Sravana Bhargavi Singing After 4 Years For Liger Movie - Sakshi
Sakshi News home page

Sravana Bhargavi: సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి!

Published Tue, Aug 16 2022 9:23 PM | Last Updated on Wed, Aug 17 2022 9:12 AM

Sravana Bhargavi Singing After 4 Years For Liger Movie - Sakshi

టాలీవుడ్‌లో సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది శ్రావణ భార్గవి. సంగీతంపై ఉన్న ఆసక్తితో సింగర్‌గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 'సింహమంటి చిన్నోడో' అంటూ వెండితెరపై తన వాయిస్‌తో మ్యాజిక్ చేసింది. దివంగత మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రి, మణిశర్మ, కీరవాణి, తమన్‌, దేవి శ్రీ ప్రసాద్‌, మిక్కీ జె మేయర్‌ వంటి  తదితర ప్రముఖ దర్శకులతో కలిసి పాడింది. అలాగే స్టార్‌ హీరోలతోపాటు యువ కథానాయకుల సినిమాల్లో గాత్రం అందించింది. 

బుల్లితెర వేదికగా పలు సంగీతం కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రావణ భార్గవి డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా అలరించింది. గబ్బర్‌ సింగ్, ఈగ, రామయ్యా వస్తావయ్యా సినిమాల్లో హీరోయిన్లకు వాయిస్‌ అందించిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరం ఉంటూ యూట్యూబ్ ‍ఛానెల్‌లో భిన్నమైన వ్లోగ్స్‌ చేస్తూ నెటిజన్లు ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వివాదంలో చిక్కుకుంది కూడా. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ తన గాత్రాన్ని వినిపించనుంది శ్రావణ భార్గవి. 

చదవండి: 50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్‌
ప్రభాస్‌ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా?

డ్యాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'లైగర్'. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో రొమాంటిక్‌ పాటగా వచ్చిన 'ఆఫత్‌' సాంగ్‌ తెలుగు వెర్షన్‌ను శ్రావణ భార్గవి ఆలపించింది. మంగళవారం (ఆగస్టు 16)న పుట్టిన రోజు జరుపుకుంటున్న శ్రావణ భార్గవి చివరిగా 2018లో వచ్చిన 'శ్రీనివాస కల్యాణం' చిత్రంలో సింగర్‌గా ఆకట్టుకుంది. 

చదవండి: మహేశ్‌ బాబు థియేటర్‌లో దళపతి విజయ్.. వీడియో వైరల్‌
నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ

చదవండి: సిల్క్‌ స్మిత బయోపిక్‌కు రానున్న సీక్వెల్‌.. ఈసారి ఏ హీరోయిన్‌?
బిగ్‌బాస్‌ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement