
శ్యామ్ కుటుంబ సభ్యులకు ఎంపీ గురుమూర్తి పరామర్శ
సాక్షి, కేవీపల్లె : బెంగళూరులో ఈ నెల 12న కరోనాతో మృతి చెందిన వైఎస్సార్ సీపీ నేత, పార్టీ ఐటీ వి భాగం ప్రధాన కార్యదర్శి కలకడ శ్యామ్‌సుందర్‌రెడ్డి అలియాస్ శ్యామ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. ఆదివారం శ్యామ్ స్వగ్రామం కేవీపల్లె పంచాయతీ మూల కొత్తపల్లెలో ఆయన కు పెద్దకర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ సమాధి వద్ద పార్టీ కండువా, పూల మాలలతో నివాళులర్పించారు. అనంతరం శ్యామ్ సతీమణి సుప్రియతోపాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేసిన శ్యామ్‌ను కరోనా కబలించడం దురదృష్టకరమన్నారు. ఐటీ విభాగంలో చురుగ్గా పనిచేసి పార్టీ విజయానికి విశేష కృషి చేశారని తెలిపారు. శ్యామ్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. పార్టీ ప రంగా శ్యామ్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, పార్టీ యువజన విభాగం కన్వీనర్ గజ్జెల శీన్ రెడ్డి, నాయకులు జయరామచంద్రయ్య, రామకొండారెడ్డి, చిన్నయర్రమరెడ్డి, సహదేవరెడ్డి, సై ఫుల్లాఖాన్, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, హ రి, సిరినాయుడు, గౌస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment