంగా షాపింగ్ మాల్ నిర్మించారు. ఇంకొకరు అయితే రైల్వే టెండర్ల ద్వారా రెండుచేతులా సంపాదించారు’ అని ఐఆర్సీటీసీ కుంభకోణాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. మతవిశ్వాసాల కారణంగా తాను ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించననీ, భారత్ మాతాకీ జై అనడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ చెప్పడంపై మోదీ స్పందిస్తూ..‘డిపాజిట్లు రాకుండా ఓడించాల్సింది ఇలాంటి వ్యక్తులను కాదా?’ అని సభికులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా బిహార్ సీఎం నితీశ్ మాట్లాడుతూ.. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్ శరవేగంగా అభివృద్ధి చెందడానికి సాయం అందించినందుకు మోదీకి నితీశ్ కృతజ్ఞతలు తెలిపారు. మోదీ నామస్మరణ.. గురువారం సాయంత్రం మోదీ వారణాసిలో భారీ రోడ్‌షోను నిర్వహించారు. తొలుత బనారస్ హిందూ వర్సటీ వ్యవస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాళవీయ విగ్రహానికి నివాళులు అర్పించిన ర్యాలీని ప్రారంభించారు∙మోదీ 7 కి.మీ పాటు సాగిన రోడ్ షోలో బీజేపీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్ షోకు హాజరైన వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు మోదీ.. మోదీ.. భారత్ మాతాకీ జై అని ఇచ్చిన నినాదాలతో వారణాసి వీధులు మార్మోగాయి. బీజేపీ చీఫ్ అమిత్, యూపీ ముఖ్యమంత్రి యోగి, రాష్ట్ర బీజేపీ చీఫ్ మహేంద్రనాథ్ సహా పలువురు నేతలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షో ముగింపులో భాగంగా దశాశ్వమేథ ఘాట్ కు చేరుకున్న మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాతో కలిసి గంగానదికి హారతి ఇచ్చారు. ‘వారణాసిలో లభించిన ఆత్మీయత, ప్రేమకు కృతజ్ఞుడిని’ అని ట్వీట్ చేశారు. మాళవీయ విగ్రహానికి నివాళులు అర్పించాక మద్దతుదారులకు మోదీ అభివాదం -
మోదీ మళ్లీ వారణాసి నుంచే
న్యూఢిల్లీ: అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ అగ్ర నాయకుడు ఎల్కే అడ్వాణీ స్థానంలో గాంధీనగర్‌లో పోటీచేయబోతున్నారు. హోలీ పర్వదినం సందర్భంగా బీజేపీ బుధవారం 184 మంది అభ్యర్థులతో గురువారం తొలి జాబితాను విడుదలచేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్(28), మహారాష్ట్ర(16), తెలంగాణ(10), పశ్చిమ బెంగాల్(28), అస్సాం(8), ఉత్తరాఖండ్(5), తమిళనాడు(5), ఛత్తీస్‌గఢ్(5), జమ్మూ కశ్మీర్(5), కర్ణాటక(21), కేరళ(13), ఒడిశా(10), రాజస్తాన్(16), తమిళనాడు(5), అరుణాచల్ ప్రదేశ్(2), ఆంధ్రప్రదేశ్(2) తదితర రాష్ట్రాల్లో బీజేపీ తన అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢీకొనబోతున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లక్నోలో, రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌లో, హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్‌ప్రదేశ్(పశ్చిమ)లో పోటీచేయబోతున్నారు. కేంద్ర మంత్రులు వీకే సింగ్(ఘజియాబాద్), మహేశ్ శర్మ(గౌతమబుద్ధనగర్–నోయిడా)లు తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకున్నారు. బిహార్‌లోనూ 17 మంది అభ్యర్థులను ఖరారుచేసిన బీజేపీ ఆ జాబితాను రాష్ట్ర యూనిట్‌కు పంపింది. మిత్రపక్షాలతో కలిసి అందులోని పేర్లను వెల్లడిస్తామని నడ్డా చెప్పారు. యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి నుంచి తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత మంది సిట్టింగ్‌లను తప్పించే అవకాశాలున్నాయి. ముఖ్యాంశాలు ► క్రిష్ణరాజ్(షాజహాన్‌పూర్) మినహా లోక్‌సభ ఎంపీలైన దాదాపు అందరు కేంద్ర మంత్రులకు టికెట్లు దక్కాయి ► యూపీలో ప్రకటించిన 28 మందిలో ఆరుగురు సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించారు. అందులో ఎస్సీ కమిషన్ చైర్మన్, ఆగ్రా ఎంపీ రామ్‌శంకర్ కఠారియా, క్రిష్ణరాజ్ ఉన్నారు. ► మాజీ కేంద్ర మంత్రి బీసీ ఖండూరి(గార్వాల్), ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్‌సింగ్ కోషియారి(నైనిటాల్)ల స్థానంలో కొత్తవారికి చోటు కల్పించారు. ► ఇటీవలే మిజోరం గవర్నర్‌గా వైదొలిగిన కుమ్మనం రాజశేఖరన్‌కు కేరళలోని తిరువనంతపురం టికెట్ కేటాయించారు. ► తమిళనాడు యూనిట్ చీఫ్ తమిళిసాయి సౌందరరాజన్ తూత్తుకుడిలో డీఎంకే అభ్యర్థి కనిమొళితో పోటీపడనున్నారు. ► మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ కుమారుడు సుజయ్ విఖే పాటిల్‌కు అహ్మద్‌నగర్ టికెట్ దక్కింది. ఆయన ఇటీవలే బీజేపీలో చేరారు. ► మహారాష్ట్రలో వారసత్వ రాజకీయ నేపథ్యమున్న పూనమ్ మహాజన్(ప్రమోద్ మహాజన్ కూతురు), ప్రీతమ్ ముండే(గోపీనాథ్ ముండే కూతురు), రక్షా ఖడ్సే(ఏక్నాథ్ ఖడ్సే కోడలు)లకు జాబితాలో చోటు దక్కింది. మరోసారి రాహుల్ వర్సెస్ స్మృతి అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీల మధ్య మరోసారి ఆసక్తికర పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో రాహుల్ చేతిలో స్మృతి లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలైనా స్ఫూర్తిదాయక ప్రదర్శనే చేశారు. మరోవైపు, ముంబై నార్త్ సెంట్రల్లో పూనమ్ మహాజన్(బీజేపీ), సంజయ్ దత్ సోదరి ప్రియాదత్(కాంగ్రెస్)ల మధ్య ఇలాంటి పోరే జరిగే అవకాశాలున్నాయి. క్రితంసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాదత్‌ను పూనమ్ మహాజన్ ఓడించారు. అడ్వాణీ రాజకీయ జీవితానికి తెర! బీజేపీ తొలి జాబితాలో 91 ఏళ్ల కురువృద్ధుడు, అగ్ర నేత ఎల్కే అడ్వాణీ పేరును విస్మరించడం ఆశ్చర్యపరిచింది. గాంధీనగర్ నియోజకవర్గంలో ఆయన స్థానంలో పోటీచేస్తున్న అమిత్ షా తొలిసారి లోక్‌సభ బరిలో దిగబోతున్నారు. దీంతో అడ్వాణీ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని భావిస్తున్నారు. 1998 నుంచి అడ్వాణీ గాంధీనగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, తొలినాళ్లలో ఆయనకు అమిత్ షా ప్రచార బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం. ప్రస్తుతం కూడా గాంధీనగర్ ఎంపీగా ఉన్న అడ్వాణీ ఆ స్థానం నుంచి ఐదు సార్లు గెలుపొందారు. 2014లో మోదీ–షా ద్వయం బీజేపీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అడ్వాణీ ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ లోక్‌సభలో 92 శాతం పార్లమెంట్ సమావేశాలకు హాజరైనా ఆయన మాట్లాడింది కేవలం 350 పదాలే. అడ్వాణీకి సీటు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ స్పందిస్తూ..అగ్ర నేతను తొలుత బలవంతంగా మార్గదర్శన్ మండలికి పంపిన బీజేపీ ఇప్పుడు ఆయన నుంచి గాంధీనగర్ స్థానాన్ని లాగేసుకుందని ఎద్దేవా చేసింది. 75 ఏళ్లు నిండిన నాయకులను ఇప్పటికే ప్రభుత్వానికి దూరంగా పెట్టిన బీజేపీ ఇక వారిని పోటీయుత రాజకీయాల నుంచి కూడా తప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
మోదీ పోటీ రెండు చోట్ల నుంచా?
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ తదితరులు పాల్గొన్న ఈ కీలక భేటీలో తీసుకున్న నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసి నుంచే మోదీ పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఈ ఒక్క చోటు నుంచేనా లేక మరో నియోజకవర్గం నుంచి సైతం పోటీచేస్తారా అనేది నిర్ణయించలేదని సమాచారం. 2014 ఎన్నికల్లో మోదీ రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అభ్యర్థుల ఖరారులో గెలుపు అవకాశాలు, వయోపరిమితి వంటివి పరిగణనలోకి తీసుకోవాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ..జార్ఖండ్‌లోని ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోనుందని వెల్లడించారు. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఈ పార్టీ కి రాష్ట్రంలోని ఒక సీటు ఇచ్చారు. -
మోదీ–మాక్రాన్ పడవ విహారం
-
మోదీ–మాక్రాన్ పడవ విహారం
వారణాసి/దాదర్ కలాన్: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దంపతులతోపాటు ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కేంద్రంలో ఏర్పాటుచేసిన చేనేత ప్రదర్శనను సందర్శించారు. ఇక్కడి కళాకారుల హస్తకళలు, భాదోహి కార్పెట్ల గురించి ప్రపంచ ప్రఖ్యాత బనారసీ చీరల ప్రత్యేకత గురించి మాక్రాన్‌కు మోదీ వివరించారు. అనంతరం డీడీయూ ఓపెన్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన చిత్రకూట్ నాటకాన్ని (రాముడి 14ఏళ్ల వనవాసాన్ని ప్రతిబింబించే) తిలకించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పడవలో మోదీ, మాక్రాన్, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌లు (అస్సీ ఘాట్, దశాశ్వమేథ్ ఘాట్ల మధ్య) విహరించారు. అనంతరం వారణాసి–పాట్నాల మధ్య నడిచే రైలును మోదీ ప్రారంభించారు. అంతకుముందు, మోదీ, మాక్రాన్ కలిసి ఉత్తరప్రదేశ్‌లోనే అతిపెద్ద సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని మిర్జాపూర్ జిల్లా ఛాన్వే బ్లాక్‌లో ప్రారంభించారు. 75మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ సోలార్ ప్లాండ్‌ను రూ.500కోట్ల వ్యయంతో ఫ్రెంచ్ కంపెనీ ఎంజీ (ఈఎన్‌జీఐఈ) సాంకేతిక సహకారంతో నిర్మించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేసే దృష్టితో ఢిల్లీలో మార్చి 16నుంచి జరగనున్న ‘కృషి ఉన్నతి మేళా’ను మోదీ ప్రారంభించనున్నారు. కాగా, మాక్రాన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ కలసి అసత్య వార్తలు, ఉదార ప్రజాస్వామ్యాలను ప్రభావితం చేస్తున్న అంశాలపై చర్చించారు. -
వారణాసిలో మోడీపై పోటికి మాఫియా డాన్!
కొద్ది రోజుల క్రితం వరకు వారణాసి ఓ పుణ్యక్షేత్రంగానే తెలిసి ఉండేది. కాని ఎన్నికల పుణ్యమా అని ప్రస్తుతం వారణాసి రాజకీయ రణక్షేత్రంగా మారనుంది. అందుకు కారణం బీజేపీ అభ్యర్థి వారణాసి ఎన్నికల బరిలో దిగడమే. ఇప్పటికే వారణాసి ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ ఉండగా, మోడీని ఓడించేందుకు మరో నేత రంగంలోకి దిగనున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన మాఫియా డాన్ ముఖ్తర్ అన్సారీ వారణాసి ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. ఓ హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన క్వామీ ఏక్తా దళ్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2 లక్షల 50 వేల ముస్లీం ఓట్లు ఉన్న వారణాసి లోకసభ నియోజకవర్గంలో 2009లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి ముచ్చెమటలు పట్టించారు. గత ఎన్నికల్లో 20 వేల ఓట్ల తేడాతో ముఖ్తర్ ఓటమి పాలైనారు. ప్రస్తుతం మావ్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు.