శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కుప్వారాలోని గుగల్‌ధర్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నంపై నిఘా సమాచారం అందిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు.
కొన్ని గంటలపాటు కొనసాగిన ఎన్‌కౌంటర్ తర్వాత, కుప్వారాలోని గుగల్ధర్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ సిబ్బంది హతమార్చారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయని భారత సైన్యం తెలిపింది.
గుగల్‌ధార్‌లో భారత సైనికులు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించారని ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో తెలిపింది. చొరబాటుదారులను తిప్పికొడుతూ, భారత సైన్యం కాల్పులు ప్రారంభించింది. గుగల్ధార్ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం తెలిపింది.
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. హతమైన ఉగ్రవాదికి జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తాజాగా రాజౌరీ జిల్లాలోని థానమండి ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల ఉనికి గురించి ఇంటెలిజెన్స్ నుంచి అందిన ఇన్‌పుట్ ఆధారంగా, థానమండిలోని మణియల్ గలి వద్ద భద్రతా బలగాలు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: సుప్రీం సిట్ అయినా నిజం నిగ్గుదేల్చేనా?
Comments
Please login to add a commentAdd a comment