adnan sami
-
సింగర్ అద్నాన్ సమీకి మాతృ వియోగం
గాయకుడు అద్నాన్ సమీ తల్లి బేగమ్ నౌరీన్ సమీ ఖాన్ (77) అనారోగ్యంతో మరణించారు. తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అద్నాన్ సమీ ప్రకటించారు. బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా అద్నాన్ సమీ సూపర్ హిట్ పాటలు పాడారు. ఈ క్రమంలో ఆయన భారీగా అభిమానులను సంపాధించుకున్నారు.అద్నాన్ సమీ తన తల్లి ఫోటోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ' నాకెంతో ఇష్టమైన మా అమ్మ బేగం నౌరీన్ సమీ ఖాన్ మరణ వార్తను ప్రకటించడం చాలా బాధగా ఉంది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ సమయంలో చెప్పలేనంత దుఃఖంతో మా కుటుంబం మునిగిపోయి ఉంది. ఆమె ప్రతి ఒక్కరికి ప్రేమ, ఆనందాన్ని పంచింది. ఆమెను కోల్పోయామనే నిజాన్ని నమ్మలేకపోతున్నాం.' అని అద్నాన్ పేర్కొన్నారు.అద్నాన్ సమీ అభిమానులు, సన్నిహితులు ఆమె మరణం పట్ల సంతాపం తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన అద్నాన్ సమీ భారతీయ పౌరసత్వం పొందారనే విషయం తెలిసిందే. అద్నాన్ తండ్రి అర్షద్ సమీ ఖాన్ పాకిస్థాన్‌కు చెందగా.. ఆయన తల్లి నౌరీన్ ఖాన్ జమ్మూకి చెందినవారు. అద్నాన్ తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. ఆయన సుమారు 15 దేశాలకు పైగానే పాకిస్తాన్ రాయబారిగా కూడా పనిచేశాడు. కానీ అద్నాన్ సమీ మాత్రం భారత్‌లో పాపులర్ సింగర్‌గా స్థిరపడ్డారు. View this post on Instagram A post shared by ADNAN SAMI (@adnansamiworld) -
భార్య ప్రైవేట్ వీడియోలు తీశాడు: సింగర్ నిజస్వరూపం బయటపెట్టిన తమ్ముడు
స్టార్ సింగర్, పద్మశ్రీ గ్రహీత అద్నాం సమీ బాలీవుడ్లో ఎన్నో సినిమాలకు మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. పాప్ ఆల్బమ్స్‌తో సంగీతప్రియులను హుషారెత్తించాడు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అద్నాం సమీ సోదరుడు జునైద్ ఖాన్ సింగర్‌పై సంచనల వ్యాఖ్యలు చేశాడు. 'నా పెద్దన్న అద్నాన్ సమీ నిజస్వరూపం బయటపెట్టాల్సిన సమయం వచ్చేసింది. నేను ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ భయపడను. ఇలా చేయడం నాకు నచ్చడం లేదు. కానీ నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే! అతడిలా నేను అబద్ధాలు చెప్పను' అంటూ కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాడు. ► అద్నాన్ సమీ 1969 ఆగస్టు 15న రావల్ పిండి ఆస్పత్రిలో జన్మించాడు. నేను కూడా అదే ఆస్పత్రిలో 1973లో పుట్టాను. అద్నాన్ చెప్పినట్లుగా అతడు ఇంగ్లాండ్‌లోనో, మరెక్కడోనో పుట్టలేదు. ► నాకు టాలెంట్ ఉంది, నేను పాడగలనని అద్నాన్‌ను తెలుసు. తనకంటే నా గొంతు బాగుందని చాలామంది అన్నారు. కావాలనుకుంటే ఆయన నాకు సాయం చేయొచ్చు. కానీ తను స్వార్థంగా ఆలోచించాడు. నన్ను ఇండియన్ ఇండస్ట్రీలో లాంచ్ చేయలేదు. ఒకవేళ నేను తనకన్నా పేరు తెచ్చుకుంటానని భయపడ్డాడేమో! ఇప్పుడు నేను ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. ఇందుకు అతడే కారణం. ► అద్నాన్ సమీ ఇంగ్లాండ్‌లోని రగ్బీ స్కూల్లో చదువుకున్నాడు. కానీ తనకు చదువు అబ్బలేదు. అందుకే ఫేక్ డిగ్రీలు సంపాదించాడు. లాహోర్ యూనివర్సిటీలో బీఏ చదివాడు. కానీ ఫేస్బుక్లో మాత్రం యూకేలో లా చదివానని చెప్తాడు. ► అన్నిటికంటే కూడా మమ్మల్ని బాగా బాధపెట్టిన విషయం. 1997లో అతడు తన మూడేళ్ల కొడుకు అజాన్‌ను తీసుకుని దుబాయ్, కెనడా, అమెరికా వెళ్లాడు. ఏడేళ్లు వచ్చేదాకా పిల్లవాడు తల్లితో ఉండాలని న్యాయస్థానాలు చెబుతున్నాయి. కానీ అద్నాన్ అదేమీ పట్టించుకోలేదు. ► ఇది మరీ దారుణ విషయం. నా గర్ల్‌ఫ్రెండ్‌తో కూడా నేనలా ప్రవర్తించలేదు. 2007/2008లో అద్నాన్ సమీ తన రెండో భార్య సబా గలదేరీ పోర్న్ వీడియోలు తీశాడు. భార్యాభర్తల మధ్య ఏదైనా గుట్టుగా ఉండాలి. కానీ ఆ వీడియోలను అతడు కోర్టుకు సమర్పించాడు. తానసలు ఆ వీడియోలు తీయలేదని, సబా ప్రియుడే వాటిని తీసి ఉండవచ్చని ఆమెపై నిందలు వేశాడు. ► ఇండియాలో అయితే బాగా డబ్బులు వస్తాయనే తను పాకిస్తాన్ పౌరసత్వం వదులుకుని ఇక్కడ సెటిలయ్యాడు. అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో జునైద్ సదరు పోస్ట్ డిలీట్ చేశాడు. కాగా పాకిస్తానీ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన అర్షద్ సమీ ఖాన్ తనయులే అద్నాన్, జునైద్. అద్నాన్ సమీ మొదట పాకిస్తానీ సినిమాలకు సంగీతం అందించాడు. ఆశా భోంస్లేతో చేసిన 'కభీ తో నజర్ మిలావో' ఆల్బమ్ హిట్ కావడంతో ఆయనకు భారత్‌లోనూ విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అలా ఆయన ఇండియన్ సినిమాలకు సైతం పనిచేశాడు. -
అద్నాన్ సమీ అతి వ్యాఖ్యలు
నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై నిన్నంతా పలువురు సినీ, సంగీత, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు RRR టీంను ప్రశంసలతో ముంచెత్తారు. పాట సమకూర్చిన సినిమా టీంను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రశంసించారు. అంతర్జాతీయ యవనికపై తెలుగు వారి ఖ్యాతి అత్యున్నత స్థాయిలో ఎగుర వేసినందుకు ఆంధ్రప్రదేశ్ తరపున RRR టీంకు అభినందనలు తెలుపుతున్నానని, ఈ పురస్కారం సాధించడం పట్ల గర్వంగా భావిస్తున్నామన్నారు. The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY — YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023 దీనిపై గాయకుడు అద్నాన్ సమీ అతిగా స్పందించారు. ఈ కీర్తిని తెలుగు వారికి మాత్రమే అంటూ చెప్పుకోవడం వద్దని, దేశాన్నివిభజించవద్దంటూ విచిత్ర రాగం అందుకున్నారు. Telugu flag? You mean INDIAN flag right? We are Indians first & so kindly stop separating yourself from the rest of the country…Especially internationally, we are one country! This ‘separatist’ attitude is highly unhealthy as we saw in 1947!!! Thank you…Jai HIND!🇮🇳 https://t.co/rE7Ilmcdzb — Adnan Sami (@AdnanSamiLive) January 11, 2023 అసలు సినిమాకు గానీ, అవార్డుకు గానీ, లేదా ఏపీ సీఎం చేసిన ట్వీట్‌కు గానీ ఏమాత్రం సంబంధం లేకుండా.. 1947ను గుర్తు చేసి అద్నాన్ సమీ స్పందించడం తెలుగు వారిపై ఆరోపణలు గుప్పించడం ఏ మాత్రం సరికాదంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. Dear @AdnanSamiLive its beyond ur comprehensive levels to understand what #Telugu Flag means. It signifies our PRIDE. V don't have to hear lectures on patriotism from likes of U. Better keep that borrowed NATIONALISM to urself. @ysjagan @ssrajamouli @AlwaysRamCharan @tarak9999 — Hyderabad Intellectuals Forum 🇮🇳 (@HydForum) January 11, 2023 RRR టీంను ప్రశంసిస్తూ తెలుగులో (ఇంగ్లీషు అక్షరాలతో తెలుగును) షారూఖ్ ట్వీట్ చేశారు. Thank u so much my Mega Power Star @alwaysramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!! (Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! ) Love you. — Shah Rukh Khan (@iamsrk) January 10, 2023 బాలీవుడ్లో బాద్షా లాంటి షారూఖ్ లాంటి వాళ్లు తెలుగును గౌరవిస్తే.. నీకేమయిందంటూ నెటిజన్లు సమీకి గుర్తు చేసి చురకలంటించారు. And SRK tweeted in telugu 👇🏻 Don’t politicise everything Mr Adnan, you are not a politician https://t.co/vncXhNLtN1 — Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) January 11, 2023 అద్నాన్ సమీ ఓవరాక్షన్ పట్ల ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క దేశం పాకిస్తాన్ నుంచి భారత్‌కు వలస వచ్చి ఇప్పుడు భారతీయులకే పాఠాలు చెబుతావా అంటూ ప్రశ్నించారు. Clear Lack of knowledge in Adnan Sami’s comments. Cannot blame him because he wasn’t an Indian Citizen before 2016. All Telugu people are naturally patriotic and need no certificate. Reference to Telugu Flag is because ‘Naatu-Naatu’ won the Golden Globe award not ‘Nacho-Nacho’! — Vijayasai Reddy V (@VSReddy_MP) January 12, 2023 అద్నాన్‌సమీ వ్యాఖ్యల వెనక అక్కడి సినిమా మాఫియా అక్కసు కనిపిస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా బాలీవుడ్‌కు బ్యాడ్ టైం నడుస్తోంది. చెప్పుకోదగ్గ ఒక్క హిట్ లేకపోగా.. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలన్నీ ఎదురుతంతున్నాయి. అదే సమయంలో దక్షిణాది సినిమాలయిన RRR, KGF లాంటివి బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. -
పద్మం దక్కిన వేళ.. ఆనంద హేల
2020 సంవత్సరానికి గాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘పద్మ’ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం ఈ అవార్డుల ప్రదానం జరిగింది. చిత్రసీమ నుంచి తమ తమ విభాగాల్లో సేవలు అందిస్తున్న నటి కంగనా రనౌత్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్, నిర్మాత ఏక్తా కపూర్, సంగీత దర్శకుడు అద్నన్ సమి, నేపథ్య గాయకుడు సురేష్ వడ్కర్, సీనియర్ నటి సరితా జోషి ‘పద్మశ్రీ’ అవార్డులు అందుకున్నారు. పద్మం దక్కిన వేళ.. ఆనంద హేలలో పురస్కార గ్రహీతలు ఈ విధంగా స్పందించారు. ఆలస్యంగా వచ్చినా ఆనందమే – సురేష్ వాడ్కర్ ‘‘కాస్త అలస్యంగా వచ్చినప్పటికీ నా దేశం నన్ను గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఏ కళా కారుడికైనా ఈ పురస్కారం చాలా గొప్పది. సంగీత ప్రపంచంలోమరింత ముందుకు వెళ్లడానికి ఈ పురస్కారం నాకు స్ఫూర్తినిచ్చింది’’ అని 66 ఏళ్ల సురేష్ వాడ్కర్ అన్నారు. హిందీ, మరాఠీ భోజ్‌పురి భాషల్లో పాడారు సురేష్. ‘సద్మా’లో ‘ఏ జిందగీ గలే లగా లే’, ‘పరిందా’లో ‘తుమ్ సే మిల్కే’ , ‘ప్యాసా సావన్’లో ‘మేఘా రే.. మేఘా రే..’ వంటి పాటలు పాడారు వాడ్కర్. ఈ క్షణాలు గుర్తుండిపోతాయి – కరణ్ జోహార్ ‘‘ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా అమ్మ, నా పిల్లలు, నా ప్రొడక్షన్ కంపెనీలా నా మనసులో ఈ పురస్కారం అలా ఉండిపోతుంది’’ అని పేర్కొన్నారు కరణ్ జోహర్. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కల్ హో నా హో’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు కరణ్ జోహార్. అలాగే ‘దోస్తానా’, ‘2 స్టేట్స్’ వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. నమ్మలేని క్షణం – ఏక్తా కపూర్ ‘‘ఇదొక గొప్ప గౌరవం. నమ్మలేని క్షణం... అలాగే గర్వకారణం. నాకు రెండు పిల్లర్లలా నిలిచిన మా అమ్మానాన్న (శోభ, జితేంద్ర కపూర్)లకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నాను. వాళ్లిద్దరూ నన్ను పూర్తిగా నమ్మడంవల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. నా కుటుంబం, స్నేహితులు, మా బాలాజీ టెలీ ఫిలింస్ టీమ్, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కలలను నిజం చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చిన ఈ దేశానికి తిరిగి ఇవ్వాలన్నది నా ఆలోచన. మరింతమంది ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తాను’’ అన్నారు ఏక్తా కపూర్. టీవీ రంగంలో దూసుకెళుతున్న ఏక్తా ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, ‘ది డర్టీ పిక్చర్’, ‘షూట్ అవుట్ అట్ వడాలా’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆ ప్రేమవల్లే ఇంతదాకా... – అద్నన్ సమీ ‘‘నాకింత గొప్ప పురస్కారాన్ని అందించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే భారతదేశ ప్రజలు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రేక్షకుల అభిమానం వల్లే నా ప్రయాణం ఇంతదాకా వచ్చింది’’ అన్నారు అద్నాన్ సమీ. హిందీలో పలు పాటలు పాడిన అద్నన్ తెలుగులో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో ‘ఏ జిల్లా..’, ‘వర్షం’లో ‘నైజామ్ పోరి..’, ‘జులాయి’లో ‘ఓ మధు..’ వంటి పాటలు పాడారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటి సరితా జోషి (80) ఆరు దశాబ్దాలుగా గుజరాతీ, మరాఠీ, హిందీ, మర్వారీ భాషల్లో 15 వేలకు పైగా షోస్‌లో భాగమయ్యారు. అలాగే ‘పరివార్’, ‘గురు’, ‘సింబా’, ‘రూహీ’ తదితర చిత్రాల్లో నటించారు. ఆ నోళ్లు మూతపడతాయనుకుంటున్నాను ‘‘ఒక ఆర్టిస్టుగా నేను ఎన్నో అవార్డులు పొందగలిగాను. కానీ ఓ ఆదర్శనీయమైన పౌరురాలిగా ప్రభుత్వం నన్ను గుర్తించి ‘పద్మశ్రీ’ అందించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కంగనా రనౌత్. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌ను స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు పది సంవత్సరాల వరకు నాకు సక్సెస్ రాలేదు. పెద్ద హీరోలు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్‌కు సంబంధించిన చిత్రాలు, స్పెషల్సాంగ్స్, సౌందర్య లేపనాల ఉత్పత్తులను గురించిన ప్రకటనలను కాదనుకున్నాను. జాతీయ అంశాలను గురించి నేను పలుసార్లు నా గొంతు విప్పాను. అందువల్ల ఎక్కువగా శత్రువులనే సంపాదించుకున్నాను. జాతీయ అంశాలను గురించి ప్రస్తావిస్తోంది అని నన్ను విమర్శించేవారి నోళ్లు ఇప్పుడు మూతపడతాయనుకుంటున్నాను’’ అన్నారు. ‘క్వీన్’, ‘తనువెడ్స్ మను’ ఫ్రాంచైజీ, ‘తలైవి’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ నిర్మాతగానూ రాణిస్తున్నారు. – కంగనా రనౌత్ -
బీజేపీ పాకిస్తాన్ ప్రేమలో పడింది అందుకే..
ఇండోర్ : ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో జన్మించిన, పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్కు పద్మశ్రీ ఎలా ఇస్తారని ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా.. తాజాగా బాలీవుడ్ నటి స్వరభాస్కర్ కూడా వ్యతిరేకించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో ప్రేమలో పడిందని.. అందుకే పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్కు పద్మశ్రీ ప్రకటించిందని విమర్శించారు. (చదవండి: పొద్దున నన్ను తిడుతారు.. రాత్రి నా పాటలు వింటా) ఆదివారం ఆమె మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ‘ రాజ్యాంగాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి’ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరభాస్కర్ మాట్లాడుతూ.. సీఏఏ ఒక మోసపూరిత చట్టమని మండిపడ్డారు. ‘శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం.. చొరబాటు దారులను అరెస్ట్ చేయడం లాంటి చట్టాలు ఇదివరకే భారత్‌లో ఉన్నాయి. దాని ప్రకారమే అద్నాన్ సమీకి భారత పౌరసత్వం ఇచ్చి పద్మశ్రీ కూడా ప్రకటించారు. మళ్లీ సీఏఏ లాంటి చట్టాలు ఎందుకు? ఆ చట్టం వల్ల ఎవరికి ఉపయోగం?’ అని ఆమె ప్రశ్నించారు. ‘ఒకవైపు సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న భారతీయులను అరెస్టులు చేస్తారు. వారిపై దాడులు చేస్తారు. మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటిస్తారు. ఇదీ బీజేపీ ప్రభుత్వం తీరు. ఎక్కడికి వెళ్లినా పాకిస్తాన్ మంత్రాన్ని జపిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో ప్రేమలో పడింది. అందుకు పాకిస్తానీయులకు అవార్డులు ప్రకటిస్తుంది’ అని స్వరభాస్కర్ విమర్శించారు. కాగా, పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్ సమీ 2016లో భారత పౌరసత్వం పొందారు. అద్నాన్ సమీ తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. 1965 యుద్ధంలో పాక్ తరఫున భారత్‌తో పోరాడారు. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కుమారుడికి ఈ ఉన్నత స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంపై పలు విమర్శలు వచ్చాయి. ‘భజన’ కారణంగానే ఈ పురస్కారం లభించిందని కాంగ్రెస్ విమర్శించింది. -
‘పొద్దున నన్ను తిడుతారు.. రాత్రి నా పాటలు వింటారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో జన్మించిన, పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్కు పద్మశ్రీ ఎలా ఇస్తారని కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇక తనను విమర్శించిన వారికి సమీ కూడా ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. తనకు ఏ ఇతర రాజకీయ నాయకులు మధ్య విభేదాలు లేవని, ప్రభుత్వాన్ని విమర్శించడానికి నన్ను పావుగా వాడుకుంటున్నారని సమీ అన్నారు. బుధవారం ఆయన ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా తనపేరును ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. (చదవండి : బాలీవుడ్ పద్మాలు) ‘ నిజం చెప్పాలంటే.. రాజకీయ నాయకులకు నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కాదు. నేను సంగీత విద్వాంసుడిని. ఉదయం నా గురించి చెడుగా మాట్లాడినవారంతా.. రాత్రి సమయంలో మందు తాగుతూ.. నా పాటలు వింటూ ఉంటారు. సంగీతకారుడిగా, నా పని ప్రజలను సంగీతంతో సంతోషపెట్టడం, ప్రేమను వ్యాప్తి చేయడమే నా పని. సొంత రాజకీయాల కోసం కొంతమంది నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నన్న పావుగా వాడుకుంటున్నారు. ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని నాపై చూపిస్తున్నారు. అని షమీ అన్నారు. పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్ సమీ 2016లో భారత పౌరసత్వం పొందారు. అద్నాన్ సమీ తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. 1965 యుద్ధంలో పాక్ తరఫున భారత్‌తో పోరాడారు. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కుమారుడికి ఈ ఉన్నత స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంపై పలు విమర్శలు వచ్చాయి. ‘భజన’ కారణంగానే ఈ పురస్కారం లభించిందని కాంగ్రెస్ నేత జైవీర్ షేర్గిల్ ట్వీట్ చేశారు. ఇక సమీకి పద్మశ్రీ ఇవ్వడాన్ని బీజేపీ సమర్థించింది. తన ప్రతిభతో భారత ప్రతిష్టను ఇనుమడింపజేశారని, ఆ పురస్కారానికి సమీ అన్నివిధాలా అర్హుడేనని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తండ్రికి నియంతలు ముస్సోలినీ, హిట్లర్లతో సంబంధాలున్నాయన్న వార్తలను గుర్తు చేస్తూ.. ఆమెకు భారతీయ పౌరసత్వం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ‘భారతదేశాన్ని, ప్రధాని మోదీని, దేశ వ్యవస్థలను వ్యతిరేకించే ముస్లింలకు మాత్రమే అవార్డులు ఇవ్వాలని విపక్షాలు కోరుకుంటున్నాయి’ అని సంబిత్ పాత్ర ఆరోపించారు. అద్నాన్ సమీ తల్లి నౌరీన్ ఖాన్ జమ్మూకి చెందిన వ్యక్తి అని గుర్తు చేశారు. ‘ఆ ప్రాంత ముస్లిం మహిళలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదా?’ అని ప్రశ్నించారు. లోక్‌జనశక్తి పార్టీ నేత, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా సమీకి పద్మశ్రీ ప్రకటించడాన్ని సమర్ధించారు. కాగా, ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్లపై వెల్లువెత్తుతున్న నిరసనల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునే చర్యల్లో భాగంగానే అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించారని ఎన్సీపీ విమర్శించింది. ఇది 130 కోట్ల భారతీయులను అవమానించడమేనని పేర్కొంది. ‘జై మోదీ’ అని నినదించిన పాక్ పౌరుడెవరైనా భారత పౌరసత్వం పొందొచ్చని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఎద్దేవా చేశారు. -
అద్నాన్ సమీకి పద్మశ్రీనా?
ముంబై: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి తాజాగా పద్మశ్రీ ప్రకటించడంపై మాటల యుద్ధం ప్రారంభమైంది. బ్రిటన్‌లో జన్మించిన, పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్ సమీ 2016లో భారత పౌరసత్వం పొందారు. ఈ పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. విమర్శకులపై సమీ ఘాటుగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ‘భజన’ కారణంగానే ఈ పురస్కారం లభించిందని కాంగ్రెస్ నేత జైవీర్ షేర్గిల్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ.. ‘పిల్లవాడా..! నీ బ్రెయిన్‌ను క్లియరెన్స్ సేల్‌లో కొనుక్కున్నావా? లేక సెకండ్ హ్యాండ్ స్టోర్‌లో కొనుక్కున్నావా? తల్లిదండ్రుల చర్యలకు పిల్లలను బాధ్యులను చేయాలని నీకు బర్కిలీ వర్సిటీలో నేర్పించారా?’ అని మండిపడ్డారు. దీనికి షేర్గిల్ ట్విటర్ వేదికగానే జవాబిచ్చారు. ‘అంకుల్జీ! ట్విట్టర్లో కొన్ని అభినందనల కోసం సొంత తండ్రినే దూరం పెట్టిన వ్యక్తి నుంచి భారతీయ సంప్రదాయం గురించి పాఠాలు నేర్చుకునే అవసరం నాకు లేదు’ అని ట్వీట్ చేశారు. గత ఐదేళ్లలో భారత్‌కు చేసిన ఐదు సేవలను చెప్పాలని సమీకి సవాలు చేశారు. అద్నాన్ సమీ తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. 1965 యుద్ధంలో పాక్ తరఫున భారత్‌తో పోరాడారు. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కుమారుడికి ఈ ఉన్నత స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తండ్రికి నియంతలు ముస్సోలినీ, హిట్లర్లతో సంబంధాలున్నాయన్న వార్తలను గుర్తు చేస్తూ.. ఆమెకు భారతీయ పౌరసత్వం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ‘భారతదేశాన్ని, ప్రధాని మోదీని, దేశ వ్యవస్థలను వ్యతిరేకించే ముస్లింలకు మాత్రమే అవార్డులు ఇవ్వాలని విపక్షాలు కోరుకుంటున్నాయి’ అన్నారు. పద్మశ్రీ పురస్కారానికి సమీ పూర్తిగా అర్హుడని సమర్ధించారు. అద్నాన్ సమీ తల్లి నౌరీన్ ఖాన్ జమ్మూకి చెందిన వ్యక్తి అని గుర్తు చేశారు. ‘ఆ ప్రాంత ముస్లిం మహిళలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదా?’ అని ప్రశ్నించారు. లోక్‌జనశక్తి పార్టీ నేత, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా సమీకి పద్మశ్రీ ప్రకటించడాన్ని సమర్ధించారు. తన ప్రతిభతో భారత ప్రతిష్టను ఇనుమడింపజేశారని, ఆ పురస్కారానికి సమీ అన్నివిధాలా అర్హుడేనని పేర్కొన్నారు. సోనియాగాంధీపై పాత్రా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించలేదు. కాగా, ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్లపై వెల్లువెత్తుతున్న నిరసనల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునే చర్యల్లో భాగంగానే అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించారని ఎన్సీపీ విమర్శించింది. ఇది 130 కోట్ల భారతీయులను అవమానించడమేనని పేర్కొంది. ‘జై మోదీ’ అని నినదించిన పాక్ పౌరుడెవరైనా భారత పౌరసత్వం పొందొచ్చని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఎద్దేవా చేశారు. -
పద్మ అవార్డులు.. కాంగ్రెస్‌పై ప్రముఖ సింగర్ ఫైర్
న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు, మ్యూజిషియన్ అద్నాన్ సమీకి పద్మశీ అవార్డు ఇవ్వడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. పాకిస్తాన్లో పుట్టి పెరిగిన అద్నాన్కు ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి జైవీర్ షర్గిల్ తప్పుబట్టారు. కార్గిల్ యుద్ధంలో పోరాడిన మహ్మద్ సన్నావుల్లాను ఎన్నార్సీ అనంతరం విదేశీయుడిగా ప్రకటించిన కేంద్రం.. పాక్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కుమారుడికి పద్మశ్రీ అవార్డును ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం చంచాగిరి మ్యాజిక్ వల్లే అద్నాన్కు పద్మశ్రీ వచ్చిందని వ్యాఖ్యానించారు. కాగా తనపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు అద్నాన్ ఘాటుగా స్పందించారు. ‘హేయ్ కిడ్.. మీ బుద్దిని క్లియరెన్స్ సేల్ నుంచి తెచ్చుకున్నారా.. లేక సెకండ్ హ్యాండ్ షాప్ నుంచి కొనుకున్నారా. తల్లిదండ్రుల చర్యలకు పిల్లలు ఎలా బాధ్యులవుతారు. మీరు ఒక న్యాయవాది. లా స్కూల్లో మీరు ఇదే నేర్చుకున్నారా’’ అంటూ ట్వీటర్ వేదికగా మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ నేతల వాదనకు భిన్నంగా ఆ పార్టీ సీనియర్‌నేత దిగ్విజయ్ సింగ్ మాత్రం అద్నాన్కు అభినందనలు తెలిపారు. దేశంలో అత్యున్నత పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 141 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా అందులో అద్నాన్ సమీ ఒకరు. ఈ ఏడాదికి గాను మొత్తం 141 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేయగా.. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్ వరించగా, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మ శ్రీ అవార్డు వరించాయి. Hey kid, did you get ur brain from a ‘Clearance Sale’ or from a second hand novelty store? Did they teach u in Berkley that a son is to be held accountable or penalised for the acts of his parents? And ur a lawyer?😳 Is that what u learned in law school? Good luck with that!😂 https://t.co/s1mgusEdDr — Adnan Sami (@AdnanSamiLive) January 26, 2020 -
బాలీవుడ్ పద్మాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 71వ పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే అవార్డుల జాబితాలో తెలుగు చిత్రసీమకు సంబంధించిన వారెవరూ లేకపోవడం గమనార్హం. హిందీ చిత్రసీమకు నాలుగు పద్మాలు వరించాయి. ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్, టీవీ టైకూన్ ఏక్తా కపూర్, ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్, ప్రముఖ గాయకుడు అద్నాన్ సామీలను ‘పద్మశ్రీ’ వరించింది. శనివారం సాయంత్రం పద్మ అవార్డుల జాబితా వెలువడగానే ఈ నలుగురికీ ప్రశంసల వర్షం మొదలైంది. కంగ్రాట్స్ కరణ్ ఇండస్ట్రీకి పరిచయమై.. ఓ పేరు సంపాదించాలని.. ఓ మార్క్ సృష్టించాలని ఏ కళాకారుడైనా కోరుకుంటాడు. కానీ దర్శకుడు కరణ్ జోహార్ బాలీవుడ్ పరిచయమే ఓ ల్యాండ్‌మార్క్. ఆయన బ్యానర్లో పరిచయం కావడం ఆర్టిస్టులకు ఓ హాల్‌మార్క్. షారుక్ ఖాన్ ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు కరణ్ జోహార్. రొమాంటిక్ డ్రామాలో ఆ సినిమా ఒక ట్రెండ్ సృష్టించింది. ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్ వంటి స్టార్ కిడ్స్ను కరణ్ ఇండస్ట్రీకు పరిచయం చేశారు. ప్రస్తుతం వాళ్లు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నారు. నిర్మాత యశ్ జోహార్, హీరూ జోహార్ దంపతులకు జన్మించారు కరణ్. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే తిరిగారు, పెరిగారాయన. చిన్నప్పటి నుంచే సినిమాల ప్రభావం ఆయన మీద ఉంది. షారుక్ ఖాన్ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు కరణ్. ఆ తర్వాత దర్శకుడిగా ‘కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కభీ ఆల్విదా నా కెహ్నా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలు తెరకెక్కించారు. కరణ్ జోహార్‌కి స్క్రిప్ట్‌ని కమర్షియలైజ్ చేయడం తెలుసు. ఆడియన్స్ పల్స్ తెలుసు. అందుకే దర్శకుడిగా ఫ్లాప్ చూడలేదాయన. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు కరణŠ . ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖ పేరు కరణ్. 47 ఏళ్ల కరణ్ పెళ్లి చేసుకోలేదు. సరోగసీ ద్వారా (యష్, రూహీ) ఇద్దరు పిల్లలున్నారు. శభాష్ సమీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో ‘ఏ జిల్లా ఏ జిల్లా... ఓ పిల్లా నీదీ ఏ జిల్లా’ పాట విన్న శ్రోతలకు ఆ పాట పాడిన గాయకుడి గొంతు కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఆ గొంతు రెగ్యులర్‌గా లేదు. విభిన్నంగా అనిపించింది. కానీ పాడుతుంటే వినాలనుంది. శభాష్.. గొంతు బాగుందన్నారు. ఆ గాయకుడి జిల్లా ఏంటి? అని వాకబు చేశారు. అతని పేరు అద్నాన్ సమీ అని తెలిసింది. లండన్‌లో పుట్టి పెరిగారు అద్నాన్ సమీ. అఫ్ఘాన్ మూలాలున్న తండ్రి, జమ్మూ కశ్మీర్ మూలాలున్న తల్లికి జన్మించారు ఆయన. తొమ్మిదేళ్లకే పియానో వాయించడం మొదలుపెట్టారు సమీ. హాలిడేలో ఇండియాను సందర్శించినప్పుడు క్లాసికల్ మ్యూజిక్‌పై ఆసక్తి ఏర్పరుచుకొని నేర్చుకున్నాడు అద్నాన్. తన చురుకుతనాన్ని గమనించి సంగీతంలోనే కొనసాగమని ప్రముఖ గాయని ఆశా భోంస్లే సూచించారు. అప్పటి నుంచి సంగీతంలో మరింత శ్రద్ధపెట్టారు. ఇండియన్, వెస్ట్రన్ క్లాసిక్ మ్యూజిక్‌లో పట్టు సాధించారు. ‘నౌషద్ మ్యూజిక్’ అవార్డు అందుకున్న పిన్న వయస్కుడు అద్నానే. అద్నాన్ తొలి కంపోజిషన్ 1986లో ‘రన్ ఫర్ లైఫ్’ సాంగ్ సూపర్ హిట్ అయింది. 1995లో ‘సర్గం’ అనే పాకిస్థానీ సినిమాకు సంగీతం అందించారు. అందులో నటించారు కూడా. అది బ్లాక్‌బస్టరే. ‘కబీతో నజర్ మిలావో’ అనే ప్రేమ పాటల్ని ఆశా భోంస్లేతో కలసి ఆల్బమ్‌గా చేశారు. శ్రోతల్ని ఉర్రూతలూగించింది. 2001 నుంచి బాలీవుడ్ సినిమాలకు పాడటం, కంపోజ్ చేయడం మొదలుపెట్టారు అద్నాన్ సమీ. 2004లో ‘శంకర్ దాదా’తో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘నచ్చావే నైజాం పోరీ (వర్షం), భూగోళమంతా సంచిలోనా (శంకర్ దాదా జిందాబాద్), కళ్లూ కళ్ళూ ప్లస్ (100ç% లవ్), ఓ ప్రియా ప్రియా (ఇష్క్), ఓ మధు ఓ మధు (జులాయి) వంటి పాపులర్ పాటలు పాడారాయన. సక్సెస్ఫుల్ క్వీన్ బాలీవుడ్లో కంగనా ఫైర్ బ్రాండ్. అనుకున్నది అనుకున్నట్లే చెబుతుంది. ఏవరేమనుకుంటే ఏంటి? అంటుంది. ఎవరు చిన్నబుచ్చుకున్నా, తన అభిప్రాయాలను వెలిబుచ్చడంలో ఎప్పుడూ సంకోచించదు కంగనా. డాక్టర్ అవ్వాలని ఇంట్లో అన్నారు. యాక్టర్ అవుతాను అంది కంగనా. ఇంట్లో వద్దన్నారు. నా ఆశను వదలనంది కంగనా. గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకుంది కంగనా. వచ్చిన అవకాశాలను మెట్లుగా చేసుకుని సూపర్ స్టార్‌గా ఎదిగింది. ‘గ్యాంగ్‌స్టర్’(2006) సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైంది కంగనా. 2007లో ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’ చిత్రం తనకు కావాల్సిన గుర్తింపుని ఇచ్చింది. ఆ మరుసటి ఏడాదే మధుర్ బండార్కర్ తీసిన ‘ఫ్యాషన్’ సినిమాలో సహాయనటిగా జాతీయ అవార్డు అందుకుంది కంగనా. ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ సినిమాతో తెలుగులోనూ పరిచయమైంది. ‘క్వీన్, తను వెడ్స్ మను’ సినిమాలకు జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. కంగనా కేవలం నటిగానే కాదు ‘క్వీన్’ సినిమాకు మాటల రచయితగా, సిమ్రాన్‌కి సహ రచయితగా, ‘మణికర్ణిక’ సినిమా కొంత భాగానికి దర్శకత్వం వహించి, దర్శకురాలిగా తన ప్రతిభను చూపించింది. ప్రస్తుతం కంగనా చేతిలో ఉన్న రెండూ లేడీ ఓరియంటెడ్ సినిమాలే. ఫోర్బ్స్ ఇండియా 100 లిస్ట్‌లో ఆరు సార్లు చోటు సంపాదించారామె. ఆమె ఫ్యాషన్ సెన్స్ విచిత్రంగానూ, స్టయిల్ స్టేట్‌మెంట్‌లా ఉంటుంది. ఆమె స్టెట్మెంట్లు ఎక్కువ శాతం కాంట్రవర్శీలకు దారి తీసిన సందర్భాలున్నాయి. ఈ కాంట్రవర్శీ క్వీన్‌కి తిరుగులేదు. సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్నారు. టెలివిజన్ స్టార్ నిర్మాణం రిస్క్‌తో కూడుకున్నది. టెన్షన్స్‌తో కూడుకున్నది. కూడికలు, తీసివేతలతో కూడుకున్నది. మనుషుల్ని డీల్ చేయాలి. టెన్షన్‌ను హ్యాండిల్ చేయాలి. అందులో రాణించడం చాలా కష్టం. కానీ బాలీవుడ్ నిర్మాణంలో రాణిగా వెలుగుతున్నారు ఏక్తా కపూర్. సీరియల్స్, సినిమాలు, వెబ్ షోలు ఇలా ఎడతెరిపి లేకుండా కంటెంట్‌ని బుల్లితెరపై కురిపిస్తూ టెలివిజన్ క్వీన్‌గా ఉన్నారు ఏక్తా. బాలీవుడ్ నటుడు జితేంద్ర, శోభా కపూర్ కుమార్తె ఏక్తా కపూర్. 15 ఏళ్లకే దర్శకుడు కైలాష్ సురేంద్రనాథ్ దగ్గర చేరింది ఏక్తా. 1994లో తండ్రి ఇచ్చిన కొంత డబ్బును, తన ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి బాలాజీ టెలీ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ స్థాపించింది ఏక్తా. సీరియల్స్ మీద సీరియల్స్. ఆ తర్వాత సినిమా నిర్మాణంలోకి దిగింది. బాలాజీ టెలీ ఫిలింస్ ద్వారా దాదాపు 130 సీరియల్స్‌ను నిర్మించింది. అందులో కొన్ని సీరియల్స్ పలు ప్రాంతీయ భాషల్లోనూ డబ్బింగ్ అయ్యాయి. ఆమె నిర్మించినవాటిలో ‘హమ్ పాంచ్, కహానీ ఘర్ ఘర్ కీ, జోధా అక్బర్, నాగినీ, కుంకుమ్ భాగ్య, కుందలీ’ వంటి పాపులర్ టీవీ సీరియల్స్ కొన్ని. సినిమాలు స్టయిల్ వేరు, సీరియల్స్ స్టయిల్ వేరు. సీరియల్స్‌లో ఎప్పటికప్పుడు సరుకు తయారవుతూనే ఉండాలి. అందుకే ఆమెను క్వీన్ ఆఫ్ టెలివిజన్ అంటారు. 2017లో ఎల్టీ బాలాజీ డిజిటల్ యాప్ స్టార్ట్ చేసి, ఇప్పటివరకు సుమారు 40 షోలు అందించింది. ‘హమ్ పాంచ్’ సీరియల్ ద్వారా విద్యా బాలన్‌ను పరిచయం చేసింది ఏక్తా. టెలివిజన్ ఇండస్ట్రీలో మోస్ట్ పవర్ఫుల్ లేడీగా ఎదిగింది ఏక్తా. 44 ఏళ్ల ఏక్తా కపూర్ పెళ్లి చేసుకోలేదు. సరోగసీ ద్వారా ఓ బాబుకి తల్లయ్యారు. – గౌతమ్ మల్లాది -
‘ఒక్క అడుగు నాతో వేస్తే చాలు’
‘ఒకసారి చూస్తే చాలు.. ఒకసారి నవ్వితే చాలు.. ఒక అడుగు నాతో వేస్తే చాలు.. ఒక రిప్లై ఇస్తే చాలు.. ఒక స్మైలీ పెడితే చాలు.. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. నాతో నువ్వుంటే చాలు.. కోరుకోను ఇంకేం వరాలు’అంటూ సాగే ఈ పాట లవర్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. అంతేకాకుండా వాట్సప్ స్టేటస్, కాలర్ ట్యూన్, రింగ్ ట్యూన్స్‌లలో ఈ పాట మార్మోగటం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగులో లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరు గాంచిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ పాటకు ట్యూన్ కట్టగా.. చంద్రబోస్ లిరిక్స్‌ను అందించాడు. ఈ పాటకు వీరిద్దరు ఒకెత్తయితే అద్నాన్ సమీ వాయిస్ ఈ పాటకు మరింత హైలెట్‌గా నిలిచింది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ నటిస్తోన్న ‘90 ఎం.ఎల్’ సినిమాలోని మరో లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యూత్‌ను ముఖ్యంగా లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ అందించిన హార్ట్ టచింగ్ లిరిక్స్‌తో పాటు అద్నాన్ సమీ వాయిస్ ఎక్స్ట్రార్డినరీగా నిలిచింది. ఇక జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ కూడా కొత్తగా ఉంది. ఓవరాల్‌గా అన్ని హంగులు జోడించి విడుదల చేసిన ఈ లిరికల్ సాంగ్ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి కథానాయికగా కనిపించనుంది. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వాణిజ్య అంశాలతో వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఈ చిత్రంలో రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్ తదితరులు నటించారు. -
భారత్‌లో పెరిగాను; కానీ పాకిస్తానే నా ఇల్లు!
ఇస్లామాబాద్: భారత్‌లో కొన్నాళ్లు పెరిగినప్పటికీ పాకిస్తాన్‌ను మాత్రమే తన సొంతిళ్లుగా చెప్పుకోవడానికి ఇష్టపడతానని ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ కుమారుడు అజాన్ సమీ పేర్కొన్నాడు. తన తండ్రి భారత పౌరసత్వం తీసుకున్నప్పటికీ తానెప్పటికీ పాక్ పౌరుడిగానే ఉంటానని తెలిపాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజాన్ మాట్లాడుతూ...‘ మా నాన్న అంటే నాకు ఇష్టంతో పాటు గౌరవం కూడా ఉంది. తను ఏ దేశంలో నివసించాలనుకుంటున్నానో నాన్న చెప్పినపుడు..ఆయన నిర్ణయాన్ని గౌరవించాను. అంతేతప్ప వ్యతిరేకంగా మాట్లాడలేదు. భారత్‌లో ఉండాలని ఆయన అనుకున్నారు. నేను పాకిస్తాన్‌ను ఎంచుకున్నాను. నిజానికి నా టీనేజ్‌లో చాలా ఏళ్లు ఇండియాలోనే పెరిగాను. అక్కడ నాకు అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. అయినప్పటికీ పాక్‌నే నా సొంత ఇంటిలా భావిస్తాను. అక్కడి ఇండస్ట్రీ నాకు కుటుంబం లాంటిది. పాక్ ఇండస్ట్రీలో భాగమైనందుకు గర్వపడుతున్నా’ అని ఈ మ్యూజిక్ కంపోజర్ చెప్పుకొచ్చాడు. ఇక తన తండ్రితో అనుబంధం గురించి చెబుతూ...‘ఒక్కోసారి నెలల పాటు నాన్నను చూసే అవకాశం ఉండేది కాదు. అయినా తల్లిదండ్రులు ఎలా ఉండాలో పిల్లలు చెప్పకూడదు కదా. అమ్మానాన్నా విడిపోయిన తర్వాత నేను అమ్మ దగ్గరే పెరిగాను. నాన్నతో స్నేహితుడిలా మెలిగేవాడిని. ప్రస్తుతం మేమిద్దరం ఎన్నో విషయాల గురించి చర్చిస్తాం. కెరీర్‌కు సంబంధించి ఆయన సలహాలు, సూచనలు ఇస్తారు. నా దృష్టిలో ఆయనో మ్యూజిక్ లెజెండ్. నా పాటలకు మొదటి విమర్శకుడు ఆయనే. తన ప్రభావం నా మీద పడకుండా సొంత శైలి అలవరచుకోమని ప్రోత్సహిస్తారు’ అని అజాన్ పేర్కొన్నాడు. కాగా అజాజ్.. అద్నాన్ సమీ- పాక్ నటి జేబా భక్తీర్‌ల సంతానం. ఇక పాకిస్తాన్లో పుట్టిన అద్నాన్ భారత పౌరసత్వం తీసుకుని ఇక్కడే నివసిస్తున్న సంగతి తెలిసిందే. -
‘మా తండ్రి చావుపుట్టుకలు భారత్‌లోనే’
ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి ట్రోలర్స్‌కి మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తండ్రి వర్ధంతిని పురస్కరించుకుని అద్నాన్ సమి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫోటో షేర్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ ‘అసలు మీ తండ్రి ఎక్కడ జన్మించారు.. ఎక్కడ మరణించారు’ అని ప్రశ్నించాడు. అందుకు అద్నాన్ సమి ‘నా తండ్రి 1942లో భారత్‌లో జన్మించారు.. 2009లో ఇండియాలోనే మరణించారు. చాలా ఇంకేమన్నా కావాలా’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. My father was born in 1942 in India & died in 2009 in India!!! Next! https://t.co/M11nbQonWh — Adnan Sami (@AdnanSamiLive) August 15, 2019 పాకిస్తాన్ లాహోర్‌లో జన్మించిన అద్నాన్ సమి ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకుని.. 2016లో భారత్ పౌరసత్వాన్ని పొందారు. తొలుత ఆయనకు కెనడా పౌరసత్వం ఉండేది. -
పాక్ ట్రోల్స్‌కు అద్నాన్ సమీ ధీటైన కౌంటర్..!
ముంబై : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన నేపథ్యంలో ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో పుట్టిన అద్నాన్ కొన్నాళ్ల క్రితం భారత పౌరసత్వం పొందిన సంగతి తెలిసిందే. ‘భారత వైమానిక దళం పట్ల గర్వంగా ఉంది. హౌ ఈజ్ ద జోష్. ఉగ్రవాదాన్ని నిర్మూలించండి. జై హింద్’ అని ట్వీట్ చేశాడు. అద్నాన్ కామెంట్లపై పాక్ నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. (భారత్-పాక్ టెన్షన్: ట్రంప్ కీలక వ్యాఖ్యలు) పాకిస్తాన్లో పుట్టి భారత్‌కు జై కొడతావా అంటూ పలువురు ట్రోల్ చేశారు. వారికి అద్నాన్ దీటైన సమాధానం ఇచ్చారు. ‘డియర్ పాక్ ట్రోల్స్.. ఇక్కడ ఇగో విషయం కాదు. నిజాన్ని గ్రహించండి. మీరూ, మేము శత్రువులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేయడం ఇక్కడ ముఖ్య విషయం. మీ నీచమైన మెంటాలిటీ చూస్తుంటే నవ్వోస్తోంది. మరీ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. లోపల ఒకటి పెట్టుకుని బయటకి మరొకటి మాట్లాడుతున్నారు. ఉష్ణపక్షిలాగా నిజాలను ఒప్పుకోరు. మీ అంత చండాలమైన మనస్తత్వం ఎవరికీ ఉండదు’ అని గట్టి కౌంటర్ ఇచ్చాడు. Dear Pak trolls, Its not about ur egos being given a reality check today; its about eliminating terrorists who u ‘claim’ r also ur enemies! Ur Ostrich mentality is laughable.Btw, ur abuses expose ur reality & therefore d only difference between u & a bucket of shit is the bucket! — Adnan Sami (@AdnanSamiLive) 26 February 2019 -
మాయే జరిగే ఇష్టంగా...
‘ఏ జిల్లా ఏ జిల్లా.., ఓ మధు ఓ మధు..., నేనంటే నాకూ చాలానే ఇష్టం’ వంటి సూపర్ హిట్స్ సాంగ్స్‌ని పాడిన సింగర్ అద్నాన్ సమీ. ‘‘ఆయన పాడారంటే పాటలో కచ్చితంగా కొత్తదనం ఉంటుంది. అలాగే మా సినిమాలో ‘అరెరే మాయే జరిగే.. ఇష్టంగా, మనసే నీదే అయ్యిందే.. ఇష్టంగా’ పాటను అద్నాన్ సమీ పాడారు. అదే మా ఫస్ట్ సక్సెస్’’ అంటున్నారు ‘ఇష్టంగా’ చిత్రబృందం. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా సంపత్ వి. రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘ఇష్టంగా’. ‘‘మా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. అద్నాన్ సమీ పాడిన ‘అరెరే మాయే..’ పాటను రిలీజ్ చేశాం. ఈ పాటకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. సంగీత దర్శకుడు యేలేంద్రకు కృతజ్ఞతలు. అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ నడకట్ల. -
కువైట్‌లో ఘోర అవమానం: ప్రముఖ సింగర్
కువైట్: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పర దేశంలో తన సిబ్బందికి అవమానం జరిగినందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ట్విటర్ ద్వారా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ఒక కార్యక్రమం కోసం కువైట్‌కు వెళ్లిన అద్నాన్ సమీ బృందంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది దుర్భాషలాడారు. దీనిపై కువైట్‌లోని ఇండియన్ ఎంబబీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినా ఏ చర్యలు చేపట్టలేదని అద్నాన్ సమీ వాపోయారు. ఇలా అనడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు. అద్నాన్ ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ స్పందిస్తూ.. ఈ విషయంపై మీరు నాతో ఫోన్లో మాట్లాడండి అంటూ ట్వీట్ చేశారు. వెంటనే స్పందించినందుకు సుష్మాకు అద్నాన్ ధన్యవాదాలు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా... సింగర్ అద్నాన్ బదులిస్తూ.. ‘మాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. సుష్మా స్వరాజ్ లాంటి వారు విదేశాంగ మంత్రిగా ఉంటే.. మాలాంటి వాళ్లు ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆమె రక్షిస్తూనే ఉంటారు. ఆమెను చూస్తే నాకు గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంపై సుష్మా స్వరాజ్ వెంటనే చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. Thank you so much for your concern my dear. @SushmaSwaraj is a lady full of heart & she is in touch with me & is looking after our people.. I’m so proud that she is our foreign minister & looks after us all over the world. https://t.co/2KjCIyRG6f — Adnan Sami (@AdnanSamiLive) May 6, 2018 -
భారత సైన్యానికి పాక్ రుణపడి ఉండాలి: సమీ
భారత సైన్యానికి పాకిస్థాన్ ఎంతగానో రుణపడి ఉండాలని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సమీ అన్నాడు. బజరంగీ భాయీజాన్ సినిమాలో అతిథిపాత్రలో కూడా నటించిన సమీ.. దీనిపై మరింత వివరణ ఇచ్చాడు. ఇరు దేశాలకు ఉన్న ఉమ్మడి శత్రువుపైనే తాను ట్వీట్లు చేశానన్నాడు. రెండు దేశాలతో పాటు మిగిలిన ప్రపంచాన్ని కూడా ఇబ్బంది పెడుతున్న ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని చెప్పాడు. అలాంటి ఉగ్రవాదులను హతమార్చినందుకు భారత సైన్యానికి పాకిస్థాన్ కృతజ్ఞతలు చెప్పాలన్నాడు. తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని పాకిస్థాన్ చాలా సంవత్సరాలుగా చెబుతోందని, పొరుగుదేశం వాళ్లకు సాయం చేస్తున్నా.. కనీసం దాన్ని ఒప్పుకొనే పరిస్థితిలో కూడా వాళ్లు లేరని అన్నాడు. తాను ఎప్పుడూ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, తన ట్వీట్లను వాళ్లు తమకు కావల్సిన రీతిలో వక్రీకరించుకున్నారని అద్నాన్ సమీ అన్నాడు. అందుకే వాళ్లు పాకిస్థానీలను.. ఉగ్రవాదులను ఒకేలా చూస్తున్నారని మళ్లీ ట్వీట్ చేశానని చెప్పాడు. తాను ఒక్క దేవుడికి తప్ప ఎవరికీ భయపడేది లేదని.. ఒకవేళ తన తలరాతలో మళ్లీ పాకిస్థాన్ వెళ్లాలని రాసి ఉంటే.. అలాగే వెళ్తానని, తిరిగి వెళ్లడానికి కూడా తాను భయపడేది లేదని తెలిపాడు. నిజానికి ఉడీ ఉగ్రదాడి తర్వాత.. భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత రెండు దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో దానిపై కాస్త హుందాగా స్పందిస్తున్న కళాకారుడి పేరు చెప్పుకోవాలంటే.. అద్నాన్ సమీ పేరు ముందొస్తుంది. స్వతహాగా పాకిస్థాన్‌కు చెందిన సమీ.. ఆ తర్వాత భారత పౌరసత్వం తీసుకున్నారు. ఉడీ ఉగ్రదాడిలో 19 మంది భారత సైనికులు మరణించిన విషయం తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడానికి భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా మన సైన్యానికి అభినందనలు తెలిపి, ప్రధానిని కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేపడుతున్న చర్యలను మెచ్చుకున్నారు. -
పాక్‌పై దాడిని సమర్థించిన పాక్ సింగర్
ప్రస్తుతం ప్రపంచం అంతా.. భారత్, పాక్‌పై చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ గురించే మాట్లాడుతోంది. ముఖ్యంగా మోది నిర్ణయానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ తీసుకున్న నిర్ణయానికి, భారత సైన్యం తెగువకు ఓ పాక్ సింగర్ మద్దతు లభించింది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా సక్సెస్ ఫుల్ పాటలు పాడిన సింగర్ అద్నాన్ సమీ సర్జికల్ స్ట్రయిక్స్‌కు మద్దతు తెలిపాడు. పాక్ దేశస్థుడైన అద్నాన్, సింగర్‌గా ఘనవిజయాలు సాధించింది మాత్రం భారత్‌లోనే అందుకే భారత పౌరసత్వం తీసుకున్న అద్నాన్, ఇక్కడే సెటిల్ అయ్యాడు. దాడి ఘటనపై భారత్‌కు మద్దతు తెలిపిన అద్నాన్‌పై పాకిస్థాన్‌లో పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. ఈ విమర్శలపై స్పందించిన అద్నాన్, 'నా వ్యాఖ్యలపై పాకిస్తానీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వారి విమర్శల ద్వారా వాళ్లు పాకిస్తాన్, టెర్రరిజం రెండింటినీ ఒకటే అని భావిస్తున్నారని అనిపిస్తోంది' అంటూ ట్వీట్ చేశాడు. Big Congratulations to @PMOIndia & our brave Armed forces for a brilliant, successful & mature strategic strike against #terrorism ! #Salute— Adnan Sami (@AdnanSamiLive) 29 September 2016Pakistanis r outraged by my earlier tweet. Their outburst clearly means they see Terrorist & Pakistan as the same! #selfgoal #stopterrorism— Adnan Sami (@AdnanSamiLive) 30 September 2016 -
ఇండియన్ గా సమీ తొలి పుట్టినరోజు
ముంబై: భారత పౌరుడిగా తొలిసారి పుట్టినరోజు చేసుకోవడం పట్ల గాయకుడు అద్నాన్ సమీ సంతోషం వ్యక్తం చేశాడు. భారత్ స్వాతంత్ర్య దినోత్సం రోజునే తన పుట్టినరోజు రావడం ఆనందాయకమని పేర్కొన్నాడు. పాకిస్థాన్ కు చెందిన సమీ ఈ ఏడాది జనవరి 1న భారత్ పౌరసత్వం తీసుకున్నాడు. బ్రిటన్ లో జన్మించిన అతడికి కెనడా పౌరసత్వం కూడా ఉంది. 'భారత దేశంలో ఇండియన్ గా మొదటి పుట్టినరోజు జరుపుకోవడం గర్వంగా ఉంది. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు' అని సమీ ట్వీట్ చేశాడు. అతడిని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ ప్రాచి దేశాయ్, సంగీత దర్శకుడు ఇషాన్ నూరానీ, కమెడియన్ జానీ లివర్... సమీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. Feeling proud that 2day I celebrate my birthday 4 d 1st time as an Indian wt My India! Happy #IndependenceDayIndia pic.twitter.com/R4VwViOnQp — Adnan Sami (@AdnanSamiLive) 15 August 2016 -
'భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు'
-
'భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు'
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి రుణపడివుంటానని పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీ అన్నారు. ఇక్కడి ప్రజలు తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపుతున్నారని చెప్పారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున భారత ప్రభుత్వం తనకు విలువైన, అందమైన కానుక ఇచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన భార్యతో కలిసి హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజును కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత పౌరసత్వం పత్రాలను సమీకి మంత్రి అందజేశారు. జనవరి 1న భారత పౌరసత్వ పత్రాలు అందుకోవడం పట్ల సమీ సంతోషం వ్యక్తం చేశారు. వీటిని స్వీకరించాడని ఇంతకమన్న మంచిరోజు ఉందని వ్యాఖ్యానించారు. మానవతా దృక్పథంతో అద్నాన్ సమీకి భారత పౌరసత్వం ఇచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. లాహోర్ లో జన్మించిన సమీ తొలిసారిగా 2001లో మార్చిలో భారత్ కు వచ్చారు. అప్పట్నుంచి వీసా మీద భారత్ కు వస్తూపోతూ గత కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. కాగా, మే 26న అతడి పాస్ పోర్టు గడువు తీరిపోయింది. -
ఆగస్టు 15 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అర్జున్ (నటుడు), సుహాసిని (నటి), అద్నాన్ సమి (గాయకుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. దీనికి అధిపతి రాహువు. కోర్టు వివాదాలు, పెండింగ్‌లో ఉన్న పోలీస్ కేసులు ఈ సంవత్సరం పరిష్కారమవుతాయి. అందువల్ల ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఆస్తులు కొనుక్కోవాలని, ఉన్న ఆస్తులను అభివృద్ధి చేయాలని కంటున్న కలలు నెరవేరతాయి. వారసత్వంగా రావలసిన ఆస్తులు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. మీ పుట్టిన తేదీ 15. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల జీవితం ఉత్సాహవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. శుక్ర, రాహువుల కలయిక వల్ల జీవితం చాలా బాగుంటుంది. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. పిల్లల పెళ్లిళ్లు తదితర బాధ్యతలు పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మీకన్నా పై స్థాయి వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఆపోజిట్ సెక్స్ వారితో నెరిపే సంబంధాల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. లక్కీ నంబర్స్: 1,4,6,9; లక్కీ డేస్: శుక్ర, శని, ఆదివారాలు; లక్కీ కలర్స్: వైట్, బ్లూ, క్రీమ్, వయొలెట్; లక్కీ మంత్స్: ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్. సూచనలు: అవివాహిత యువతుల పెళ్లి ఖర్చులు భరించడం, అనాథలకు, వికలాంగులకు తగిన విధంగా సహాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
'పాక్‌లో నా ఫొటోలు తగలబెడుతున్నారు'
సంతోషం వెంటే విషాదాన్నీ చవిచూస్తున్నాడు ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ! భారత్‌లో ఎంతకాలమైనా నివసించవచ్చనే అనుమతి దొరకడం ఓవైపు.. స్వదేశం పాకిస్థాన్‌లో తనపై పెల్లుబిగుతోన్న ప్రజాగ్రహం మరో వైపు. రెండింటి నడుమ నలిగిపోతూ తన బాధను మీడియాతో పంచుకుని కాస్త ఉపశమనం పొందే ప్రయత్నం చేశాడు సమీ.. పాకిస్థాన్ ప్రభుత్వం తన వీసాను పునరుద్ధరించకపోవడంతో చిక్కుల్లో పడ్డ ఆయన.. 'నన్ను మీ గడ్డ మీదే నివసించే అవకాశమివ్వండి' అని భారత ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాడు. అందుకు ప్రభుత్వం అంగీకరించడం ఆ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. దాంతో పాకిస్థాన్ పౌరసత్వాన్ని త్యజిస్తు న్నట్టు అద్నాన్ సమీ పేర్కొ న్నాడు. ఇకపై తన పాకిస్థాన్ పౌరసత్వాన్ని వదిలేస్తున్నానని, 14 ఏళ్లుగా తనకు ఆశ్ర యమిచ్చిన భారత్ నే ఇకపై తన సొంతగడ్డ అని అతడు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే భారత్‌లోనే ఉండాలనుకుంటున్న సమీ నిర్ణయంపై పాకిస్థానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. 'నా స్వదేశస్తులకు నా మీద కోపం పెరిగిపోయింది. అక్కడ నా ఫోటోలను తగలబెడుతున్నారు. ఇది నన్నెంతగానో బాధపెడుతోంది. కానీ ఏం చేస్తాం! ఇండియా అన్నా.. ఇక్కడ నివసించడమన్నా నాకెంతో ఇష్టం. ఆ ఇష్టం కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తా' అని కళ్లు చెమర్చాడు అద్నాన్ సమీ. -
'అది ఊహించని ఫోన్ కాల్'
ముంబై:ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని లతా మంగేష్కర్ తనకు అభినందనలు తెలపడం పట్ల గాయకుడు అద్నాన్ సమీ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇందుకు సల్మాన్ హీరోగా రూపొందుతున్న భజరంగీ భాయ్ జాన్ మూవీలో అద్నాన్ సమీ పాడిన పాటే కారణమట. అందులో 'భర్ దో జోలీ మేరీ'అనే పల్లవితో సాగే పాటను అద్నాన్ పాడాడు. దీనికి గాను లతా మంగేష్కర్ నుంచి ప్రశంసలతో కూడిన ఓ అరుదైన ఫోన్ కాల్ ను తాను రిసీవ్ చేసుకున్నట్లు అద్నాన్ తెలిపాడు. దీనిపై తొలుత ఆశ్యర్యానికి గురైన అద్నాన్ తన సంతోషాన్ని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 'నా పాటను అభినందిస్తూ లతాజీ నుంచి ఫోన్ కాల్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు చిన్న పిల్లాడిలా ఫీలయ్యా. ఆమె నుంచి వచ్చిన ఆ ప్రశంస నిజంగా అద్బుతం' అని ఆద్నాన్ పేర్కొన్నాడు. -
మరో వివాదంలో అద్నాన్ సమీ!
వీసా గడువు వివాదం నుంచి బయటపడ్డ పాకిస్థానీ గాయకుడు సంగీత దర్శకుడు అద్నాన్ సమీ మళ్లీ ఇబ్బందుల్లో పడ్డాడు. పన్ను ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలో సోమవారం విచారణకు హాజరుకావాలంటూ సర్వీస్ టాక్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అద్నాన్ సమీ నిర్వహించిన కార్యక్రమాలపై పన్ను చెల్లించలేదనే కారణంతో ఆయనపై అక్టోబర్ 15 తేదిన కేసు నమోదు చేసామని సర్వీస్ టాక్స్ విభాగం అధికారులు తెలిపారు. ఎంత మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినాడో ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. సోమవారం సమీని విచారించిన తర్వాతనే ఎంత మొత్తం ఎగవేతకు పాల్పడినాడో చెప్పగలమన్నారు. విచారణకు హాజరయ్యే సమయంలో తాను నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను తీసుకు రావాలని నోటీసులో పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు. వీసా గడువు పూర్తయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా భారత్ లో అద్నాన్ సమీ ఉండటం గతవారం వివాదంగా మారింది. అయితే తాను చేసిన విజ్క్షప్తికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మూడు నెలలపాటు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. -
అద్నాన్ సమీకి మూడు నెలల వీసా గడువు పెంపు!
పాకిస్థానీ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సమీకి మూడు నెలల పాటు వీసా గడువును హోంమంత్రిత్వ శాఖ పెంచుతూ నిర్ణయం తీసుకుంది అని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఇటీవల అద్నాన్ సమీ వీసా గడువు ముగిసినా.. భారత్ లో ఉండటం వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6 తేది నుంచి మరో మూడు నెలలపాటు వీసా గడువును పెంచామని ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంజయ్ షింత్రే మీడియాకు తెలిపాడు. అద్నాన్ సమీ వీసా 2006 సెప్టెంబర్ 26 నుంచి 2013 అక్టోబర్ 6 తేది వరకు వీసా అనుమతి ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా అద్నాన్ సమీ ముంబైలో నివాసముంటున్నారు. వీసా గడువు పూర్తయిన వెంటనే అద్నాన్ సమీకి ముంబై సోలీసులు నోటీసులు జారీ చేశారు. తాను వీసా గడువు పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నానని నోటీసులకు సమీ జవాబిచ్చారు. -
పాక్ గాయకుడు అద్నాన్ సమీకి సమన్లు
ముంబై: పాకిస్తాన్ గాయకుడు అద్నాన్ సమీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. అతని వీసా గడువు ముగిసినా భారత్ లో ఉండటంతో సమన్లు పంపక తప్పలేదు. సమీకి భారత రాయబార కార్యాలయం గత ఏడాది సెప్టెంబర్ 26 నుంచి ఈ ఏడాది అక్టోబర్ ఆరు వరకు వీసా మంజూరు చేసింది. బాలీవుడ్‌తోపాటు దక్షిణాది భాషల్లోనూ ఇతడు పలు పాటలు పాడాడు. వీసా గడువు ముగిసిన నేపథ్యంలో దేశం విడిచివెళ్లిపోవాలన్న డిమాండ్ కూడా ఎక్కువైంది. అంతకముందు వీసా కాలపరిమితి ముగిసినా ముంబైలోనే ఉంటున్న పాక్ గాయకుడు అద్నన్ సమీ వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని ఎమ్మెన్నెస్ హెచ్చరించింది. సమీ మమ్మల్ని శనివారం మా కార్యాలయంలోనే కలుసుకొని సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడని ఎమ్మెన్నెస్ సినిమా విభాగం చిత్రపత్ కర్మచారి సేన అధ్యక్షుడు అమే ఖోప్కర్ తెలిపారు. వీసా పరిమితి ముగిసింది కాబట్టి భారత్‌ను వీడివెళ్లాలని మేం ఆయనకు సూచించాం అని వివరించారు. సమీ స్వచ్ఛం దంగా మీ కార్యాలయానికి వచ్చారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన అక్రమంగా భారత్‌లో నివసిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో తామే పిలిపించామని తెలిపారు. తనకు పాకిస్థాన్ పాస్‌పోర్టు ఉందని, సమయానుగుణంగా జారీ అయ్యే వీసాతో భారత్‌లో నివసిస్తున్నానని ఈ గాయకుడు ముంబైలోని కుటుంబ న్యాయస్థానికి తెలిపారు. -
సమీ!.. స్వదేశం వెళ్లిపో :ఎమ్మెన్నెస్
పాక్ గాయకుడికి ఎమ్మెన్నెస్ హెచ్చరిక ముంబై: వీసా కాలపరిమితి ముగిసినా ముంబైలోనే ఉంటున్న పాక్ గాయకుడు అద్నన్ సమీ వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని ఎమ్మెన్నెస్ శనివారం హెచ్చరించింది. ఎమ్మెన్నెస్ సినిమా విభాగం చిత్రపత్ కర్మచారి సేన అధ్యక్షుడు అమే ఖోప్కర్ మీడియాతో మాట్లాడుతూ ‘సమీ మమ్మల్ని శనివారం మా కార్యాలయంలోనే కలుసుకొని సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు. వీసా పరిమితి ముగిసింది కాబట్టి భారత్‌ను వీడివెళ్లాలని మేం ఆయనకు సూచించాం’ అని వివరించారు. సమీ స్వచ్ఛం దంగా మీ కార్యాలయానికి వచ్చారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన అక్రమంగా భారత్‌లో నివసిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో తామే పిలిపించామని తెలిపారు. తనకు పాకిస్థాన్ పాస్‌పోర్టు ఉందని, సమయానుగుణంగా జారీ అయ్యే వీసాతో భారత్‌లో నివసిస్తున్నానని ఈ గాయకుడు ముంబైలోని కుటుంబ న్యాయస్థానికి తెలిపారు. సమీకి భారత రాయబార కార్యాలయం గత ఏడాది సెప్టెంబర్ 26 నుంచి ఈ ఏడాది అక్టోబర్ ఆరు వరకు వీసా మంజూరు చేసింది. బాలీవుడ్‌తోపాటు దక్షిణాది భాషల్లోనూ ఇతడు పలు పాటలు పాడాడు.