
వారణాసి: యూపీకి బీజేపీ సీనియర్ నేత శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి కన్నుమూశారు. ఆయన వారణాసి సౌత్ సీటు నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనను ఆస్పత్రిలో పరామర్శించారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఆయనకు ఫోన్ చేసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మృతికి అన్ని పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి.
శ్యామ్‌దేవ్ రాయ్ వారణాసిలోని దుర్గాకుండ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు వారణాసిలో నిర్వహించనున్నట్లు సమాచారం. నిజాయితీపరుడైన నేతగా ఆయనకు గుర్దింపు ఉంది. 2017లో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
ఇది కూడా చదవండి: Sambhal Controversy: ‘అది మసీదు కాదు.. హరిహరుల ఆలయం’