కూతురితో సింగర్‌ హాలీడే ట్రిప్‌.. హేమచంద్ర ఎక్కడ? | Sravana Bhargavi Goes Vacation With Daughter, Netizens Asking About Hemachandra | Sakshi
Sakshi News home page

కూతురితో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న శ్రావణ భార్గవి.. హేమచంద్ర ఎక్కడంటూ..

Published Thu, Apr 25 2024 3:07 PM | Last Updated on Thu, Apr 25 2024 3:07 PM

Sravana Bhargavi Goes Vacation With Daughter, Netizens Asking About Hemachandra - Sakshi

బుల్లితెర సెలబ్రిటీలు చాలామందికి సొంతంగా యూట్యూబ్‌ ఛానల్స్‌ ఉన్నాయి. సినీతారలు కూడా ఈ యూట్యూబ్‌ ఛానల్స్‌ వైపు ఆకర్షితులై సొంతంగా ఛానల్‌ పెట్టుకున్నారు. దీని ద్వారా తమ పర్సనల్‌ విషయాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్‌ టాప్‌ సింగర్‌ శ్రావణ భార్గవి ఈ మధ్య యూట్యూబ్‌ వీడియోలతోనే ఎక్కువ సందడి చేస్తోంది. అలాగే ఈ మధ్య పాడ్‌ క్యాస్ట్‌ల హవా ఎక్కువైపోవడంతో.. ఇదేదో బాగుందని ట్రై చేద్దాం అనుకున్నట్లు ఉంది. ఫ్లిప్‌సైడ్‌ విత్‌ శ్రావణ భార్గవి పేరిట నెల క్రితం పాడ్‌క్యాస్ట్‌ మొదలుపెట్టింది. ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.

నీ భర్త ఎక్కడ?
యూట్యూబ్‌ వీడియోలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఈ గాయని తన కూతురిని తీసుకుని హాలీడేకు చెక్కేసింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇది చూసిన జనాలు నీ భర్త హేమచంద్ర ఎక్కడ? అని కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారు. హేమచంద్రను ఎందుకు వదిలేశారు? అని నిలదీస్తున్నారు. కొందరైతే మరీ హద్దులు దాటుతూ 'అయినా నువ్వు అతడికి ఏమీ సెట్‌ అవ్వలేదులే' అని సెటైర్లు వేస్తున్నారు. 

అప్పటినుంచి సింగిల్‌గానే..
కాగా హేమచంద్ర, శ్రావణ భార్గవి జంటగా కనిపించి రెండున్నరేళ్ల పైనే అవుతోంది. అప్పటినుంచి వీరు విడిపోయారంటూ వార్తలు వస్తున్నా ఏనాడూ వాటిపై అటు హేమచంద్రకానీ, ఇటు శ్రావణ భార్గవి కానీ స్పందించనేలేదు. పైగా సోషల్‌ మీడియాలో కూడా ఎక్కడా కలిసి ఉన్న ఫోటోలు షేర్‌ చేయలేదు. దీంతో నెటిజన్లు సైతం వీరు విడిపోయారని ఫిక్సయిపోయారు.

 

 

చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement