Senior BJP leaders
-
బీజేపీ సీనియర్ నేత కన్నుమూత
వారణాసి: యూపీకి బీజేపీ సీనియర్ నేత శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి కన్నుమూశారు. ఆయన వారణాసి సౌత్ సీటు నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనను ఆస్పత్రిలో పరామర్శించారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఆయనకు ఫోన్ చేసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మృతికి అన్ని పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి.శ్యామ్‌దేవ్ రాయ్ వారణాసిలోని దుర్గాకుండ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు వారణాసిలో నిర్వహించనున్నట్లు సమాచారం. నిజాయితీపరుడైన నేతగా ఆయనకు గుర్దింపు ఉంది. 2017లో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు.ఇది కూడా చదవండి: Sambhal Controversy: ‘అది మసీదు కాదు.. హరిహరుల ఆలయం’ -
Karnataka assembly elections 2023: టికెటివ్వకుంటే పాతిక సీట్లు గోవిందా
హుబ్బళ్లి(కర్ణాటక): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ షెట్టార్ ధిక్కారస్వరం వినిపించారు. ‘హూబ్లీ–ధార్వాద్ సెంట్రల్ టికెట్ నాకివ్వాల్సిందే. లేదంటే ఈసారి ఎన్నికల్లో పార్టీ 20 నుంచి 25 స్థానాల్లో ఓటమిని చవిచూస్తుంది’ అని షెట్టార్ శనివారం వ్యాఖ్యానించారు. నవ తరం, యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పోటీచేయొద్దని సూచించింది. అలా షెట్టార్‌కు ఢిల్లీ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. దీనిని బేభాతరు చేస్తూ ధిక్కార స్వరం వినిపించారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హుబ్బళ్లికి వచ్చి షెట్టార్తో మంతనాలు జరిపారు. అయినా సరే వినని షెట్టార్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ సిట్టింగ్‌లను పక్కనబెడితే ఆ నిర్ణయం ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడకూడదు. ఒకవేళ పడితే అది ఆ ఒక్క స్థానానికే పరిమితం కాదు. ఉత్తర కర్ణాటకలో కనీసం 20–25 స్థానాల్లో ఓడిపోయే ప్రమాదముంది. ఈ మాట గతంలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కూడా చెప్పారు. వేచి చూస్తా. నాకు టికెట్ ఇవ్వకుంటే తదుపరి కార్యాచరణపై ఆలోచిస్తా’ అని అన్నారు. -
వృథా పాపం కాంగ్రెస్‌దే
పార్లమెంటు సమావేశాలపై బీజేపీ నేతల ధ్వజం న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని పలువురు బీజేపీ సీనియర్ నేతలు విరుచుకుపడ్డారు. గురువారం సమావేశాలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం వారు దేశంలో పలుచోట్ల మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రధాన ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. సభలను కాంగ్రెస్ అడ్డుకుంటున్న తీరును జనం ముందు ఎండగట్టాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు వారు రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా 28 చోట్ల విలేకర్ల సమావేశాలు ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ నిష్కారణంగా పార్లమెంటును అడ్డుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై విమర్శలు సంధించారు. ఆ పార్టీ ఓటమిని ఇంకా జీర్ణించుకోవడం లేదన్నారు. సభలను అడ్డుకుంటున్న నేపథ్యంలో సభా నిర్వహణ నిబంధనలను పునః పరిశీలించాల్సిన అవసరముందని మంత్రి వెంకయ్య నాయుడు బెంగళూరులో అన్నారు. సమావేశాలు వృథా కావడానికి కాంగ్రెస్, వామపక్షాలే కారణమని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. ఆ పార్టీ దేశ ప్రగతిని అడ్డుకుంటోందన్నారు. తాము సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 2 వరకు కాంగ్రెస్, లెఫ్ట్ నేతల నియోజక వర్గాలకు వెళ్లి.. ఆ పార్టీలను ఎండగడతామని బీజేపీ ప్రతినిధి ఎంజే అక్బర్ తెలిపారు. కాగా, మాజీ సైనికులకు ఒకే ర్యాంకు-ఒకే పింఛను విధానం అమల్లో జాప్యంపై రాహుల్ విమర్శపై మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. రాహుల్‌ది బురదజల్లి పారిపోయే వ్యవహారమని దుయ్యబట్టారు. రాహుల్‌కు నాయకత్వ సామర్థ్యాలు లేవని, సోనియా ఆయనను దేశంపై బలవంతంగా రుద్దతున్నారని అన్నారు.