కొందరిని చూస్తుంటే వారేవా అని అనకుండా ఉండలేం. దానికి వారిలోని గొప్పదనం, వారు చేసే పనులు కారణమై ఉంటాయి. దీనికితోడు వారి క్రమశిక్షణ, దైనందిన జీవితం కూడా తోడయివుంటుంది. 107 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉంటూ, అందరికీ స్ఫూర్తినిస్తున్న రోమెల్ సింగ్ పఠానియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో సైనికరంగం ఏర్పడక ముందే ఆజాద్ హింద్ ఫౌజ్(Azad Hind Fauj)లో సభ్యునిగా చేరి, దేశం కోసం మూడు యుద్ధాలు చేసిన కెప్టెన్ రోమెల్ సింగ్ పఠానీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వయసులో కూడా కళ్లద్దాలు పెట్టుకోకుండా న్యూస్ పేపర్లు చదివే సామర్థ్యం కలిగిన రోమెల్ సింగ్ పఠానియా ఎవరి సాయం లేకుండా తానే స్వయంగా స్కూటర్ నడుపుతుంటారు. కెప్టెన్ పఠానియా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు చెందిన ఫతేపూర్‌లోని బరోహ్ గ్రామ నివాసి.
ఆజాద్ హింద్ ఫౌజ్‌లో సభ్యుడైన రోమెల్ సింగ్ పఠానియా(Romel Singh Pathania) 1939-45లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. బ్రిటీష్ పాలనలో పఠానియా 1945లో బజిరెస్తాన్ యుద్ధంలో కూడా భాగస్వామ్యం వహించారు. దేశ విభజన సమయంలో పలువురి ప్రాణాలు కాపాడారు. 1962 నాటి చైనా యుద్ధం, 1965, 1971లలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొని దేశ సేవ చేశారు. తాను భారత సైన్యంలోని 16వ డోగ్రా రెజిమెంట్‌లో సుమారు 31 ఏళ్లపాటు పనిచేశానని రోమెల్ సింగ్ పఠానియా తెలిపారు.
పాష్టో, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో తనకు పూర్తి పరిజ్ఞానం ఉందని రోమెల్ సింగ్ మీడియాకు చెప్పారు. తాను శాకాహారం మాత్రమే తీసుకుంటానని, తన జీవితంలో ఏనాడూ బీడీ, సిగరెట్, మద్యం, మాంసం, చేపలు ముట్టలేదని పేర్కొన్నారు. శారీరకంగా తాను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నానని, మోకాళ్ల నొప్పులు కూడా లేవని తెలిపారు.
కంటి చూపు, జ్ఞాపకశక్తి కోల్పోలేదని చెప్పారు. ఉదయం 4 గంటలకే నిద్ర నుంచి లేస్తానని, భగవంతుని ప్రార్థనతో తనకు రోజు ప్రారంభమవుతుందన్నారు. ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న రోమెల్ సింగ్ పఠానియాకు శుభాకాంక్షలు(Greetings) చెబుతూ, మీ వయస్సు ఎంత అని మీడియా అడిగిప్పుడు నవ్వుతూ తనకు ఏడేళ్లు అని చెప్పారు. తరువాత తన వయసు 107 అని తెలిపారు.
ఇది కూడా చదవండి: మద్యపానం క్యాన్సర్‌కు కారకం: అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment