లక్నో: సైన్యంలో విధి నిర్వహణలో చనిపోయిన వారి డిపెండెంట్లు(నెక్స్ట్ ఆఫ్ కిన్) ఎవరనే విషయమై స్పష్టమైన మార్గదర్శాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇటీవల కీర్తి చక్ర పతకం పొందిన దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ తల్లిదండ్రులు రవి ప్రతాప్‌సింగ్, మంజు సింగ్ అన్నారు.
ఈ విషయమై ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ మాట్లాడామన్నారు. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కూడా ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని తమకు హామీ ఇచ్చారని చెప్పారు.
Shocking words.. pic.twitter.com/UeiF0Ef4Mf
— Gems of Politics (@GemsOf_Politics) July 11, 2024
‘సైన్యంలో వీర మరణం పొందిన వారికి సంబంధించిన పరిహారం ఎవరికి దక్కాలనే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న నెక్ట్స్ ఆఫ్ కిన్(ఎన్‌ఓకే) మార్గదర్శకాలు సరిగా లేవు. ఈ విషయమై రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇప్పటికే మేం మాట్లాడాం.
నా కుమారుడు అన్షుమన్‌సింగ్‌కు పెళ్లి జరిగి కేవలం అయిదు నెలలు మాత్రమే అయింది. నా కొడుక్కి పిల్లలు లేరు. అయినా మా కొడుకుకు వచ్చిన కీర్తి చక్ర పతాకం, ఇతర అన్ని పరిహారాలు కోడలికే దక్కాయి. ఆమె అన్ని అధికారిక డాక్యుమెంట్లలో తన చిరునామా మార్చుకుని వెళ్లిపోయింది.
ఇందుకే ‘ఎన్‌ఓకే’ను మళ్లీ పునర్‌నిర్వచించాలని కోరుతున్నాం. కోడలి కంటే తల్లిదండ్రులే కొడుకుపై ఎక్కువగా ఆధారపడతారు. మేము బాధపడుతున్నట్లుగా ఇతర తల్లిదండ్రులెవరూ భవిష్యత్తులో బాధపడకూడదు’అని అన్షుమన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్‌సింగ్,మంజుసింగ్ అన్నారు.
గత ఏడాది జులైలో సియాచిన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కెప్టెన్ అన్షుమన్‌సింగ్ మృతి చెందారు. ఆ ప్రమాదంలో తన సహచరులను కాపాడి అన్షుమన్ మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు వదిలారు.
అన్షుమన్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకుగాను భారత ప్రభుత్వం ఆయనకు కీర్తిచక్ర పతాకాన్ని ప్రకటించింది. ఈ పతకాన్ని జులై 5న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అన్షుమన్ భార్య స్మృతి, మాతృమూర్తిలకు ఈ పతకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహుకరించారు.
ప్రస్తుత రూల్స్ ప్రకారం ‘ఎన్‌ఓకే’ ఎవరు..
సైన్యంలో ఒక వ్యక్తి చేరినపుడు తల్లిదండ్రులను నెక్ట్స్ ఆఫ్ కిన్‌గా పేర్కొంటారు. అయితే ఆ వ్యక్తికి వివాహం అయిన తర్వాత మాత్రం నెక్ట్స్ ఆఫ్ కిన్‌గా తల్లిదండ్రుల పేర్ల స్థానంలో జీవిత భాగస్వామి పేరు రికార్డుల్లోకి ఎక్కిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment