Mahashivratri: జ్యోతిర్లింగాలలో మార్మోగుతున్న శివనామస్మరణలు | Mahashivratri Live Photos Updates Ujjain Mahakal Kashi Vishwanath Somnath Mahakumbh Shivratri snan | Sakshi
Sakshi News home page

Mahashivratri: జ్యోతిర్లింగాలలో మార్మోగుతున్న శివనామస్మరణలు

Published Wed, Feb 26 2025 8:06 AM | Last Updated on Wed, Feb 26 2025 11:06 AM

Mahashivratri Live Photos Updates Ujjain Mahakal Kashi Vishwanath Somnath Mahakumbh Shivratri snan

దేశవ్యాప్తంగా ఈరోజు (బుధవారం) మహాశివరాత్రి వేడుకలు(Mahashivratri celebrations) జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర  ఆలయ తలుపులు బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకే తెరుచుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు మంగళ హారతి నిర్వహించారు. మరో 44 గంటల పాటు భక్తులకు నిరంతర దర్శనాలు కల్పించనున్నారు.

జార్ఖండ్‌లోని డియోఘర్‌లో ఉన్న జ్యోతిర్లింగం బైద్యనాథ్ ఆలయాన్ని నేడు రెండు లక్షల మంది భక్తులు సందర్శించనున్నారని అంచనా. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని కాశీలో గల విశ్వనాథ ఆలయ తలుపులు  శివరాత్రి వేళ మంగళ  హారతితో తెల్లవారుజామున 3.30 గంటలకే తెరుచుకున్నాయి. నేడు విశ్వనాథునికి నాలుగు సార్లు హారతి సమర్పించనున్నారు.

గుజరాత్‌లోని  సోమనాథ మహాదేవుని ఆలయ తలుపులు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకే తెరుచుకున్నాయి. ఆలయాన్ని 42 గంటల పాటు భక్తుల కోసం తెరిచి  ఉంచనున్నారు. వీటితో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని జ్యోతిర్లింగాలు(Jyotirlingas), ప్రసిద్ధ శివాలయాలలో  మహాశివునికి అభిషేకాలు కొనసాగుతున్నాయి.
 

గాయకుడు హన్స్‌రాజ్ రఘువంశీ ‘శివ కైలాశ్‌ కే వాసి’ అనే భజనను ఆలయంలో ఆలపించారు.

అఖాడాలను స్వాగతించడానికి కాశీ విశ్వనాథ ఆలయంలో సన్నాహాలు జరుగుతున్నాయి.

జునా అఖాడా ప్రధాన పూజారి స్వామి అవధేశానంద గిరి రథం ఎక్కి కాశీ విశ్వనాథ ఆలయం వైపు బయలుదేరారు.

కాశీ విశ్వనాథ ఆలయంలో సాధువులపై పూల వర్షం కురిపించారు.

చాందినీ చౌక్‌లోని గౌరీ శంకర్ ఆలయంలో భక్తుల పూజలు

బెంగళూరులోని కడు మల్లేశ్వర ఆలయంలో దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలో భక్తుల రద్దీ

ముంబైలోని బాబుల్‌నాథ్ ఆలయంలో భక్తుల రద్దీ

నాసిక్ లోని త్రయంబకేశ్వర్ ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు

ఉజ్జయినిలో మహాకాళీశ్వరుని ఘనంగా తొలి హారతి నిర్వహించారు.

కాశీ విశ్వనాథ ఆలయంలో కొనసాగుతున్న పూజలు

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని శివాలయంలో జనసమూహం

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని మంకమేశ్వర్ ఆలయం వద్ద రాత్రి నుంచి భక్తుల క్యూ

ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయంలో అభిషేక ఉత్సవం

మహాశివరాత్రి  సందర్భంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఆలయాన్ని దీపాలతో అలంకరించారు.

 ఇది కూడా చదవండి: Mahakumbh: ఉప్పొంగుతున్న ఉత్సాహం.. శివభక్తుల పారవశ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement