
నటీనటులు కూడా మనుషులే. వాళ్లకు అందరిలాగే కోపాలు, బాధలు, సమస్యలు ఉంటాయి. కానీ వాటిని బయట ప్రపంచానికి తెలియనీకుండా.. సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తుంటారు. అలాంటి వారిలో నటి సుష్మితా సేన్ కూడా ఒకరు. తన అందచందాలతో అలరించడమే కాకుండా.. బోల్డ్ స్టేట్‌మెంట్స్ , జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఓ వర్గానికి ఇన్సిపిరేషన్‌గా నిలిచిన ఈ మాజీ మిస్ యూనివర్స్.. ఒకప్పుడు చావు అంచులదాక వెళ్లి వచ్చింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే..తెరపై ఎనర్జిటిక్‌గా కనిపించింది. మొన్నటి వరకు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి స్టెరాయిడ్ తీసుకునేదట. ఆమె తీసుకున్న ఓ నిర్ణయమే ఇప్పుడు ఆమెని ఆరోగ్యకరంగా ఉండేలా చేసిందట.
ఏం జరిగింది?
సుష్మిత కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే అనారోగ్య సమస్యలతో పోరాటం చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 2014 నుంచే ఆమె ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన అడిసన్స్ డిసీజ్‌తో బాధపడుతున్నటు వెల్లడించింది. ఆమె శరీరంలో కార్డిసోల్ అనే హర్మోన్ ఉందని తేలిందట. ఇది ప్రాణాంతకమైనది అని..దీన్ని సరి చేయాలంటే.. ప్రతి 8 గటలకు ఒకసారి హైడ్రో కార్డిసోన్ అనే స్టెరాయిడ్ ని ఇంజెక్ట్ చేయాలని వైద్యులు చెప్పారట. అలాగే వ్యాయామాలు, బరువైన పనులు చేయకూడదని సూచించారట.
జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్
కానీ సుష్మిత మాత్రం తన ఫిట్నెస్ కోచ్‌ని పిలిపించుకొని జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసిదంట. యాంటీ గ్రావిటీ వ్యాయామాలతో పాటు డిటాక్సిఫికేషన్ ప్రారంభించిందట. అయితే ఓ రోజు సుష్మిత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో దుబాయ్ నుంచి అబుదబీ తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ తర్వాత టర్కీ వైద్యులు ఫోన్ చేసి సుష్మితా జీవితంలో మిరాకిల్ జరిగిందని చెప్పాడట. తన అడ్రిల్ గ్రంధి ఇప్పుడు సవ్యంగా పని చేస్తుందని చెప్పారట. తన 35 ఏళ్ల వైద్య కెరీర్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట. ఇకపై ఎనిమిది గంటలకు ఒకసారి స్టెరాయిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో సుష్మితా ఊపిరిపీల్చుకుందంట.
1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించిన సుస్మితా సేన్ తనకు 18వ ఏట(1994) విశ్వసుందరిగా కిరీటం అందుకుని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. 1997లో రత్సగన్ అనే తమిళ్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలువరు అగ్రహీరోలతో సినిమాలు చేసింది. తెలుగులో నాగార్జున తో కలిసి 'రక్షకుడు' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ రాణించింది. ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్ పరంగా ఇప్పటికీ బీజీగా ఉన్నారు.