
పాకిస్తానీయులు భారత్‌ను తక్షణమే వదిలి వెళ్లిపోవాలని కేంద్రం రెండు రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురూ తట్టాబుట్టా సర్దుకుని పాకిస్తాన్‌కు పయనమైపోయారు. అది సరే.. మరి బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ (Adnan Sami) వంతు ఎప్పుడంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి సోషల్ మీడియాలో సెటైర్లు వేశాడు.
ఈ దద్దమ్మకెలా అర్థమవుతుంది?
దశాబ్దం క్రితమే భారతీయ పౌరసత్వం తీసుకున్న అద్నాన్ సమీ దీనిపై ఘాటుగా స్పందించాడు. ఈ చదువురాని దద్దమ్మకు ఎవరు చెప్తే అర్థమవుతుంది? అని కౌంటర్ ఇచ్చాడు. అద్నాన్ సమీ పేరెంట్స్ పాకిస్తానీయులు. వీరు ఇంగ్లాండ్‌లో సెటిలయ్యారు. అద్నాన్ సమీ అక్కడే పుట్టి పెరిగాడు. తర్వాత భారత్‌కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. 2015 డిసెంబర్‌లో భారత పౌరసత్వం తీసుకున్నాడు. ఈ విషయంలో తనను చాలామంది ట్రోల్ చేశారంటూ.. ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
మతం మార్చేస్తారు!
అద్నాన్ సమీ మాట్లాడుతూ.. నువ్వు భారతీయుడివి అయిపోయావా? అయితే నీ మతం కూడా మార్చేస్తారు. ఇక నువ్వు ఏ స్వామివో అయిపోవాల్సిందే అంటూ నానారకాలుగా కామెంట్లు చేసేవారు. వాళ్లన్న మాటలే నిజమైతే.. అమెరికాలో ఉన్న పాక్ ప్రజలందరూ క్రిస్టియన్లు అయిపోవాలి లేదా ఇంగ్లాండ్‌లో ఉన్నవాళ్లందరూ నిరసనకారులుగా మారిపోవాలి. నేను మతం మారాలని చెప్పడానికి వాళ్లెవరు? దేశం మారితే మతం మారాలన్న రూల్ ఏం లేదు' అని చెప్పుకొచ్చాడు.
సినిమా
అద్నాన్ సమీ.. ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించాడు. పలు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. లక్కీ: నో టైమ్ ఫర్ లవ్, ఏ రాస్తే హై ప్యార్ కే, ఢమాల్, 1920, ఛాన్స్ పె డ్యాన్స్, ముంబై సాల్సా, ఖుబ్సూరత్, శౌర్య చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశాడు.
Who’s going to tell this illiterate idiot!!😂 https://t.co/OoH4w5iPQ3
— Adnan Sami (@AdnanSamiLive) April 25, 2025
చదవండి: 30 సార్లు ఫోన్ చేసినా హిమాన్షి లిఫ్ట్ చేయలేదు.. బిగ్‌బాస్ విన్నర్