ఇండియన్ గా సమీ తొలి పుట్టినరోజు | Singer Adnan Sami happy to celebrate birthday as Indian | Sakshi
Sakshi News home page

ఇండియన్ గా సమీ తొలి పుట్టినరోజు

Published Mon, Aug 15 2016 4:03 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

ఇండియన్ గా సమీ తొలి పుట్టినరోజు

ఇండియన్ గా సమీ తొలి పుట్టినరోజు

ముంబై: భారత పౌరుడిగా తొలిసారి పుట్టినరోజు చేసుకోవడం పట్ల గాయకుడు అద్నాన్ సమీ సంతోషం వ్యక్తం చేశాడు. భారత్ స్వాతంత్ర్య దినోత్సం రోజునే తన పుట్టినరోజు రావడం ఆనందాయకమని పేర్కొన్నాడు. పాకిస్థాన్ కు చెందిన సమీ ఈ ఏడాది జనవరి 1న భారత్ పౌరసత్వం తీసుకున్నాడు. బ్రిటన్ లో జన్మించిన అతడికి కెనడా పౌరసత్వం కూడా ఉంది.

'భారత దేశంలో ఇండియన్ గా మొదటి పుట్టినరోజు జరుపుకోవడం గర్వంగా ఉంది. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు' అని సమీ ట్వీట్ చేశాడు. అతడిని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ ప్రాచి దేశాయ్, సంగీత దర్శకుడు ఇషాన్ నూరానీ, కమెడియన్ జానీ లివర్... సమీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement