ఈరోజు (ఆదివారం) గంగా దసరా.. ఈ సందర్భంగా భక్తులు వారణాసిలోని గంగా దశాశ్వమేధ ఘాట్‌లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఘాట్‌ల వద్ద భక్తుల సందడి నెలకొంది. అలాగే ప్రయాగ్‌రాజ్, అయోధ్య, హరిద్వార్‌లోని గంగా ఘాట్‌ల వద్ద భక్తుల రద్దీ నెలకొంది.
గంగా నది ఘాట్‌ల వద్ద స్నానాలు చేసే భక్తులకు భద్రత కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్‌కుమార్ పలువురు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్నానఘట్టాలను పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించాలని, నదీ ఘాట్‌ల వద్ద తగినంత వెలుతురు ఉండేలా చూడాలని, బారికేడింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
గత కొన్నేళ్లుగా ఉత్సవాల నేపధ్యంలో తలెత్తుతున్న వివాదాలను గుర్తుంచుకుని, ఊరేగింపు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని పోలీసులకు డీజపీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిశితంగా పరిశీలించాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో యూపీ-112 వాహనాలను మోహరించాలని కోరారు.
#WATCH | Varanasi, UP: Devotees take a holy dip at the Dashashwamedh Ghat of the Sacred Ganga on the occasion of Ganga Dussehra. pic.twitter.com/DlZPo3rlDV
— ANI (@ANI) June 16, 2024
Comments
Please login to add a commentAdd a comment