syam
-
బీజేపీ సీనియర్ నేత కన్నుమూత
వారణాసి: యూపీకి బీజేపీ సీనియర్ నేత శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి కన్నుమూశారు. ఆయన వారణాసి సౌత్ సీటు నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనను ఆస్పత్రిలో పరామర్శించారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఆయనకు ఫోన్ చేసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మృతికి అన్ని పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి.శ్యామ్‌దేవ్ రాయ్ వారణాసిలోని దుర్గాకుండ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు వారణాసిలో నిర్వహించనున్నట్లు సమాచారం. నిజాయితీపరుడైన నేతగా ఆయనకు గుర్దింపు ఉంది. 2017లో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు.ఇది కూడా చదవండి: Sambhal Controversy: ‘అది మసీదు కాదు.. హరిహరుల ఆలయం’ -
శ్యామ్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ
సాక్షి, కేవీపల్లె : బెంగళూరులో ఈ నెల 12న కరోనాతో మృతి చెందిన వైఎస్సార్ సీపీ నేత, పార్టీ ఐటీ వి భాగం ప్రధాన కార్యదర్శి కలకడ శ్యామ్‌సుందర్‌రెడ్డి అలియాస్ శ్యామ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. ఆదివారం శ్యామ్ స్వగ్రామం కేవీపల్లె పంచాయతీ మూల కొత్తపల్లెలో ఆయన కు పెద్దకర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ సమాధి వద్ద పార్టీ కండువా, పూల మాలలతో నివాళులర్పించారు. అనంతరం శ్యామ్ సతీమణి సుప్రియతోపాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేసిన శ్యామ్‌ను కరోనా కబలించడం దురదృష్టకరమన్నారు. ఐటీ విభాగంలో చురుగ్గా పనిచేసి పార్టీ విజయానికి విశేష కృషి చేశారని తెలిపారు. శ్యామ్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. పార్టీ ప రంగా శ్యామ్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, పార్టీ యువజన విభాగం కన్వీనర్ గజ్జెల శీన్ రెడ్డి, నాయకులు జయరామచంద్రయ్య, రామకొండారెడ్డి, చిన్నయర్రమరెడ్డి, సహదేవరెడ్డి, సై ఫుల్లాఖాన్, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, హ రి, సిరినాయుడు, గౌస్ పాల్గొన్నారు. -
పోలీసులకు దొరికిపోయిన కిక్ శ్యామ్
-
నటుడు కిక్ శ్యామ్ అరెస్ట్, కారణం?
చెన్నై: తెలుగులో కిక్, రేసుగుర్రం, కత్తి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు శ్యామ్. ఇతనిని కోడంబాక్కం పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా జూదం, బెట్టింగులు నిర్వహిస్తున్నాడంటూ శ్యామ్ తో పాటు 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిక్ శ్యామ్ గా ఫేమస్ అయిన ఈ నటుడికి చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలో ఓ పోకర్ క్లబ్ ఉంది. అనుమతి లేకుండా ఇక్కడ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాడులు చేశారు. దీంతో పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. నుంగంబాక్కంలో నివసిస్తున్న శ్యామ్ లాక్ డౌన్ నేపథ్యంలో తన నివాసంలోనే గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. చదవండి: ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్’ ట్రైలర్ -
బైక్ ఈఎంఐ కట్టలేక..
హైదరాబాద్: తన బైక్ నెలవారీ వాయిదా కట్టేందుకు చేతిలో డబ్బులేక ఓ యువకుడు దోపిడీకి తెగబడ్డాడు. రెండు రోజుల క్రితం నాగోల్‌లో వృద్ధురాలని బెదిరించి దోపిడీ కి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేయగా ఈ విషయం వెల్లడయింది. వివరాలివీ.. ఎల్బీనగర్కు చెందిన శ్యామ్ అనే యువకుడు జల్సాలకు అలవాటుపడ్డాడు. సంపాదించినదంతా విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు. అయితే, అతడు ఫైనాన్స్ సంస్థ నుంచి తీసుకున్న బైక్‌కు నెలనెలా ఈఎంఐ కట్టాల్సి ఉండటంతో.. వేరే దారి లేక దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ మేరకు శ్యామ్ గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న సువర్ణ అనే వృద్ధురాలిని బెదిరించి నగలు దోచుకున్నాడు. ఆమె ప్రతిఘటించటంతో కత్తితో గాయపరిచాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు శనివారం అతడిని పట్టుకుని, దోపిడీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శ్యామ్ రిమాండ్‌కు తరలించనున్నారు. -
'యస్' మూవీ స్టిల్స్